వాషింగ్టన్
డీసీ : అమెరికా వీధుల్లో తెలంగాణ నినాదం మారు మోగనుంది. తెలంగాణ మార్చ్
పేరుతో ఈ నెల 15న చలో వాషింగ్టన్ డీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణలో నెల రోజులుగా జరుగుతున్న సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ
ఎన్‌ఆర్‌ఐ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ వద్ద ఉదయం 11 గంటలకు సుమారు 1000 మంది
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఒక అపురూ దృశ్యాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర
ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలకు నైతిక మద్దతు
ఇవ్వడానికి, అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని తెలంగాణ ఉద్యమం
వైపు మళ్లించడానికి ఎన్‌ఆర్‌ఐ జేఏసీ కృషి చేస్తోంది. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు
భారీ సంఖ్యలో తరలిరావలసిందిగా జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారాన్ని
అమెరికాలో ఉన్న తోటి స్నేహితులు, బందువులు, ఇతర తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు
తెలియజేయాలని సూచించింది. తెలంగాణ మార్చ్‌ను త్వరలో అమెరికాలోని ఇతర
నగరాల్లో కూడా నిర్వహించనున్నట్లు ఎన్‌ఆర్‌ఐ జేఏసీ వెల్లడించింది.
No comments:
Post a Comment