న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యక్ష పోరులో పాల్గొనాలని
నిర్ణయించుకున్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో రైల్ రోకోలో
పాల్గొంటున్నామని ఎంపీలు తెలిపారు. నిజామాబాద్‌లో మధుయాష్కీ, గద్వాలలో మందా
జగన్నాథం, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామగుండంలో వివేక్,
జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్, నల్గొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి,
జమ్మికుంటలో పొన్నం ప్రభాకర్, మహబుబాబాద్‌లో బలరాం నాయక్, వరంగల్‌లో
సిరిసిల్ల రాజయ్య పాల్గొంటారని ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్
శ్రేణులంతా రైల్ రోకోలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment