సకల జనం అజేయం
-ఉగ్రరూపంలో సమ్మె మూడో రోజూ
-కార్యాలయాల మూత తెరుచుకోని సినిమా హాళ్లు
- స్ఫూర్తిదాయకంగా సింగరేణి
- యాజమాన్యానికి రూ.75 కోట్లు నష్టం
- తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మల దహనం
- గాడిదలపై చిత్రపటాల ఊరేగింపు
- జవాబు పత్రాలపై ‘జై తెలంగాణ’ నినాదం
- రంగాడ్డి జిల్లాలో విద్యార్థుల సాహసం
- నేటి నుంచి సమరంలోకి ఉపాధ్యాయులు
- 19 నుంచి ఆర్టీసీ సమ్మె షురూ
- నేడు సీమాంధ్ర బస్సులపై పోరాటం
చినుకు
చినుకు కలుస్తున్నాయి.. వరదై పోటెత్తుతున్నాయి! తెలంగాణ సాధన దిశగా రాజకీయ
జేఏసీ నేతృత్వంలో మొదలైన సకల జనుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది! సర్కారు
ఎన్ని అడ్డుకులు కల్పించినా.. సకల జనం అజేయంగా నిలిచింది! సమ్మె ఉగ్రరూపం
దాల్చుతోంది! తెలంగాణ జిల్లాల్లో పాలన స్తంభించిపోయింది. మూడో రోజు కూడా
ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. యావత్ తెలంగాణకు
స్ఫూర్తిదాయకంగా సింగరేణి సమ్మె కొనసాగుతోంది. బొగ్గు ఉత్పత్తి
నిలిచిపోవడంతో 75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కార్మికులు సైతం తమ
స్థాయిలో 24 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోయారు. సింగరేణిలో సమ్మె మరో మూడు
రోజుల్లో దక్షిణ భారతంలో పారిక్షిశామిక సంక్షోభానికి కారణం కానుంది.
సింగరేణి అధికారులు సైతం 19 నుంచి సమ్మెలోకి దిగబోతుండటం సర్కారులో మరింత
కలవరం కలిగిస్తున్నది. మరోవైపు వరుసగా రెండో రోజూ సినిమాహాళ్లు మూతపడ్డాయి.
పది జిల్లాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వరంగల్‌లో న్యాయవాదులు
డీఈవో కార్యాలయంలోకి ప్రవేశించి సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఫొటోను ధ్వంసం
చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ పల్లెలు, పట్టణాలు
ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిపోయాయి. మేము సైతం అంటూ.. సమ్మెకు
సంఘీభావంగా పలు చోట్ల విద్యార్థులు మానవహారాలు నిర్మించారు. రంగాడ్డి
జిల్లా బండెల్కిచర్ల గురుకుల పాఠశాలలో జరిగిన పరీక్షలో జవాబు పత్రాలపై
పలువురు విద్యార్థులు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు రాశారు. పలు జిల్లా
కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమంలో
కలిసిరాని నేతలు, మంత్రుల దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు.
సీఎం
కిరణ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రులు దానం నాగేందర్,
ముఖేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పలువురు తెలంగాణ
వ్యతిరేకుల ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఆదిలాబాద్‌లో కిరణ్‌కుమార్‌డ్డి,
చంద్రబాబు, దానం, శ్రీధర్‌బాబు, ముఖేష్ తదితరుల చిత్రపటాలను గాడిదలపై
ఊరేగించారు. సమ్మె ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తూ శుక్రవారం నుంచి
ఉపాధ్యాయులు సకల జనుల సమరాంగణానికి తరలి వస్తున్నారు. ఉత్తర-దక్షిణ
భారతావని మధ్య రాకపోకలు స్తంభింప చేసేందుకు ఉద్దేశించిన జాతీయ రహదారుల
దిగ్బంధం కార్యక్షికమం ముందుగా ప్రకటించిన 18న కాకుండా.. 19కి మార్పు
చేస్తూ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. 18న బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ఉండటంతో
వాటికి హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
19వ తేదీ నుంచే ఆర్టీసీ కార్మికులు సైతం సమర శంఖం పూరించనుండటం తెలంగాణలోని
సబ్బండ వర్ణాలకు స్ఫూర్తినిస్తోంది!! తెలంగాణ కోసం జరిగే సమ్మెకు ముందే
సీమాంధ్ర బడా నేతలు, పెట్టుబడిదారుల యాజమాన్యాల్లోని ప్రైవేటు బస్సుల పని
పట్టేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది! నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని
ఎల్బీనగర్‌వద్ద ప్రైవేటు బస్సులను అడ్డుకునేందుకు పిలుపునిచ్చింది! ఇదిలా
ఉండగా.. రాష్ట్రంతో పాటు దక్షిణభారతాన్ని అంధకారంలోకి నెట్టేయనున్న
సింగరేణి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కారు ప్రయత్నాలు
మొదలుపెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ ఎస్పీ రవీందర్
గురువారం గోదావరి ఖనిలో పర్యటించడం ఈ అనుమానాలకు కారణమైంది.
రామగుండం రీజియన్ మేనేజర్లు బీ కిషన్‌రావు తదితరులతో సమావేశమై సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. దీనిపై రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను మానుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.
-కార్యాలయాల మూత తెరుచుకోని సినిమా హాళ్లు
- స్ఫూర్తిదాయకంగా సింగరేణి
- యాజమాన్యానికి రూ.75 కోట్లు నష్టం
- తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మల దహనం
- గాడిదలపై చిత్రపటాల ఊరేగింపు
- జవాబు పత్రాలపై ‘జై తెలంగాణ’ నినాదం
- రంగాడ్డి జిల్లాలో విద్యార్థుల సాహసం
- నేటి నుంచి సమరంలోకి ఉపాధ్యాయులు
- 19 నుంచి ఆర్టీసీ సమ్మె షురూ
- నేడు సీమాంధ్ర బస్సులపై పోరాటం
రామగుండం రీజియన్ మేనేజర్లు బీ కిషన్‌రావు తదితరులతో సమావేశమై సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. దీనిపై రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను మానుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.
No comments:
Post a Comment