
మంకన పువ్వు, ఛెత్రి పువ్వు.. పోక బంతి, కనకాంబరాలు.. గోరెంకపూలు, సలిమల్లె.. అన్ని పూలల్లో ఒదిగిపోయే గునుగు పువ్వు.. పువ్వులేకాదు.. నవ్వుల కలయిక!
ఇది బతుకుల కలయిక! కులం లేదు.. మతం లేదు.. తారతమ్యాలసలేలేవు..! మన అమ్మలు.. మన అక్కలు.. మన చెల్లెళ్లు.. మన అత్తలు.. పట్టుపీతాంబరాలు కట్టుకుని.. కదులుతుంటే.. గౌరమ్మే మన నట్టింట నడుస్తున్నట్టు..!లంగాఓణీల్లో కన్నె పిల్లలు ఉన్నంతలో ముస్తాబై.. ఇంతెత్తు బతుకుమ్మను మలిచి వీధుల్లో సాగుతుంటే.. ఎంత శోభ!
బతుకమ్మలను చేర్చి.. చుట్టూ చేరి.. కష్టాలు, కన్నీళ్లు మర్చి.. చప్పట్లే తాళాలుగా మధురమైన గొంతులు ఉయ్యాల పాటలు పాడుతుంటే.. ఓహ్.. ఇది కాదా.. శ్రమైక జీవన సౌందర్యం! ఇది తెలంగాణ సొత్తు. ఇది తెలంగాణకే సొత్తు! ఓ నిలువెత్తు బతుకు పండుగ..తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక! అపురూపమైన సంబురం! తెలంగాణ అమ్మలకు.. ఆడపడుచులకు..
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
No comments:
Post a Comment