- బోసిపోయిన రైల్వే స్టేషన్‌లు
- పట్టాలపైకి చేరిన తెలంగాణ పల్లెలు
- అక్కడే వంటావార్పు.. భోజనాలు.. నిద్ర
- ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తెగిన లింకు...
- రోడ్డెక్కని 80 శాతం ఆటోలు
- ఆరో రోజూ ఆర్టీసీ సమ్మె సంపూర్ణం
- 2 కోట్ల మంది రవాణాకు దూరం
- నేడూ అదే పరిస్థితి.. చేతుపూత్తేసిన సర్కార్
- సకల జనుల సమ్మెకు 12 రోజులు పూర్తి
- పల్లె పల్లెనా ఉద్యమ బావుటాలు
- సమ్మెలోకి క్షౌరవృత్తిదారులు
- బట్టలుతికేది లేదన్న రజకులు
- సమ్మె నోటీసుఇచ్చిన ప్రభుత్వ డ్రైవర్లు
- సచివాలయంలో ఇక లిఫ్టులూ బంద్
- రంగంలోకి కేంద్ర పరిక్షిశమల కార్మికులు
- 2 రోజులు యంత్రాలకు బ్రేక్
హైదరాబాద్,
సెప్టెంబర్ 24 (టీ న్యూస్) :తెలంగాణవ్యాప్తంగా రైల్‌గాడీ కూత వినబడలేదు..
ఆర్టీసీ బస్సుల హారన్‌లు మోగలేదు.. ఆటో బూరలు మౌనం దాల్చాయి.. వాటి
స్థానంలో జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి... పల్లె పల్లె కదిలింది..
పట్టాలపైకి చేరింది.. పొగబండ్లను అడ్డుకుని ఉద్యమం నడిచింది.. మా రాష్ట్రం
మాకియ్యండంటూ మోత మోగించింది! సీమాంధ్ర పాలన కింది మగ్గేది లేదని
రణన్నినాదాలు చేసింది! జేఏసీ పిలుపు మేరకు శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలైన
రైల్ రోకో... యావత్ భారతాన్ని కల్లోలం చేసింది. తెలంగాణలో ఒక్క రైలు కూడా
పట్టాలపైకి రాలేదు. తెలంగాణ మీదుగా ఒక్క రైలు బండి కూడా ఇతర రాష్ట్రాలకు
పోలేదు.. సీమాంధ్ర నుంచి తెలంగాణ రావాల్సిన ఒక్క రైలు కూడా జాడ లేదు.
ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఆరు రోజులుగా బస్సులు తిరగడం లేదు. దీనికి
శనివారం ఆటోల బంద్ కూడా తోడవడంతో ప్రజా రవాణా ఎక్కడిక్కడ స్తంభించిపోయింది.
దాదాపు 2 కోట్ల మంది రవాణా సదుపాయాలకు దూరమయ్యారు. నేటి సాయంత్రం దాకా
రైల్‌రోకోలు జరుగనుండటం.. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటం.. రెండో రోజు కూడా
ఆటోలు బంద్ పాటించనుండటంతో ఆదివారం సైతం ఇవే పరిస్థితులు నెలకొనబోతున్నాయి.
సకల పోరాట రూపాలతో దిగ్విజయంగా సాగుతున్న సకల జనులసమ్మె శనివారం నాటికి 12
రోజులు పూర్తి చేసుకుంది. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ.. కొత్త కొత్త
రంగాలు సమర భేరీ మోగిస్తున్నాయి.
26, 27 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని పరిక్షిశమల కార్మికులు సమ్మె చేయనున్నారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన సమరానికి సంఘీభావంగా 26న కేంద్ర ఉద్యోగులు సామూహిక సెలవు పెడుతున్నారు. అటు సచివాలయానికీ సమ్మె సెగ తగలనుంది. సచివాలయంలో పని చేస్తున్న లిఫ్టు ఆపరేటర్లు, వాచ్‌మెన్‌లు మొదలు.. ప్రభుత్వ అధికారుల వాహనాల డ్రైవర్ల దాకా.. సమ్మెలో పాల్గొనబోతున్నారు.
మోతమోగించిన రైల్‌రోకోలు
జేఏసీ పిలుపు మేరకు శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలైన రైల్‌రోకో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా రైలుగాడీలు తిరగలేదు. పల్లెలన్నీ పట్టాలపైకి చేరుకున్నాయి. జనం పట్టాలపై టెంట్లువేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. ఉద్యమ నినాదాలతో రైల్వే స్టేషన్‌లను హోరెత్తించారు. పలు చోట్ల కళాకారులు ధూంధాంలు నిర్వహించారు. శనివారం రాత్రి పలువురు నేతలు సహా జనం, ఉద్యమకారులు పట్టాలపైనే నిద్రపోయారు. రైల్ రోకో కారణంగా ఎక్స్‌వూపెస్ రైళ్లు సహా దాదాపు 500 సర్వీసులు నిలిచిపోయాయి. శనివారం ఒక్కరోజే దక్షిణమధ్య రైల్వే పరిధిలో రదె్దైన రైళ్ల వల్ల సుమారు 5లక్షల మందిపై ప్రభావం పడిందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ జిల్లాల నుంచి వెళ్లే రైళ్లు దాదాపు రద్దయ్యాయి. కొన్ని పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఎక్స్‌వూపెస్‌లు, ప్యాసింజర్‌లు, ఎంఎంటీఎస్, డీహెచ్‌ఎంయూలు అన్నీ కలిపి సుమారు 500కుపైగా సర్వీసులు నిలిచిపోయాయి. తెలంగాణలో లక్షలాది మందితో కిటకిటలాడే రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. ఉత్తర దక్షిణ భారతాలకు పూర్తిగా లింకు తెగిపోయింది. రైల్‌రోకోలు పూర్తయ్యేదాకా ఒక్క రైలు కూడా నడిపే పరిస్థితుల్లో దక్షిణమధ్య రైల్వే లేదని తెలుస్తోంది. రెండో రోజైన ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
ఆటోల సమ్మె విజయవంతం
తెలంగాణవ్యాప్తంగా ఆటోల సమ్మె విజయవంతమైంది. 80శాతానికి పైగా ఆటోలు తిరగలేదు. సుమారు 23 ఆటో యూనియన్లు సకల జనుల సమ్మెలో భాగంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునివ్వడంతో మొత్తం లక్షా 70వేలకుపైగా ఆటోలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ జిల్లాలు, రాజధాని హైదరాబాద్ కలిపి మొత్తం 2లక్షల ఆటోలున్నాయి. వీటిలో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలోనే లక్షా 10వేల ఆటోలుంటాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, బీఎంఎస్, టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఆటో కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఆటోలు లేక 10 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో మరో 10 లక్షల మందిపై ఆటోల సమ్మె ప్రభావం ఉంది.
ఆరో రోజూ తిరగని పయ్య
ఆర్టీసీ
సమ్మె ఉధృతంగా సాగుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా తెలంగాణ డిపోలు మూతపడే
ఉన్నాయి. తెలంగాణలోని దాదాపు 10వేల బస్సులు నిలిచిపోయాయి. కేవలం 359
బస్సులు మాత్రమే తిరిగాయి. అందులో 289 బస్సులు హైదరాబాద్ పరిధిలో, 87
బస్సులు సికింవూదాబాద్‌పరిధిలో తిరిగాయి. ఖమ్మంలో 3 బస్సులు మాత్రమే
రోడ్డెక్కగలిగాయి. సమ్మె కారణంగా రోజుకు 84 లక్షల మంది ప్రయాణికులపై
ప్రభావం పడుతోంది. యాజమాన్యంతో సమ్మె విరమణ గురించి ఎలాంటి చర్చలు జరిపే
ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ, ఎన్‌ఎంయూ తెలంగాణ ఫోరం స్పష్టం చేశాయి.
రైల్‌రోకోలు, ఆటోలసమ్మె, ఆర్టీసీ తెలంగాణ కార్మికుల సమ్మెతో మొత్తం 2 కోట్ల
మంది రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల
జోలికే పోలేదు. ఏంచేసినా లాభం లేదని రవాణా శాఖ అధికారులు భావించడమే ఇందుకు
కారణంగా తెలుస్తోంది.
ఇక సచివాలయానికి తాళమే..!
రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయలాంటి సచివాలయంలో సోమవారం నుంచి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇప్పటి వరకూ సచివాలయానికి సమ్మె ప్రభావం పరోక్షంగానే ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షంగా ఉండబోతున్నది. సకల జనుల సమ్మెలో సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సమ్మెలో లిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, ప్రభుత్వ డ్రైవర్లు పాల్గొంటున్నారు. జంట నగరాల ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సోమవారం నుంచి తాము విధులకు రావడం లేదని డ్రైవర్ల సంఘం తెలిపింది. డ్రైవర్లు రాకపోతే మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ అధికారులు విధులకు ఎలా హాజరవుతారన్నది అసక్తికరంగా మారింది. వారు ఎలాగోలా సచివాలయం వరకూ వచ్చినా.. వాచ్‌మెన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నందున కార్యాలయాల తాళాలు తీసేవారే కన్పించని ప్రత్యేక పరిస్థితులు నెలకొనబోతున్నాయి. మరోవైపు క్షౌర వృత్తిదారులు, రజకులు కూడా సమ్మెలోకి దిగుతున్నారు.
యంత్రాలూ తిరగవు
సకల జనుల సమ్మెకు మద్దతుగా కేంద్ర పబ్లిక్ సెక్టార్ పరిక్షిశమల కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 26, 27 తేదీలలో కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పరిక్షిశమల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎల్లయ్య సారథ్యం వహిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఎంటీ, ప్రాగా టూల్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, హెచ్‌ఏఎల్ తదితర పరిక్షిశమలలోని కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. శనివారం తెలంగాణ ఎన్జీవో భవన్‌లో పరిక్షిశమల సమ్మె పోస్టర్‌ను తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏిసీ చైర్మన్ కే స్వామిగౌడ్ ఆవిష్కరించారు. వివిధ పరిక్షిశమలలో 20 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్వామిగౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మహోన్నతంగా ప్రతిబింబించేలా తమ వంతు కర్తవ్యంగా సమ్మెలో భాగస్వాములవుతున్నామని పరిక్షిశమల జేఏసీ నాయకులు ప్రకటించారు.ఈ 26న సామూహిక సెలవులు పెట్టి సకల జనుల సమ్మెలో భాగస్వాములవుతున్నామని కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ మల్లికార్జున్ ప్రకటించారు. ఏజీ ఆఫీస్‌లో శనివారం కేంద్ర ఉద్యోగుల సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యోగులు అప్రతిహతంగా ఉద్యమిస్తున్నారని, వారికి సైదోడుగా తాము సకల జనుల ఉద్యమంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. జంటనగరాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు 180 వరకు ఉంటాయని, ఈ కార్యాలయాలన్నింటిలో కలిపి 6వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు. ఒక పిలుపు ఇవ్వగానే వీరందరూ స్వచ్ఛందంగా సెలవులు పెట్టేందుకు సమ్మతి తెలిపారని, తాము ఉద్యమంలో ధృఢంగా ఉండగలమని చెప్పడానికి ఈ సంఘీభావమే నిదర్శనమని ఆయన చెప్పారు.
- పట్టాలపైకి చేరిన తెలంగాణ పల్లెలు
- అక్కడే వంటావార్పు.. భోజనాలు.. నిద్ర
- ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తెగిన లింకు...
- రోడ్డెక్కని 80 శాతం ఆటోలు
- ఆరో రోజూ ఆర్టీసీ సమ్మె సంపూర్ణం
- 2 కోట్ల మంది రవాణాకు దూరం
- నేడూ అదే పరిస్థితి.. చేతుపూత్తేసిన సర్కార్
- సకల జనుల సమ్మెకు 12 రోజులు పూర్తి
- పల్లె పల్లెనా ఉద్యమ బావుటాలు
- సమ్మెలోకి క్షౌరవృత్తిదారులు
- బట్టలుతికేది లేదన్న రజకులు
- సమ్మె నోటీసుఇచ్చిన ప్రభుత్వ డ్రైవర్లు
- సచివాలయంలో ఇక లిఫ్టులూ బంద్
- రంగంలోకి కేంద్ర పరిక్షిశమల కార్మికులు
- 2 రోజులు యంత్రాలకు బ్రేక్

26, 27 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని పరిక్షిశమల కార్మికులు సమ్మె చేయనున్నారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన సమరానికి సంఘీభావంగా 26న కేంద్ర ఉద్యోగులు సామూహిక సెలవు పెడుతున్నారు. అటు సచివాలయానికీ సమ్మె సెగ తగలనుంది. సచివాలయంలో పని చేస్తున్న లిఫ్టు ఆపరేటర్లు, వాచ్‌మెన్‌లు మొదలు.. ప్రభుత్వ అధికారుల వాహనాల డ్రైవర్ల దాకా.. సమ్మెలో పాల్గొనబోతున్నారు.
మోతమోగించిన రైల్‌రోకోలు
జేఏసీ పిలుపు మేరకు శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలైన రైల్‌రోకో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా రైలుగాడీలు తిరగలేదు. పల్లెలన్నీ పట్టాలపైకి చేరుకున్నాయి. జనం పట్టాలపై టెంట్లువేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. ఉద్యమ నినాదాలతో రైల్వే స్టేషన్‌లను హోరెత్తించారు. పలు చోట్ల కళాకారులు ధూంధాంలు నిర్వహించారు. శనివారం రాత్రి పలువురు నేతలు సహా జనం, ఉద్యమకారులు పట్టాలపైనే నిద్రపోయారు. రైల్ రోకో కారణంగా ఎక్స్‌వూపెస్ రైళ్లు సహా దాదాపు 500 సర్వీసులు నిలిచిపోయాయి. శనివారం ఒక్కరోజే దక్షిణమధ్య రైల్వే పరిధిలో రదె్దైన రైళ్ల వల్ల సుమారు 5లక్షల మందిపై ప్రభావం పడిందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ జిల్లాల నుంచి వెళ్లే రైళ్లు దాదాపు రద్దయ్యాయి. కొన్ని పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఎక్స్‌వూపెస్‌లు, ప్యాసింజర్‌లు, ఎంఎంటీఎస్, డీహెచ్‌ఎంయూలు అన్నీ కలిపి సుమారు 500కుపైగా సర్వీసులు నిలిచిపోయాయి. తెలంగాణలో లక్షలాది మందితో కిటకిటలాడే రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. ఉత్తర దక్షిణ భారతాలకు పూర్తిగా లింకు తెగిపోయింది. రైల్‌రోకోలు పూర్తయ్యేదాకా ఒక్క రైలు కూడా నడిపే పరిస్థితుల్లో దక్షిణమధ్య రైల్వే లేదని తెలుస్తోంది. రెండో రోజైన ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
ఆటోల సమ్మె విజయవంతం
తెలంగాణవ్యాప్తంగా ఆటోల సమ్మె విజయవంతమైంది. 80శాతానికి పైగా ఆటోలు తిరగలేదు. సుమారు 23 ఆటో యూనియన్లు సకల జనుల సమ్మెలో భాగంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునివ్వడంతో మొత్తం లక్షా 70వేలకుపైగా ఆటోలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ జిల్లాలు, రాజధాని హైదరాబాద్ కలిపి మొత్తం 2లక్షల ఆటోలున్నాయి. వీటిలో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలోనే లక్షా 10వేల ఆటోలుంటాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, బీఎంఎస్, టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఆటో కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఆటోలు లేక 10 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో మరో 10 లక్షల మందిపై ఆటోల సమ్మె ప్రభావం ఉంది.
ఆరో రోజూ తిరగని పయ్య

ఇక సచివాలయానికి తాళమే..!
రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయలాంటి సచివాలయంలో సోమవారం నుంచి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇప్పటి వరకూ సచివాలయానికి సమ్మె ప్రభావం పరోక్షంగానే ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షంగా ఉండబోతున్నది. సకల జనుల సమ్మెలో సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సమ్మెలో లిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, ప్రభుత్వ డ్రైవర్లు పాల్గొంటున్నారు. జంట నగరాల ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సోమవారం నుంచి తాము విధులకు రావడం లేదని డ్రైవర్ల సంఘం తెలిపింది. డ్రైవర్లు రాకపోతే మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ అధికారులు విధులకు ఎలా హాజరవుతారన్నది అసక్తికరంగా మారింది. వారు ఎలాగోలా సచివాలయం వరకూ వచ్చినా.. వాచ్‌మెన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నందున కార్యాలయాల తాళాలు తీసేవారే కన్పించని ప్రత్యేక పరిస్థితులు నెలకొనబోతున్నాయి. మరోవైపు క్షౌర వృత్తిదారులు, రజకులు కూడా సమ్మెలోకి దిగుతున్నారు.
యంత్రాలూ తిరగవు
సకల జనుల సమ్మెకు మద్దతుగా కేంద్ర పబ్లిక్ సెక్టార్ పరిక్షిశమల కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 26, 27 తేదీలలో కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పరిక్షిశమల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎల్లయ్య సారథ్యం వహిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఎంటీ, ప్రాగా టూల్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, హెచ్‌ఏఎల్ తదితర పరిక్షిశమలలోని కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. శనివారం తెలంగాణ ఎన్జీవో భవన్‌లో పరిక్షిశమల సమ్మె పోస్టర్‌ను తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏిసీ చైర్మన్ కే స్వామిగౌడ్ ఆవిష్కరించారు. వివిధ పరిక్షిశమలలో 20 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్వామిగౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మహోన్నతంగా ప్రతిబింబించేలా తమ వంతు కర్తవ్యంగా సమ్మెలో భాగస్వాములవుతున్నామని పరిక్షిశమల జేఏసీ నాయకులు ప్రకటించారు.ఈ 26న సామూహిక సెలవులు పెట్టి సకల జనుల సమ్మెలో భాగస్వాములవుతున్నామని కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ మల్లికార్జున్ ప్రకటించారు. ఏజీ ఆఫీస్‌లో శనివారం కేంద్ర ఉద్యోగుల సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యోగులు అప్రతిహతంగా ఉద్యమిస్తున్నారని, వారికి సైదోడుగా తాము సకల జనుల ఉద్యమంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. జంటనగరాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు 180 వరకు ఉంటాయని, ఈ కార్యాలయాలన్నింటిలో కలిపి 6వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు. ఒక పిలుపు ఇవ్వగానే వీరందరూ స్వచ్ఛందంగా సెలవులు పెట్టేందుకు సమ్మతి తెలిపారని, తాము ఉద్యమంలో ధృఢంగా ఉండగలమని చెప్పడానికి ఈ సంఘీభావమే నిదర్శనమని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment