Pages

Sunday, September 25, 2011

రైలాగింది..


తెలంగాణ మోత మోగింది
2,00,00,000
ఇది సకల జనుల సమ్మెలో
తెలంగాణ బిడ్డల సంఖ్య
విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు,ఆటో కార్మికులు, లాయర్లు, వైద్యులు..
అందరూ కలిసి సాగిస్తున్న ‘ప్రత్యేక’ ప్రత్యక్ష సమరమిది!



sakala2-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీ న్యూస్, హైదరాబాద్:‘‘కోట్ల గొంతుకలొకసారి గర్జిస్తయి.. గర్జిస్తయి. సీట్ల మీద కూర్చుండే మంత్రుల్లారా ఖబడ్దార్..!’’ అని నాలుగు దశాబ్దాల క్రితమే ప్రజల మహత్తర పోరాట శక్తిని విప్లవాక్షరాలుగా పలికిన ఓ పోరాటయోధుడి మాటలను వాస్తవం చేస్తూ కోట్లాది మంది తెలంగాణ బిడ్డలు ముందుకు కదులుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె సైరనూది పాలకుల పీఠాన్ని కదిలిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మెలో అక్షరాల 2కోట్ల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వీరి సమర నినాదాలతో తెలంగాణ పీఠభూమి మార్మోగుతున్నది. విద్యాసంస్థలు, కార్యాలయాలు, సింగరేణి బొగ్గుగనులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థలు, వైద్య కళాశాలలు, న్యాయస్థానాలు... ఇలా తెలంగాణ నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.

నినదిస్తున్న విద్యాలయాలు
సకల జనుల సమ్మెలో రంగాలవారీగా చూస్తే విద్యారంగం నుంచి ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఎస్‌ఎస్‌సీ వరకు ఒక కోటి 15లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్నారని అధికారిక అంచనా. ప్రభుత్వ పరిధిలో తెలంగాణ ప్రాంతంలో 40వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రాజధానిలోని జంటనగరాల్లోని పాఠశాలల సంఖ్య 3500. ప్రాథమిక, మాధ్యమిక హైస్కూల్ స్థాయి వరకు 40 వేల పాఠశాలల్లో కోటి 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులందరూ తెలంగాణ ప్రాంత గ్రామీణ ప్రజలతో కలిసి ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఇవికాక ఢిల్లీ పబ్లిక్‌స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఉండే స్కూల్స్, రైల్వే స్కూల్స్, బేగంపేటవంటి పబ్లిక్ స్కూల్స్‌లో కలిపి 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యాశాఖలోని తెలంగాణ అధికారులు వివరించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ పరిధిలో 362 కాలేజీలు ఉన్నాయి. 55 ఎయిడెడ్ కళాశాలలు, 2000 ప్రైవేట్ కళాశాలలతో కలిపి మొత్తం 9 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని 7 విశ్వవిద్యాలయాలలోని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది కలిసి 35 వేల మంది ఉంటారు. వీరంతా సకల జనుల సమ్మెలో ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో 720 ఇంజినీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలోని విద్యార్థుల సంఖ్య 7లక్షలు. ప్రభుత్వ పరిధిలో 112 డిగ్రీ కళాశాలలున్నాయి. సుమారు 80 ఎయిడెడ్ కాలేజీలు, 800 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 3లక్షల 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పరిధిలో ఒక లక్షా 20వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

వీరందరూ సకల జనుల సమ్మెలో మహోధృతంగా పాల్గొంటున్నారు. ప్రైవేట్ రంగంలో 50వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో ఒక ప్రభుత్వ సెక్టార్‌లోనే 10వేల మంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 6వేలమంది పనిచేస్తుండగా, ప్రైవేట్ రంగంలో 8వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. 720 ఇంజినీరింగ్ కళాశాలల్లో లెక్చరర్లు, సిబ్బంది కలిసి 11వేల వరకు ఉన్నారని అధికారిక అంచనా. వీరందరూ సమ్మెలో ఉన్నారు. ఇక సింగరేణి విషయానికి వస్తే ప్రత్యక్షంగా 50వేల మంది ఉద్యోగులు సమ్మెలో రణన్నినాదాన్ని మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నాలుగున్నర లక్షల ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లు, ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులు లక్షా 50 వేలమంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి. 26న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, డీఆర్‌డీఎల్, మిథాని, ఈసీఐఎల్ వంటి సంస్థలన్నింటిలో కలిపి 20వేల మంది కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్ష పోరాటంలో భాగస్వాములవుతున్నారు.

sakala2-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaరైల్వేశాఖలోనే తెలంగాణ ఉద్యోగులు 5వేల మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 185 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని ఉద్యోగులు 26న కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపారు. అన్ని సంస్థలలో కలిసి 6వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే వీరందరూ ఆయా కార్యాలయాలలో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇక, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి 5లక్షల మందికిపైగా ఆటో కార్మికులు ఉన్నారు. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి నుంచే సకల జనుల సమ్మెలో భాగస్వాములయ్యారు. శని, ఆదివారాల్లో ఆటోలు బంద్ చేస్తామని ముందుగా ప్రకటించినట్లుగానే తమ ‘ప్రత్యేక’ సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోరాటంలో న్యాయవాదులు కీలక భూమిక పోషిస్తున్నారు.

25వేల మంది లాయర్లు వీరోచితంగా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలోని డాక్టర్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమని కదనరంగంలోకి దిగారు. కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు బంద్ పెట్టారు. వీరితో కలిసి పారామెడికల్ సిబ్బంది, నర్సులు, జూనియర్ డాక్టర్లు మొత్తం 20 వేల మంది వైద్యసిబ్బంది సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నారు. ఇంకా ఎందరో.. తెలంగాణ జెండాను చేతబూని ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు.

No comments:

Post a Comment