Pages

Wednesday, September 28, 2011

భగ్గుమన్న తెలంగాణ

- శాంతియుత ఉద్యమంలో లగడపాటి జగడం
- చిచ్చురేపిన కుహనా సమైక్యవాది
- ఆర్టీఏ కార్యాలయంలో ఖాకీల కండకావరం.. నేతల ఈడ్చివేత, బలవంతపు అరెస్టులు
- జూబ్లీ ఠాణాలో విజయవాడ ఎంపీ హల్‌చల్.. అత్తారింట్లో ఉన్నట్లు అతిథి మర్యాదలు
- వదిలేశామన్నా బయటికిపోని వైనం.. కారును క్రేన్‌కు తగిలించి ఇంటికి తరలింపు
- వనస్థలిపురంలో రెచ్చిపోయిన ఖాకీలు.. బస్సులు అడ్డుకున్న వారిపై లాఠీచార్జి
- మహోధృతంగా సకల జనుల సమ్మె.. ఆర్టీసీ కార్మికుల ర్యాలీలతో హోరెత్తిన జిల్లాలు
- ఆలయాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవలు

14140-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ప్రశాంతంగా సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, జగడపాటిగా పేరుమోసిన లగడపాటి రాజగోపాల్ చిచ్చుపెట్టారు. సకల జనుల సమ్మె చరివూతాత్మకంగాసాగుతున్న నేపథ్యంలో అశాంతిని రేపారు. ఈ కుట్రలు కుతంవూతాలపై తెలంగాణ భగ్గుమంది. ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నాటి స్వల్ప ఉద్రిక్తతను సాకుగా చేసుకుని.. రాజధానిలో వాలిపోయిన లగడపాటి.. ఆర్టీఏ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులను ఓదార్చుతున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. ఆగ్రహించిన తెలంగాణ ఉద్యమకారులు ఆర్టీఏ కార్యాలయానికి రాగా.. అక్కడ పోలీసులు తమ వంతు పాత్ర పోషించారు. నేతలను బలవంతంగా అరెస్టు చేసి, ఈడ్చేశారు. ఖాకీల ధాటికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సొమ్మసిల్లిపోయారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్‌పై దాదాపు హత్యాయత్నం అన్నంత స్థాయిలో పోలీసులు దాడి చేశారు.

స్వామిగౌడ్‌ను పొత్తి కడుపులో, ఛాతీపై, మర్మావయవాలపై విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన స్వామిగౌడ్ ప్రస్తుతం కేర్ ఆస్పవూతిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకముందే అరెస్టయిన లగడపాటి... జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. పోలీస్ స్టేషన్ తన అత్తవారిల్లయినట్లు అతిథి మర్యాదలు పొంది.. తెలంగాణపై నోరుపారేసుకున్నారు. లగడపాటి రాకను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో స్టేషన్ వద్ద రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంపై పెట్రోల్ చల్లి రెచ్చగొ వచ్చిన వ్యక్తికి రాచమర్యాదలేంటని ఆందోళనకారులు పోలీసులను నిలదీశారు. పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. పరిస్థితి కాస్త సద్దుమణిగిన తర్వాత పోలీసులు లగడపాటిని పంపించేసేందుకు ప్రయత్నించినా ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. బలవంతంగా బయటకు తీసుకువచ్చి కారులో కూర్చొనబెట్టినా.. ఆయన పంతం వీడలేదు.

దీంతో పోలీసులు వాహనాలు తరలించే క్రేన్ సహాయం తీసుకుని, లగడపాటిని కారుతో సహా ఆయన ఇంటికి చేర్చాల్సి వచ్చింది. మరోవైపు ఖాకీల దాష్టీకాలు మంగళవారం కూడా కొనసాగాయి. సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసుల పహారాలో ఉద్యోగులను బస్సుల్లో తరలిస్తుండగా తెలంగాణవాదులు హైదరాబాద్ వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. ఈ బస్సుల్లో సచివాలయానికి ఉద్యోగులను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమ ప్రయత్నాన్ని ఉద్యమకారులు అడ్డుకోవడంతో వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఇదిలా ఉండగా రాజకీయ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు మోతమోగించాయి. వరుసగా 8వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగింది. ఉద్యోగుల ర్యాలీలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన బస్‌భవన్ ముట్టడిలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం సహా ముఖ్యనేతలంతా అరెస్టయ్యారు. ఈ ముట్టడికి కోదండరాం, విద్యాసాగర్‌రావు తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.

మరోవైపు సకల జనుల సమ్మె మంగళవారంతో పక్షం రోజులు పూర్తి చేసుకుంది. తెలంగాణ టెంపుల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల్లో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.

No comments:

Post a Comment