Pages

Wednesday, September 28, 2011

టీడీపీకి మరో షాక్

- ఎమ్మెల్యే గంపగోవర్ధన్ రాం రాం
- బాబు ‘రెండు కళ్ల’వైఖరికి నిరసనగా..ండ్రోజుల క్రితమేరాజీనామా లేఖ!
- కేసీఆర్‌తో భేటీ
- రెండ్రోజుల్లో టీఆర్‌ఎస్‌లోకి
- అదే బాటలో మరో10 మంది ఎమ్మెల్యేలు!

GAMPA2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 27 (టీన్యూస్):తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన వైఖరితో విసిగివేసారిన కామాడ్డి ఎమ్మెల్యే గంపగోవర్థన్ టీడీపీకి దూరమయ్యారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని బాబును కోరినా ఎలాంటి స్పందన కనిపించకపోవడం, మరోవైపు నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల క్రితమే చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపినట్లు తెలిసింది. అదే సమయంలో తెలంగాణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. రెండ్రోజుల్లో నియోజకవర్గంలో ప్రజల సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా గంప గోవర్ధన్ బాటలోనే ఉన్నారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి, తెలంగాణపై చంద్రబాబు వైఖరితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాలో తిరుగలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడకు వెళ్లినా తెలంగాణపై బాబు వైఖరిని స్పష్టం చేయాల్సిందేనని, అలా చేస్తేనే గ్రామాల్లోకి అడుగుపెట్టనిస్తామని ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాబు కారణంగానే వచ్చిన తెలంగాణ ఆగిపోయిందన్న ప్రచారం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసడ్డి కూడా ఇదే బాటలో నడిచారు. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించిన నాగం జనార్దన్‌డ్డితో పాటు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, వేణుగోపాలచారి, జోగురామన్నలు టీడీపీలో సైద్ధాంతిక పోరాటం జరిపి.. తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకి అనే విషయాన్ని తేటతెల్లం చేసి మరీ పార్టీని వీడారు. తాజాగా ఉధృతంగా కొనసాగుతున్న సకల జనుల సమ్మెలోనూ టీడీపీ నేతలు పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు.

బెదిరించి చేర్చుకుంటున్నారు : ఎర్రబెల్లి
రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సహకారంతో కేసీఆర్ తమ పార్టీ నేతలను బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. గంపగోవర్ధన్ పార్టీని వీడనున్నారనే నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.

టీటీడీపీ అత్యవసర భేటీ.. నేడు రాజీనామాలు!
గంపగోవర్ధన్ కేసీఆర్‌ను కలిసినట్లు తెలియడంతో ఆందోళన చెందిన టీడీపీ తెలంగాణ ఫోరం నేతలు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో అత్యవసరంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించాలంటే కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా పదవులకు రాజీనామాలు చేయడం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు సమర్పించనున్నట్లు ఓ ఎమ్మెల్యే చెప్పారు.

పార్టీ వర్క్‌షాప్‌లో సమ్మె ఊసే లేదు!
పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో సకల జనుల సమ్మెపై కనీస అసలే చర్చ జరగలేదని తెలిసింది. సకల జనుల సమ్మెతో తెలంగాణలో స్తంభించిన జనజీవనం, ప్రజల ఆకాంక్షలపై కనీస చర్చ కూడ జరుగకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని పార్టీ నేత ఒకరు చెప్పారు. దీంతో ఎవరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించే సాహసం చేయలేకపోయారని ఆయన వాపోయారు.

No comments:

Post a Comment