‘బంగారు వర్ణంతో మెరిసే
తంగేడు.. ముచ్చటైన చామంతి.. ముద్దొచ్చే ముద్దబంతిలతో చూడముచ్చటగా పేర్చిన
బతుకమ్మలు నడిచొచ్చిన పూలవనాన్ని తలపిస్తుంటే.. డప్పుల దరువులు.. కోలాటాల
మధ్య ఆడపడుచులు పదం పదం.. పాదం పాదం కలిపారు. రెండు మహానగరాలను ఏకం చేసే
చారివూతక ట్యాంక్‌బండ్‌ను ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ
మార్మోగించారు. తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచిన ‘ఊరూరా బతుకమ్మ’
ఉత్సవం మంగళవారం హైదరాబాద్‌లో కన్నుల పండుగగా జరిగింది.
హుస్సేన్‌సాగర్ తీరం పులకించిపోయింది. అశ్వయుజ మాస శుద్ధ నవమి చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తుండగా, తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పాటలకు సాగర అలలు లయధ్వనులు పలికాయి. తెలంగాణ జాగృతి సంస్థ నాయకురాలు కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్షికమానికి తెలంగాణ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ విజయశాంతి, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు.
హుస్సేన్‌సాగర్ తీరం పులకించిపోయింది. అశ్వయుజ మాస శుద్ధ నవమి చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తుండగా, తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పాటలకు సాగర అలలు లయధ్వనులు పలికాయి. తెలంగాణ జాగృతి సంస్థ నాయకురాలు కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్షికమానికి తెలంగాణ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ విజయశాంతి, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు.

‘శ్రీలక్ష్మీ నీ మహిమలు గౌరమ్మా.. చిత్రమైతోచునే గౌరమ్మ’ వంటి సంప్రదాయపాటలతో పాటు ‘సినుకు సినుకుల వాన ఉయ్యాలో.. ఎప్పుడొస్తావే ఉయ్యాలో’ వంటి పాటలు ఎండుతున్న పొలాల దుర్భర పరిస్థితిని కళ్లకుకట్టాయి. వందల కిలోమీటర్లు కృష్ణా, గోదావరులు ప్రవహిస్తున్నా తెలంగాణ భూములను ఎడారిగా మార్చిన సీమాంధ్ర వలస పాలకుల కుటిల నీతిని తేటతెల్లం చేసే గీతాలను కళాకారులు ఆలపిస్తున్నప్పుడు మహిళలు కంటతడిపెట్టుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఊరూరా బతుకమ్మ సంబురాలకు సారథ్యం వహించారు. నేత్రపర్వంగా తీర్చిదిద్దిన బతుకమ్మతో నెత్తిన పెట్టుకుని చిల్డ్రన్స్ పార్క్ కాలినడకన ఆమె ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. వేలాది మంది తెలంగాణ ఆడపడుచులు ఆమె వెంటనడిచారు. బతుకమ్మను హాయిగా, ఉల్లాసంగా ఆడేందుకు ట్యాంక్‌బండ్‌పై తగిన ఏర్పాట్లు చేశారు.

ఊరూరా బతుకమ్మ ఉత్సవాలు భాద్రపద అమావాస్య నాడు ఎంగిలిపూవుతో ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని అన్నీ జిల్లాలలో సోమవారం వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ముగింపు సద్దుల బతుకమ్మ పండుగను ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది స్త్రీల సమక్షంలో నిర్వహించారు. గత ఏడాది బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మంత్రులు ఈ సారి మొఖం చాటేశారని జేఏసీ చైర్మన్ కోదండరాం ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే వారికి ఈ దుస్థితి దాపురించిందని అన్నారు.
No comments:
Post a Comment