- ఎర్రబారిన ఖమ్మం.. న్యూడెమోక్షికసీ ఆధ్వర్యంలో భారీ సభ
- మార్మోగిన జై తెలంగాణ నినాదం
- ప్రపంచ చరివూతలోనే ఇలాంటి సమ్మె లేదు
- పాల్గొననివారు చచ్చినవాళ్ల కిందే లెక్క
- జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్య
- ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదం లేదనడం అవివేకమే: న్యూడెమోక్షికసీ నేత సూర్యం
నాడు నిజాం మెడలు వంచినట్లుగా... నేడు సీమాంధ్ర సర్కారును వణికించేలా.. ఆంధ్ర వలసదోపిడీదారుల గుండెల్లో దడపుట్టించేలా.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు స్ఫూర్తినిచ్చేలా.. తెలంగాణ పోరు గర్జన చేసింది! ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం ఎర్రబారింది.. పోరాటాల ఖిల్లా.. పొలికేక వేసింది! ఎటు చూసినా ఎర్ర జెండాల రెపపలతో ఖమ్మం పట్టణం అరుణార్ణవమైంది! తెలంగాణ సాధన దిశగా.. సకల జనుల సమ్మె నేపథ్యంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన తెలంగాణ పోరు గర్జన దిగ్విజయమైంది! ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదం లేదన్నవారికి విప్లవ చుక్కలు చూపించింది! వేల గొంతుకలు ఒక్కటై చేసిన జై తెలంగాణ నినాదంతో ఖమ్మం పట్టణం మారుమోగిపోయింది!
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, న్యూ డెమోక్షికసీ నేతలు సూర్యం, గోవర్దన్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత ఈటెల రాజేందర్, ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ తదితరులు దిశానిర్దేశం చేయగా.. ఉద్యమదారిలో మునుముందుకు సాగడానికి పునరంకితమైంది! సకల జనుల సమ్మె దిగ్విజయమవుతున్న తీరును వివరించిన కోదండరాం.. ప్రపంచ చరివూతలోనే ఇలాంటి సమ్మె లేదని చెప్పారు. ఈ సమ్మెలో పాల్గొనని వారు చచ్చినవాళ్ల కిందే లెక్కని అన్నారు. తొలి దశ ఉద్యమం 1968లోనే ఖమ్మంలోమొదలైందన్న న్యూ డెమోక్షికసీ నేత సూర్యం... ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదం లేదనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటే ఉద్యమానికి డెడ్‌లైన్ అని తేల్చి చెప్పారు.
- మార్మోగిన జై తెలంగాణ నినాదం
- ప్రపంచ చరివూతలోనే ఇలాంటి సమ్మె లేదు
- పాల్గొననివారు చచ్చినవాళ్ల కిందే లెక్క
- జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్య
- ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదం లేదనడం అవివేకమే: న్యూడెమోక్షికసీ నేత సూర్యం


No comments:
Post a Comment