- బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా
- ఎంపీ పొన్నంపై ముఖ్యమంత్రి ఫైర్
- సముదాయించిన నేతలు.. సీఎం సారీ
- సీఎం పదవికి ఏం లాబీయింగ్ చేశారు?
- మాకూ చెబితే అలానే తెలంగాణ తెచ్చుకుంటాం: పొన్నం
- ఈ వ్యాఖ్యలతోనే సీఎం ఆగ్రహం
- తప్పుడు నివేదికలపై సీఎంను నిలదీసిన నేతలు
- వాస్తవాలే పంపుతున్నానన్న కిరణ్.. వాడివేడిగా చర్చలు
హైదరాబాద్,
సెప్టెంబర్ 22 (టీ న్యూస్):సకల జనుల సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్ రెడ్డితో టీ కాంగ్రెస్ నేతల సమావేశం వాడివేడిగా జరిగింది.
గురువారం రాత్రి టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు, నాయకులు ముఖ్యమంవూతిని ఆయన
క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తెలంగాణపై కేంద్రాన్ని సానుకూలంగా
ఒప్పించాలని కోరారు. ఈ సందర్భంగా సకల జనుల సమ్మె విషయంలో కేంద్రానికి
తప్పుడు నివేదికలు పంపకుండా.. వాస్తవాలు వివరించాలని నేతలు సీఎంను కోరడంతో
కిరణ్ ఒకింత అసహనానికి గురైనట్లు సమాచారం. తానేమీ తప్పుడు నివేదికలు
ఇవ్వడం లేదని, వాస్తవ పరిస్థితులనే కేంద్రానికి నివేదిస్తున్నానని
బుకాయించారు. ఈ దశలో సీఎంకు, నేతలకు మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగినట్లు
సమాచారం. దానికి తోడు సీఎం పదవి తెచ్చుకోడానికి ఎలాంటి లాబీయింగ్ చేశారో.. ఆ
మంత్రాంగం ఏమిటో మాకూ చెబితే అదే పద్ధతుల్లో తెలంగాణ తెచ్చుకుంటామని ఎంపీ
పొన్నం ప్రభాకర్ అనడంతో సీఎంలోని సీమాంధ్ర దురహంకారం ఒక్కసారిగా బయటపడిందని
తెలిసింది. పొన్నంను పట్టుకుని.. వాటీజ్ దిస్ నాన్సెస్.. బుద్ధి ఉండే
మాట్లాడుతున్నావా? అంటూ విరుచుకుపడినట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేతలు జానాడ్డి, కేశవరావు, ఆమోస్‌లు సర్ది చెప్పడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆమోస్ కల్పించుకొని గతంలో టీఎన్జీఓ సంఘ నాయకుడిగా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశానని, కాని అతను వాటిని స్పోర్టివ్‌గా తీసుకొని తమను ఉద్యోగులుగా, ప్రభుత్వంలో భాగస్వాములుగానే చూశారని ఆమోస్ గుర్తు చేశారు. దీంతో సిఎం కిరణ్ శాంతించినట్లు తెలిసింది. పొన్నంపై దురుసుగా చేసిన వ్యాఖ్యలకు సీఎం అనంతరం క్షమాపణ చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీఎంను కలిసిన అనంతరం కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు, సమ్మెలు సాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఉద్యమ తీవ్రతను కేంద్రానికి తెలుపాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన సీఎంను కోరారు.
ఏఐసీసీ అధికార ప్రతినిధి సింఘ్వీ తెలంగాణలో సకల జనుల సమ్మె ప్రభావం లేదంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహోధృతంగా సమ్మె సాగుతున్న దశలో సింఘ్వీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుంచి తప్పుడు నివేదికలు వెళ్లడం వల్లనే సింఘ్వీ ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చని ఆయన అన్నారు. తెలంగాణలో సకలం బంద్ అయిన సమయంలో వాస్తవాలు కేంద్రం ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడవద్దని కోరారు. ఉద్యమాన్ని అణిచి వేస్తామని బెదిరించ వద్దని హితవు పలికారు. ఉధృతంగా సమ్మె సాగుతున్నందున ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంవూతికి గట్టిగా చెప్పామని, అయితే మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరంగల్ ఘటన, నిజాం కాలేజీ హాస్టల్‌లో దౌర్జన్యం వంటి ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని సీఎంను డిమాండ్ చేశామని, నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని పొన్నం తెలిపారు.
సమ్మె చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఏం జరిగినా తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులుగా తమదే బాధ్యతని అన్నారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు. పంతానికి పోవద్దని అన్నారు. జీవో 177ను వెంటనే రద్దు చేయాలని కోరామని, అయితే ఇది కోర్టు పరిధిలో ఉందని సీఎం చెప్పారన్నాని పొన్నం తెలిపారు. తెలంగాణలో దసరా పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు కాబట్టి జీతాల్లో కోతలు విధిస్తే ఊరుకునేది లేదని తాము సీఎంకు తేల్చి చెప్పినట్లు వివరించారు. సింగరేణి ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించాలని పొన్నం డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మంద జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించి, ముఖ్యమంవూతిగా తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు.
సీఎంతో జరిగిన భేటీలో టీ కాంగ్రెస్ ఎంపీలు కేశవరావు, వివేక్, ఎస్ రాజయ్య, మంత్రులు జానాడ్డి, సబితాడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, పీ సుదర్శన్‌డ్డి, ఎమ్మెల్యేలు కవిత, టీ రాజయ్య, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ తదితరులు ఉన్నారు. కాగా మిగిలిన నాయకులంతా బయటకు వెళ్లిపోయినా సబితాడ్డి, పొన్నాల, సుదర్శన్‌డ్డి, డీకే అరుణ మాత్రం సీఎంతో మరింత సమయం చర్చలు జరపడం గమనార్హం.

No comments:
Post a Comment