"ఊరురా
బతుకమ్మ" కార్యక్రమంలో భాగంగా చివరి రోజున ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ
ఆడపడుచులు సద్దుల బతుకమ్మ ఆడుతున్నారు. వేలాదిగా తెలంగాణ ఆడపడుచులు
తరలివచ్చారు. బుద్ధ భవన్ నుంచి వేలాది బతుకమ్మలతో ర్యాలీగా
తరలివస్తున్నారు. తెలంగాణ త్వరగా ఏర్పడాలని గౌరమ్మను వేడుకుంటున్నామని
మహిళలు చెబుతున్నారు. బతుకమ్మ ఆడడంతో ట్యాంక్ బండ్‌కు కొత్త కళ
సంతరించుకుంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ట్యాంక్ బండ్ ఇవాళ తెలంగాణ
ఆడపడుచులతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలతో హోరెత్తిపోతోంది.
No comments:
Post a Comment