Pages

Sunday, September 18, 2011

పోరు దారిలో...ఆత్మగౌరవ రెపపలు

-అంతటా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రభుత్వ కార్యాలయాలపై ఎగిరిన మువ్వన్నెల జెండా
- రణరంగమైన నిజామాబాద్, వరంగల్, కరీంనగర్
- కరీంనగర్‌లో వకీళ్ల్లపై విరిగిన పోలీసు లాఠీ
- ఎమ్మెల్యే యెండెలతోపాటు వేలాది మంది తెలంగాణవాదుల అరెస్టు
- నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ

jai-elangana-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీన్యూస్ నెట్‌వర్క్:వరంగల్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఎగురవేస్తామని ప్రకటించిన బీజేపీ భారీ ఎత్తున పార్టీ, అనుబంధ సంఘాల నాయకులను, కార్యకర్తలను సమీకరించింది. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, మందాడి, జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌డ్డి, నాయకులు వేణుగోపాల్‌డ్డి, రాజలింగం సహా పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్‌కు రాగానే పోలీసులు వారిని అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి అమరవీరుల స్తూపం వద్ద జాతీయ జెండా ఎగురవేయగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తెలంగాణ జెండా ఎగురవేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భూపతి కృష్ణమూర్తి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలతోపాటు తెలంగాణ జెండాల్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మందిని అరెస్టులు చేశారు. ఉద్యోగ సంఘాలు కూడా పలు ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేశాయి. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, టీఎన్‌జీఓ సంఘం భవన్‌లో అధ్యక్షుడు స్వామిగౌడ్, మింట్ కంపౌండ్ తెలంగాణ చౌరస్తాలో రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, మియాపూర్ అల్విన్ కాలనీలో నాగం జాతీయ, తెలంగాణ పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ బస్ భవన్ వద్ద ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం, రాజేంవూదనగర్ చౌరస్తాలో తూర్పు రంగాడ్డి జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరావు, కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మరో పది చోట్ల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పద్మారావు ఆధ్వర్యంలో విలీన దినోత్సవం జరిగింది. గాంధీ భవన్‌లో బొత్స, ఎన్‌టీఆర్ భవన్‌లో చంద్రబాబు, బీజేపీ కార్యాలంలో కిషన్‌డ్డి, సీపీఐ కార్యాలయంలో నారాయణ జాతీయ పతాకాలు ఎగురవేశారు.

police-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్ జిల్లాలో అక్కడక్కడా పోలీసులు అత్యుత్సాహంతో జెండావిష్కరణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీజేపీ నాయకుడు రామకృష్ణాడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడ జెండాలు ఎగురవేశారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ చౌక్‌లో విమోచన దినం కార్యక్షికమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల కోర్టులో జాతీయ జెండాను ఎగురేసేందుకు ప్రయత్నించిన న్యాయవాదులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గాయపడ్డ న్యాయవాదులను భవనంపై నుంచి కిందకు తోసేయ్యడానికి యత్నించగా, మరో పోలీసు వారించాడు. దీంతో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లాఠీచార్జికి కారకుడైన ఎస్‌ఐ కృష్ణమూర్తి క్షమాపణలు చెప్పారు. టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ జమ్మికుంటలో జాతీయ జెండాతోపాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మంలో కలెక్టరేట్ సహా జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ, తెలంగాణ జెండాలను ఎగురవేశారు.

తెలంగాణ విమోచన దినం నిజామాబాద్ జిల్లాలో రణరంగంగా మారింది.పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణవాదులు కలెక్టర్,ఆర్డీఓ కార్యాలయాలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అర్బన్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పీసీసీ చీఫ్ డీఎస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నల్లగొండ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసినప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద తెలంగాణవాదులు జెండాలను ఎగురవేశారు. కొన్ని కార్యాలయాలలోకి చొచ్చుకొని వెళ్లేందుకు కొన్ని పార్టీల వారు ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించినప్పటికీ తెలంగాణవాదులు జిల్లా కేంద్రంతో సహా పలు చోట్ల జాతీయ జెండాలు ఎగురవేశారు.

అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ విఠల్‌రావు ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. ఆదిలాబాద్‌లో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు తెలంగాణ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు పోలీసు పరేడ్‌క్షిగౌండ్‌లో జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో తెలంగాణ విమోచన దినం జోరుగా సాగింది. సమ్మెలో పాల్గొంటున్న సకల జనులతో పాటు బీజేపీ, ఏబీవీపీ, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ తదితర పార్టీలు, సంఘాలు జాతీయ జెండాతోపాటు తెలంగాణ జెండాలు ఎగురవేసి తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకున్నారు. సుమారు 300 మంది తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగాడ్డి జిల్లా వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయం ఎదురుగా జాతీయ జెండాను, పార్టీ జెండాను పొలిట్‌బ్యూరో సభ్యుడు, డాక్టర్ ఏ.చంద్రశేఖర్ ఎగురవేశారు. కీసర మండలం చీర్యాల్ చౌరస్తాలో జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు తూర్పు డివిజన్ జేఏసీ చైర్మన్ చెల్మాడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment