సకల జనుల ఉద్యమం రెండు వారాలు దాటింది. ఇవాళ్ళ
హైదరాబాద్ బంద్ జరుగుతున్నది. ఇప్పటికే మంత్రుల ఇళ్ళకు కూడా ఉద్యమ సెగ
తగిలింది. ఇక్కడే కాదు మహారాష్ట్రలో, కర్ణాటకలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కలిగి తెలంగాణ ఉద్యమం గురిం చి తెలుసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర
స్థాయికి చేరుకోవడాన్ని చూసి భరించలేని ఆంధ్ర పెత్తందారీ ఉష్ట్ర పక్షుల
సంగతి ఎట్లా ఉన్నా, ఢిల్లీకి కూడా ఈ కాక తాకింద ని తాజా వార్తలను బట్టి
తెలుస్తున్నది. ఇది శాంతియుతంగా తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు సాధించిన
విజయం. అయితే లక్ష్యం సాధించే వరకు ఇదే పట్టుదలతో ఇంకా పోరాడవలసి ఉన్నది.
ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ను కలిసిన పీసీసీ నేత బొత్స సత్యనారాయణ సకల జనుల సమ్మె తీవ్రత కేంద్రానికి అర్థమైందని తెలిపారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు కేంద్రానికి అర్థమైనట్టు కూడా ఆయన చెప్పారు. శాస్త్రీయంగా కసరత్తు జరుగుతున్నదని, నెలరోజుల లోపే పరిష్కారం లభించవచ్చునని అన్నా రు. ఉద్యమిస్తున్న ప్రాంతానికి మేలైన పరిష్కారం లభిస్తుందనే మాట కూడా చెప్పడం సంతోషం. కానీ తెలంగాణ జనానికి శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి బుగులు కూడా అయితున్నది. ఇప్పుడు బొత్స చెబుతున్న మాటలు నిజ మా లేదా అబద్ధాలా అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ఇతర పెద్దలు చెప్పే మాటలపై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారు. సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి చిదంబరం తన మాట మీద నిలబడకపోయిన తరువాత, పార్లమెంటులో చెప్పిన మాట లు చెల్లుబాటు కాకపోయిన తరువాత, ప్రజలకు ప్రభుత్వ హామీలపై, నాయకుల మాటలపై నమ్మకం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఇక్కడ సకల జనుల సమ్మె విరమణ సాధ్యం కాదు. ఒక వేళ స్పష్టమైన ప్రకటన చేస్తే సమ్మె విరమించినా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయే వరకు ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు. ఏ క్షణంలోనైనా ఉవ్వెత్తున ఉద్యమం మళ్లీ చెలరేగే అవకాశాలు ఉంటాయి.
తెలంగాణ సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ సాధించాలని భావిస్తున్నట్టు ఆజాద్ చెప్పారని ఆయనను కలిసిన కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై మెలిక పెడుతున్నారని కూడా తెలుస్తున్నది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం అయితే తప్ప శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు. హైదరాబాద్ లేని తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ వారికి సమ్మతం కాదు. తెలంగాణ ప్రజలు ఇంతగా ఉద్యమిస్తున్నది హైదరాబాద్ లేని తెలంగాణను తెచ్చుకోవడానికి కాదు. పైగా ఆంధ్ర దురాక్షికమణ హైదరాబాద్‌తోనే అగిపోదు. క్రమంగా విస్తరించి తెలంగాణ మొత్తం తెలంగాణ వారికి కాకుండా చేస్తుంది. ఇందుకు చరివూతలో ఉదాహరణలు ఉన్నాయి.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, లేదా ఉమ్మడి రాజధాని చేయాలని వాదించడం ద్వారా కుహనా ఆంధ్ర మేధావులు, అక్కడి పెట్టుబడిదారులు ఇంత కాలం తాము చెబుతున్న ఏక జాతి సిద్ధాంతం ఎంత బలహీనమైందో రుజువు చేశారు. అంతా ఒకే జాతి అయినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉన్నా ఆందోళన పడవద్దు. తాము పరాయివారిగా మారిపోతామనే భయం పెట్టుకుంటున్నారం వారి వాదనలోని డొల్లతనం తెలిసిపోతున్నది. ఇంతకాలం పాలకులమనే భావనతో బతికిన ఆంధ్ర కుహనా మేధావులు ఇప్పుడు తెలంగాణ వారితో కలిసి సమానస్థాయిలో జీవించాలనే భావనను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక పాలనా యంత్రాంగం చేతిలో లేకపోతే తమ అక్రమ ఆస్తుల సంగతేమిటనే భయం దోపిడీదారులది.
హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉండకుండా కేంద్రం చేతిలో ఉండాలనే స్థాయికి వీరు దిగజారారు అంటే వీరు ఇంత కాలం ప్రవచిస్తున్న ఏకజాతి సిద్ధాంతం ఏమైనట్టు? కేవలం తెలంగాణను ఆక్రమించుకుని, దోచుకోవడానికేనా ఈ సమైక్యవాద సిద్ధాంతం! పైగా తమ పనికి మాలిన వాదనకు మద్దతుగా అంబేడ్కర్ భావనలను ఉదహరించడం మరింత విడ్డూరం. ఆంధ్ర తెలంగాణ విలీనం జరిగినప్పుడు, దాదాపు అరవై ఏళ్ళుగా ఎకరాల కొద్దీ కబ్జా చేస్తున్నప్పుడు వీరికి అంబేడ్కర్ సూచనలు గుర్తుకు రాలేదా? అంబేడ్కర్ హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలనే సందర్భం, ప్రాతిపదిక వేరు. హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయాలని, ఆంధ్ర పెట్టుబడిదారుల అక్రమ ఆస్తులను రక్షించాలని ఆయన ఎప్పుడూ భావించలేదు. రాష్ట్ర విభజన సందర్భమే వేరు. ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు కూడా ఆచరణ సాధ్యం కాదు. చండీగఢ్ వివాదం చూసిన తరువాత రాజధాని పొత్తును బుద్ధి, జ్ఞానం ఉన్నవావరూ ఆమోదించరు. ఆంధ్ర ప్రజానీకం కూడా తమ ప్రాంతంలో రాజధాని ఉండాలని కోరుకుంటారు తప్ప, కొద్ది మంది అక్రమ ఆస్తుల పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉండడానికి అంగీకరించరు. మద్రాసును వదులుకున్నప్పుడే సొంత రాజధానిని నిర్మించకుండా, ఆంధ్ర పెద్దమనుషులు తమ ప్రజలకు ద్రోహం చేశారు.
ఇంకా అదే ద్రోహం చేస్తామంటే ఆంధ్ర ప్రజలు సహిస్తారా? ఎట్లా కలిసినమో అట్ల విడిపోవడమే మంచిది. విలీనం తరువాత తెలంగాణ వారికి ఎంతో నష్టం జరిగింది. అదంతా లెక్కలు తీసి కక్కమని తెలంగాణ వారు అడుగుత లేరు. అందుకు సంతోషించాలె. చారివూతక వాస్తవాలను, సాంస్కృతిక అస్తిత్వా న్ని కాదని ఎటువంటి మార్పులు, చేర్పులు చేసినా సమస్య పరిష్కారం కాకపోగా మరిం త రగులుతుంది. ఆంధ్ర పెట్టుబడిదారులు ఇటువంటి మెలికలు పెట్టడం మాని వెంటనే ‘శాశ్వత పరిష్కారం’ కోసం సహకరించాలె.

No comments:
Post a Comment