Pages

Sunday, October 2, 2011

పదవులకు కోమటిరెడ్డి గుడ్‌బై


- గవర్నర్, అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా
- గనపార్క్ వద్ద నివాళులు
- తెలంగాణ ఇచ్చేది లేదంటే పార్టీనీ వీడుతా
- ఇక ప్రత్యక్ష పోరు.. నేడు నల్లగొండలో లక్షమందితో బహిరంగ సభ
- దీక్ష యోచన విరమణ : కోమటి రెడ్డి
- మరోసారి చిరుమర్తి రాజీనామా
- వ్యక్తిగతంగా లేఖ అందజేత
- కోమటిడ్డి రాజీనామాను సీఎంకు పంపిన గవర్నర్

komatireddy1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 1 (టీ న్యూస్) : సెప్టెంబర్ చివరి నాటికి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రకటించకుంటే పదవుల నుంచి తప్పుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి.. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, విమానాక్షిశయాలు, ఓడరేవులు, సహజ వాయువుల శాఖ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి తన పదవులకు రాజీనామా చేశారు. ఎంపీలు గుత్తాసుఖేందర్‌డ్డి, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ ఎ.ఇంద్రకరణ్‌డ్డితో కలిసి శనివారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి మంత్రి పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకుని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను కలిసి శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖ అందజేశారు.

సకల జనుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 13న ఫాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. తాజాగా మరోసారి తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి నేరుగా అందజేశారు. అనంతరం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్థూసానికి నివాళులు అర్పించారు. నల్లగొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి కోమటిడ్డి మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఇక ప్రజలతో కలిసి ఉద్యమంలో భాగస్వామిని అవుతానని శపథం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
తెలంగాణ ఇచ్చేది లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పిన మరుక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటానని అన్నారు. ఆదివారం నల్లగొండలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి అధిష్ఠానం దృష్టికి తీసుకు చెప్పారు.

నిరాహార దీక్ష కూడా చేపట్టాలని భావించినప్పటికీ జిల్లాకు చెందిన పార్టీ ప్రజావూపతినిధులు, నేతలు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తుల మేరకు ఆ యోచనను విరమించుకున్నానని, ప్రస్తుతానికి సభ మాత్రమే నిర్వహించనున్నామని కోమటిడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చే వరకు ఏదో ఒక విధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మంత్రుల్లో కోమటిడ్డి రెండవవారు. ఇదే డిమాండ్‌తో మూడు నెలల క్రితం జూపల్లి కృష్ణారావు కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

సీఎం ఆమోదానికి కోమటిరెడ్డి రాజీనామా లేఖ
కోమటిడ్డి వెంకట్‌డ్డి మంత్రి పదవికి చేసిన రాజీనామ లేఖను గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి పంపించినట్లు తెలిసింది. సీఎం ఆమోదం లభిస్తే కోమటిడ్డి రాజీనామాను గవర్నర్ అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. గతంలో జగన్ మద్దతుగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయగా.. అప్పటి సీఎం రోశయ్య వెను ఆమోదం తెలపడంతో గవర్నర్ సురేఖ రాజీనామాను ఆమోదించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment