- కంగుతిన్న సీఎం కిరణ్,మంత్రులు దానం, ముఖేశ్
హైదరాబాద్,
అక్టోబరు 1 (టీ న్యూస్): సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మహిళలు
ఝలక్ ఇచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ‘జై తెలంగాణ’ నినాదాలతో
హోరెత్తించారు. అభివృద్ధి పేరిట సాగిన షోలో తమ తెలంగాణ ఆకాంక్షను మహిళలు
ఎలుగెత్తి చాటారు. సీఎం కిరణ్, ఆయన సేవ చేసుకుంటున్న మంత్రులను కంగు
తినిపించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశానికి మంత్రి
దానం నాగేందర్ ఆధ్వర్యంలో వచ్చిన జనం తమ తెలంగాణ ఆకాంక్షను గట్టిగా
వినిపించారు. ఈ కార్యక్షికమంలో సీఎం అభివృద్ధి కార్యక్షికమాలు, ఒక రూపాయికి
కిలోబియ్యం గురించి ఏకరువు పెట్టారు. సీఎం ప్రసంగాన్ని మహిళలు తీవ్రంగా
తప్పుబట్టారు.
నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెంచి రూపాయికి కిలోబియ్యం ఇస్తే ఏం చేసుకుంటామని, దీనివల్ల తమకు ఒరిగే అదనపు ప్రయోజనమేమీ లేదని మహిళలు సీఎంను నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కే తమ ఓటు అంటూ ఒక్కసారిగా నినదించారు. ఆంధ్రా సీఎం మాకొద్దని, తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడున్న మంత్రులు, దానం, ముఖేశ్, ఇతరకాంగ్రెస్ నేతలు షాక్ చెందారు. ఈ సమావేశంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి.. సీఎం కిరణ్ చిరునవ్వులు చిందిస్తే.. వారు కూడా తీవ్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసి.. సీమాంధ్ర సీఎం ఆనదింపజేశారు. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు. సీఎం, మంత్రుల ప్రసంగాల్లో తెలంగాణ వ్యతిరేకత, ద్రోహ చింతన గమనించిన మహిళలు తిరగబడ్డారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెశాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించంరాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఈ అంశంలో ఎవరు అడ్డువచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని క్యాంపు కార్యాలయంలో బియ్యం లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నారు.

No comments:
Post a Comment