- విద్యుత్ సంక్షోభంలో రాష్ట్రం
-అంధకారంలో మగ్గనున్న గ్రామాలు
- పక్కరాష్ట్రాలతో ముగిసిన ఒప్పందాల గడువు
- నిలిచిపోయిన 500 మెగావాట్ల కొనుగోలు
- రామగుండంలో తగ్గిన 1300 మెగావాట్ల ఉత్పత్తి
- జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్రం
- బొగ్గు లేక కర్ణాటకలోనూ కోతలు
-630 మెగావాట్లు బయటినుంచి కొనుగోలు
- ఎన్టీపీసీ ఉత్పత్తి ఆగిపోవడంతో 4 రాష్ట్రాలపై ప్రభావం
విద్యుత్ కొరత రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది.
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు
చేస్తున్నా, బొగ్గు కొరతతో రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి 1300 మెగావాట్లు
తగ్గింది. మరోవైపు విద్యుత్ కొనుగోలుకు ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం
శుక్రవారంతో పూర్తవడంతో శనివారం నుంచి విద్యుత్ కోత మరింత పెరగనున్నట్లు
ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు 500 మెగావాట్లు
విద్యుత్ కొనుగోలు నిలిచిపోవడంతో కొత్త ఒప్పందాల కోసం ప్రభుత్వం
ప్రయత్నిస్తోంది. సకల జనుల సమ్మెతో మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి
దృష్ట్యా అదనంగా విద్యుత్ సరఫరా చేయాలని ఎన్‌టీపీసీ యాజమాన్యంతో చర్చలు
జరుపున్న రాష్ట్రం తమ అవసరాలను తీర్చేందుకు జోక్యం చేసుకోవాలని మరోపక్క
కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు ఎన్‌టీపీసీపై ఒత్తిడి తెచ్చి అదనంగా
విద్యుత్ సరఫరా చేయాలని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శుక్రవారం
సంప్రదింపులు జరిపారు. జల విద్యుత్ ఉత్పత్తిలోనూ పూర్తిస్థాయి సామర్థ్యం
మేరకు ఉత్పత్తి జరగకపోవడంతో శనివారంనాడు భారీ విద్యుత్ లోటు ఏర్పడుతుందని
దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోత తప్పదని అంచనా వేస్తున్నారు.
ఇది గ్రామాల్లో మరింత పెరిగి కొన్ని గ్రామాలు అంధకారమవుతాయని తెలుస్తోంది. కాగా, సకలజనుల సమ్మె ప్రభావం పొరుగు రాష్ట్రాలను తాకుతోంది. ఎన్టీపీసీ నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే అందులో ఉత్పత్తి తగ్గడంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడుతోంది. సమ్మె ప్రభావంతో సింగరేణి నుంచి బొగ్గు సరఫరా ఆగిపోవడంతో కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి థర్మల్ పవర్‌ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అక్కడ స్థిరంగా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో రోజుకు 200 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటోందని సమాచారం. తెలంగాణ ఉద్యమం వల్ల సింగరేణి, నాగపూర్‌ల నుంచి బొగ్గు సరఫరా జరగడం లేదని, దీంతో విపరీతమైన కోతలు విధించాల్సి వస్తోందని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి శోభాకర్లందాజే చెబుతున్నారు. రాయచూరు, బళ్లారి థర్మల్ ప్లాంట్లను నడపలేకపోతున్నామని, ప్రస్తుతం 630 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని ఆమె అంటున్నారు.
పరిస్థితి ఇలానే కొనసాగితే 700 మెగావాట్లు కొనాల్సి వస్తోందని పేర్కొన్నారు. మరోపక్క విద్యుత్ డిమాండు 268 మిలియన్ యూనిట్లు కాగా, 233 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని, 50వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, వెస్ట్రన్ కోల్డ్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్, ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేశామని అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి శుక్రవారం సమ్మెపై సమీక్ష సందర్భంగా తెలిపారు. డిస్కమ్‌లు అదనపు విద్యుత్తును దక్షిణ ప్రాంతం వెలుపల నుంచి కొనుగోలు చేసే విధంగా కారిడార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా పీజీసీఐఎల్‌కు ఆదేశించాలని కేంద్ర ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
-అంధకారంలో మగ్గనున్న గ్రామాలు
- పక్కరాష్ట్రాలతో ముగిసిన ఒప్పందాల గడువు
- నిలిచిపోయిన 500 మెగావాట్ల కొనుగోలు
- రామగుండంలో తగ్గిన 1300 మెగావాట్ల ఉత్పత్తి
- జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్రం
- బొగ్గు లేక కర్ణాటకలోనూ కోతలు
-630 మెగావాట్లు బయటినుంచి కొనుగోలు
- ఎన్టీపీసీ ఉత్పత్తి ఆగిపోవడంతో 4 రాష్ట్రాలపై ప్రభావం
ఇది గ్రామాల్లో మరింత పెరిగి కొన్ని గ్రామాలు అంధకారమవుతాయని తెలుస్తోంది. కాగా, సకలజనుల సమ్మె ప్రభావం పొరుగు రాష్ట్రాలను తాకుతోంది. ఎన్టీపీసీ నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే అందులో ఉత్పత్తి తగ్గడంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడుతోంది. సమ్మె ప్రభావంతో సింగరేణి నుంచి బొగ్గు సరఫరా ఆగిపోవడంతో కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి థర్మల్ పవర్‌ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అక్కడ స్థిరంగా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో రోజుకు 200 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటోందని సమాచారం. తెలంగాణ ఉద్యమం వల్ల సింగరేణి, నాగపూర్‌ల నుంచి బొగ్గు సరఫరా జరగడం లేదని, దీంతో విపరీతమైన కోతలు విధించాల్సి వస్తోందని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి శోభాకర్లందాజే చెబుతున్నారు. రాయచూరు, బళ్లారి థర్మల్ ప్లాంట్లను నడపలేకపోతున్నామని, ప్రస్తుతం 630 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని ఆమె అంటున్నారు.
పరిస్థితి ఇలానే కొనసాగితే 700 మెగావాట్లు కొనాల్సి వస్తోందని పేర్కొన్నారు. మరోపక్క విద్యుత్ డిమాండు 268 మిలియన్ యూనిట్లు కాగా, 233 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని, 50వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, వెస్ట్రన్ కోల్డ్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్, ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేశామని అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి శుక్రవారం సమ్మెపై సమీక్ష సందర్భంగా తెలిపారు. డిస్కమ్‌లు అదనపు విద్యుత్తును దక్షిణ ప్రాంతం వెలుపల నుంచి కొనుగోలు చేసే విధంగా కారిడార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా పీజీసీఐఎల్‌కు ఆదేశించాలని కేంద్ర ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
No comments:
Post a Comment