- 28న హైదరాబాద్‌లో 100 కేంద్రాల్లో రాస్తారోకో
- 29న విద్యుత్ కోతను నిరసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
- 30న రాజధాని బంద్.. అక్టోబర్ 1న కాగడాల ప్రదర్శన
- 2న టోల్‌గేట్ ట్యాక్స్ కట్టకుండా ప్రయాణాలు
- 3న తెలంగాణ పండుగగా బతుకమ్మ ఉత్సవాలు
- 4న తెలంగాణ స్ఫూర్తితో బతుకమ్మ నిమజ్జనాలు
- 6న దశకంఠ కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం
- 9 10,11 తేదీల్లో నిరవధిక రైల్‌రోకో
- ఉద్యమ షెడ్యూల్ విడుదల చేసిన రాజకీయ జేఏసీ
- ఎక్కడికక్కడ సీమాంధ్ర బస్సులను అడ్డుకోవాలి
- హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు చెప్తాం
- జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడి
- నేడు తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు
హైదరాబాద్,
సెప్టెంబర్ 26 (టీ న్యూస్):సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేస్తూ తాజా
పోరాట షెడ్యూల్ విడుదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరింత బలంగా
చాటేందుకు యావత్ తెలంగాణను పోరుబాటలో నడిపేందుకు చుక్కాని రాజకీయ జేఏసీ
సమాయత్తమైంది. సెప్టెంబర్ 27 నుంచి వచ్చే నెల 11 వరకు పోరుబాట వేసింది.
ఇందులో భాగంగా 30న హైదరాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ.. వచ్చే నెల 9,
10,11 తేదీల్లో నిరవధిక రైల్‌రోకోలు చేపట్టనుంది. వాటి వివరాలను రాజకీయ
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సోమవారం ఇక్కడ ప్రకటించారు. బంజారాహిల్స్
లోటస్‌పాండ్‌లోని ప్రైవేట్ ఫాంహౌజ్‌లో జరిగిన టీ జేఏసీ ముఖ్యనాయకుల
సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సీహెచ్
విద్యాసాగర్‌రావు, న్యూడెమొక్షికసీ రాష్ట్ర నాయకులు పీ సూర్యం, కే
గోవర్ధన్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్, సెక్రటరీ జనరల్ వీ
శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్లు జీ దేవీవూపసాద్‌రావు, సీ విఠల్,
అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం,
ఎన్‌ఎంయు టీ ఫోరం చైర్మన్ థామస్‌డ్డి, కన్వీనర్ అశ్వత్థామడ్డి, కో-కన్వీనర్
హన్మంతు, రాజడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ మంగళవారం తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు భారీగా ర్యాలీలు నిర్వహిస్తారని, వారికి సంఘీభావం తెలుపుతూ అన్ని జేఏసీల నాయకులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 28న హైదరాబాద్‌లో 100 కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రాస్తారోకోలతో హైదరాబాద్‌ను స్తంభింపజేయాలన్నారు. విద్యుత్ కోతను నిరసిస్తూ 29న తెలంగాణవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. 30న హైదరాబాద్ బంద్ పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ బంద్‌ను నిర్వహించాలని ఆయన కోరారు. అక్టోబర్ 1న తెలంగాణ వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాలని, 2న టోల్‌గేట్ పన్నులు చెల్లించకుండా ప్రయాణాలు చేయాలని జేఏసీ నిర్ణయించింది.
3న
బతుకమ్మ పండుగను తెలంగాణ ఉత్సవాలుగా జరుపుకోవాలని, 4న బతుకమ్మ
నిమజ్జనాన్ని తెలంగాణ స్ఫూర్తితో నిర్వహించాలని కోదండరాం కోరారు. 6న దసరా
పండుగ సందర్భంగా దశకంఠ కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని, దసరా రోజు
రావణాసురుడి దిష్టిబొమ్మకు బదులుగా కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం
చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. 9,10,11 తేదీల్లో నిరవధికంగా రైల్‌రోకో
కార్యక్షికమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఉధృతంగా సాగుతుండగా సీమాంవూధకు చెందిన ప్రైవేట్ బస్సులు నడవనీయవద్దని,
సీమాంధ్ర బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్ర
ట్రావెల్స్ తమ బస్సులను తిప్పితే ఆ తరువాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత
వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే
ముస్లింలకు స్వాగతం పలికి అదే గౌరవంతో ఘనంగా వీడ్కోలు పలుకుతామని ఆయన
తెలిపారు. ఈ ఉద్యమ షెడ్యూల్‌ను పక్కాగా, విజయవంతంగా అమలు చేయాలని, తెలంగాణ
రాష్ట్ర సాధన అకాంక్షలను మరోమారు కేంద్రానికి సెగ తగిలే విధంగా చూపాలని
కోదండరాం విజ్ఞప్తి చేశారు.
- 29న విద్యుత్ కోతను నిరసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
- 30న రాజధాని బంద్.. అక్టోబర్ 1న కాగడాల ప్రదర్శన
- 2న టోల్‌గేట్ ట్యాక్స్ కట్టకుండా ప్రయాణాలు
- 3న తెలంగాణ పండుగగా బతుకమ్మ ఉత్సవాలు
- 4న తెలంగాణ స్ఫూర్తితో బతుకమ్మ నిమజ్జనాలు
- 6న దశకంఠ కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం
- 9 10,11 తేదీల్లో నిరవధిక రైల్‌రోకో
- ఉద్యమ షెడ్యూల్ విడుదల చేసిన రాజకీయ జేఏసీ
- ఎక్కడికక్కడ సీమాంధ్ర బస్సులను అడ్డుకోవాలి
- హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు చెప్తాం
- జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడి
- నేడు తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు

సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ మంగళవారం తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు భారీగా ర్యాలీలు నిర్వహిస్తారని, వారికి సంఘీభావం తెలుపుతూ అన్ని జేఏసీల నాయకులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 28న హైదరాబాద్‌లో 100 కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రాస్తారోకోలతో హైదరాబాద్‌ను స్తంభింపజేయాలన్నారు. విద్యుత్ కోతను నిరసిస్తూ 29న తెలంగాణవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. 30న హైదరాబాద్ బంద్ పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ బంద్‌ను నిర్వహించాలని ఆయన కోరారు. అక్టోబర్ 1న తెలంగాణ వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాలని, 2న టోల్‌గేట్ పన్నులు చెల్లించకుండా ప్రయాణాలు చేయాలని జేఏసీ నిర్ణయించింది.

No comments:
Post a Comment