Pages

Tuesday, September 20, 2011

మళ్లీ కేసీఆర్ దీక్షాస్త్రం!

నా చావుతోనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి
దృఢ నిశ్చయంతో టీఆర్‌ఎస్ అధినేత.. మూడు నాలుగు రోజుల్లో దీక్షకు దిగే అవకాశం

- సకల జనుల సమ్మెకు మద్దతుగానే ఈ యోచన
- తెలంగాణ పాలిట శాపంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు
- సమ్మె, ఉద్యమంపై సర్కారు కుట్రలు
- పోలీసుల దౌర్జన్యాలతో అణచివేత యత్నాలు
- ఇవే కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేశాయి
- టీఆర్‌ఎస్ ఆంతరంగిక వర్గాల వెల్లడి
- వారిస్తున్న పార్టీ ముఖ్యులు, కుటుంబీకులు
- తగ్గేది లేదంటున్న గులాబి దళపతి

Kcrao-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema(టీ న్యూస్, హైదరాబాద్)తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరోసారి ఆమరణ నిరాహారదీక్షకు దిగే యోచనలో టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో దీక్షకు దిగాలన్న యోచనకు కేసీఆర్ వచ్చారని టీఆర్‌ఎస్ ఆంతరంగిక వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సాధన కోసం వారం రోజులుగా సకల జనం ఉధృతంగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రాజకీయ జేఏసీ పిలుపు మేరకు సోమవారం నాడు జాతీయ రహదారుల దిగ్బంధం దిగ్విజయంగా సాగింది. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మె హారన్ మోగించారు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు, వైద్యులు, అధ్యాపకులు, వృత్తిదారులు సహా సకల రంగాల వారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వీరోచితంగా ఆందోళన చేస్తున్నారు.

కొత్తగా మంగళవారం నుంచి విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. ఇలా సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమ్మెబాట పడుతున్న తరుణంలో వీరి ఆందోళనకు మద్దతుగానే ఆయన ఈ ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఉద్యోగులు అపూర్వ స్థాయిలో పోరాటం చేస్తున్నా వారికి రాజకీయ నాయకులు అండగా నిలబడకపోవడం పట్ల ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురవడమే మరోసారి నిరాహార దీక్షకు కూర్చొనాలన్న యోచనకు పురికొల్పిందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కోసం ఇచ్చిన మాటకు అనుగుణంగా రాజీనామాలు చేయనివారు, రాజీనామాలు చేసినా వాటిని ఆమోదింపచేసుకోని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలే తెలంగాణ పాలిట శాపమని కేసీఆర్ భావిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

వారు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి కలిసిరావాలని కేసీఆర్ కోరుతున్నారు. తెలంగాణను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని చెబుతున్న కేసీఆర్.. ఈ నేపథ్యంలోనే అవసరమైతే తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీక్షకు దిగే విషయంలో పార్టీ ముఖ్యులు, ఆంతరంగికులతో ఆయన సంప్రతింపులు జరుపుతున్నారని తెలిసింది. తెలంగాణ కోసం ఎత్తిన జెండా దించేది లేదని వివిధ వేదికలపై స్పష్టం చేస్తూవచ్చిన కేసీఆర్.. తెలంగాణ కోసం ప్రాణం పోయినా వెనక్కు తగ్గేది లేదన్న పట్టుదలతో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అన్ని వర్గాలు తమ జీవితాలను పణంగా పెట్టి మరీ సమ్మెకు దిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా ఉద్యమాన్ని అణచివేసే దిశగా కుట్రలు చేయడం, విద్యార్థులపై ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో పోలీసులతో దౌర్జన్యానికి దిగడం ఆయనను మనస్తాపానికి గురి చేసిందని టీఆర్‌ఎస్ ఆంతరంగికవర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే మరోసారి నిరాహార దీక్షకు దిగాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఉద్యమంలో వీరోచితంగా పోరాడుతున్న సకల జనానికి అండగా నిలిచేందుకే నిరాహార దీక్ష చేయాలనే ఆలోచనను కేసీఆర్ చేస్తున్నట్లు తెలిసింది. తన చావుతోనైనా తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరాలని కేసీఆర్ చెబుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే మరోసారి దీక్ష చేయాలనే యోచనలో ఉన్న కేసీఆర్‌ను పార్టీ ముఖ్యులు, కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

గతంలో 2009లో కేసీఆర్ చేసిన దీక్ష, ఆ సమయంలో తెలంగాణలో రాజుకున్న ఆందోళనల సెగ ఢిల్లీకి తాకడంతో కేంద్ర హోం మంత్రి పీ చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ‘డిసెంబర్ 9 ప్రకటన’ చేసిన సంగతి తెలిసిందే. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికిన సీమాంధ్ర నేతలు.. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ేఅయితే ఆ మరుసటి రోజు నుంచే సీమాంధ్ర పెట్టుబడిదారులు, రెండు కళ్ల సిద్ధాంతవాదులు రంగంలోకి దిగి.. రాజీనామాల డ్రామా మొదలు పెట్టడంతో వచ్చిన తెలంగాణ రాకుండా పోయిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment