Pages

Sunday, September 25, 2011

సచివాలయం ముట్టడి 28 తర్వాత ఏ క్షణంలోనైనా..


- ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై స్వామిగౌడ్
- ఉత్తర్వులు ఉపసంహరించకుంటే తీవ్ర పరిణామాలు


tngos-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీ న్యూస్, హైదరాబాద్ :కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపైన ప్రభుత్వం సస్పెన్షన్ పేరుతో కొరడా ఝళిపించిందని, ఈనెల 28లోగా ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే, 28 అర్థరాత్రి తర్వాత ఏ క్షణంలోనైనా మూడు లక్షల మంది ఉద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కె.స్వామిగౌడ్ హెచ్చరించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ టెన్యూర్, ఐకెపి, కంటిన్జెన్సీ వంటి దినసరి వేతనాల ఉద్యోగులపైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌డ్డి తన ప్రతాపాన్ని చూపుతున్నారని, ముఖ్యమంత్రి ఇంత పాశవికంగా ప్రవర్తించడానికి తెలంగాణ మంత్రులే బాధ్య త వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నదని, సర్వీసు బుక్‌లో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగిగా గుర్తింపు ఉంటే 29న వేతనాలు ఇస్తామని నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా ప్రకటించారని స్వామిగౌడ్ చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వమని ప్రభుత్వమే ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని, ఇలాంటి నిర్హేతుకమైన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ఉద్యోగులందరికీ సీమాంధ్ర ఉద్యోగులతో కలిపి ఒకేరోజున వేతనాలు ఇవ్వాలని, లేనిపక్షంలో సర్కార్‌కు నూకలు చెల్లిన ఆయన హెచ్చరించారు.

శనివారం తెలంగాణ ఎన్జీవో భవన్‌లో 137 ఉద్యోగ సంఘాల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం స్వామిగౌడ్‌తోపాటు కో. చైర్మన్ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వి. శ్రీనివాస్‌గౌడ్, కో. చైర్మన్ సి. విఠల్ విలేకరులతో మాట్లాడారు. 26, 27 తేదీలలో తెలంగాణ మంత్రుల ఇంటిముందు శాంతియుత ర్యాలీలతో ధర్మాక్షిగహాన్ని ప్రకటిస్తామని, తాత్కాలిక ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నా, తెలంగాణ మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నందున వారికి తెలంగాణ పట్ల ఉన్న బాధ్యతలను గుర్తు చేస్తూ వారి ఇళ్లముందు రెండు రోజులు శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తామని సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.

ఆదివారం జరిగే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాలని కొన్ని రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, పుండుమీద కారం చల్లినట్లు తెలంగాణ లెక్చరర్లను ఇన్విజ్‌లేషన్ చేయమని ఉత్తర్వులు ఇస్తున్నారని అన్నారు. అయితే, తెలంగాణ లెక్చరర్లు ఇన్విజిలేషన్‌లో పాల్గొనడం లేదని ఆయన చెప్పారు. చీరల బజార్‌లో రెండు చీరలు కొంటే ఒక చీర ఉచితంగా ఇస్తామన్నట్లుగా సింగరేణి కార్మికులు ఒకరోజు పనిచేస్తే, రెండు రోజుల వేతనం ఇస్తామని ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరి ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బతుకులనే పణంగా పెట్టి సింగరేణిలో తెలంగాణ ఉద్యమాల కొలిమిని ఊపిరితిత్తులతో ఊదిఊది మండిస్తున్న కార్మికులను అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తే పాలకులు అంతకంతకు అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు. కో. చైర్మన్ దేవీవూపసాద్ మాట్లాడుతూ, 26, 27 తేదీలలో కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ పరిక్షిశమలలోని ఉద్యోగులందరూ సకల జనుల ఉద్యమానికి మద్దతుగా సమ్మె చేయనున్నారని, వీరికి తోడుగా 6వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 26న సామూహిక సెలవులు పెడుతున్నారని చెప్పారు. ఎల్‌ఐసీ ఉద్యోగులు ప్రత్యక్షంగా 26 నుంచి సమ్మెలోకి వస్తున్నారని, అక్కడి సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు తెలంగాణ ఎల్‌ఐసీ ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని, తెలంగాణ ఎల్‌ఐసి ఉద్యోగులకు సైదోడుగా నాలుగున్నర తెలంగాణ ప్రజలు ఉన్నారన్న సంగతిని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఎన్‌కౌంటర్లు చేస్తే పోలీసాఫీసర్లకు రివార్డులు ఇచ్చినట్లుగా ఉద్యమంలో పాల్గొనకుండా ఉంటే బంపర్ ఆఫర్లు ఇస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలను అవహేళన చేడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మరో కో. చైర్మన్ సి. విఠల్ మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కుల కోసం ఐదున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య విశ్వాసాన్ని, స్పూర్తిని అభినందించాల్సిన పాలకులు, నిరంకుశంగా జీ.వో 177ను అమలు చేసేందుకే సిద్ధపడటం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమని, పాలకులకే ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదన్న విషయం మరోసారి రుజువయ్యిందని అన్నారు. కాలేజీ విద్య జేఏసీ కన్వీనర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేయాల్సిన ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు మరోసారి అన్యాయం చేసేందుకే పరీక్షలు జరుపుతున్నదని, ఈ పాలన సీమాంధ్ర పాలనయే అని చెప్పడానికి పాలకుల తీరే నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సమ్మె పోస్టల్‌ను ఆవిష్కరించారు.


పొలిటికల్ జేఏసి శని ఆదివారాలలో రైల్‌రోకో నిర్వహించాలని పిలుపు నిచ్చిందని, ఆ పిలుపు ప్రకారం శనివారం రైల్‌రోకో విజయవంతమైందని ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ కె. స్వామిగౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృఢంగా చాటి చెప్పాలన్న భావనతో ఆదివారంతో పాటు సోమ, మంగళ వారాలలో కూడా రైల్‌రోకో జరపాలని ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. ఈ తీర్మానాలను, ప్రతిపాదనలను పొలిటికల్ జేఏసి చైర్మన్ కోదండరాంకు వివరిస్తామని, పొలిటికల్ జేఏసీ నిర్ణయం ప్రకారం ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment