Pages

Sunday, September 25, 2011

సకల జనుల సమ్మెపై నల్లారివారి గుస్సా...

- జనాన్ని పిలిపించుకుని సొంత డబ్బా
- అభివృద్థి పనుల్ని ఉద్యమకారులు అడ్డుకుంటున్నారని విమర్శలు
- గ్యాస్ రాకుండా కేంద్ర మంత్రి జైపాల్ వద్ద మోకాలడ్డారట
- బొగ్గు తెద్దామంటే రైల్‌రోకో చేస్తున్నారట


హైదరాబాద్, సెప్టెంబర్ 24(టీ న్యూస్):తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న మహోద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంవూతికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. తానేదో రాష్ట్ర సంక్షేమానికి, బడుగు వర్గాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్షికమాలు అమలు చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు వా కి ప్రతిబంధకాలుగా తయారయ్యారని చెప్పుకొనేందుకు విశ్వవూపయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు నాయకులను చేరదీసి వారితో జనాన్ని తన క్యాంప్ కార్యాలయానికి రప్పించుకుని వరుసగా రెండు రోజుల నుంచి ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారంనాడు రంగాడ్డి జిల్లా నుంచి జనాన్ని సేకరించి చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా శనివారం మెదక్ జిల్లా నుంచి మరికొందరిని రప్పించుకుని మాట్లాడారు. అయితే, మెదక్ జిల్లాకు చెందిన తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారితో జన సమీకరణ చేయించారు.

వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, రెండు మూడు నెలల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించినందున అప్పటివరకు వేచి ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత సలహా ఇచ్చారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని నిలిపి వేయించారని, గ్యాస్ కావాలని కేంద్ర సాయం అడిగితే కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి వద్దకు వెళ్లి ఉద్యమకారులు గ్యాస్ ఇవ్వవద్దన్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు తీసుకువద్దామంటే రైల్‌రోకో ఆందోళనలు నిర్వహిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ధ్యేయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పదిహేను వందల మెగావాట్ల విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనిచెప్పారు.

ఇప్పటికే 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును రోజూ దిగుమతి చేసుకుంటున్నామని, ప్రజలు ఇబ్బంది పడితే ఉద్యమకారులకు సంతోషంగా ఉంటుందా? అని తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించారు. హైదరాబాద్‌లో ముప్పయి...నలభై లక్షల మంది కూలి చేసుకుని బతికేవారికి ఉపాధి పోయిందని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆయన ప్రస్తావించారు. ఎస్‌ఐ పరీక్షలు పెట్టవద్దంటే 14ఎఫ్‌ను రద్దు చేయించామని చెప్పుకొన్నారు. దీంతో ఆరువందలమంది తెలంగాణవారు ఎస్‌ఐలుగా ఎంపికయ్యారన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, ఒకే యేడాదిలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరిగిందని, 28 శాఖల్లో 1.16లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటానికి డిసెంబరులోగా నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.

No comments:

Post a Comment