
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ మరోసారి దీక్షకు సిద్దమైనట్లు వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ గా మారాయి. అయితే పార్టీ ముఖ్యులు,ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన కేసీఆర్ దీక్షను తాత్కాలింకంగా వాయిదా వేసారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులు, ప్రజలు జరుపుతున్న సకల జనుల సమ్మెకు ప్రేరణగా దీక్ష చేపడితే ఉద్యమానికి ఊపునిచ్చినట్లువుందని ఆయన కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యమాన్ని మరింత తారాస్థాయికి తీసుకెళ్లి... కేంద్రం మెడలు వంచేందుకు మళ్లీ దీక్షకు కూర్చోవాలనుకుంటున్నానని నిన్న జరిగిన కరెంటోళ్ల శంఖారావంలో ఆయన ప్రకటించారు. ‘అయితే అది ఎప్పుడనేది తెలంగాణ రాజకీయ జెఎసితో చర్చించి, సమయం, సందర్భాన్ని చూసి ప్రకటిస్తానన్నారు.
కేసీఆర్ మళ్లీ దీక్ష చేసే అంశంపై ఆయన తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఆరోగ్య రీత్యా దీక్ష చేయోద్దని ఉద్యమాన్నే మరింతగా ఉదృతం చేయాలని సన్నిహితులు సూచించనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమాన్ని వేడెక్కించేందుకు దీక్ష చేస్తానంటే ఓ తెలంగాణ బిడ్డగా కాదనలేక పోతున్నానని కూతురు కవిత అన్నారు.
నెలాఖరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చాక, వారికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో దీక్ష కూర్చోవాలని కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అప్పటి వరకు ఆగకుండా సకల జన సమ్మెకు దిగిన ఉద్యోగులపై వేటు వేయాలని ప్రభుత్వ యోచిస్తోందని, అలాంటి కఠిన చర్యకు ప్రభుత్వం దిగిన వెంటనే దీక్షకు దిగితే బాగుంటుందని మరి కొందరు సూచిస్తున్నట్టు తెలిసింది.
మరో వైపు తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్తు కార్యచరణపై వ్యూహరచణ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రహదారులు దిగ్బంధనం చేసి సక్సెస్ అయిన జేఏసీ... రేపు ఖమ్మంలో జరిగే న్యూడెమెక్రసీ పోరుగర్జనకు సభకు నేతలంతా హాజరైన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. 24, 25 తేదీల్లో రైల్ రోకో నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది.
No comments:
Post a Comment