Pages

Monday, September 26, 2011

గ్యాస్ ఇస్తామన్నా తీసుకోలేదు

- ఇప్పటికీ అవకాశం ఉంది.. రాష్ట్ర ప్రభుత్వమే స్పందించటం లేదు
- గ్యాస్ ఇవ్వొద్దంటూ నాపై తెలంగాణ ఎంపీలు ఒత్తిడి తేలేదు
- సీఎంకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి లేఖ
- ఉద్యమంపై కిరణ్ కుట్ర: శంకర్‌రావు n సీఎంవి అహంకారపు మాటలు: పొన్నం
- స్థాయిని మరచిన సీఎం : మందా
- ఇప్పటికీ అవకాశం ఉంది..రాష్ట్ర ప్రభుత్వమే స్పందించటం లేదు
- గ్యాస్ ఇవ్వొద్దంటూ నాపై తెలంగాణ ఎంపీలుఒత్తిడి తేలేదు
- ఆ అంశంపై ఎవరూ మాట్లాడలేదు.. స్పష్టం చేసిన జైపాల్

jaipal-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: తెలంగాణ ఎంపీల ఒత్తిడి ఫలితంగానే కేంద్ర ఇంధన, సహజ వాయువుల శాఖ మంత్రి జైపాల్‌డ్డి అదనపు గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించటానికి నిరాకరిస్తున్నారని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను స్వయంగా జైపాల్‌డ్డే కొట్టిపారేశారు. సీఎం మాటల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంవూతికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రానికి అదనపు గ్యాస్ అందించవద్దంటూ తెలంగాణ ఎంపీలు నాపై ఒత్తిడి తెచ్చినట్లుగా మీరు(సీఎం) నమ్ముతున్నట్లు నాకు అర్థమైంది. ఈ అంశంపై నాతో తెలంగాణ ఎంపీలు ఎవ్వరూ మాట్లాడలేదని మీకు స్పష్టం చేస్తున్నా’’ అని జైపాల్ తెలిపారు. దీంతో పాటు ఇద్దరి(కిరణ్, జైపాల్) మధ్య ఈనెల 19 నుంచి జరిగిన సంభాషణల సందేశాన్ని కూడా లేఖలో పొందుపరిచారు.

‘‘మీరు కోరినట్లుగా గ్యాస్‌ను కేటాయిస్తామని మా కార్యాలయ అధికారులు సమాచారం అందించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. మీరు ఈనెల 19న ఫోన్ చేసి మూసివేసిన జీఎమ్‌ఆర్ వేమగిరి ప్రాజెక్టుకు కేటాయించిన గ్యాస్‌ను ఇతర ప్రాజెక్టులకు మళ్లించాలని కోరగా, మీకు హామీ ఇచ్చిన విధంగానే దానిపై అత్యవసర చర్చలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నన్ను వ్యక్తిగతంగా కలిశారు. మూసివేసిన వేమగిరి ప్రాజెక్టుకు కేటాయించిన గ్యాస్‌ను ఇతర ప్రాజెక్టులకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమైనందున అది కుదరదని అధికారులకు స్పష్టం చేశాను. ప్రత్యామ్నాయంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గ్యాస్‌ను అత్యవసరంగా పొందవచ్చని సూచించాను. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

ఈ సౌకర్యాన్ని పొందటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉంది’’ అని కేంద్ర మంత్రి తన లేఖలో ముఖ్యమంవూతికి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈనెల 22న ఫోన్‌లో సీఎంతో మాట్లాడినప్పుడు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మరోమారు చెప్పినట్లు జైపాల్‌డ్డి తన లేఖలో గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే... సింగరేణి కార్మికుల సమ్మె వల్ల బొగ్గు నిల్వలు లేనందునే తెలంగాణ రైతాంగానికి సరిగ్గా విద్యుత్ అందటం లేదని ముఖ్యమంత్రి కిరణ్ చేస్తున్న వాఖ్యల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఇంకా.. బొగ్గు నిల్వలు లేకున్నా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుందామన్నా కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి సహకారం లభించడం లేదని కిరణ్ సర్కారు చెబుతున్న మాటల్లో డొల్లతనం బయటపడిపోయింది.

No comments:

Post a Comment