- కదలికలేని ఢిల్లీ దర్బార్
- మరిన్ని చర్చలంటూ కాలయాపన
- వాయిదాలతో సరిపెడుతున్న కేంద్రం
- ఎటూ తేల్చని కోర్ కమిటీ భేటీలు
- కేంద్రంలో చర్చలంటూ కొత్త పల్లవి
- రాష్ట్రానికి మరో అధ్యయన కమిటీ!
- సమయం కావాలన్న ప్రణబ్, ఆజాద్
- తొలిదశ చర్చలు ముగిశాయన్న ఆజాద్
- రెండో దశ ప్రక్రియ మొదలు కావాలి
- పరిష్కారం సులభం కాదని వ్యాఖ్య
- సంకట స్థితిలో టీ కాంగ్రెస్ నేతలు
- కేశవరావు ఇంట్లో మల్లగుల్లాలు
- మరో పది రోజులు ఆగాలని నిర్ణయం
- జానాడ్డికి ఉద్యోగుల ఝలక్
- ఢిల్లీ గేట్ వద్ద జేఏసీ కాగడాల ప్రదర్శన
భూమి
గుండ్రంగా ఉండును! ఎక్కడ నుంచి బయల్దేరినా చివరకు వచ్చేది మాత్రం
అక్కడికే! ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో రుజువు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ,
దాని నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం! ఒకవైపు తెలంగాణ గత 19 రోజులుగా
అట్టుడుకుతున్నది. ఉద్యోగులు, కార్మికులు, వృత్తి సంఘాలు.. సకల జనులూ
ప్రత్యేక రాష్ట్రం కోసం మహోధృతంగా పోరాటం చేస్తున్నాయి. కానీ.. కాంగ్రెస్
మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నది. పరిస్థితి తీవ్రతను గమనిస్తున్నామంటూనే
సాచివేత ధోరణిని అనుసరిస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో యావత్
తెలంగాణ రగలిపోతుంటే.. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో
చక్రవర్తి చందాన తన చర్చల ప్రక్రియ పరిధిని నానాటికీ విస్తరించుకుంటూ
పోతున్నది. రాష్ట్ర విభజనపై మొన్నటిదాకా ఆజాద్ నివేదిక తర్వాత నిర్ణయమన్న
కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలతోనూ
సంప్రతింపులు జరపాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇప్పటికే జాప్యమైందని, ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని వివిధ పార్టీలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి భారీ నివేదికను వండి వార్చినప్పటికీ.. మళ్లీ రాష్ట్రానికి అధ్యయనం కోసం మరో కమిటీని పంపనున్నట్లు ప్రకటించింది. తద్వారా తనకు తెలంగాణ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే శక్తి, ఆసక్తి లేదని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నది.
గత
రెండేళ్లుగా ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం ఇటీవలి కాలంలో సకల జనుల
సమ్మెతో మహోధృతమైంది. సబ్బండ వర్ణాలు సమ్మె కట్టాయి. యావత్ తెలంగాణలో పాలన
స్తంభించిపోయింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడటంతో దానిపై
ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు
తరిగిపోయి.. థర్మల్ పవర్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు
ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు కూడా రెడ్‌సిగ్నల్ పడటంతో
రానున్న రోజుల్లో తీవ్ర అంధకారంలోకి ఆంధ్రవూపదేశ్ కూరుకుపోయే సంకేతాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బస్సులు తిరగడం లేదు. ఏ కార్యాలయమూ
పని చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రం మొత్తానికీ ఇబ్బంది కలుగుతున్నది.
మరోవైపు రాజకీయంగా కూడా ఆందోళన ఉధృతమవుతున్నది. వివిధ రాజకీయ పార్టీలతో
పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలు సైతం ప్రత్యేక
రాష్ట్రం కోసం పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం
సమావేశమైన కోర్‌కమిటీ.. ఒక పరిష్కార మార్గాన్ని ప్రతిపాదిస్తుందని అందరూ
ఊహించారు. కాంగ్రెస్ తీసుకునే వైఖరిపై ఆధారపడి టీడీపీ, ఎంఐఎంలు కూడా
అభివూపాయం చెబుతాయని సాక్షాత్తూ హోం మంత్రి పీ చిదంబరమే వ్యాఖ్యానించారు.
కానీ.. కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. శుక్రవారం ఆజాద్ నివేదికపై చర్చించిన కాంగ్రెస్ కోర్‌కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. శుక్రవారం చర్చించిన అంశంపైనే శనివారం కూడా మినీకోర్ కమిటీ భేటీ అయ్యింది. అందులోనూ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. పైగా.. తమ నాన్చివేత ధోరణి మరికొంత కాలం కొనసాగనుందని నేతలు నిస్సంకోచంగా ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తదుపరి సంప్రతింపుల ప్రక్రియ అవసరమని ప్రణబ్ ముఖర్జీ అభివూపాయపడ్డారు. తామంతా ఆ దిశలోనే ఉన్నామన్నారు. తెలంగాణ పది జిల్లాలతో పాటు రాజధానిలో నెలకొన్న ఆందోళనలు, పరిస్థితుల తీవ్రత తమకు సంపూర్తిగా తెలుసని చెప్పారు. వాటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి తదుపరి సంప్రంతింపులు జరగాలన్న ప్రణబ్.. అందుకు మరి కొంత సమయం పడుతుందని తెలిపారు.
ఇప్పటికే తాను ఆంధ్రవూపదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు ముగించానన్న ఆజాద్.. ఇక జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఒక ప్రక్రియ ముగిసింది.. దాని స్థానంలో మరోవూపక్షికియ ప్రారంభం కావాల్సి ఉంది’’ అని అన్నారు. ఒక కమిటీని క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం నిమిత్తం రాష్ట్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. నిజానికి రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకంటూ జస్టిస్ శ్రీకృష్ణకమిటీని కేంద్రం నియమించింది. ఏడాదిపాటు రాష్ట్రంలో విహరించిన ఆ కమిటీ ఆకుకు అందకుండా.. పోకకు పొందకుండా ఆరు మార్గాలు ప్రవచించింది. రహస్య నివేదికను జత చేస్తూ ఉద్యమాన్ని, పార్టీలను, మీడియాను మేనేజ్ చేసి ఆకాంక్షను అణచేయాలని సలహా ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతకాలం నెట్టుకొచ్చిన కాంగ్రెస్... మళ్లీ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో ఆజాద్‌ను రంగంలోకి దించింది. ఆయన రెండు నెలల పాటు చర్చల ప్రక్రియ అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలతో సంప్రతింపుల్లో మునిగిపోయారు. చివరికి పార్టీ అధినేవూతికి ఓ నివేదిక సమర్పించారు. అందులోనూ కేవలం పరిస్థితుల తీవ్రతను కేంద్రందృష్టికి తెచ్చారే తప్ప.. నిర్దిష్ట పరిష్కారాన్ని సూచించలేదని వార్తలు వచ్చాయి. దీనిపై చర్చించిన కోర్ కమిటీ మరోసారి భేటీ అయ్యాక పది రోజల వ్యవధిలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
గతంలో నేరుగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు డిసెంబర్ 9న ప్రకటించిన కేంద్రం.. ఆ ప్రకటనకు ముందు రాష్ట్రంలోని పార్టీల అభివూపాయాలనే తీసుకుంది. అఖిలపక్షంలో వచ్చిన అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 9 ప్రకటనను వెలువరించింది. కానీ.. ఇప్పుడు కొత్తగా జాతీయ స్థాయి నాయకత్వాలతో చర్చలనే మాటను ముందుకు తేవడం ఈ వ్యవహారాన్ని సాగదీయడానికేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి మరింత జటిలమవుతున్న సంకేతాలు అందిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీ కాంగ్రెస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో రోడ్‌మ్యాప్ (మార్గదర్శిక ప్రణాళిక) వచ్చేంత వరకూ ఢిల్లీ వదిలిపెట్టి వచ్చేది లేదని భీష్మించిన టీ కాంగ్రెస్ నేతలు.. తాజా పరిణామాలతో కంగుతిన్నారు. ఇప్పటికే పదవులకు రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రజల నుంచి టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. భౌతిక దాడులు, ఇళ్లముట్టడులు వంటి సన్నివేశాలనూ చవి చూస్తున్నారు.
ఇదిగో రాజీనామా.. అదిగో రాజీనామా.. అంటూ అలానే నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ఆజాద్ నివేదిక తర్వాత ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, తమపై ఒత్తిళ్లు తగ్గుతాయని కొండంత ఆశతో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆ భరోసా కాస్తా ఆజాద్, ప్రణబ్ మాటలతో కొట్టుకుపోయింది. దీంతో పార్టీ పెద్దలు ఎలాగూ పది రోజుల్లో నిర్ణయం అంటున్నారు కాబట్టి.. మరో పది రోజులు ఆగితే పోలా? అన్న అభివూపాయంతో వారు ఉన్నారు. ఇన్ని రోజులు ఆగాం.. మరో పది రోజులు ఆగుదాం అంటూ కేశవరావు నివాసంలో జరిగిన టీ కాంగ్రెస్ నేతల సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తం మీద ఆజాద్ నివేదిక టీ కాంగ్రెస్ నేతలను సైతం సందిగ్ధంలో పడేసింది. మరోవైపు తెలంగాణలో సకల జనుల సమ్మె తీవ్రతను కేంద్ర నాయకత్వాల దృష్టికి తీసుకు వచ్చేందుకు టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జానాడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యమకారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కోసం తామంతా జీతాలు, జీవితాలనే పణంగా పెట్టి పోరాడుతుంటే.. బాధ్యతగల ప్రజా ప్రతినిధులైన మీరు పదవులు పట్టుకుని వేళ్లాడటమేంటని నిలదీశారు. తెలంగాణ మంత్రుల అభివూపాయాలను సీఎం గడ్డిపోచలా తీసిపారేస్తుంటే ఇంకా ప్రభుత్వంలో కొనసాగడం దండగని తేల్చి చెప్పారు. దీనిపై ఉద్యోగ నేతలకు నచ్చజెప్పిన జానాడ్డి.. తెలంగాణపై రోడ్‌మ్యాప్ వచ్చేంత వరకూ ఢిల్లీ వదిలి వెళ్లబోమని అన్నారు. కాగా.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీ పురవీధుల్లో రాజకీయ జేఏసీ చాటి చెప్పింది. వందలాది మంది కాగడాలు చేబూని ఢిల్లీగేట్ వద్ద ప్రదర్శన జరిపారు. తెలంగాణ సాధించుకునేదాకా సకల జనుల సమ్మె ఆగేది లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం విస్పష్టంగా ప్రకటించారు.
- మరిన్ని చర్చలంటూ కాలయాపన
- వాయిదాలతో సరిపెడుతున్న కేంద్రం
- ఎటూ తేల్చని కోర్ కమిటీ భేటీలు
- కేంద్రంలో చర్చలంటూ కొత్త పల్లవి
- రాష్ట్రానికి మరో అధ్యయన కమిటీ!
- సమయం కావాలన్న ప్రణబ్, ఆజాద్
- తొలిదశ చర్చలు ముగిశాయన్న ఆజాద్
- రెండో దశ ప్రక్రియ మొదలు కావాలి
- పరిష్కారం సులభం కాదని వ్యాఖ్య
- సంకట స్థితిలో టీ కాంగ్రెస్ నేతలు
- కేశవరావు ఇంట్లో మల్లగుల్లాలు
- మరో పది రోజులు ఆగాలని నిర్ణయం
- జానాడ్డికి ఉద్యోగుల ఝలక్
- ఢిల్లీ గేట్ వద్ద జేఏసీ కాగడాల ప్రదర్శన

ఇప్పటికే జాప్యమైందని, ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని వివిధ పార్టీలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి భారీ నివేదికను వండి వార్చినప్పటికీ.. మళ్లీ రాష్ట్రానికి అధ్యయనం కోసం మరో కమిటీని పంపనున్నట్లు ప్రకటించింది. తద్వారా తనకు తెలంగాణ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే శక్తి, ఆసక్తి లేదని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నది.

కానీ.. కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. శుక్రవారం ఆజాద్ నివేదికపై చర్చించిన కాంగ్రెస్ కోర్‌కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. శుక్రవారం చర్చించిన అంశంపైనే శనివారం కూడా మినీకోర్ కమిటీ భేటీ అయ్యింది. అందులోనూ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. పైగా.. తమ నాన్చివేత ధోరణి మరికొంత కాలం కొనసాగనుందని నేతలు నిస్సంకోచంగా ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తదుపరి సంప్రతింపుల ప్రక్రియ అవసరమని ప్రణబ్ ముఖర్జీ అభివూపాయపడ్డారు. తామంతా ఆ దిశలోనే ఉన్నామన్నారు. తెలంగాణ పది జిల్లాలతో పాటు రాజధానిలో నెలకొన్న ఆందోళనలు, పరిస్థితుల తీవ్రత తమకు సంపూర్తిగా తెలుసని చెప్పారు. వాటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి తదుపరి సంప్రంతింపులు జరగాలన్న ప్రణబ్.. అందుకు మరి కొంత సమయం పడుతుందని తెలిపారు.
ఇప్పటికే తాను ఆంధ్రవూపదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు ముగించానన్న ఆజాద్.. ఇక జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఒక ప్రక్రియ ముగిసింది.. దాని స్థానంలో మరోవూపక్షికియ ప్రారంభం కావాల్సి ఉంది’’ అని అన్నారు. ఒక కమిటీని క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం నిమిత్తం రాష్ట్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. నిజానికి రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకంటూ జస్టిస్ శ్రీకృష్ణకమిటీని కేంద్రం నియమించింది. ఏడాదిపాటు రాష్ట్రంలో విహరించిన ఆ కమిటీ ఆకుకు అందకుండా.. పోకకు పొందకుండా ఆరు మార్గాలు ప్రవచించింది. రహస్య నివేదికను జత చేస్తూ ఉద్యమాన్ని, పార్టీలను, మీడియాను మేనేజ్ చేసి ఆకాంక్షను అణచేయాలని సలహా ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతకాలం నెట్టుకొచ్చిన కాంగ్రెస్... మళ్లీ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో ఆజాద్‌ను రంగంలోకి దించింది. ఆయన రెండు నెలల పాటు చర్చల ప్రక్రియ అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలతో సంప్రతింపుల్లో మునిగిపోయారు. చివరికి పార్టీ అధినేవూతికి ఓ నివేదిక సమర్పించారు. అందులోనూ కేవలం పరిస్థితుల తీవ్రతను కేంద్రందృష్టికి తెచ్చారే తప్ప.. నిర్దిష్ట పరిష్కారాన్ని సూచించలేదని వార్తలు వచ్చాయి. దీనిపై చర్చించిన కోర్ కమిటీ మరోసారి భేటీ అయ్యాక పది రోజల వ్యవధిలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
గతంలో నేరుగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు డిసెంబర్ 9న ప్రకటించిన కేంద్రం.. ఆ ప్రకటనకు ముందు రాష్ట్రంలోని పార్టీల అభివూపాయాలనే తీసుకుంది. అఖిలపక్షంలో వచ్చిన అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 9 ప్రకటనను వెలువరించింది. కానీ.. ఇప్పుడు కొత్తగా జాతీయ స్థాయి నాయకత్వాలతో చర్చలనే మాటను ముందుకు తేవడం ఈ వ్యవహారాన్ని సాగదీయడానికేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి మరింత జటిలమవుతున్న సంకేతాలు అందిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీ కాంగ్రెస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో రోడ్‌మ్యాప్ (మార్గదర్శిక ప్రణాళిక) వచ్చేంత వరకూ ఢిల్లీ వదిలిపెట్టి వచ్చేది లేదని భీష్మించిన టీ కాంగ్రెస్ నేతలు.. తాజా పరిణామాలతో కంగుతిన్నారు. ఇప్పటికే పదవులకు రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రజల నుంచి టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. భౌతిక దాడులు, ఇళ్లముట్టడులు వంటి సన్నివేశాలనూ చవి చూస్తున్నారు.
ఇదిగో రాజీనామా.. అదిగో రాజీనామా.. అంటూ అలానే నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ఆజాద్ నివేదిక తర్వాత ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, తమపై ఒత్తిళ్లు తగ్గుతాయని కొండంత ఆశతో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆ భరోసా కాస్తా ఆజాద్, ప్రణబ్ మాటలతో కొట్టుకుపోయింది. దీంతో పార్టీ పెద్దలు ఎలాగూ పది రోజుల్లో నిర్ణయం అంటున్నారు కాబట్టి.. మరో పది రోజులు ఆగితే పోలా? అన్న అభివూపాయంతో వారు ఉన్నారు. ఇన్ని రోజులు ఆగాం.. మరో పది రోజులు ఆగుదాం అంటూ కేశవరావు నివాసంలో జరిగిన టీ కాంగ్రెస్ నేతల సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తం మీద ఆజాద్ నివేదిక టీ కాంగ్రెస్ నేతలను సైతం సందిగ్ధంలో పడేసింది. మరోవైపు తెలంగాణలో సకల జనుల సమ్మె తీవ్రతను కేంద్ర నాయకత్వాల దృష్టికి తీసుకు వచ్చేందుకు టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జానాడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యమకారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కోసం తామంతా జీతాలు, జీవితాలనే పణంగా పెట్టి పోరాడుతుంటే.. బాధ్యతగల ప్రజా ప్రతినిధులైన మీరు పదవులు పట్టుకుని వేళ్లాడటమేంటని నిలదీశారు. తెలంగాణ మంత్రుల అభివూపాయాలను సీఎం గడ్డిపోచలా తీసిపారేస్తుంటే ఇంకా ప్రభుత్వంలో కొనసాగడం దండగని తేల్చి చెప్పారు. దీనిపై ఉద్యోగ నేతలకు నచ్చజెప్పిన జానాడ్డి.. తెలంగాణపై రోడ్‌మ్యాప్ వచ్చేంత వరకూ ఢిల్లీ వదిలి వెళ్లబోమని అన్నారు. కాగా.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీ పురవీధుల్లో రాజకీయ జేఏసీ చాటి చెప్పింది. వందలాది మంది కాగడాలు చేబూని ఢిల్లీగేట్ వద్ద ప్రదర్శన జరిపారు. తెలంగాణ సాధించుకునేదాకా సకల జనుల సమ్మె ఆగేది లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం విస్పష్టంగా ప్రకటించారు.
No comments:
Post a Comment