Pages

Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

Thursday, September 15, 2011

450 cinema halls in Telangana down shutters

Movie lovers returned home dejected on Wednesday with cinema halls remaining closed across Telangana including the state capital in view of the Sakala Janula Samme.
The Telangana Film Chamber of Commerce gave a call to film distributors and exhibitors to close film theatres on September 14 and 15, to express their solidarity for the ongoing Sakala Janula Samme, demanding formation of a separate Telangana.Nearly 450 cinema houses including multiplexes across the Telangana region have been closed voluntarily to mark the twoday protest. As a result, theatre managements suffered a loss of `10,000 per theatre on average. It is estimated the state government will lose nearly `1 crore in terms of entertainment tax and other taxes due to the twoday closure. In terms of losses occurred due to lack of ticket sales, the theatres are learnt to have lost about `80,000 to `1 lakh in cinema halls in Hyderabad while those in rural areas suffered a loss of about `40,000 `80,000 on the first day."It was a voluntary decision to close cinema theatres as an act of solidarity. We are happy to express our willingness to be part of the movement in a different way despite suffering losses," said M Vijayender Reddy, president, TFCC.

General strike continues in Telangana for separate state

The indefinite general strike in Andhra Pradesh's Telangana region to demand a separate state continued for the third day Thursday, crippling the administration.

Over 400,000 government employees in Hyderabad and nine other districts of Telangana stayed away from work, affecting the delivery of public services and revenue collection.

Authorities Thursday also imposed two- to four-hour power cuts as thermal power generation came to a standstill due to the continuing strike by employees in state-owned Singareni Collieries Company Limited (SSCL).

Tension prevailed at the state assembly as Telangana leaders from the Telugu Desam Party (TDP) tried to lock the building to protest what they called "injustice" to the region and policemen stopped them.

TDP Telangana Forum leader E. Dayakar Rao told reporters that since 80 percent of employees in both the assembly and the state secretariat are from Andhra and Rayalaseema regions, the government was trying to give the impression that the strike has had no impact.

The assembly and the secretariat should have 45 percent of employees from Telangana but gross injustice was being meted out to the region, he said.

For the second consecutive day, cinema theatres in Telangana remained closed to express solidarity with the 'sakala janula samme' or strike by all sections of people called by Telangana Joint Action Committee (JAC).

Striking employees, students, teachers, lawyers and activists of various pro-Telangana groups staged protests, formed human chains and took out rallies in different parts of the region.

The strike is likely to further intensify with over 150,000 government teachers planning to join the protest from Friday. Telangana teachers and JAC leaders said they would lock schools and colleges.

Adding to the government's woes, employees of electricity department and state-owned Road Transport Corporation have also decided to join the strike from Sep 19.

Telangana JAC chairman M. Kodandaram Thursday called upon the people to intensify the strike while Chief Minister N. Kiran Kumar Reddy appealed to employees to call off the work stoppage as it was causing hardships to people.

The chief minister said a separate Telangana could not be achieved by the strike. The cabinet sub-committee headed by Deputy Chief Minister Damodar Rajanarasimha held a meeting in Hyderabad to review the situation.

With the strike causing huge losses to the state exchequer, the government is contemplating using the Essential Services Maintenance Act (ESMA) and the no-work, no-pay rule.

However, Minister for Infrastructure Komatireddy Ventaka Reddy, who hails from Telangana, has warned against the invocation of the ESMA against employees, and said it would not be tolerated.

Pro-Telangana lawyers tried to lay siege to Gandhi Bhavan, headquarters of the ruling Congress, demanding that Congress legislators from Telangana quit to press the demand for statehood.

సమ్మెకు జీహెచ్ఎంసీ ఉద్యోగులు సై

సకల జనుల సమ్మెకు జీహెచ్ఎంసీ ఉద్యోగులు సై అన్నారు. ఈనెల 20 నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు.19న తెలంగాణ జీహెచెంసీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలు తప్ప...మిగిలిన అన్ని అడ్మినిస్ట్రేటివ్ సేవల్ బంద్ చేస్తామన్నారు. ఎస్మాలతో భయపెట్టాలని చూస్తే... సానిటేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై బంద్ చేస్తామని సర్కార్ ను హెచ్చరించారు.

వరంగల్‌లో డీఈఓ ఆఫీస్‌పై దాడి

సకల జనుల సమ్మెకు సహకరించని.. సీమాంధ్ర కు చెందిన.. వరంగల్ డీఈవోకు.. లాయర్లు చుక్కలు చూపించారు. బలవంతంగా ఆఫీసు తెరిపించిన... డీఈవో పుష్పరాజ్ ... పని చేయాలంటూ సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న లాయర్లు....తెలంగాణ వాదులు డిఇవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఫర్నీచర్ ధ్వసం చేశారు. డిఇఓ పుష్పరాజ్ ను బయటకు వెళ్లగొట్టారు. ఉద్యోగుల సమ్మెను అణచడానికి యత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫోటోలను విరగొట్టారు

Adilabad Strike Info... Uncovered news in media

Transport between Maharashtra and AP was hit with the closure of Boraj inter-state checkpost located on the district border on Wednesday because of the Sakalajanula Samme.
Road traffic came to a grinding halt on either side of the border since Tuesday morning with employees of forest, RTA, commercial tax and sales tax departments taking part in the strike. Thousands of vehicles were stranded for about 7 km stretch on national highway-44 in the district.
Sensing trouble, police entered the scene and cleared the traffic flow in the afternoon. Enraged over the police move, Telangana JAC leaders led by local MLA Jogu Ramanna went to the interstate checkpost to prevent police from regulating the traffic movement. The Telangana protagonists travelled on NH-44 without paying tax at various toll gates in the district.
Source: Info by Adilabad Citizens
 

నల్ల సూరీళ్ల సెగ..!

- మరో మూడురోజులకే బొగ్గు నిల్వలు
- ప్రత్యామ్నాయం లేక సర్కారు విలవిల
- దడ పుట్టిస్తున్న ‘నల్ల సూర్యులు’
- అప్పుడే విద్యుత్ కోతలు షురూ
- రెండో రోజూ స్తంభించిన సింగరేణి
- నిర్మానుష్యంగా మారిన గనులు
- 12 వేలకుపైగా ఆగిన లారీలు
- నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి విలువ 50 కోట్లు
- 16 కోట్ల వేతనాలు త్యాగం చేసిన కార్మికులు
- రహదారులపైన రాస్తారోకోలు, ర్యాలీలు
010-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
సింగరేణి కార్మికుల ఐక్యతకు సర్కారు వణికిపోతోంది. రెండు రోజుల సమ్మెకే ఆపసోపాలు పడుతోంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జీతాలను లెక్కచేయకుండా సామాజిక బాధ్యతను నెత్తికెత్తుకున్న ‘నల్లసూర్యుల’ ధాటికి విలవిలలాడుతోంది. కార్మిక సంఘాలు ఐక్యంగా కన్నెర్ర జేయడంతో కటిక చీకట్లను తప్పించుకునే మార్గం కనిపించకపోవడంతో సర్కారులో కలకలం మొదలైంది. వరదలొస్తే తప్ప జల విద్యుత్ ఉత్పత్తి చేయలేని స్థితిలో ప్రత్యామ్నాయాలు కరువై కంగారు పడుతున్నది. సింగరేణిలో బుధవారం కూడా ఒక్క బొగ్గుపెళ్ల బయటకు రాలేదు.

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 36 భూగర్భ, 14 ఓపెన్ కాస్టు గనులతోపాటు 11 జీఎం, 11 వర్క్‌షాపులు, స్టోర్‌లు, సీఎస్పీలలో సైతం 65 వేల మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. బొగ్గు రవాణా చేసే 12 వేలకుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎస్పీల నుంచి బయటకు వెళ్ల్లే వ్యాగన్లు సైతం ఆగిపోయాయి. రెండు రోజులుగా రూ.50 కోట్ల విలువైన బొగ్గు బయటకు రాలేదు. కార్మికులు రెండు రోజులకుగాను రూ.16 కోట్ల వేతనాలు కోల్పోయారు. తెలంగాణ కోసం గతంలో తొమ్మిది రోజులు సమ్మె చేసి రూ.64 కోట్ల వేతనాలు కోల్పోయిన కార్మికులు, ఈసారి ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

నిండుకుంటున్న నిల్వలు
ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రంలో బొగ్గు స్టాకు నిండుకుంటోంది. మరో మూడు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉండడంతో బుధవారం నుంచి నాలుగు గంటల విద్యుత్ కోతకు సర్కారు శ్రీకారం చుట్టింది. వీటీపీఎస్, కేటీపీఎస్‌లలోనూ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. అక్కడ కూడా స్టాకు మరో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉన్నట్లు సమాచారం. వీటీపీఎస్‌కు మహానది కోల్‌ఫీల్డ్ (ఒరిస్సా) నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో 590 వరకు చిన్న, పెద్ద పరిక్షిశమల్లో సైతం బొగ్గు స్టాకు దగ్గరపడినట్లు సమాచారం. రాష్ట్రంతో పాటు, కర్నాటక, తమిళనాడు, కేరళలోని 4000 పైగా పరిక్షిశమలకు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 13 లక్షల వరకు కార్మికులపై మూడు రోజులలో సమ్మె ప్రభావం ప్రత్యక్షంగా కనిపించనుంది.

ఇదంతా పారిక్షిశామిక సంక్షోభానికి దారితీస్తాయని అధికార వర్గాలు చెబుతున్నారు. మంగళవారం నుంచి సింగరేణి ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడలేదని తెలిసింది. దీంతో అనధికారికంగా కోతలు అమలు చేయాలని సర్కారు తీర్మానించిందని సమాచారం. గురువారం నుంచి గ్రామాలకు 8 గంటలు, మండల కేంద్రాలకు 4 గంటలు, జిల్లా కేంద్రాలకు రెండు గంటల చొప్పున కరెంటు కోతలు పంచుతున్నారు. బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో థర్మల్‌పవర్ ప్రాజెక్టులు మూత దిశగా ఉన్నాయి. తొలి దెబ్బ రామగుండం థర్మల్ స్టేషన్‌పై పడనుందని సమాచారం. ఇక్కడ బుధవారం రాత్రి నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం రాత్రికి విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నారని సమాచారం.

ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ నాలుగు రోజులకు మాత్రమే సరిపడు బొగ్గు నిల్వలు ఉండటంతో అక్కడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేద్దామన్నా.. ట్రాన్స్‌మిషన్ కారిడార్ లేకపోవడం సమస్యగా తయారైంది. ప్రస్తుతం జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో 66 మిలియన్ యూనిట్ల మేరకు జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్తరాది నుంచి వరదలు తగ్గిపోతే ఇది కూడా ఆగిపోతుంది. దీంతో ఏకైక మార్గంగా మహానంది కోల్‌ఫీల్డ్ నుంచి ఐదు ర్యాక్‌ల బొగ్గు తెప్పించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. దక్షిణది గ్రిడ్ నుంచి ఎక్కువ విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నది.

బిల్లు పెట్టక తప్పదు
తెలంగాణపై అనుకూల నిర్ణయం వస్తేనే సమ్మె విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు సమ్మె వద్దన్నా కార్మికులు మాత్రం ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారు. సింగరేణి అధికారులు సైతం సమ్మెలోకి రావాలని జేఏసీ నాయకులు బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల ఇంటింటికి వెళ్లి సమ్మెలో కలిసి రావాలని పువ్వులు అందజేశారు. కాసిపేట గని కార్మికులు ఇంటింటికి తిరుగుతూ వారిని ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మిక కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి వస్తున్నారు. ఇందారం వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా యువకులు నిరాహార దీక్ష చేపట్టారు. బుధవారం శ్రీరాంపూర్, మంచిర్యాల, గోదావరిఖనిలలో ప్రజావూఫంట్ నాయకుడు గద్దర్‌తోపాటు వేద కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు. కార్మికులతో సభలు ఏర్పాటు చేసి వారిలో ఆత్మసై్థర్యాన్ని నింపారు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడేనని, మీ వెంట మేమున్నామని భరోసా ఇచ్చారు.

సింగరేణివ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మంచిర్యాల ఎమ్మెల్యే జీ అరవింద రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వై గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య, కలవేని శంకర్, వీరభవూదయ్య, మల్లాడ్డి, కుమార స్వామి, ఐఎన్టీయూసీ నాయకులు, ఎమ్మెల్సీ బీ వెంకవూటావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు బంటు సారయ్య, శరబలింగం, సంపత్, బెల్లంపల్లి టీఆర్‌ఎస్ నియోజక వర్గం ఇన్‌చార్జి ప్రవీణ్, శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు టీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బీ సంపత్ కుమార్, జాఫర్, చాంద్‌పాషా, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, రాజిడ్డి, ఓజియర్, రాజగోపాల్, రహీం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు అన్నయ్య, రాజారాం, కాంపెల్లి సమ్మయ్య, కాశీరావు, ప్రధాన కార్యదర్శి బీ జనక్ ప్రసాద్, బీఎంఎస్ నాయకులు ఆదిరాం నర్సయ్య, పులి రాజిడ్డి, తదితరులు జేఏసీ కో ఆర్డినేటర్ రాంమూర్తి, గోసిక మల్లేశ్, రవీందర్, కళాదర్, శంకర్ నాయక్, తదితరులు పలు ఆందోళన కార్యక్షికమాలలో పాలుపంచుకున్నారు.

Wednesday, September 14, 2011

'People's strike' in Telangana hits coal production

Hyderabad, Sep 13 (IANS) Coal production in the government-owned Singareni Collieries Company Limited (SCCL) came to a grinding halt Tuesday as its over 100,000 workers joined a 'people's strike' demanding a separate state of Telangana be carved out of Andhra Pradesh, an official said.
Work in 50 mines spread over Adilabad, Karimnagar, Warangal and Khammam districts in Telangana region came to a standstill as the employees began the indefinite strike Tuesday morning on the call of the Telangana Joint Action Committee (JAC).
The employees did not turn up for duty from 7 a.m. as all their 14 unions were supporting the strike call. On a normal day, the company produces about 120,000 tonnes of coal in 36 underground and 14 opencast mines, said a company official.
Singareni employees began a 'rasta roko' movement by forming human chains.
They were also participating in various sports and cultural competitions near the mines to show their solidarity with 'Sakala Janula Samme' or 'people's strike'.
If it continues, the strike is likely to affect nearly 10 thermal power stations in Andhra Pradesh, Karnataka and Maharashtra. With an installed capacity of 7,000 MW, these stations depend on Singareni coal for their operations.
The strike by 400,000 government employees in Telangana from Tuesday is also likely to bring the administration to a halt and affect the delivery of public services in the region.
The JAC has decided to go ahead with the strike despite Chief Minister N. Kiran Kumar Reddy threatening to act tough.
The government Monday made it clear that it would not hesitate to invoke the Essential Services Maintenance Act (ESMA) to ban strikes, implement a 'no work, no pay' order and initiate disciplinary action against the strikers.
Government teachers, employees of state-owned Andhra Pradesh Road Transport Corporation and other public sector undertakings also plan to join the strike from Sep 16.
At a massive public meeting in Karimnagar Monday night, leaders of Telangana Rashtra Samithi (TRS) and JAC warned the government against using ESMA.
'Telangana will burn if the government dares to use ESMA against any employee, teacher or worker,' said TRS chief K. Chandrasekhara Rao.
KCR, as Rao is popularly known, said the agitation would not stop till the central government fulfills its Dec 9, 2009 promise to carve out Telangana state.

Source: in.news.yahoo.com

సకలం బంద్ - సమ్మె తో సత్తా చాటిన తెలంగాణ ప్రజలు

- తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు
- ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
- అటెండర్లు మొదలు తహసీల్దార్‌ల దాకా
- లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి
- డ్రైవర్లు రాక కదలని కలెక్టర్ల కార్లు
- ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు
- రాష్ట్రం వచ్చేదాకా పోరు తప్పదని ప్రతిన
- ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన జిల్లాలు
- సంక్షోభంలో సీమాంధ్ర సర్కార్
- ఎస్మా విధిస్తే మంత్రులదే బాధ్యత
- జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరిక
- ఇంటికో పది వేసుకుని ఉద్యోగులకిస్తాం
- సమ్మె జీతాలు రాష్ట్రం వచ్చాక వడ్డీతో సహా
- అదనంగా నెల జీతం బోనస్ ఇస్తాం: కేసీఆర్

lock-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్ కన్నెపూరజేసింది.. నల్లగొండ పోరుబాట పట్టింది. మెతుకుసీమలో లొల్లిమొదలైంది.. ఆదిలాబాద్ అదరగొట్టింది. పాలమూరులో సమరోత్సాహం పెల్లుబికింది.. ఖమ్మం కదం తొక్కింది. ఇందూరులో సమ్మె సైరన్ మోగింది.. రంగాడ్డి రణన్నినాదం చేసింది. ఓరుగల్లు హోరెత్తింది.. హైదరాబాద్‌లో సకలం బంద్ అయింది!! ఉద్యోగులు వీరోచిత సమరానికి దిగారు.. పది జిల్లాల ప్రజలు ఉత్త్తుంగతరంగమై కదిలారు! ఉద్యోగులకు సంఘీభావంగా రాస్తారోకోలు చేశారు! చేయి చేయి కలిపారు. అడుగులో అడుగేశారు. పాట పాడారు.. ఆట ఆడారు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుదామని తెగేసి చెప్పారు! ఎస్మా గిస్మా జాన్తానై.. తెలంగాణ దేనాహై.. అంటూ పోరు నినాదం చేశారు! రాష్ట్ర సాధన దిశగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సకల జనం సమ్మెజేసింది.. తెలంగాణ సకలం బంద్ అయింది.. ఘనమైన పోరాట వారసత్వ గడ్డ.. సమ్మెతో తన సత్తా చాటిజెప్పింది! ప్రభుత్వ ఉద్యోగులు
మొదలు.. ప్రైవేటు సంస్థల దాకా..!
అటెండర్లు మొదలు.. గెజిటెడ్ అధికారుల దాకా..! లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వృత్తిదారులు, కార్మికులు.. బీడీ కార్మికులు.. సకల శ్రమజీవులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు... ఒకరనేమిటి? ఒక వర్గమనేమిటి? సబ్బండ వర్ణాలు సీమాంధ్ర సర్కారుపై సమర శంఖం పూరించాయి.. రాష్ట్రమొచ్చేదాక రణమాగదని తెగేసి చెప్పాయి! తెలంగాణ జనులందరినీ జాగృతం చేయడంలో అగ్రభాగాన ఉండే 65వేల మంది సింగరేణి నల్లబంగారం కార్మికులు సై అన్నారు.. యావత్ కోల్‌బెల్ట్‌ను స్తంభింపజేశారు! వెరసి.. పాలన కుప్పకూలింది.. సీమాంధ్ర సర్కారు సంక్షోభంలో పడింది! ఎక్కడ కార్యాలయం గేటు చూసినా తాళాలే! ఎక్కడ విన్నా పోరు నినాదాలే! వందమందో వెయ్యిమందో కాదు.. ప్రభుత్వోద్యోగులే అక్షరాలా నాలుగున్నర లక్షలు! వారికి మద్దతుగా అసంఖ్యాక గొంతుకలు! అందరిదీ ఒకటే డిమాండ్! మా తెలంగాణ మాకియ్యండి! మా నీళ్లు మాకియ్యండి.. మా నిధులు మాకియ్యండి..

మా ఉద్యోగాలు మాకే వదిలేయండి! ఇవే నినాదాలతో జనం రోడ్లపైకి వచ్చారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లాలన్నీ దద్దరిల్లించారు. కార్యాలయాలకు తాళాలేశారు. తెలంగాణ జెండాపూగరేశారు! పలు జిల్లాల్లో డ్రైవర్లు రాక కలెక్టర్ల కార్లు కదల్లేదు.. సీఎస్ నిర్వహించిన తెలంగాణ జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫన్స్‌కు కలెక్టర్లు వెళ్లలేని స్థితి! ఉద్యోగానికి ఎవరొచ్చారు? ఎవరు రాలేదు? అన్న లెక్కలు తీయబోయి రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగమే బొక్కబోర్లా పడింది! ఆ సమాచారం ఇచ్చేందుకూ ఎవరూ లేని స్థితి! ఒక్క సచివాలయంలోనే భిన్నమైన పరిస్థితి! ఆ పరిస్థితే ఓ నగ్న సత్యాన్ని బట్టబయలు చేసింది! సచివాలయంలో 80 శాతం సీమాంధ్ర ఉద్యోగులే నిండిపోయిన వైనాన్ని కళ్లముందు మరోసారి నిలబెట్టింది! 20శాతమే ఉన్నా..

తెలంగాణ ఉద్యోగులు సమ్మెకు దిగారు. అన్ని శాఖల్లో కలియదిరుగుతూ తెలంగాణ ఆకాంక్షలను ప్రతిధ్వనింపజేశారు.. తోటి ఉద్యోగుల నుంచి సంఘీభావాన్ని సంపాదించారు! తొలి రోజు సమ్మెతో సర్కారీ ఖజానాకు తెలంగాణ జిల్లాల నుంచి 20 కోట్ల రూపాయల రెవెన్యూ ఆగిపోయింది. ఐదేళ్ల పసిపాప నుండి 80 ఏళ్ల వృద్ధుల దాకా సమ్మెకు సైదోడుగా నిలిచారని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణలోని 65 వేల మంది సింగరేణి కార్మికులు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 6 లక్షల మంది బీడీ కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచేందుకు సంసిద్ధం కావాలని, మంత్రులు విధులను బహిష్కరించాలని, రాజీనామాలు చేయాలని, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరేవిధంగా తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమించాలని కోదండరాంవిజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై ఎస్మా
ప్రయోగిస్తే అందుకు మంత్రులదే బాధ్యతని స్పష్టం చేశారు. ఎస్మా వంటి నిర్బంధ చట్టాలకు, పోలీసుల మోహరింపులకు ఉద్యోగులు భయపడే ప్రసక్తి లేదని ఉద్యోగసంఘాల నాయకులు స్వామిగౌడ్, దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్, సీ విఠల్ తేల్చి చెప్పారు. సమ్మె కారణంగా జీతాలు కోల్పోయే ఉద్యోగులకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల జీతాలు చిన్నమొత్తాల పొదుపులో ఉన్న చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమ్మె కాలానికి వడ్డీతో సహా చెల్లిస్తామని, అదనంగా నెల జీతం బోనస్ ఇస్తామని ప్రకటించారు. సమ్మెకాలంలో ఇబ్బందులు పడకుండా ఇంటికి పది చొప్పున వసూలు చేసి ఉద్యోగుల కుటుంబాలు నడిపిస్తామని హామీ ఇచ్చారు! చినుకు చినుకు తుదకు వరదైనట్లు..

ఉధృతంగా మొదలైన సకల జనుల సమ్మెను మహోధృతం చేసేందుకు 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ కానున్నాయి.. 16వ తేదీ నుంచి ఉపాధ్యాయులు.. 19 నుంచి ఆర్టీసీ కార్మికులు రంగంలోకి దిగుతున్నారు! మధ్యలో 18వ తేదీన ఉత్తర దక్షిణ భారతావనికి సంబంధాలు తెంచేసే స్థాయిలో జాతీయ రహదారుల దిగ్బంధం జరగబోతున్నది!

Telangana employees begin stir


Work in various government offices in all the 10 Telangana districts was completely paralysed as employees boycotted duties as part of the Sakalajanula Samme which began on Tuesday.
Nearly 25,000 employees in Warangal and 30,000 in Karimnagar boycotted their duties in response to the political JAC's indefinite strike call. The employees staged a dharna in front of the collector office at Warangal and locked the office gates.
Protesting students obstructed Warangal superintendent of police Rajesh Kumar at the Arts College in Hanamkonda. They stopped his vehicle and shouted slogans. The students even refused to give way to his vehicle though the SP had to turn back to his office. They demanded the immediate suspension of DSP Venkata Narsaiah.
Doctors boycotted their duties at MGM Hospital. Doctors association president Nagendrababu said if the Centre does not grant Telangana, they would go ahead with an indefinite strike. "We will attend only emergency services," he threatened. All the employees belonging to revenue, education, I&PR, registration and 50 other department staff joined the mass indefinite strike.
Advocates stayed away from the courts as they took out rally from the Adalat junction to the collector office. Bar association members staged protests in front of revenue offices in Karimnagar district. Employees took out rallies at Karimnagar town, while students boycotted classes and formed a human chain at Kaman chowrasta in the town. TNGOs president Hameed monitored the mass strike in the district.
As part of the agitation lawyers in Nizamabad have decided to stay away from the court for eight days. A majority of the private schools were closed in the town. All the government offices in Adilabad district were closed during the day as all the employees stayed away from their duties.
As part of the strike, all sections of people stayed away from work and raised slogans in support of Telangana as they held sit-ins and other forms of protest. "The employees will not cooperate with the government. The state ministers from Telangana region should also participate in the strike," K Vithal, a leader of Telangana employees union said.
TRS leaders organised road blockades in Siddipet in Medak, Nalgonda and Khammam districts. Former minister Jupalli Krishna Rao and Nagarkurnool MP Manda Janganatham faced the wrath of Palamur students when they came to Mahbubnagar to render support to the JAC employees. The students and JAC leaders demanded Manda to submit his resignation first.

Tuesday, September 13, 2011

సకల జన సమరం

పదేళ్ళ కిందట ఏ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ సింహ గర్జన చేసినారో ఇప్పుడు అదే గడ్డమీద సకల జనులు సంఘటితంగా సమర శంఖం పూరించిండ్రు. ఇవాల్లటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల చరివూతాత్మక సమ్మె ప్రారంభమవుతున్నది. సింగరేణి కార్మికుల గుండె ఇప్పుడు నిప్పు కణికై మండుతున్నది. కరెంటు కార్మికులు దశాబ్దాల చీకటిని పారదోలి తెలంగాణ నిండా స్వేచ్ఛా వెలుగులు నింపుదామంటున్నరు. ఆర్టీసీ రథ చక్రాలు జనం వెంట నడుస్తున్నయి. ఉపాధ్యాయులు ఉద్యమ పాఠా లు చెబుతున్నరు. బడి పిల్లలు బతుకు పాఠాలు చదువుకుంటున్నరు. సబ్బండ వర్ణాలు స్వాభిమానం తమ సహజ స్వభావమని చాటి చెబుతున్నయి. తెలంగాణ గర్జిస్తున్నది. ఈ గర్జనకు ఢిల్లీ పెద్దలు దిగిరావాలె. ఆంధ్ర సర్కారు కూలిపోవాలె.

ప్రపంచంలో ఎక్కడైనా పాలకవర్గం ఉద్యమకారులను చంకకెత్తుకుని ముద్దు పెట్టుకుంటదా? ఎస్మా అంటది, 177 జీవో అని బెదిరిస్తది. 130 జీవో అని హుంకరిస్తది. కానీ... ప్రపంచ చరివూతలో ఉద్యమాలను అణచివేసే మొనగాడు ఇప్పటి దానుక పుట్టలేదు. అదే జరిగితే ప్రపంచ చరిత్ర స్తంభించి పోయేది. కాలం ఎనుకకు పోయేది. జనానికి ఈ మాత్రం హక్కులు ఉండేవా? అంతిమంగా ఉద్యమానిదే విజయం. ఇందులో అనుమానం అక్కర లేదు. నియంతలు కొట్టుక పోతరు. జనం గెలుస్తరు.

పోరాడితే ఏమయితది? ఏమీ కాదు.. బానిసత్వం పోతది. ఉద్యోగాలు పోతయా? పోవు... ఎక్కడికీ పోవు.. ఇప్పటి వరకు ఎక్కడా ఉద్యోగాలు పోలేదు. లక్షలాది మంది ఉద్యోగులు అదీ జనం కోసం సమ్మె చేస్తే తీసేసే దమ్ము ఏ సర్కారుకూ ఉండదు. తమిళనాడులో లక్షలాది మంది ఉద్యోగులు సమ్మెకు దిగినప్పుడు జయలలిత సర్కారు ఒక్క కలం పోటుతో అందరి ఉద్యోగాలు పీకేసి విర్రవీగింది. ఉద్యోగులను తీసేయడం సబబే అని కోర్టులు కూడా అన్నయి... అయినా అందరినీ మళ్ళ అమెనే ఉద్యోగంలో కి తీసుకున్నరు. లక్షలాది మంది ఉద్యోగాలు తీసేసి ఈ భూగోళం మీద ఏ ప్రభుత్వ మూ బతికి బట్ట కట్టలేదు. ఏ సర్కారైనా ఉద్యోగులతో పెట్టుకుంటే తన మరణ శాసనం మీద తనే సంతకం పెట్టుకున్నట్టు. ఇంత మంది ఉద్యోగులకు జీతాలు, జనానికి ఈ మాత్రం సంక్షేమ పథకాలు ఎట్ల వచ్చినయి. దానికో చరిత్ర ఉన్నది. ఎన్కట ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పుడు అన్ని దేశాలలో పాలకులకు అసలు సంగతి అర్థమైంది. కొనుగోలుదారు అంతో ఇంతో చల్లగ ఉంటేనే కార్పొరేట్ సంస్థలకు లాభాలు వస్తయి.

వీళ్ళు డీలా పడితే వాళ్ళ బిజినెస్‌లు అంతమయిపోతయి. అందుకనే జీతాలు పెంచి, మధ్యతరగతి తాహతు పెంచిండ్రు. సంక్షేమ రాజ్యం అనే సిద్ధాంతం వల్లించుతున్నరు. తెలంగాణలో లక్షలాది మంది ఉద్యోగాలు పోతే, తెలంగాణ అంతటా కొనుగోళ్ళు నిలిచిపోతె, రాకపోకలు ఆగిపోతె.. ఎవరికి నష్టం? ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలయిన కార్పొరేట్ల కాళ్ళకిందికి నీళ్లొస్తయి. చిన్న పెద్ద అమ్మకాలు ఆగిపోయి పెట్టుబడిదారీ ప్రపంచం కంపించి పోతది. అందుకనే ఉద్యోగులారా! ఎవరి ఉద్యోగాలు పోవు.. ఉద్యోగాలు పీకేసినమని తాఖీదులు జారీ చేసినా బెదరవద్దు.. మీ వెనుక కోట్లాది మంది ప్రజలున్నరు. మళ్లీ మీ ఉద్యోగాలు మీకు పూలల్ల బెట్టి ఇయ్యక తప్పదు. తెలంగాణ అంటుకొని మండితే, అది భారత దేశం కడుపుల రాచపుండు పుట్టిన ఎనకట నెహ్రూ అన్నడట. తెలంగాణ కీలకమైన ప్రాంతం. ఉత్తర దక్షిణాల నడుమ, దేశానికి మధ్యన, అడవులకు, కొండలకు మధ్యన కీలక భూమి. తెలంగాణ గర్జిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు.

ప్రపంచీకరణ యుగంలో పోరాటాలు నడవయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు కొందరు బుద్ధిహీనులు. తెలంగాణ ప్రజలారా! మనం ఒంటరిగాళ్ళం కాదు. మన పోరాటం ఒంటరి ఆరాటం కాదు. ఇది భూమి పుత్రుల ఉద్యమ యుగం. లాటిన్ అమెరికా మొదలుకొని మధ్య ఆసియా, తూర్పు ఆసియా వరకూ అడుగడుగునా... భూమి పుత్రులు జమీన్ కోసం, జల్, జంగల్ మీద హక్కుల కోసం పోరాడుతున్నరు. అమెరికా ఖండాలలో భూమి పుత్రులు కొలంబస్ విగ్రహాలు కూలగొట్టి బరబరా రోడ్ల మీద గుంజుకుంట పాటలు పాడి చెంగ చెంగ ఎగురుతున్నరు. లాటిన్ అమెరికా దేశాలలో కమ్యూనిస్టులు పాత పుస్తకాలు పక్కకు పెట్టి భూమి పుత్రుల ఉద్యమంతో మమేకమై అధికారం చేపట్టిండ్రు. వెనెజులా, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలివి యా, పరాగువే ... అన్ని చోట్ల భూమి పుత్రులు అమెరికా ప్రవచిస్తున్న ప్రపంచీకరణను ఎనుకకు తిరుగుమని జాడించి తన్నిండ్రు. అమెరికా తొత్తు ప్రభుత్వాలను కూలగొట్టి నయా ఉదారవాదం ఓడిపోయిందని ప్రకటించిండ్రు. చైనాలోని ఉయిగూర్లు పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నరు. కుర్దులు, టిబెటన్లు, బెలూచీలు... ఒక్కరేమిటి ప్రపంచమంతటా ముల్కీ పోరాటాలు పెల్లుబుకుతున్నయి.

తెలంగాణ ఉద్యమం బహుముఖంగా సాగుతున్నది. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణను వెనక్కు తీసుకున్న ప్రజాస్వామ్య విఘాతం మీద జరుగుతున్న యుద్ధమిది. ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఇరవై రెండు నెలలుగా ఉధృతంగా సాగుతున్న తెలంగాణ పోరాటం, శాంతియుతంగా సాగుతున్నది. కానీ ప్రజాస్వామ్యం విఫలం అవుతున్నది. పార్లమెంటు ప్రకటనలకూ దిక్కు లేకుండాపోయింది. అందుకే ఈ సకల జనుల సమ్మె. ఈ సమ్మెలో... నాయకులు కలి సి రాకున్నా సరే...వస్తే మంచిది.. జనం పోరాడుతనే ఉంటరు. సకల జనులు తెలంగాణ సాధిస్తరు. తెలంగాణ జనులారా! మనం ఒంటరిగాళ్ళం కాదు... మన పోరాటం ఒంటరిది కాదు. మన భూమి పుత్రుల పోరాటం మొదటిది కాదు, చివరిది కాదు. అంతిమ విజయం మనదే. తెలంగాణ భూమి పుత్రులదే.

ఉద్యోగులపై ఈగవాలినా అగ్గిరాజుకుంటది


-ఇదీ కేసీఆర్ మాట
-ఎస్మా అంటే రగిలిపోతం
-బస్సు పయ్య కదలొద్దు.. బొగ్గు పెళ్ల పెగలొదు బడిగంట మోగొద్దు.. రైలు కదలొద్దు
- సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలి
- సమైక్య రాష్ట్రంలో జరగని దగా లేదు
- రాష్ట్రం సాధించుకోకపోతే పాతాళానికి తొక్కేస్తారు జాగ్రత్త
- కట్టుబానిసల్లా బతకాల్సి వస్తుంది
- కావూరి కాకిలాంటోడు
- రాయపాటి సాంబశివరావు దొంగ... ఆయన వల్ల చైనాలో ఆరుగురికి ఉరి
- టీజీ.. పిచ్చికూతలు మానుకో... లేదంటే నాలుక కోస్తాం

07-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

(టీ న్యూస్, కరీంనగర్) ‘‘సకల జనుల సమ్మె అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసే సమ్మె కాదు. అందరం పాల్గొనాలె. రేపటి నుంచి బస్సు పయ్య తిరగదు. బడిగంట మోగదు. సింగరేణిలో బొగ్గు పెళ్ల పెగలదు. రైళ్లు తిరగవు’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై ఈగవాలినా తెలంగాణలో అగ్గి రాజుకుంటుందని చెప్పారు. అగ్గిబరాటలా మండుతామని చెప్పారు. లక్షలాది మంది హాజరైన తెలంగాణ జన గర్జన సభలో కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. కరీంనగర్ గడ్డకు వందనం.. కరీంనగర్ బిడ్డకు వందనం.. అంటూ తన ఉపన్యాసం ప్రారంభించిన కేసీఆర్... తెలంగాణ కోసం కొట్లాడే ధైన్యాన్ని కరీంనగర్ ఇచ్చిందని చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో సింహగర్జన సభ పెట్టిన నప్పుడు నన్ను కరీంనగర్ బిడ్డలు అదరించారు..ఇన్నేళ్ల ఉద్యమం జనగర్జన పెడితే.. అదే అత్మవిశ్వాసంతో స్వాగతం పలికారు.

నాకు ఇస్తున్న భరోసా, స్వాగతం చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి. నా బాధ్యతను మరింత పెంచాయి. తెలంగాణ సాధన కోసం అవసరమైతే తల నరక్కుంటాను కానీ... ఎత్తిన జెండాను దించను’’ అని కేసీఆర్ ప్రకటించారు. ‘‘సకల జనుల సమ్మె అంటే అషామాషీ కాదు. యావత్తు తెలంగాణ కదాలాలె. కదన రంగంలోకి దూకాలె. సమ్మె అంటే ఉద్యోగులే కాదు.. యావత్తు తెలంగాణ ప్రజలు పాల్గొనాలి. తెలంగాణ బాధలను, ఇబ్బందులను తమ భుజాల మీద వేసుకొని మోసుకుపోతున్న ఉద్యోగుల్లారా.. ఆగ్గిరగిలించండి.. సకలజనుల సమ్మెలో ఏ ఒక్క ఉద్యోగిపై ఎస్మా ప్రయోగించినా.. లేదా ఈగ వాలినా ఊరుకోం. స్వామిగౌడ్ గారు.. మీ వెనక జాతీయ పార్టీ బీజేపీ ఉంది. న్యూడెమోక్షికసీ ఉంది. కేసీఆర్ ఉన్నాడు. నాలుగున్నర కోట్ల జనం ఉన్నారు’’ అని చెప్పారు.
knr-(2)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘పదేళ్లుగా ఆంధ్రోళ్లు నన్ను తిట్టని తిట్టు తిట్టిండ్రు. నాలుగు కోట్ల మంది తరపున పోరాడుతున్న కోదండరాంను టీజీ వెంక అనేటోడు తిడుతున్నడు. బంగారంలాంటి కోదండరాంను బురద అంటావా? నీకెన్ని గుండెలు? ఎందుకు ఆ కండకావరం? పిచ్చి కూతలు మానకపోతే నాలుక కోస్తాం’’ అని హెచ్చరించారు. ‘‘కావూరి కాకి లాగ ఒర్రుతున్నడు. తెలంగాణ విద్యార్థులు పనికిరానివారంటున్నడు.ఖబడ్దార్. ఒక్కటంటే వందంటం. లఫూట్ మాటలు మాట్లాడితే మీకన్నా లఫూట్ మాటలు మాట్లాడతాం. నోరు దగ్గర పెట్టుకోండి. సహించే వరకు సహించినం. ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కడ వాత పెట్టాలో మాకు తెలుసు’’ అని అన్నారు. ‘‘పొగాకు ఎక్స్‌పోర్టులో డూప్లికేట్ ఆకులు పెడితే రాయపాటి సాంబశివరావు వల్ల చైనాలో ఆరుగురు అధికారులకు ఉరి శిక్షపడింది.

రాయపాటిని అప్పజెప్పమని చైనా కోరితే ఇక్కడ కాంగ్రెస్‌వాళ్లు ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. సన్నాసి, దొంగతనం చేసిన రాయపాటి విద్యార్థుల గురించి మాట్లాడుతాడా?’’ అంటూ నిప్పులు చెరిగారు. సమైక్యాంవూధలో జరగని దగా లేదని చెప్పారు. కరీంనగర్-హైదరాబాద్ రైల్వే లేన్‌పై సర్కారు వివక్షను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మన దేశానికి స్వాతవూంత్యం వచ్చిన తరువాత తెలంగాణకు వచ్చిన ఒకే ఒక్క రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్. దీనికోసం కేంద్రం 671 కోట్లు శాంక్షన్ చేసింది. ఏళ్లు దొర్లుతున్నా రాష్ర్ట ప్రభుత్వం తన వంతు నిధులు ఇవ్వలేదు.

భూమి సేకరించలేదు. అన్నారు. ‘‘సీఎం... నువ్వు యువ కిరణాలు పెడతా... తోక కిరణాలు పెడతా... అభివృద్ధిని ఆపుకోవద్దు అంటున్నవ్. చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రాన్ని పాలించే ఇంగిత జ్ఞానం ఉంటే, ప్రాంతీయ పక్షపాతివి కాకుంటే దీనికి నిధులు ఇవ్వు. 2006లో ఈ లైన్ శాంక్షన్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్‌డ్డి కట్టలేదు. ఈ ఆరేళ్లలో ప్రభుత్వం 6లక్షల కోట్ల బడ్జెట్ చేసిందిగానీ హైదరాబాద్- కరీంనగర్ లైన్‌కు 234 కోట్లు ఇవ్వటానికి రాలేదు.

knr-(10)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగత యేడాది 40 కోట్లు పెట్టారు. అవి కాస్తా వాపసు పోయాయి. నువ్వూ దీని గురించి పట్టించుకోవటం లేదు. ఇంక మేం ఎందుకు అడగద్దు తెలంగాణ? ఆరేళ్ల క్రితం బడ్జెట్ శాంక్షన్ అయితే వేరే రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి కావాలనుకునే సీఎం అయితే మోకాళ్ల మీద ఉరుక్కుంట పోయి నిధులు తెచ్చుకుంటరు. కరీంనగర్ జిల్లాకు 600 కోట్ల రూపాయలతో మంచినీళ్ల పథకం తెచ్చి 30 కోట్లు ఇవ్వమంటే మూడు రూపాయలు ఇవ్వలేదు. ఎందుకడగద్దు తెలంగాణ?’’ అని ఆయన సీఎంను నిలదీశారు. ‘‘సమైక్య రాష్ట్రంలో కలిసి ఉంటే కలదు సుఖం అంటవ్. యేడ సుఖం ఉంది? మిడ్‌మానేరు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏదో ఒక కథ చెప్పి తెలంగాణ ప్రాజెక్టులు పక్కన పెడతారు.

పోలవరానికి 4వేల కోట్ల ప్యాకేజీతో టెండర్లు పిలుస్తరు. వెయ్యి కోట్ల మిడ్‌మానేరును పట్టించుకోరు’’ అన్నారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు గురించి మాట్లాడుతూ.. ‘‘ఏం చెప్పాల అర్థం కాదు. అయినోని గురించి చెప్పాలె. కానోని గురించి ఏం చెప్పాలె? కాంగ్రెస్‌లో ఒక నలుగురైదుగురు ఎంపీలు తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడుతుంరు. పొన్నం ప్రభాకర్ ఆ నలుగురిలో ఒకడు. ఫస్ట్‌టైం ఎంపీ అయినా ధైర్యంగా కొట్లాడుతున్నడు. పొన్నం.. ఎవ్వరికీ భయపడకు. అదే ధైర్యంతో ఉండు. తల కోసుకో కానీ ఎత్తిన పిడికిలి దించకు. మేం మీ వెంట ఉంటం. పొన్నంకు శ్రీధర్‌బాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అన్నారు.‘‘చూడండి. ఈ దంపతులది మహారాష్ట్రలోని విదర్భ.

తెలంగాణ, విదర్భ ఎంతగా బంధించబడి ఉన్నాయో చూడండి... (విదర్భ దంపతులు సంకెళ్లతో వేదికపైకి వచ్చారు) విదర్భ నుంచి పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణ యావత్తు తిరుగుతున్నరు... ఇటువంటి ఆదర్శమూర్తులను, ఇట్లాంటి బిడ్డలను మనం గుండెల్లో పెట్టుకోవాలి. ఈ దంపతులకు తలవంచి నమస్కారం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘విదర్భలో ఉన్న దంపతులకు మన బాధ అర్థమైందిగానీ మన తెలంగాణ సన్నాసులకు అర్థం కాదు. ఇజ్జత్ ఉందా? తెలంగాణ జనం ఒక్క నమూనలలో తిడుతుంరా? కళాకారులు పాటలు కట్టి మరీ తిడుతున్నరు. అయినా మేం కదలం. అంటున్నరు సన్నాసులు. నేను చెబ్తిని, దండం పెడతానన్న. రాజీనామాలు చేస్తే గెలిపించుకుంటమని చెప్పిన. కాల్మొక్త అని కూడా అన్న. అయినా వచ్చినట్టే వచ్చి వెనక్కి పొయ్యింరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కుక్కతోకకు రాయి కడితే సక్కగయితాది?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘11 సంవత్సరాలుగా ఉద్యమాన్ని చేస్తున్నం. గండాలను ఎదురీదినం. ఎత్తిన పిడికిలి దించలేదు.

knr-(5)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ సాధించుకోలేకపోతే ఉంచుతరా మనల్ని? పాతాళలోకానికి తొక్కుతారు. ఈ దశలో రాష్ట్రాన్ని సాధించటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు’’ అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘ప్రయివేట్ పాఠశాలలు కూడా సమ్మెకు పోతున్నయి. మీ అందరితో మనవి చేసేదొక్కటే. నో ఆల్టర్‌నేట్. తెలంగాణను సాధించుకోవాలె. ఉద్యోగుల సమ్మె అని అనుకుని ఎక్కడోళ్లు అక్కడ ఇండ్లళ్ల పండొద్దు. రైల్‌రోకో అంటే గ్రామాలకు గ్రామాలు వచ్చి పట్టాలపై కూసోవాలి. రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం టైం టు టైం పిలుపిస్తారు. ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించారు. దానినిబట్టి ఉద్యమాన్ని ముందుకు నడపాలె. ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా 13న తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేయాలి. 14, 15తేదీల్లో సినిమాహాళ్ల బంద్ ఉంది.

18న జాతీయ రహదారుల దిగ్భంధనానికి జేఏసీ పిలుపునిచ్చింది’’ అని చెప్పారు. ‘‘మణిపూర్‌లో ఎలా చేశారో అదే పద్ధతిలో జాతీయ రహదారులపై మనమందరం చేరుకోవాలె. చీమలదండులా దిగ్భంధం చేయాలి’’ అని ఉద్బోధించారు. ‘‘ఈ రోజు ఇంత సమయం గడిచినా. మీరు ఇంత పొద్దు పోయేవరకు ఉండి ఇంత అపురూపంగా కూర్చుని ఉండి నాయకుల ఉపన్యాసాలు విన్న మీ అందరికీ పేరుపేరున ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ’’ అంటూ ఆయన తన ఉపన్యాసాన్ని ముగించారు.

‘‘ముఖ్యమంతి కిరణ్‌కుమార్ రెడ్డి.. సకల జనుల సమ్మెపై పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేసి, కుంట్రలు కుతంవూతాలు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగుండదు. ఇది మాహెచ్చరిక. మా సహనంకు ఓ హద్దుఉంది. పరీక్ష పెట్టకండి’’ అని హెచ్చరించారు. ‘‘మేం అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చి న మాటనే కదా.. 120 కోట్ల జనం సాక్షిగా తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటను అమలు చేయమంటున్నాము. ఇదేమైనా తప్పా.. ఇందుకోసం పోరాటం చేస్తున్న మాపై మీకు ఎందుకు కక్ష? న్యాయం చేయాలని అడిగితే వేధింపులకు గురిచేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఖబడ్దార్ మా ఉద్యోగుల బిడ్డల మీద ఈగ వాలినా.. ఊరుకోం. సకల జనుల సమ్మెను అషామాషీగా తీసుకోవద్దు... సమ్మెలో భా గంగా ఒక బస్సు పైయ్య కదలదు..

బడిగంట మోగదు. సింగరేణిలో పెళ్ల కూడ పెగలదు... రైలు ముందుకు కదలదు.. విద్యు త్తు ఉద్యోగులు తమ పంథాలో ఆందోళన చేస్తారు. న్యాయవాదులు పిడికిలి బిగించి కొట్లాడాతారు. మాది నా్యైయమెన కోరిక, ధర్మాక్షిగహ పోరాటం. ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుంది’’ అని కేసీఆర్ ఆవేశంగా చెప్పారు.

‘‘పాపం.. సీహెచ్ విద్యాసాగర్‌రావు అమాయకుడు. బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌డ్డి ఏకక్షిగీవంగా ఎన్నికవుతడని అంటున్నడు. అందరూ ఆయనలాగే అమాయకంగా ఉంటరనుకుంటున్నడు. ఇప్పటికే సీఎం కిరణ్, బొత్స సత్యనారాయణ బాన్సువాడలో పోటీ పెట్టడానికి సిద్ధమవుతున్నరు. పెట్టండి. పోటీ పెట్టమనే అంటున్న. కరీంనగర్‌లో ఇంతకముందు పోటీకొచ్చిండ్రు. గుద్దు గుద్దితే నేలకు తాకిండ్రు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన పోచారంపై పోటీ పెట్టడానికి వాళ్లకు ఇజ్జత్, మానం ఉండాలి. సీఎం కిరణ్‌కు విజ్ఞత ఉంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి. ఎస్మా గిస్మా అని బెదిరించడం మానుకోవాలి’’ అని కేసీఆర్ అన్నారు.

వరంగల్‌లో యాకూబ్‌డ్డి సహా పలువురు విద్యార్థులను పోలీసులు తీవ్ర చిత్రహింసలు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘వరంగల్ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈ వేదిక మీది నుంచి డిమాండ్ చేస్తున్న’’ అంటూ కేసీఆర్ గర్జించారు. ‘‘14ఎఫ్ పేరు చెప్పి మీ టోపీలు లాటీలు గుంజుకుంటున్నరనే నేను దీక్ష చేసిన. విద్యార్థులు ఉస్మానియాలో వీరవిహారం చేశారు. వాళ్లను కొట్టడానికి మీకు చేతుపూలా వచ్చినయి?’’ అని కేసీఆర్ పోలీసులను ప్రశ్నించారు.

ఉద్యమాల ఖిల్లాలో జన ఉప్పెన

-సబ్బండ వర్ణాల సమరశంఖం గులాబీ వనమైన కరీంనగర్
- నేటి నుంచి సకల జనుల సమ్మె
- సమాయత్తం చేసిన భారీ సభ
- తెలంగాణవాదుల్లో పోరు జోరు
- దిశానిర్దేశం చేసిన నేతలు
- నేడు సంఘీభావంగా రాస్తారోకోలు
- 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్
- 18న జాతీయ రహదారుల దిగ్బంధం
- వేదికపై నేతల పిలుపు
- టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
- ప్రాక్టీస్ ముగిసింది.. ఇక యుద్ధమే: తేల్చి చెప్పిన కోదండరాం
- ఇది తుపాను ముందటి ప్రశాంతత: బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
- ఉద్యమాన్ని అణచలేరు: న్యూడెమోక్రసీ నేత సూర్యం
- తెలంగాణ కోసమే సకల జనుల సమ్మె: ఉద్యోగ జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్
- బలిదానాల ముందు ఉద్యోగాలెంత?: శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్య 

head-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
విప్లవాల పురిటిగడ్డ వేదికగా.. తెలంగాణ సకల జనం గర్జించింది! కపట సమైక్యవాదుల దోపిడీ కుట్రలు ఇంకానా.. ఇకపై సాగవంటూ గాండ్రించింది! దశాబ్దాలుగా దగా పడిన నాలుగున్నర కోట్ల గుండెల్లో రగులుతున్న సెగ ఢిల్లీకి తగిలేలా ఉవ్వెత్తున ఎగసిపడింది! సకల జనుల సమ్మెకు నగారా మోగించింది! ఉద్యమాల ఖిల్లాలో జనం ఉప్పెనైంది! కాలినడకపై కొందరు.. బళ్లు కట్టుకుని మరికొందరు.. లారీల్లో ఇంకొందరు... వేలు.. లక్షలుగా తెలంగాణ పల్లెలన్నీ కరీంనగర్ బాట పట్టాయి! ఎటు చూసినా గులాబీ వనంతో కరీంనగర్ ఉద్యమ గుబాళింపులతో శోభిల్లింది! లక్షలాది మంది తెలంగాణ ఉద్యమక్షిశేణులు చేసిన జై తెలంగాణ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి!

కపట సమైక్యవాదులకు గుబులు పుట్టింది! సకల జనుల సమ్మెతో తెలంగాణ రావడం తథ్యమని విశ్వాసం కల్పించింది! చరివూతాత్మకంగా సాగనున్న తెలంగాణ సకల జనుల సమ్మెకు ఒక్క రోజు ముందు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జనగర్జన.. దిగ్విజయమైంది! చిన్నారులు మొదలు.. వృద్ధుల దాకా.. నెత్తురు మండే యువకులు మొదలు.. ఉద్యమాన్ని ఉరకపూత్తించే మేధావుల దాకా..! సకల జేఏసీలు, సకల సంఘాలు ఏకమయ్యాయి... తెలంగాణను నాన్చుతున్న ఢిల్లీ కోటపై దండెత్తాయి! పోరు బిడ్డలకు దారి చూపిన నేతలు.. దగా పడిన తెలంగాణ దైన్యాన్ని మరోమారు చెప్పారు.

KCR01-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema పెల్లుబుకుతున్న పోరుజ్వాలను ఢిల్లీకి గురి పెట్టారు! సకల జనుల సమ్మె విజయవంతానికి పిలుపునిచ్చారు. బస్సు పయ్య కదలొద్దు.. సింగరేణిలో బొగ్గు పెళ్ల పెగలొద్దు.. రైలు కదలొద్దు.. బడి గంట మోగొద్దు.. అంటూ దిశా నిర్దేశం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పదునైన వాగ్బాణాలు విసురుతూ.. చెర్నాకోల దెబ్బల్లాంటి విమర్శలతో సీమాంవూధ నేతల వాదాలను దెబ్బతీశారు! సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఈగవాలినా తెలంగాణ అగ్గిబరాట అవుతుందని హెచ్చరించారు. ప్రాక్టీస్ ముగిసిందన్న రాజకీయ జేఏసీ చైర్మన్ ఇక యుద్ధమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. మనకు నీళ్లు నిధులు ఇవ్వని సర్కారు మనదికానే కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వాన్ని నడవనీయవద్దని పిలుపునిచ్చారు. మన అధికారం మనకు కావాలంటూ కొట్లాడాలని ఉద్భోదించారు. తుపాను ముందు ప్రశాంతత ఈ జనగర్జన అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిచ్చి, ఆమోదం పొందేలా చూడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకోవడం ఇక ప్రభుత్వం వల్లకాదని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్షికసీ రాష్ట్ర నేత సూర్యం స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలు తమకు తెలంగాణ ప్రజలిచ్చివేనని, ఆ ప్రజల కోసం వీటిని త్యాగం చేయడానికి వెరవబోమని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామి గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల బలిదానాలకంటే తమ ఉద్యోగాలు ఎక్కువేమి కాదని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 

Monday, September 12, 2011

బానిసకొక బానిసకొక బానిస -అల్లం నారాయణ

‘పీనుగుల మీద పేలాలు ఏరుకునే జాతి ఏదన్నా ఉన్నదంటే అది మన మంత్రుల జాతే’
ఇటీవల నాకొచ్చిన మెసేజ్ సారాంశం ఇది. ‘అంత‘హార్ష్’గ అంటే ఎట్లా’... నా సమాధానం కాని ప్రశ్న. దానికి అవతలి వ్యక్తి ‘మీరు కూడా అట్లంటే ఎట్ల సార్! అన్నీ తెలిసి. ఇవతల మనుషులు చనిపోతుంటే వాళ్లకు పంద్రాగస్టులు, క్యాబినెట్లు కావల్సి వచ్చాయా? వాళ్లనేం చేసినా తప్పులేదు. మీరు సమర్థించకం డి’.. మళ్లీ కొట్టొచ్చినట్టు మెసేజ్. నిజమే. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల రాజీనామాలు అవి ఉత్తుత్తవే కావొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమానికి ఒక ఊతం గా భావించారు. కానీ, వాళ్లే మళ్లీ రాజీనామాలు అట్లా పక్కనబెట్టి అంతకు ముందు ఏమీ జరగనట్టు పంద్రాగస్టు వేడుకలకు వెళ్లి, ఒకే ఒక్క కోమటిడ్డి తప్ప మంత్రులు మొత్తం క్యాబినెట్‌కు వెళ్లే సరికి జనాలకు సహజంగానే పుండు మీద కారం రాసినట్టువుతున్నది. మంట మండుతున్నది. ఇజ్జత్ లేదు.

అనే మాట తెలంగాణల తరచూ వాడే మాట. అదిప్పుడు మంత్రుల పట్ల చిన్న మాటైపోయి పీనుగులు-పేలాల దాకా వచ్చింది. సిగ్గుందా? అని అడిగిండు నాగం. కానీ ప్రజలు అంతకన్నా ఎక్కువే అడుగుతున్నరు. ‘పదిరోజులు పదవిలేకపోతే బతకలేరు మీరా మాట్లాడేది’ అని లగడపాటి అన్నడు. నిజమే పదవి లేకపోతే మేమేడ బతుకుతమని బందెలదొడ్లె స్వచ్ఛందంగా సొచ్చిన పశువుల్లాగా మంత్రులు క్యాబినెట్‌లోకి స్వచ్ఛందంగా వెళ్లారు. ఐచ్ఛిక, రాజకీయ మరణాలని ఎవరు మాత్రం నివారించగలరు. ఒకవేపు వందల ఆత్మహత్యలు, గుండె పగిలిన తెలంగాణ. కాంగ్రెస్ జాతీయ పార్టీ విశ్వాస ఘాతుకం. అదే పార్టీ మంత్రులది తెలంగాణ పట్ల ఇదీ కథ. ఒక పరాధీన బాంచెల కథ. కేంద్ర కాంగ్రెస్ మోసాల కథ విలీనం నుంచి ఇప్పటిదాకా సాగుతూ వస్తున్నది. బహుశా ఏకాభివూపాయం సాధించండి. మీది మీరే తేల్చుకోండి. అసెంబ్లీ తీర్మానం లాంటి మాటలను చిదంబరం పార్లమెంటు లో ప్రవచించిన తీరు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మోసానికి కూడా సూచికగా అనుకోవచ్చు.

ఆర్టికల్3ని కాదని, అసెంబ్లీ తీర్మానాలు, టిరనీ ఆఫ్ మెజారిటీని తెలంగాణ మీద తోల్తున్నారం కాంగ్రెస్ పార్టీ విలీనం నాటి, ఆ తర్వాతి అన్ని ఉద్యమాల నాటి ద్రోహ బుద్ధినే ప్రదర్శిస్తున్నదని అర్థం. ఇసుమంత మారని ఈ కాంగ్రె స్ బుద్ధి వెనుక ఏముంటుంది కనుక... అధికార దాహం. రాజకీయ ప్రయోజనా లు. ధనకాంక్ష, నయా పెట్టుబడిదారులకు కొమ్ముకాసే తత్వం. బహుశా ఈ తత్వ మే మన బాంచెలను కూడా క్యాబినెట్‌కు పంపించి ఉంటుంది. లగడపాటి రాజగోపాల్‌కు ఆ విశ్వాసం ఎక్కడిది? తెలంగాణ మంత్రుల స్వభావాన్ని ఆయన అట్లా అంచనా ఎలా కట్టగలిగారు. తావీజ్ మహిమ కాదు. లగడపాటి రాజకీయ వివేచనాశక్తి గలవాడు కూడా కాదు. కానీ అతనొక బేపారి. కలలను ఎట్లా కొనా లో, ఎట్లా అమ్మాలో తెలిసిన బేపారి. తమ మోచేతి నీళ్లు తాగకుండా ఎక్కడికి పోతారని ఆయనకు బాగా తెలుసు. మోచేతి నీళ్లు తాగడానికి అలవాటుపడి ఉన్నవాళ్ల బలహీనతలు కూడా బాగా తెలుసు.

అందువల్లనే కదా! రాజగోపాల్ అన్న మాటను అతితొందరగా నిజం చేసి చూపించారు మంత్రులు. ప్రాణం పోతున్నా సరే. మానం పోతున్నా సరే. మంది చస్తున్నా సరే. తెలంగాణ ప్రజలందరూ ఇగ మా వల్ల కాదు. మాకు ఒక తెలంగాణ పరిష్కారం అంటున్నా సరే.. మన తెలంగాణ మంత్రులకు మాత్రం పదవులు, దానివల్ల వచ్చే అధికారమదం, రాలే ఎంగిలి మెతుకులు, శవాల మీద ఏరుకునే నాణేలు కనబడ్తుండడం యాధృచ్ఛికం కాదు. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయి’ అని సామెత. నిజానికి తెలంగాణ ప్రజలు ఆనాడు, ఈనాడు కాంగ్రెస్ ను తెలంగాణ ఇస్తారన్న విషయంలో నమ్మలేదు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అమాయకపు తెలంగాణ అననైతే అన్నడు కానీ, ఏ ఒత్తిళ్లకు లొంగాలో వాటికి లొంగి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా విలీనం నిర్ణయం తీసుకుని మొదటి మోసం చేసిండు.

విలీనం అయిన మరుసటి దినం నుంచే ఇదే కాంగ్రెస్ పార్టీ అన్ని ఒప్పందాలను, అన్ని సూత్రాల ను, తెలంగాణ, ఆంధ్ర, ప్రజలను కలిపి ఉంచాల్సిన షరతులను గంపగుత్తగా తొక్కి ఆధిపత్య భావజాలంతో వలసగా మార్చారు. 1969లో తెలంగాణ రోసిపోయి, మా కొలువులు మాకే దక్కాలని పోరుబాట పడ్తే కాసు బ్రహ్మానందడ్డి, ఇందిరాగాంధీలు 369 మందిని చంపి ఉద్యమాన్ని నెత్తురు ముంచా రు. దేశ సమక్షిగత, సమైక్యత అని చిలుకపలుకులు పలికిన ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజల నెత్తురు కండ్ల జూసింది. కని తెలంగాణ ఇవ్వలేదు. ఉన్న చెన్నాడ్డిని లొంగుటాన ఏసుకుని, తెలంగాణ ఆకాంక్షలను మంట్లె కలిపేసిన చరిత్ర, ద్రోహం, నలభై రెండు సంవత్సరాల మానని గాయం. ఇక అప్పటి నుంచీ కాంగ్రెస్ వాళ్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరనప్పుడు, అధికారం అందని పండైనప్పుడు తెలంగాణను తడవతడవలుగా తలకెత్తకున్నది. తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణకు అన్యాయం జరిగిందని అంగలార్చింది అధికారంలో లేనప్పుడు. చంద్రబాబు రాజ్యమేలుతున్నప్పుడు.

ఆ తర్వాత సమైక్యవాది అని గొప్పలు కొట్టుకు నే వై.ఎస్., దేశ సమక్షిగత గురించి మాట్లాడే సోనియాగాంధీ, టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని, ఎన్నికలు గెలిచి , తెలంగాణను బోడమల్లన్న చేసింది. ఆ తర్వాత సీఎంపీలో, రాష్ట్రపతి భాషణలో, తెలంగాణ పేరు చెప్పి మోసం చేసి ఇట్లా ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజలను కించపర్చింది. తద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను భంగపరిచిందీ కాంగ్రెస్ పార్టీయే. చివరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరాహారదీక్ష పెల్లుబికిన తెలంగాణ చైతన్యం, వీరత్వం చూపిన విద్యార్థిలోకం, సకల జనుల చైతన్యం చూసి డిసెంబర్ 9 ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ యే. అదే పార్టీ ఇప్పుడు నాలుక తిరగేసి ఇజ్జత్‌లేని ప్రకటనలు చేసింది. సోనియాగాంధీ జన్మదిన కానుక అంటే మురిసిముక్కలైతిమి.

కాంగ్రెస్ పార్టీని నమ్మి నానబోస్తే అదే చిదంబరం ఇప్పుడు అదే పార్లమెంటులో ఏకాభివూపాయం అని, రాజ్యాంగం దఖలు పరిచిన కేంద్రం హక్కును వదులుకొని ఆంధ్ర మెజారిటీకి తెలంగాణను బలిపెడ్తున్నాడంటే దేనివల్ల? అసలు తెలంగాణ అనే ఒక స్వేచ్ఛా ఆకాంక్షకు అరవై సంవత్సరాలుగా అడ్డుతగులుతున్నది కాంగ్రెస్ పార్టీయే. కానీ.. రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యం కనుక. దానికి కాంగ్రెస్ పార్టీయే శరణ్యం కనుక తెలంగాణ పదేపదే గొర్రె కసాయిని నమ్మినట్టు నమ్మాల్సి వస్తున్నది.తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిజంగానే కసాయిలుగా పదేపదే అవతారమెత్తుతున్నారు. నిజానికి రాజకీయ పార్టీల నేతలందరూ రాజీనామాలు చేసి సీమాంధ్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణ సాధించాలన్న డిమాండ్ ఇవ్వాల్టిది కాదు.


కానీ, అడుగడుగునా ప్రజలు తెలంగాణ ప్రజావూపతినిధులను, మంత్రులను అడ్డుకుంటున్న సందర్భం. ఎందుకురా ఈ బతుకు జనంలోకి వెళ్లలేమనుకుంటున్న సందర్భం. మేమూ ఇంకా తెలంగాణ తెస్తామని, ఉద్యమిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు హఠాత్తుగా రాజీనామాల నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదం పొందలేదు. అదే వేరే విష యం. కానీ తెలంగాణ వచ్చేదాకా రాజీనామాలు ఉపసంహరించుకోబోమని, మాట మార్చేది లేదని ఎన్ని ప్రగల్భాలు పలికారో? లెక్కలేదు. ప్రాణాలు కూడా ఇస్తామన్న వీరుల్లా ప్రకటనలు కోకొల్లలు. మీసాలు తిప్పి, మాటల
గారడీ చేసిన కాంగ్రెస్ మంత్రులు ఒక్క పొద్దులు, ఉపవాసాలు చేసి , మళ్లీ అందరం వాళ్లను నమ్మి వాళ్ల దీక్షల్లో ప్రసంగాలు చేసి, వాళ్ళ మాటల తడి వాళ్ల నాల్కల కొసన ఇంకా ఊగులాడుతుండగానే ఈ మోసం... ఎంత ఇజ్జత్ లేకుంటే ఇట్లా జరుగుతుందనుకోవడం ఒక అమాయకత్వమే. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న తరుణం.

కుంభకోణాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయ నాయకత్వం పైగా అవిశ్వసనీయత . 14ఎఫ్ విషయంలో చిదంబరం ప్రకటన గుర్తుందా? మళ్లీ తీర్మానం కావాలన్న చిదంబరం రెండు రోజులాగి 14ఎఫ్ రద్దు చేయడం వెనుక ఏముంది? ప్రహసనం, అన్నా హజారే దీక్ష సందర్భంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు దాని నాయకత్వలేమిని, రాజకీయ అపరిణితిని, నిజాయితీ లేనితనాన్ని, ప్రజాస్వామిక ధర్మాలను అది పాతర పెడ్తుండడాన్ని సూచిస్తున్నది. ఈ అవిశ్వసనీయత, ప్రహసన నిర్ణయాల ప్రభావం తెలంగాణపైనా ఉంది. డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఇప్పుడు ఏకాభివూపాయం. గాడిద గుడ్డు అనడం కానీ, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి,సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చెయ్యడానికి, ఎట్లా ప్రయత్నం చేస్తున్నదో వాటిపై పడుతున్నది.

అంతా విని రామునికి సీతేమైందన్నట్టు ఆజాద్ వచ్చె మళ్లీ బాగోతం మొదలుపెట్టమన్నట్టు? ఇప్పుడు చివరాఖరికి ఏం జరిగిందో చెప్పండి? తేల్చుకొనిరండి? మూడు నెలలయితే నిర్ణయం. నిజంగా తెలంగాణ ప్రజల కాళ్లకు మొక్కా లె. అయినా వాళ్లు ప్రశాంతంగా ఉన్నరు. ప్రశాంతంగా ఉద్యమిస్తున్నరు. ఈ తారీఖులు, దస్తావేజులు మారడం దేనికి సూచన. రాష్ట్రంలో పరిస్థితులు మారిన వన్న ఈ సూచన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీమాంధ్ర, పెట్టుబడిదారుల కొమ్ముకాసి మరోసారి తెలంగాణకు ద్రోహం తలపెట్టే యోచనతోనే ఉన్నదా? అర్థం అవుతూనే ఉన్నది. ఇది కొనసాగతున్నది. ఇప్పుడు... తెలంగాణ ఉద్యమాన్ని గమనించే వాళ్లకు అర్థమయ్యే విషయం. మన బాంచెలు పిరికి వాళ్లు. పరాధీనులు అయిన మంత్రులు స్వామి, సకార్యాల కోసం క్యాబినెట్‌లోకి వెళ్లి వాళ్ల రాజకీయ జీవితకాలంలో పెద్ద తప్పు చేశారు.

ఆ తప్పు దిద్దుకుంటారో, ఎంగిలి మెతుకులు, ఏరిపారేసిన ఎముకలకు ఆశపడ్తారో వారి ఇష్టం. అధికార రాజకీయ ప్రయోజనాలకోసం ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనజీవితాలతో ఆటలాడుకుంటున్నది. కొంత అధికారం, కొంత ఆదాయ మార్గం అటు అధిష్ఠానానికి, ఇటు సీమాంధ్ర ఏలికలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం. ఇప్పటికైతే ఇదే నిజం. పిల్లలు చచ్చిపోతున్నరు. కాపురాలు కూలిపోతూనే ఉన్నయి. తల్లిదంవూడులు అంగలారుస్తూనే ఉన్నరు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదవ చాప్టర్‌అమలులో విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయనాయకులు, తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుకు తెరలేపుతున్నది. రాజకీయ, మీడియా మేనేజ్‌మెంట్‌లు అయిపోయి, అనంతర చర్యలు, అణచివేత చర్యలు ప్రారంభమవుతున్నయి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని కీలక విషయాల్లోనూ అంచనాలు తప్పి తప్పులు చేస్తున్నట్టే, తెలంగాణ విషయంలోనూతప్పులో కాలేస్తున్న ది. ఇది మునుపటి ఉద్యమం కాదు.

గ్రామ గ్రామానికీ పాకిన ఉద్యమం. మని షి మనిషికీ వ్యాపించిన ఉద్యమం. ప్రజాస్వామిక ధర్మాలు, సూత్రాలను కాలరాసి గుప్పెడు మంది కోసం కోట్ల మంది ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోదు తెలంగాణ. సకల జనుల సమ్మె కావచ్చు. దిగ్బంధం జరగొచ్చు. నెత్తురు ఒడిసిన నేల నెత్తురు మండితే ఏం జరుగుతుందో? ఏలికలకు కొత్తకాదు. తెలంగాణ ఆగదు. అంతం కాదు. వచ్చేదాకా సాగిపోతది. తెలంగాణ మంత్రులకు ఒక గమనిక. కొండా వెంకటరంగాడ్డి ఒక మాట అన్నడు. ‘గులామ్ కీ జిందగీసే మౌత్ అచ్ఛా హై!’ అని మరి బానిసలవుతారో..? మరేమవుతారో మీఇష్టం. బానిసల కన్నా.. చావులు మేలు. ‘బానిసకొక బానిసకొక బానిసవోయ్, బానిసా!మానిషి జన్మానికి ఛీ మచ్చవు నర పీనుగా’ శ్రీశ్రీ.
Source: NamastheTelangana.com

మన భాష... మన యాస..‘డబుల్’ కా మీటా...

A sunday supplement called "Batukamma" in our newspaper NamastheTelangaana is very much appreciated, because since beginning of the newspaper i am following it and it enphasizes more on the culture, nature people and traditions of the telangaana region below is one of teh article which resembles sweet and freshness of our language and accent here is the article for you friends. Thanks to newspaper onceagain

మన భాష... మన యాస..‘డబుల్’ కా మీటా...


kodipunju‘ఏంది బిడ్డా ఎప్పుడచ్చినవ్? పొలగాండ్లు బాగున్నరా? పురాంగ అంటుకుసొంటుకు లేకుండా పోయినవేంరా? మా ఆపతిసంపతి నువ్వు గాకపోతె ఎవ్వల్జూత్తరు కొడుక..?’ అంటడు ఆ పెద్ద మనిషి. ‘కాదే చిన్నాయిన! ఆఫీసుల పనిబాగైతంది. వద్దంవద్దం అనుకుంటనే లేటైంది. చిన్నవ్వ మంచిగున్నాదె?’ వరుసకు కొడుకైన రమేష్ ఇట్ల జవాబిస్తడు.

‘ఏం మంచిగుండడు బిడ్డ! అప్పుడెమొ అద్దంటె ఉరికురికి చేసె! ఇప్పుడు మంచాల పడె! మనిషంత పుండుపుండోలైంది. రాత్రంత ఆయెపాయె అన్నట్టు జేత్తంది! నేనే కిందవడిమీదవడి అండిపెడ్తె, ఓ బుక్క తింటంది..! దావఖన్లకు తీస్కపోదంరా అంటే చిన్నోడు ఇయ్యరమయ్యర తిట్టిండు. పెద్దంత్రంచిన్నంత్రం లేకుండ మాట్లాడిండు. అప్పుడు పానంపానమోలె సాత్తె ఇప్పుడు గిట్ల చెయ్యవట్టిరి. నువ్వన్న జెప్పు బిడ్డ తమ్ముళ్లకు! అది గడిగడికి నిన్నే యజ్జేత్తంది నువ్వయితె ఇంటికివా.. నేను జల్దిజల్ది పొయ్యి పంపుపెట్టత్త!...’

jantapadalu- వింటున్నరు కద...అచ్చమైన తెలంగాణ ఆత్మీయత ఎట్లుంటదో! ఆ భాష, యాస ఎంత కమ్మగుంటదో! గుండెల నిండా ఉన్న ప్రేమ, వాత్సల్యం వ్యక్తీకరించేందుకు ఒక్కపదమూ సరిపోక, జంట పదాలై ఎలా తన్నుకొస్తున్నదో..!

పైన ఉదహరించిన చిన్ని సంభాషణలో ఏకంగా డజను దాకా జంట పదాలు(పదం) ఉన్నయి. తెలంగాణ పల్లెల్లో ఇట్ల మాట్లాడటం మామూలే. తమ కష్టసుఖాలను అదే స్థాయిలో ఎదుటి వ్యక్తికి చేరవేయడంలో భాగంగా ఇట్లాంటి పదాల వాడకం సహజంగా కనిపిస్తది. ఉదాహరణకోసం రాసిందేగానీ ఇట్లాంటి సంభాషణలు మీకే ఎక్కువ తెలుసు.

మామూలుగానే ‘మనం వాడు మోసం చేస్తండు’ అనరు.. ‘ఉల్టపల్ట చేస్తండు’ అంటం. ‘భయమేస్తంది’ అని ఊకోం. ‘అగులుబుగులు అయితంది’ అని చెబ్తం. అలిగితే కేవలం ‘బతిమిలాడి’ సరిపుచ్చం.. ‘అద్గరిచ్చి.. బుద్గరిచ్చి’ అక్కునజేర్చుకుంటం. ఇటువంటి ఎన్నో జంట పదాలు, అచ్చమైన తెలుగుపదాలు తెలంగాణ భాష నిండా ఉన్నయ్. కొన్ని ఉర్దూ మిళితమై కనిపిస్తయ్. వాటిలో కొన్నింటిని చదవి చూడాలె..పాణం లేచి వస్తది.

అంటుకు సొంటుకు : దగ్గరకు
లంబుకులంబు : లావు
అండ్లదండ్ల : లోలోపల
అక్కలుముక్కలు : ఏదో అట్ల
అక్కిరిబిక్కిరి : మీదమీద
అడ్డందొడ్డం : మీదమీద
అగులుబుగులు : భయం
అగ్గువసగ్గువ : చౌకగా
అట్లట్ల : అలా
అడుగుబొడుగు : చివరకు మిగిలేది
అడుపదడప : అప్పుడప్పుడు
అతారపతార : పలుకుబడి
అదల్‌బదల్ : బదలిచ్చు
అద్గరిచ్చిబుద్గరిచ్చి : నయానోభయానో
ఆయెపాయె : చావుబతుకుల స్థితి
అర్కతిబర్కతి : వెలితి, లేమి
అలగ్‌సలగ్ : వేరుగా ఉండడం
అలాయ్‌బలాయ్ : కౌగిలింత
అలిమిబలిమి : బలవంతం
ఆపతిసంపతి : ఆపదసంపద
ఇగరాదుఅగరాదు : ఎంతకీ రాదు
ఇయ్యరమయ్యర : ఇష్టమొచ్చినట్లు
ఈకగాదుతోకగాదు : లెక్కలోకిరాదు
ఉత్తుత్తగ : ఊరికే
ఉరికురికి : జల్దిజల్ది
ఉల్టపల్ట : కిందమీద
ఊలేదు ఆలేదు : ఏమీలేదు
ఎంగిలిమంగలం : ఎంగిలిచేయడం
ఎగ్గిలెగ్గిలి : ఎడ్డెక్కిరి
ఎటువెట్టిఎటుదిరిగి : అటీటుజేసి
ఎతలేదు కతలేదు : ఏదీలేదు
ఎర్రగబుర్రగ : అందంగా
కంకెడుకంకెడు : పిడికెడు
కయ్యకయ్య : లబోదిబో
కస్సపిస్స : మెత్తగా
కాకిరిబీకిరి : అర్థం పర్థం లేకుండా
కాయిపాయి : కమ్మగా
కిందవడి మీదవడి : ఎలాగోలా
కుయ్యిలేదు కుటుక్కు లేదు : సడీచప్పుడు లేదు
గంగలగోదాట్ల : ఏట్లో
గట్టగట్ట(గుట్టగుట్ట) తాగు : తొందరగా తాగు
గడికిగడికి : గడియగడియకూ
గాయిగాయి : అల్లరి
గావరగావర : ఆకలితో నకనకలాడు
గొడగొడ ఏడ్సుడు : బాగా ఏడ్చు
గొర్రగొర్ర గుంజు : లాగడం
గోసగోస : దీనస్థితి
చిక్కుబొక్కు : కలగాపులగం
చిన్నంత్రంపెద్దంత్రం : చిన్నాపెద్దా తేడా
చిల్లంకల్లం : చిందరవందర
చెప్పకుంట చెయ్యకుంట : చెప్పాపెట్టకుండా
జప్పజప్ప తిను : జల్దిజల్ది తిను
జల్దిజల్ది : తొందరగా
జల్గురుజల్గురు : జారునట్లు
జిలజిల : రోత
జెప్పజెప్ప : తొందరగా
టకటక : తొందరగా
డుంబుకుడుంబు : లావుగా
తుంటకుతుంట : లావుగా
తంతెతంతెకు : తరతరానికి
తాపతాపకు : మళ్లీమళ్లీ
తాపకింత తాపకింత : కొద్దికొద్దిగా
తిప్పితిప్పికొడితే : అన్నీ కలిస్తే
తిర్రమర్ర : ఉల్టాపల్టా
తుక్కుతుక్కు : చితక
తుకపెక : బాగా
దబ్బదబ్బ : తొందరగా
దిక్కుదీం : దిక్కులేని
దిక్కుసక్కి : దిక్కులేని
నిక్కినిక్కి : మునిగాళ్లపై నిలబడి
నిగనిగ : అందంగా
నోట్లెనోట్లె : లోలోపల
పట్టిపట్టి : అదే పనిగా
పడుడుపడుడే : పడడంతోనే
పరంపరం : పొట్టుపొట్టు
వల్లవల్ల : ఎడతెగకుండా
పానంపానం : ఆరోప్రాణం
పిసపిస : పిచ్చి పట్టినట్లు
పుల్లలుపుల్లలు : అన్నం ఉడికిన తీరు
పెట్టుపోతలు : లాంఛనాలు
పుండుపుండు : అస్వస్థత
బండకుబండ : దృఢంగా
బట్టకు పొట్టకు : మామూలుగా
బడబడ : కల్లాకపటం లేకుండా
బర్సులుబర్సులు : నున్నగా లేకపోవడం
బిత్తిరిబిత్తిరి : అమాయకపు
బెక్కన బెంగటిల్లు : బెంగపడు
బొట్టులేదు బోనంలేదు : అవమానపరచు
బోడబోడ : ఏమీలేని పరిస్థితి
మంగురుమంగురు : తిక్కతిక్క
మన్నుమశానం : వల్లకాడు
మర్రిమర్రిజూసుడు : వెనక్కిచూసుడు
మాటమాటకు : మాటిమాటికి
మాటలేదు ముచ్చటలేదు : మాట్లాడకపోవడం
మిట్టమిట్టచూసు : ఆశపడు
మెరమెర : మనసులో మెదులు
మొన్నమొన్నటి : ఇటీవలి
యాల్లపొద్దుగాల : పెందలడ
రయ్యరయ్య : తొందరగా
రందారప్డా : ఏ బాధాలేదని
అంగడంగ : గందరగోళం
లట్టుపొట్టు : యథేచ్ఛగా
లడ్గురుం బొడ్గురుం : వదులువదులు
లద్దిలద్ది : మెత్తగా
లొడలొడ : అతిగా
శిదల్‌శిదల్ : ముక్కలుముక్కలు
శిమాంటశిమాంట : మొట్టమొదలు
శిటశిట : పూర్తిగా అయిష్టత
శీర్కెలుశీర్కెలు : పూర్తిగా చినిగిపోవు
సందుబొందు : సందట్లో సడేమియా
సకులంముకులం : సకలం ముకిళింపజేసుకొని కూర్చును
సర్రసర్ర : తొందరగా
సాదసీద : నిరాడంబరం
సాఫ్‌సీద : నిక్కచ్చిగా
సొడసొడలుపోవు : అలసిపోవు
అత్తరబుత్తర : ఏదో అయిందనిపించడం
Source: NamastheTelangaana.com

నేడే గర్జన


కరీంనగర్ వేదికగా సకల జనుల సమ్మెకు సైరన్
జనగర్జనకు సర్వం సిద్ధం
సభకు ముందుగా భారీ కాన్వాయి
ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా కళా బృందాలు
200మంది వలంటీర్లు
4వేల మంది పోలీసులు

-గులాబీమయంగా కరీంనగర్
-కళ్లెం యాదగిరిడ్డి ప్రాంగణం ముస్తాబు
-భారీ జన సమీకరణకు జేఏసీ నేతల కసరత్తు
-అందరిచూపూ ఉద్యమాల ఖిల్లా వైపే

KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ గర్జిస్తోంది. స్వరాష్ట్రం కోసం సమ్మెక సోమవారం సైరన్ మోగిస్తోంది. తెలంగాణ జనగర్జనకు కరీంనగర్ వేదిక కానుంది. సమ్మెకు సమరశంఖం పూరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. విప్లవాల పురిటిగడ్డ.. ఉద్యమాల ఖిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో నగారా మోగించి సర్వజనులను సకల జనుల సమ్మెలోకి దింపి ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరు సల్పడానికి కార్యరూపం తయారైంది. ఇక నగారా మోగించడమే ఆలస్యం అన్నట్లుగా యావత్తు తెలంగాణ ప్రజానీకం కరీంనగర్ వైపు చూస్తోంది. ఈ సభను గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవంతం చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. భారీ ఏర్పాట్లతో, భారీగా జన సమీకరణలో జేఏసీ నాయకత్వం తలమునకలై ఉంది.

కరీంనగర్, టీ న్యూస్ ప్రతినిధి:కరీంనగర్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానం (కళ్లెం యాదగిరి రెడ్డి ప్రాంగణం)లో జరిగే సభకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభావేదికను అందరికీ కనిపించే విధంగా తయారు చేసిన నాయకులు వేరువేరు గ్యాలరీలను ఏర్పాటుచేసి బారికేడ్లు నిర్మించారు. సభ ప్రాంగణంలో కేసీఆర్ నిలు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటుగా వివిధ ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో వచ్చే వాహనాలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. సభ ప్రాంగణంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా రెండువందల మంది వలంటీర్లను నియమించారు.

సభను గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్వహించడానికి గాను జనసమీకరణపై దృష్టిపెట్టారు. గత నాలుగైదు రోజులుగా గులాబి దండు ఊరు వాడ తిరిగి నగరా మోగించగా.. అన్ని జేఏసీ సంఘాలు ఎక్కడిక్కడే జనాలను తమ శక్తి మేరకు తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పలు గ్రామాల్లో ఇప్పటికే సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి తీర్మానాలు చేసుకున్నారు. జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జిల్లా ఇన్‌చార్జి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ , టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, విద్యార్థి సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు సుమన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ తదితర నాయకులు జనసమీకరణ, సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిజానికి గతంలో అదిలాబాద్, నిజమాబాద్, వరంగల్, మెదక్ జిల్లానుంచి భారీగా జనాన్ని తరలించాలని నిర్ణయించినా.. స్వచ్ఛందంగా ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక, కర్షక , మహిళలు తరలివచ్చేందుకు సిద్ధం కావడంతో కరీంనగర్ జిల్లా నుంచే లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు.

జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న బహిరంగ సభకు ప్రజలను సమీకరించేందుకు టీఆర్‌ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుండగా, సకలజనుల సమ్మెకు మద్దతుగా పాల్గొనేందుకు బీజేపీ, న్యూ డెమోక్షికసీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభం కానున్న జగనర్జనసభకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ నేతలు భారీ కాన్వాయితో హైదరాబాద్ నుంచి తరలిరానున్నారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం శనిగరం చేరుకొని అక్కడ తెలంగాణ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌వీ నాయకులు మోటర్ సైకిల్ ర్యాలీతో చేరుకొని స్వాగతం పలుకుతారు. ఎల్‌ఎండీ మీదుగా కమాన్, తెలంగాణ చౌక్ నుంచి సర్కస్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సర్కస్ మైదానం నుంచి భారీ ప్రదర్శన సభ ప్రాంగణం వరకు సాగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ర్యాలీలో కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టే విధంగా ఉండే వివిధ కళారూపాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కేసీఆర్‌తోపాటు జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేతలు విద్యాసాగర్‌రావు, దత్తావూతేయ, నూ డెమోక్షికసీ నేత సూర్యం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శాసన సభాపక్ష నేత ఈటెల, మాజీ ఎంపీ వినోద్ ర్యాలీలో పాల్గొంటారు. కరీంనగర్ నగరం యావత్తు గులాబీమయం అయింది. ఏ రహదారి చూసినా తెలంగాణ జెండాలు, తెరాస జెండాలతో రెపపలాడుతున్నాయి. ప్రతి చౌరస్తాను గులాబిమయం చేసారు. ఎల్‌ఎండీ నుంచి సర్కస్ మైదానం వరకు పెద్ద ఎత్తున్న ప్లెక్సీలను ఏర్పాటుచేసారు. ర్యాలీ సాగే రహదారి వెంట ప్రత్యేక తెలంగాణ పోరు, సకలజనుల సమ్మెకు సంబంధించి నినాదాలతో కూడ బ్యానర్లు, పోస్టర్లు నిర్మించారు. కొన్ని చోట్ల భారీ కట్‌అవుట్లను ఏర్పాటుచేసారు. జనగర్జన సభ సందర్భంగా నాలుగువేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. దీంతో సభ నిర్వహణపై పోలీసులు డేగకన్ను వేశారు. జనసమీకరణ నుంచి నేతల పర్యటనల వరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు.

నాటి సింహగర్జన స్థానంలో నేడు జనగర్జన
2001లో తెలంగాణ రాష్ట్రసమితి అవిర్భవానికి వేదికైన కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాల గడ్డపైనే నేడు జనగర్జన సభను నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలంలో అనేక సభలు, సమావేశాలు జరిగినా.. జనగర్జనను మాత్రం మరోసారి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి సకలజనుల సమ్మెలో భాగంగా మూడు సభలు ఏర్పాటు చేయాలని నిర్వహించిన తొలిసభను మాత్రం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక ఎత్తు అయితే.. సభ మరుసటి రోజు నుంచే సకల జనుల సమ్మె సైరన్ మోగుతుండటం విశేషం.

నేడు ఉద్యోగుల సర్వసభ్య సమావేశం
13 నుంచి ఆరంభమయ్యే సకల జనుల సమ్మెను విజయవంతం చేసే దిశగా ఉద్యోగులను సమయాత్తం చేయడానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆపీసర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని జిల్లాకేంవూదంలోని టీఎస్‌జీవో ఫంక్షన్ హాలులో నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు జరిగే సభకు స్వామిగౌడ్, ఇతర ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. అక్కడి నుంచి ర్యాలీలో పాల్గొని సభకు తరలి ఉద్యోగులు నిర్ణయించారు. ఇలావుండగా, సకల జనుల సమ్మెకు కరీంగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మద్దతు పలికారు. సమ్మెను ఉద్ధృతం చేయడానికి హైదరాబాద్‌ను దిగ్బంధం చేద్దామని, ఇందుకు అన్ని రాకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అవసరమైతే ఈ కార్యక్షికమాన్ని తానే ముందుండి నడిపిస్తానని వెల్లడించారు.

Source: Namasthetelangaana.com

Saturday, September 10, 2011

తెలంగాణపై సిఎం కిరణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంఘర్ణణలను నైపుణ్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆయన 12 పేజీల ప్రసంగ ప్రతిలోని 6,7 పేజీల్లో తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అధిక భావోద్వేగాల వల్ల పరిస్థితి ఏర్పడినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలు, పార్టీల నాయకులు సంయమనం పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భావోద్వేగాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఆందోళనల విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మీడియాపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు పరిమితులు అవసరమని ఆయన అన్నారు. గణేష్, రంజాన్ వంటి ఉత్సవాలను సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు.

ప్రాంతీయ భావోద్వేగాలతో తలెత్తిన ఉద్యమాలను శాంతిభద్రతల సమస్యగా చూడరాదని ఆయన అన్నారు. రాజకీయ పరిష్కారం కనుక్కునే వరకు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Friday, September 9, 2011

తాకత్.... A poetry by T Vasu


మబ్బుల్ని మింగిన పువ్వులు
పూల వాన..
చినుకులై రాల్తున్న తంగేడు పూలు
తుపానై..
గడ్డిపూలు.. మోదుగుపూలు
భూమి.. భూమ్మంతా
మా అనంతగిరి కొండలంత అందగుంది..
.... ... ...
చరిత్ర
ఉదయ సమువూదమను పానగల్ చెర్వొడ్డున
చింతచెట్టు కింద...
ఎర్రదుబ్బల...
తెలంగాణ పటం దిద్దుతున్న
పోరడి చూపుడేలు..
మా మట్టి మహా సముద్రం ముంగల
విశ్వభూనభో ఇతిహాసం
కాపిష్కల నీరంత..
కొట్లాటల పొద్దుగుంకే సవ్వాలే లేద్..
కాళ్లకు ఎన్కడుగు ఎర్కలే....
జంపన్నవాగు..జోడ్‌ఘాట్..కడి గుండ్రాంపల్లి...ఎల్బీనగర్...మానుకోట.. ట్యాంకు బండ్...తాండూరు...
ఉస్మానియా.. కాకతీయ.. హన్మకొండ ..
నెక్కొండ.. ఖమ్మం..
పోరాట తొవ్వెంబడి
వేలుకు వేలుగా
నిలు మైలురాళ్లు...
రక్తపు ధారలతో అచ్చుకట్టిన మైలురాళ్ళు

యాదయ్య చౌరస్తా పెద్ద దర్వాజను
తుత్తునియులు చేస్తున్న నినాదాలు

రెడ్యాల తొవ్వమీద
రెక్కలు విప్పిన తీటకోయిలాకుల నిరసన
రాయినిగూడెం మట్టిపిడికిళ్ల ధక్కాకు
పిండిపిండైన రచ్చబండ..
ఇప్పుడంతా రాళ్ళు.. కోడిగుడ్లు..
తమాటాలు..
ముళ్లకంచెలు... తుమ్మ మొద్దులు...
గాలినిండా టైర్లు కాల్తున్న వాసన..
మా ఉద్యమాల మంటల్లో
సూర్యుడైనా మాడి మసి కావల్సిందే....
పుస్తకాలు...
నెత్తుటి అట్టాలేస్కుంటయ్..
పేజీలు తిప్పితే..
వేళ్లకు ఎచ్ఛగా తగిలే అక్షరాలు...
ప్రాంతంపై ప్రేమున్న కాడ
ప్రాణానికి విలువుండదు
అక్షరం ఆత్మహత్య చేస్కుంది
టక్కుటమార..మాయజాల..
ఇడియట్ బాక్సుల.. దృశ్య శవపేటికల
అజీర్తితో... వామ్టింగ్ చేస్కునే
నీళ్ల విరోచనాల..ఎసిడిటి పుల్లటి తేన్పుల ..
వికరాల ... రోగాలతో విలవిల్లాడే...
ప్రేతాత్మల నవ్వుల...
మెంటల్ మంటల్లో కల్గిన కపాల మోక్షాల...
పక్కా నకిలీల...
ఏడ్పులనబడే నవ్వుల నయాచోర్...
పిలాస్టిక్ ఉద్యమాల.. ఆలోచనల
పెంటదిబ్బల.. ఆత్మవంచనల.. .
అసంబద్ధ... సమైక్యభావవీచికల....
మడత పేచీల...
గూర్చి రాయలేక ...
అక్షరం ఆత్మహత్య చేస్కుంది...
ఛత్రినాక చౌరస్తా కాడ
కూలిందెప్పుడో పాత బంగ్లా..
గక్కడో మొండిగోడ
మొలుస్తున్నయ్.. అక్షరాలు
సూర్యుడు నిద్ర లేచే యాల్ల...
దస్ జిల్లొంకా నారా హై ..
తెలంగాణ హమారాహై....

మంచిరేవుల బాటపొంటి
బాహ్యవలయ రహదారి అను అవుటర్ రింగ్‌రోడ్డు ప్రక్కన
ఎండిన చెట్టు మీద
ఆకులై మెరుస్తున్నయ్ పాలపిట్టలు...
- తమ్మనబోయిన వాసు

కాళన్న యాది...

కాళోజీ (అను) వాదం ‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు ప్రచురించిన గ్రంథం. అంతకు పది సంవత్సరాల పూర్వం ఎచ్.ఎన్. బ్రెయిల్స్‌ఫర్డ్ అనే రాజకీయ విశ్లేషకుడు ఒక ఏడాదిపాటు భారతదేశాన్ని పర్యటించి ఇంగ్లిషులో రాసిన పుస్తకమిది.
kaloji-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ పుస్తకానికి వెల్దుర్తి మాణిక్యరావుగారు రాసిన చిన్న ‘పరిచయము’(మొదటి ముద్రణకు ముందుమాట)ను మించి ఇన్నాళ్ల తర్వాతైనా కొత్తగా రాయవలసింది ఏమీలేదు. ఈ సంవత్సరం వెల్దుర్తి మాణిక్యరావుగారి శతజయంతి. హైదరాబాద్‌లో బూర్గుల రంగనాథరావు, నెల్లూరి కేశవస్వామి, భోగి నారాయణమూర్తి తదితరు కలిసి ఆయన 1960ల దాకా ‘సాధన సమితి’ పేరుతో సాహిత్యసంస్థను నిర్వహించారు. తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని చిత్రించిన తొలితరం కథారచయితలు కాళోజీ, వట్టికోట ఆయన సన్నిహిత మిత్రులు. కాళోజీ, ఆళ్వారుస్వామిల రచనలన్నీ కూడా వెలుగు చూస్తున్న సందర్భంగా కాళోజీ అనువదించిన ఈ పుస్తకం కూడా వెలువడడం కాళోజీ అభిరుచిని, (ముఖ్యంగా యువకుడుగా ఉన్న రోజుల్లో) అనువాదశక్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ డ్బై ఏళ్లలో తెలుగుభాష, పదిహేనేళ్లుగా తెలంగాణ భాషలు ఎంత వైవిధ్యంతో వికసించి సుసంపన్నమయ్యాయో పోల్చుకోవడానికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపకరించి, వెల్దుర్తి కాళోజీల వారసత్వాన్ని మనం ఇంకెంత ముందుకు తీసుకపోయామో కదా అని మనమీద మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తెలంగాణ వాక్య రచనలోను, తెలంగాణ భాషలోకి అనువాదం చేయడంలోను మనం కాళోజీ భుజాల మీద నిలబడగలిగామని కూడా మనకు గొప్పనిపిస్తుంది.

అయితే అది ఏ తెలుగు రచయితదయినా కావచ్చు గురజాడ మొదలు సురవరం ప్రతాపడ్డి దాకా అది ఆనాటి శైలి, ఆనాటి వాక్య రచన. మనం కర్త, కర్మ, క్రియలు నిండుగా ఉండే వాక్యాల నుంచి చాలా ముందుకొచ్చాం. మనిషే ఒక శైలి అన్నట్లుగా ఎవరి మౌఖికభాష వాళ్ల పుస్తకభాషగా దూసుకొస్తున్న కాలమిది. కనుక ఈ కాలంలో ఎంతో చిత్తశుద్ధితో, మూల గ్రంథం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు తెలిసిన ఒక తిరుగుబాటుదారు చేసిన గ్రాంథికశైలి అనువాదం మనకాయనపట్ల గౌరవాన్ని పెంచుతుంది. పత్రికలతో సహా ఏ అనువాదకుడూ వెనుకాడకుండా ఉపయోగించే రౌండ్ సమావేశం అనేమాటను గుండ్రబల్ల సమావేశంగా అనువాదం చేయాలన్నంత పట్టింపు చూస్తే ముచ్చపుస్తకం తెరవగానే వెల్దుర్తి మాణిక్యరావుగారి ముందుమాటలోనే ఒక దీర్ఘ చతురస్రం (బాక్స్‌గట్టి)లో ‘చదువరీ! ఈ పుస్తకములోని లోట్లన్నియు నావి అని అనువాదకుడు ప్రకటించుకున్నాడు.

ఈ క్రమశిక్షణ, వినయం ఒక ప్రాపంచిక దృక్పథం ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్యమ జీవితం ఉన్నవాళ్లకే సాధ్యమవుతుంది. జాతీయోద్యమం, నైజాం వ్యతిరేక పోరాటకాలంలో అది మనం అందరిలోనూ చూడవచ్చు. ముఖ్యంగా సత్యాక్షిగహుల్లో సాయుధపోరా టం ఎంచుకున్నవారిలో, గాంధీజీ అనుయాయుల్లో, భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకున్నవాళ్లలో.పుస్తకం అనువాదం చేయడానికి కాళోజీ ఎంచుకున్నదే బ్రెయిల్స్‌ఫర్డ్‌ను. గాంధీజీ పట్ల, ఆయన సత్యాక్షిగహ మార్గం పట్ల ఉన్న అపారమైన గౌరవం వల్ల. ఆయన సబర్మతీ ఆశ్రమం చూడడానికి వచ్చి.. దేశమంతా తిరిగినట్లున్నాడు. ఆయన గాంధీజీ వైపునుంచే దేశాన్నంతా చూశా డు. కాకపోతే పాశ్చాత్య, అందులోను బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి వచ్చినవాడు కాబట్టి, పారిక్షిశామిక విప్లవ నేపథ్యం ఉన్నవాడు కాబట్టి గాంధీజీ గ్రామ స్వరాజ్యం, ఆర్థిక విధానాలు ఆయనకు ఆచరణ సాధ్య మా! అని వింతగా కనిపిస్తాయి. కాని కొట్టిపారేయడు.

కాళోజీ వాటిని నమ్మినవాడు. సత్యాక్షిగహాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని. కాకపోతే సత్యాక్షిగహం చేయడానికి సాయుధపోరాటం చేయడానికన్న ఎక్కువ వైయ్యక్తిక సాహసం కావాలంటాడు. సాయుధ పోరాటం చేయడానికి ఒక గుణాత్మక పరిణామం వచ్చి ఒక సామూహిక సమాజానికే చైతన్యం, తెగింపు వచ్చి, నిన్నటిదాకా నీ బాన్చెన్‌దొరా అన్న వెట్టి మనుషులు, మట్టి మనుషులు, బానిసలు సంకెళ్లు తెంచుకొని ‘ఇగ ఎగబడదామురో’ అని తిరుగబడడం ఒక ఎత్తు. సత్యాక్షిగహానికి సత్యం పట్ల అచంచల విశ్వాసం, దానికి తగిన ధార్మిక ఆగ్రహం కావాలి. కాళోజీ తరచుగా ఉదహరించే గాంధీజీ మాట ‘పిరికితనం కన్నా పతి)హింస ఎంచుకోదగింది’ (I Prefer voilence to cowrdice). కాళోజీ గాంధీకన్నా ఒక అడుగు ముందుకు వేసి సత్యాక్షిగహం విఫలమైనచోట సాయుధపోరాటమే-వూపహ్లాదుడు రాజీలేకుండా నిలబడితే ఉగ్రనరసింహుడే వచ్చి పరిష్కరిస్తాడు.

ఆయన ప్రహ్లాద చరిత్ర మనసుకు పట్టిన కాలం నుంచి ఆఖరి శ్వాస దాక నమ్మిన సిద్ధాంతమదే. (‘సత్యాక్షిగహమో, చారుమజుందారీయమో’) .ఈ పుస్తకమంతా 1930లో దేశవ్యాప్తంగా సత్యాక్షిగహ ఉద్యమం పెల్లుబుకుతున్న కాలం. ఉప్పు సత్యాక్షిగహం, విదేశీ వస్తు బహిష్కరణ ఎంత విస్తృతంగా అమలవుతున్నాయో వెల్దుర్తి అలతి పదమ్ముల అనితర సాధ్యంగా చెప్పాడు. ఎందుకిట్లా దేశమంతా ఈ గాంధీజీ సత్యాక్షిగహ మంత్రోపదేశంతో కదిలారో తాను స్వయంగా చూసి అధ్యయనం చేయడానికి రచయిత ఒక ఏడాదిపాటు దేశమంతా తిరిగాడు. దేశ పరిస్థితులు ఒకవైపు కడుదయనీయంగా ఉన్నాయి. కాని ఒక వెనుకబడిన స్వతంత్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రైతు కేంద్రంగా వృత్తుల మీద ఆధారపడిన జీవితం ఇంగ్లిషువాని జోక్యంతో, రాజకీయార్థిక దాడులతో ఛిన్నాభిన్నమయింది. తకిలీకి, రాట్నానికి, మగ్గానికి, మాంచెస్టర్, ల్యాంక్‌షైర్‌ల మిల్లులు ఎటువంటి ఉపవూదవాన్ని తెచ్చాయో.. గాంధీజీ ఆ రాట్నాన్ని, తకిలీని ప్రచారం చేసి చూపించాడు. విలాసవంతులు కూడా గుట్టలుగా పోసి విదేశీ వస్త్రాలను బహిష్కరించారు. కాసేపు ఈ పుస్తకాన్ని, సంస్థానాలను మినహాయించి 1930ల దేశస్థితితో కాకుండా మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అవసరాల దృష్ట్యా చదువుదాం.

ఇవ్వాళ్టి ప్రజాస్వామిక ఉద్యమానికి ఒక కరదీపికగా ఉందీ పుస్తకం. కనీసం రెండు సంవత్సరాలుగా మనం వలసపాలనకు సహాయ నిరాకరణం చేద్దామని చెప్పుకుంటున్నాం. శాసనోల్లంఘన చేద్దామంటున్నాం. బలవత్తరమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా డ్బై ఏళ్ల క్రితం ఈ దేశ ప్రజలు ఎంతో అపూర్వంగా అవి చేసి చూపారు. ఈ పుస్తకం ముగిసే నాటికి (1931) ఆ పోరాటం ఒక గుండ్రబల్ల సమావేశానికి దారితీసింది. దేశానికి స్వయం పాలన యిచ్చి బ్రిటిష్‌వాడు వెళ్లిపోతాడన్న విశ్వాసం కలిగింది. ఒక్క గాంధీజీ మీదనే కాదు, ఈ పుస్తకం మేరకే చూసినా సుభాష్‌చంవూదబోసు, జవహర్‌లాల్ నెహ్రూ మొదలు బెంగాల్‌లో విప్లవకారుల వరకు ప్రజలకు నాయకత్వం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది.

ఈస్టిండియా కంపెనీతో మొదలైన కంపెనీల పరిపాలన ఇవ్వాళ మనదేశంలో అక్టోపస్ వలె విస్తరించింది. నిన్న రాచపుండు ఇవ్వాళ క్యాన్సరయ్యింది. తెలంగాణ ఉద్యమం తెలియక వలసాంధ్ర పాలన అన్నా, తెలిసి ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ సంపన్న వర్గాల దళారీ పాలన అన్నా మనమంతా మానసికంగా వ్యతిరేకిస్తున్నది వలసపాలనను అంటే కంపెనీల పాలనను.

1996 నుంచే,పదిహేనేళ్లుగా ప్రజాస్వామికంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చంవూదబాబు ప్రపంచబ్యాంకు సిఇవోగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చిన వైనంతో ప్రారంభమై వైఎస్‌ఆర్ కంపెనీల కోసం ‘జలయజ్ఞం’ పేరుతో రక్తయజ్ఞం నిర్వహించిన దుష్పరిణామాలను ప్రతిఘటించడానికే.

ఒక్కసారి ఈ పుస్తకంలోని శీర్షికలు చూడండి-రాట్నం, మద్య నిషేధం, విదేశీవస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాక్షిగహం. రాట్నం-మగ్గం గా, మరమగ్గంగా విస్తరించి సిరిసిల్ల నుంచి పోచంపల్లి దాకా ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ,మైక్రో అప్పుల మాయాజాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలు కావా? మద్యపాన నిషేధం ఇవ్వాళ బెల్టుషాపుల విశ్వరూపం ముందు ఎంత తీవ్రస్థాయిలో చేపట్టవలసిన ఉద్యమమవుతుంది? ఇవ్వాళ్టి పాలనే మైన్ (మైనింగు)లది, వైన్‌లది.
ఇవ్వాళ దేశ వ్యాప్తంగా సమువూదతీర ప్రజలందరూ చేస్తున్నది ఉప్పు సత్యాక్షిగహం.ఇది కేవలం ఉప్పుమీద పన్నువేయడం దగ్గర ఆగింది కాదు. ఇప్పుడు ఉప్పు బహుళజాతి కంపెనీలది. బడా కంపెనీలది.

ఉప్పుమీద పన్ను వేసినపుడు బార్డోలీ (గుజరాత్ సమువూదతీరం) దాకా చరివూతాత్మకమైన సత్యాక్షిగహం చేసి తామే ఉప్పు పండించుకుంటామనడమే కాకుండా గాంధీజీ పన్నుల నిరాకరణకు కూడా పిలుపు ఇచ్చాడు. సత్యాక్షిగహం అనే నాణానికి మరోవైపు శాసనోల్లంఘనం, పన్నుల నిరాకరణ. ముప్ఫైలో రచయి త కళ్లార చూసి చిత్రించిన ఈ పోరాట రూపాలన్నీ ఇవ్వాళ తెలంగాణలో అంటే చిత్తశుద్ధితో ఆచరించడానికి ఈ పుస్త కం ఒక ఉత్తేజాన్నిస్తుంది.

గులాంనబీ ఆజాద్ ఆంవూధవూపదేశ్ వ్యవహారాలు చూసే మంత్రిగానో, కేంద్ర దూతగానో చేస్తున్న చర్చల వంటివే ఇంగ్లాండులో రౌండ్ సమావేశాలు జరిగాయి. ఇప్పటివలె అవి కాంగ్రెస్‌కే పరిమితం కాలేదు. గాంధీ, జిన్నా, అంబేద్కర్‌లయినా పాల్గొన్నారు. ఏమయినా ఆ గుండ్రబల్ల సమావేశ నిర్ణయం ‘నిరోధించదగినంత పాడుగను, అవలంబించదగినంత మంచిగను ఉండనిచో.. భవిష్యత్తు పూర్తిగా భూతకాలము వలెనే ఉండగలదు.. ప్రస్తుతము జరిగినట్లే జరుగును. పదవుల కొరకు, ఆదాయము కొరకు ప్రాకులాడువారే ఆ అవకాశముతో లాభమొందెదరు.. ఇట్లు ప్రభుత్వ వర్గములలో పలుకుబడి సంపాదించుకొనినవారు ఒకరి తరువాతనొకరు మంత్రిత్వమును స్వీకరింతురు.. ఆర్థిక పరిస్థితి బాగుపరుచుటకై పొదుపు చేయుదుమని పురాతనమగు నెపములు చూపబడును.

విద్యావ్యాప్తి, ఆరోగ్యవంతముగా జీవనము గడుపు విధానము, బాధ పారిక్షిశామికులకు ఉండుటకై మంచి గృహవసతి మొదలగు అత్యవసరమైన పనులను డబ్బులేదని తలపెట్టరు. పన్నుల భారమే రైతుల పై నుంచి తగ్గించి ధనికవర్గము పైనను, జమీందారుల పైనను మోపబడదు. భూమి పన్నులలో ఏ మాత్రము మార్పు జరుగదు... ఒక్క మార్పు గలుగును. ధనిక వర్గమునకు చాలా లాభదాయకముగానుండును’. (చూ. పే. 103,104)
చర్చలకు పోరాటం దారితీస్తే..ఆ చర్చలలో పోరాట ఆకాంక్షలు వ్యక్తమయ్యే నిర్ణయాలు జరుగుతాయి. ఆ చర్చలలో పోరాటశక్తుల ప్రతినిధులు పాల్గొనాలి. అటువంటి సందర్భాల్లో కూడా పోరాట ఆకాంక్షలను అణచివేసే రాజ్య వైఖరినే మనం ఇటీవల రెండు సందర్భాల్లో చూశాం. పోరాటాలు ముప్ఫై ఆదర్శాలను ప్రతిఫలించినప్పుడు చర్చలూ అట్లాగే ఉంటాయి. ఫలితాలూ అట్లాగే ఉంటాయి.

కాళోజీ సత్యాక్షిగహోద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా డ్బై ఏళ్ల రాజ్యవ్యతిరేక ప్రస్థానం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన అనువాదాన్ని మనం పోరాట ఆచరణలోకి అనువదించుకోవడానికే ఈ మలిమువూదణ.
(హెచ్.ఎన్‌బెయిల్స్ ఫర్డ్ రాసిన ‘నా భారతదేశ యాత్ర’ పుస్తకాన్ని కాళోజీ 1941లో అనువాదం చేశారు. దానిని పునర్‌ముద్రిస్తున్న సందర్భంగా దానికి వరవరరావు రాసిన ముందుమాట నుంచి..)

‘జై తెలంగాణ’ హారన్

‘జై తెలంగాణ’ హారన్
bike-telangaana-news talangana patrika telangana culture telangana politics telangana <br><br>cinemaబైక్ బ్రేకు తొక్కినప్పుడు ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అని హారన్ వస్తే ఎలా ఉంటుంది. సూపర్ కదా. ఇదే ఐడియా వచ్చింది గంధం సురేందర్ బాబుకి. కానీ ఇది ఎలా సాధ్యం? అసలు సాధ్యమవుతుందా? తెలంగాణ ఆకాంక్షని నరనరాల్లో నింపుకున్న సురేందర్‌కి ముందు అనుమానమే వచ్చింది. అసలు ఈ హారన్లు ఎక్కడ తయారు చేస్తారు. హైదరాబాద్‌లో చేస్తారా? వెతికాడు.

హైదరాబాద్‌లో హారన్లు దొరుకుతాయి.. కానీ.. మనకు కావాల్సిన పాటని, మాటని పెట్టుకోలేం. కానీ తెలంగాణ కోసం తన వంతుగా ఏదైనా చేయాలన్న సురేందర్ తపన మాత్రం వీడలేదు. ఆ ప్రయత్నమే అతనికి ఒక మార్గం చూపించింది. ఇంటర్‌నెట్‌లో అలాంటి కంపెనీల గురించి వెతికాడు. వందల్లో వచ్చాయి. వాటన్నింటిని సార్టింగ్ చేసి పదింటిని ఎంచుకున్నాడు. వారితో మాట్లాడాక ఢిల్లీలో ఉన్న ఒక కంపెనీలో ఇది సాధ్యమవుతుందని అర్థమైంది. ఆ తర్వాత ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అని గాయకుడు దేశపతి శ్రీనివాస్ వాయిస్‌ని రికార్డ్ చేయించాడు. సీడీలోకి కాపీ చేసుకుని ఢిల్లీకి వెళ్లాడు. కార్ల స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఆ కంపెనీ ఒక హారన్‌ని తయారు చేసిచ్చింది. అది చాలామందికి నచ్చడంతో బల్క్‌లో 10 వేల హారన్లను ఆర్డర్ ఇచ్చాడు. కారు రివర్స్ తీస్నున్నప్పుడు వచ్చే హారన్‌కి బదులుగా దీన్ని పెట్టుకోవచ్చు. దీన్నే టూ వీలర్‌కు కూడా హారన్‌గా పెట్టుకోవచ్చు. వెనక బ్రేక్ వేసినప్పుడు హారన్ వచ్చేలా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. పాపులర్ బాలీవుడ్ పాటలతో హారన్లు మార్కెట్‌లో ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి. కానీ తెలుగులో..
blue-telangaana-news talangana patrika telangana culture telangana politics telangana <br><br>cinema

అదీ తెలంగాణ స్ఫూర్తిని కలిగించేదిగా ఉన్న హారన్ మాత్రం ఇదే మొదటిది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సురేందర్ తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి దీన్ని తయారు చేయించాడు.ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సురేందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. హారన్ల అమ్మకం కోసం జిల్లాకొక వాలంటీర్‌ని కోరుతున్నాడు. ఆసక్తి ఉన్నవారు, ‘జై తెలంగాణ’ హారన్ గురించిన పూర్తి వివరాలకు సురేందర్ సెల్ నెంబర్ : 9849419941లో సంప్రదించొచ్చు.

తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే! - By Warangal Police

తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే!
-ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్!
-12 మంది విద్యార్థులపై చిత్రహింసలు..స్టేషన్లకు తిప్పి మరీ చితకబాదారు
- తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా?
- విద్యార్థుల అరెస్టు, చిత్రహింసలపై ఆగ్రహం
- జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
- వరంగల్ నగరంలో బస్సు దగ్ధం
- పోలీస్ స్టేషన్లు ముట్టడించిన విద్యార్థులు
- తీరుమారని ఖాకీ.. విద్యార్థులపై లాఠీచార్జ్
- చంపుతామంటే ఊరుకునేది లేదు
- కాజీపేట డీఎస్పీకి ఉద్యమకారుల హెచ్చరిక
- హక్కుల సంఘానికి వెళతామన్న బోయినపల్లి
- ఎంత మందిని చంపుతారో చూస్తాం: పాపిడ్డి

Student010-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
‘అరే తెలంగాణ అంటార్రా? ఇంకోసారి అంటారా? మర్యాదగా.. తెలంగాణ అని ఇంకోసారి అనమం ఊరుకుంటాం. లేదంటే మీ పని అంతే. మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తాం. ఏమనుకుంటున్నారో..’ ఇది తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకుగా ఉన్న విద్యార్థి నేతలకు ఓ రక్షకభట అధిపతి ఇచ్చిన వార్నింగ్! విద్యార్థి నేతలకే కాదు.. వారికి మద్దతు పలికిన టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్ రెడ్డికీ అదే గతి పడుతుందని హెచ్చరిక! అది ఎలా ఉంటుందో మచ్చుకు రుచి చూపించారు కూడా! పోలీస్ స్టేషన్‌లో వేసి, రెండు కాళ్లను చాపి.. వాటిపై ఒకరు కూర్చొని, కాళ్లపై రోకలిబండల్లాంటి లాఠీలతో మరికొందరు బాదుతూ, బస్సుపూక్కించి, జిల్లాలోని ఠాణాలన్నీ తిప్పుతూ, అక్కడ సెల్‌లో వేసి చితకబాతుతూ, మార్గమధ్యంలో వాహనంలోనే కుళ్లబొడుస్తూ..

బూతులు తిడుతూ.. బెదిరిస్తూ.. భయవూభాంతులకు గురిచేస్తూ... తెలంగాణ ఉద్యమంపై తమ కసి తీర్చుకున్నారు! ఫలితం.. నలుగురు యువకులు నడవలేని స్థితి! అందులో ఒకరిది మరీ దారుణమైన పరిస్థితి! ఇది వరంగల్ జిల్లా ఖాకీల మార్కు హింస! నరనరాన జీర్ణించుకుపోయిన తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం! తెలంగాణ విషయంలో దోబూచులాడుతున్న మంత్రి పొన్నాలను నిలదీయడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది! ఆవేశంతో ఆయన ఇల్లు ముట్టడించడం ఘోరమైపోయింది! వెరసి.. 12 మంది విద్యార్థులను రాత్రంతా జిల్లాలోని వివిధ స్టేషన్లకు తిప్పుతూ థర్డ్‌డిగ్రీ చిత్ర హింసలు పెట్టారు! డీఎస్పీ తమను ఎలా బెదిరించిందీ..

ఎలా చిత్రహింసల పాల్జేసిందీ బాధితులు న్యాయమూర్తికి విన్నవించుకోవడతో ఖాకీల కర్కశం సమాజానికి వెల్లడైంది! విద్యార్థుల అరెస్టులు, చిత్రహింసలపై తెలంగాణ భగ్గుమంది! పోరుగల్లు పొక్కిలైంది! డీఎస్పీ కిరాతకాన్ని ఖండిస్తూ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఠాణాలను ముట్టడించారు! డీఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తోడయ్యాయి. డీఎస్పీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి. తెలంగాణ కావాలంటున్న నాలుగున్నర కోట్ల మందినీ ఎన్‌కౌంటర్ చేస్తారా? అని సవాలు చేశాయి!!

ఎన్‌కౌంటర్ చేస్తానన్నాడు!
- ఖాకీ కర్కశాన్ని కళ్లకు కట్టిన విద్యార్థి నేత
- చిత్రహింసలపై న్యాయమూర్తికి వివరాలు
- నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై కోర్టుకు యాకూబ్‌డ్డి
- కిక్కిరిసిన కోర్టు.. మార్మోగిన తెలంగాణ నినాదం

చెయ్యి కదిపితే బాధ! కాలు మెదిపితే నరకం! ఒళ్లంతా పచ్చి పుండు! మాట పెగిలే సత్తవ కూడాలేదు! అయినా మొండితనం.. తెలంగాణ కోసం! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం! ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. పోలీసుల చిత్రహింసల కారణంగా స్ట్రెచర్ మీద వచ్చాడు! శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు!

వరంగల్, సెప్టెంబర్ 8 (టీ న్యూస్): ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. ఖాకీ చెరలో గాయాల పాలైన తీరు హృదయ విదారకరంగా ఉంది. అక్రమ నిర్భంధం ఒకవైపు.. అలవికాని చిత్రహింసలింకొక వైపు.. అసలు సంగతి బయటపడితే అంతం చేస్తామన్న బెదిరింపులు మరోవైపు! ఐతేనేం.. అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసుల నిజస్వరూపాన్ని అదరక, బెదరక న్యాయమూర్తి ముందు ఆవిష్కరించాడు యాకూబ్‌డ్డి. ఒళ్లంతా గాయాలు సలుపుతున్నా, నిలబడడం కాదుకదా మాట్లాడటానికి కూడా శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు.

న్యాయవాదులు, తెలంగాణవాదులు అనుక్షణం ఉత్కం చూస్తుండగా.. వందలాదిగా మోహరించిన పోలీసు బలగాల మధ్య యాకూబ్‌డ్డి అంబుపూన్స్‌లో అదాలత్‌కు రాగానే కోర్టు కోర్టంతా జైతెలంగాణ నినాదమయ్యింది. క్షతగావూతుడైన యోధుడిని చూసి ఉద్యమకారులు, కొడుకు దేహంపై కమిలిన గాయాల్ని తడుముతూ కన్నీరొలికించిన కన్నతండ్రి! కంటతడిపెట్టని నయనం లేదు. ‘నీత్యాగం వృథాకాదు, నీ స్వప్నం నిజం కాకపోదు’ అని వెన్నుతట్టిన సహచరుల కరస్పర్శల తదుపరి స్టెచర్‌పైనే కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తికి, యాకూబ్‌డ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
StudentFig-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
నీ పేరేమిటి?
యాకూబ్‌డ్డి
మీ తండ్రి పేరేమిటి?
సమ్మిడ్డి.
మిమ్ముల్ని ఎక్కడ అరెస్టు చేశారు?
సుబేదారిలో.
ఎన్ని గంటలకు అరెస్టు చేశారు?
12 గంటలకు.
మిమ్ముల్ని ఎక్కడ నిర్బంధించారు?
సుబేదారిలో.
తర్వాతేం జరిగింది?
మమ్ములందర్ని ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడేం జరిగింది?
దుఃఖం..!! సార్ అక్కడ నా బట్టలు విప్పించారు. ఒకరి తర్వాత ఒకరు చిత్రహింసలకు గురిచేశారు. సార్ భరించలేని బాధ అవుతున్నది సార్.
దేనితో కొట్టారు?
కర్రలతో సార్.
ఎవరు కొట్టారు?
డీఎస్పీ వెంకవూటాంనర్సయ్య, ఇంకో ఆరుగురు పోలీసులు సార్.
ఎక్కడ కొట్టారు?
ఒళ్లంతా కొట్టారు సార్. పురుసాల మీద కూడా కొట్టారు సార్.. ఒల్లంతా ఒకటే నొప్పి సార్.
ఆ తర్వాత?
మీ కోసం ఫోన్ చేస్తున్న పెద్ది సుదర్శన్‌డ్డిని కూడా ఒదిలిబె లేదు.. ఇదే రూంలో మీలాగే ఆయన సంగతి కూడా చూస్తామని బెదిరించారు
ఆ తర్వాత?
చాలా సేపు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పారు సార్.
ఆ తర్వాత?
ఎంజీఎం ఆస్పత్రి నుంచి కోర్టుకు వస్తుంటే అంబుపూన్స్‌లో ఎస్కార్ట్ పోలీసులు కూడా పోలీసులకు వ్యతిరేకంగా న్యాయమూర్తి ముందు మాట్లాడితే ఎన్‌కౌంటర్ చేస్తామన్నారు సార్. నాకు ఈ పోలీసులతో ప్రాణభయం ఉంది సార్..

బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నాక, న్యాయవాదుల అభ్యర్థన మేరకు యాకూబ్‌డ్డిని జైలుకు తరలించి తగిన వైద్యం అదించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.
Source: NamastheTelangaana.com