Pages

Wednesday, September 28, 2011

అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వడానికి కేంద్రం సుముఖం

తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు విలేకరులతో కేసీఆర్ అన్నారు. అయితే హైదరాబాద్ లేని తెలంగాణకు ఒప్పుకునేది లేదని కేసీఆర్ స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంఐఎం నేత అసదుద్దీన్ కూడా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని నిన్న తనతో చెప్పినట్లు కేసీఆర్ అన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ముందు కేంద్రం తనతో ఖచ్చితంగా చర్చిస్తుందని కూడా ఛానల్స్‌లో ప్రసారం అవుతోంది. కాగా... ఈ వార్తలను టీఆర్‌ఎస్ వర్గాలు ధృవీకరించడం లేదు. ఒక వేళ కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పి ఉంటే పార్టీ నేతలు, విద్యార్థులు, మేథావులు, ఉద్యోగులు అందరితో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని కానీ కేంద్రం చెప్పగానే ఒప్పుకోమని టీఆర్‌ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి అన్నారు.

No comments:

Post a Comment