Pages

Tuesday, October 11, 2011

14 నుంచి కూనంనేని ఆమరణ దీక్ష

- తెలంగాణ కోసం తెగించిన సీపీఐ ఎమ్మెల్యే
- ప్రాణాలు పోయినా పట్టించుకోను

955-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ నెల 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే తాను ఆమరణ దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం సాధించేంతవరకు విశ్రమించేదిలేదని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు తన ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోనని వ్యాఖ్యానించారు.

కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ సమావేశంలో ఆదివారం రాత్రి మాట్లాడుతూ కేంద్రవూపభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఏర్పాటును జాప్యం చేస్తోందని మండిపడ్డారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని కుట్రలతో అణచివేసేందుకు సీమాంధ్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. 27 రోజులుగా సకలజనులు సమ్మెలో పాల్గొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినటె్లైనా లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే ప్రభుత్వ పాలన, రవాణా వ్యవస్థ స్తంభించాయని, రాష్ట్రానికి వెలుగులు అందించే సింగరేణిలో ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రావడం లేదని వివరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment