Pages

Saturday, September 24, 2011

నల్లారి వారి సామ దాన భేద దండోపాయాలు కుతంత్రాల కిరణాలు!


-నల్లారి వారి సామ దాన భేద దండోపాయాలు
- ఉద్యోగుల విభజనకు యత్నం
- ఆర్టీసీలో కొన్ని సంఘాలకు బుజ్జగింపులు
- సింగరేణి కార్మికులకు రెట్టింపు జీతాల ఎర
- సమ్మె కొద్దికాలమేనంటూ ప్రణబ్‌తో మంతనాలు
- ఉద్యమ ఉద్యోగులకు నెల జీతం మొత్తం కోత
- కొత్త పథకాలతో మభ్య పెట్టే ప్రయత్నం
- అంతర్గత సెగను తప్పించుకునేందుకు తంటా
- రాష్ట్రపతి పాలన రాకుండా ఉద్యమంపై ఉక్కుపాదం!

kiran-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 23 (టీ న్యూస్):ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం.. అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్న దుష్ట సంప్రదాయం! ఓ ప్రజాస్వామిక డిమాండ్‌పై.. ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అప్రజాస్వామికంగా అణచివేసేందుకు పాలకుల కుటిల పన్నాగం..! సంఘటిత కార్మికులను చీల్చే యత్నాలు... ఉద్యోగులను బుజ్జగించే పన్నాగాలు.. రెట్టింపు వేతనాలు ఎరవేసేందుకు కుతంవూతాలు.. జీతాలకు పాకులాడి.. సమ్మె వదిలేసి వచ్చేస్తారని దుష్ర్పచారం... సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఒకటా ండా.. సీమాంధ్ర సర్కారుకు నాయకత్వం వహిస్తున్న సోకాల్డ్ హైదరాబాదీ సీఎం నల్లారివారి లీలలు ఎన్నని?

తన సీటుకే ఎసరు తెచ్చే అంతర్గత కల్లోలంలో చిక్కుకున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. దానికి తెలంగాణ ఉద్యమ ఉధృతితోడై ఊపిరి ఆడనీయకుండా చేస్తుండటంతో కుతంవూతాల బాటనే ఎంచుకుంటున్నారు. మంత్రివర్గ సహచరులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొనడంతోపాటు.. ఏకపక్షంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ అభాసు పాలవుతున్న కిరణ్ తాజాగా, ప్రభుత్వానికి సవాలుగా మారిన సకల జనుల సమ్మెను నీరుగార్చేందుకు కొత్త కుట్రలతో ముందుకు వస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి రాజకీయ విధానాలను అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నారని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఉండి.. ఉద్యోగులు, కార్మిక సంఘాల్లో చీలికలు తేవడానికి, కొన్ని సంఘాలను బుజ్జగించడం, కొన్ని సంఘాలకు ఎరవేయడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఆర్టీసీలో చిచ్చుకు యత్నాలు
సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తికి సహకరిస్తే రెట్టింపు వేతనం ఇస్తామని సింగరేణి యాజమాన్యంతో నేరుగా చెప్పించే ప్రయత్నం చేసిన సర్కారు... ఆ పథకం బెడిసికొట్టినా తన ప్రయత్నాలను ఇతర రంగాల్లో కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలపై కన్నేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాల్లో చీలిక తెచ్చి కనీసం రెండు సంఘాలనైనా తన వైపు తిప్పుకునేందుకు సంస్థ యాజమాన్యాన్ని ఉసిగొల్పుతున్నది. సహజంగా కార్మిక సంఘాల నేతల్లో ఉండే విభేదాలను ఆసరాగా తీసుకుని, సంఘం నేతలు కొంత మందితో సర్కారు, ఆర్టీసీ యాజమాన్యం రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమ్మె వల్ల రోజుకు ఆరున్నర కోట్ల నష్టం ఏర్పడుతున్నదని, పైగా ఆందోళనకారుల విధ్వంసం వల్ల పలు బస్సులు దెబ్బతిని మరింత నష్టం కలిగి ఆర్టీసి నష్టాల ఊబిలో కూరుకుపోతుందని, ఇది భవిష్యత్తులో ఆర్టీసి మనుగడకే ఇబ్బందిగా మారుతుందని యాజమాన్యం కొంత మంది నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

కొన్నాళ్ళ పాటు సమ్మె చేసినందున, నిరసన రికార్డు అయినందున ఇక ఉద్యమాన్ని ఆపేస్తే మంచిదని కొందరు నాయకులతో మంతనాలు జరుపుతున్నదని సమాచారం. ఎక్కువ కాలం ఉద్యమం కొనసాగితే పండుగ సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవడంతో పాటు సంస్థకు నష్టం పెరుగుతుందని, కొన్ని సంఘాలైనా తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరిస్తే రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది.

కేంద్రంతో నేరుగా సీఎం మంతనాలు
తెలంగాణలో సకల జనుల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న భావన కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె విషయంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. దీంతో సమ్మె ప్రభావం పెద్దగా లేదంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడం ద్వారా తనపై ఒత్తిడి లేదన్న అభివూపాయాన్ని కేంద్ర నేతలకు కల్గించేందుకు సీఎం కిరణ్ నానా ప్రయాసలు పడుతున్నారు. సచివాలయంలో 75 శాతం పైగా ఉద్యోగులు హాజరవుతున్నారని, తెలంగాణ జిల్లాల్లో 90 శాతం ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ దాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైగా రాబోయే పండుగ సీజన్‌లో ఉద్యోగులపై కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తుందని, ఫలితంగా వారు క్రమంగా విధుల్లో చేరుతారని సీఎం కిరణ్ భావించడంతో పాటు అదే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తున్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని కిరణ్‌కుమార్‌డ్డి స్వయంగా టెలిఫోన్ ద్వారా కూడా కేంద్రంలోని ప్రముఖులకు వివరిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆంశంపై కేంద్ర స్థాయిలో ప్రశ్నిస్తున్న కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి కూడా ఇదే విషయం రాష్ట్రం నుంచి వెళ్ళినట్లు సమాచారం. జీతాలు రాక పండుగల సమయంలో ఇబ్బందులకు గురయ్యే ఉద్యోగులు విధుల్లోకి చేరక తప్పదని, ఇది సమ్మె విచ్ఛిన్నానికి దారితీస్తుందని, ఉద్యమం దానంతట అదే నీరుగారిపోతుందని పాలనాయంవూతాంగం కేంద్రానికి వివరిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జీతాల కోత
సీఎం శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ సకల జనుల సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. సకల జనుల సమ్మె ఈ నెల 13 నుంచి ప్రారంభమైంది. కానీ.. ఆ పదమూడు రోజులకు కూడా జీతాలు ఇవ్వకుండా తన తెలంగాణ వ్యతిరేకతను సీఎం చాటుకున్నారని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల హాజరు వివరాలు ట్రెజరీలకు చేరే అవకాశం లేనందున తెలంగాణలో సమ్మె చేస్తున్న వారిందరి జీతాలు నిలిపివేస్తున్నారు. మరోవైపు సమ్మె కాలంలో పనిచేసిన వారందరికీ 29వ తేదీనే జీతాలు ఇస్తూ సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు ఇవ్వక పోవడం పుండు మీద కారం చల్లినట్టుంది.

కిరణ్‌కు అంతర్గత సెగ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతర్గత సెగ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలు నిర్ణయాల్లో కేబినెట్ సహచరులను ఆయన విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కొందరు మంత్రులే విమర్శించారు. జాతీయ నేతల వద్ద లాబీయింగ్ చేసుకుని సీఎం పదవి పొందిన కిరణ్.. తన మంత్రి వర్గ సహచరులతోనూ సఖ్యతతో ఉండటం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలనూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సమ్మెతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో జనంలో ఉందోలేదో తెలియని తన పాపులార్టీని కాపాడుకునేందుకే ఆయన మొన్న 1.6 లక్షల ఉద్యోగాల ప్రకటన తాజాగా రూపాయికే కిలోబియ్యం పథకం ప్రకటన ఉన్నాయని అంటున్నారు.

జనం వీటి మాయలో పడితే అది తెలంగాణ ఉద్యమానికి ప్రతిబంధకమవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. తనకొత్త పథకాలకు జనం విశేషంగా స్పందించారని చెప్పుకునేందుకు శుక్రవారం క్యాంపు కార్యాలయానికి సుమారు ఐదు వందల మందిని జమ చేసి రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ఊదరగొట్టించుకున్నారు సీఎం. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ, ఆ కొద్ది జనంతో జేజేలు పలికించుకున్నారు.

రాష్ట్రపతి పాలన?
సమ్మె నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అంధకారమయమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని గమనిస్తున్న కేంద్రం తగిన చర్య తీసుకుంటుందని అంటున్నారు. ఆ పరిణామాలు రాష్ట్రపతి పాలన దిశగా కూడా ఉండే అవకాశం లేకపోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన కుర్చీని కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారన్న వాదన వినిపిస్తున్నది. ఫలితంగానే సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్లో చీలకలు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని, సామ దాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment