Pages

Wednesday, September 21, 2011

తీవ్ర రూపం దాల్చిన సకలజనుల సమ్మె

Photo

    సకలజనుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులందరూ విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. నేటినుంచి విద్యుత్ ఉద్యోగులు సకలజనుల సమ్మెకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం  ఏర్పాటయ్యేదాక ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగులు చెప్పారు.  
    కరీంనగర్ జిల్లాలో సకలజనుల సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి లేదంటూ సిపిఐ ఆధ్వర్యంలో హిజ్రాలకు కాంగ్రెస్ నేతల ఫ్లెక్లీలు తగిలించి భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద సర్కారు వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులు కళాకారులు రోడ్డుపై బైఠాయించి తెలంగాణ నినాదాల చేస్తూ నిరసన తెలిపారు. 
 
   సకలజనుల సమ్మెకు మద్దతుగా వరంగల్ జిల్లాలోని దేవాలయాల్లో అర్చకులు ఆర్జిత సేవలు నిలిపివేశారు. దీంతో జిల్లాలోని సుమారు 795 దేవాలయాలు తాళాలతో దర్శనమిచ్చాయి. జిల్లా కేంద్రంలో ఎండోమెంట్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళోజీ విగ్రహం వద్ద...తెలంగాణ రాష్ట్రం కోరుతూ వేదఘోష నిర్వహించారు. మరోవైపు నేషనల్ మజ్దూర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
   సింగరేణి కార్మికులు చేస్తోన్న సమ్మెకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో అఖిల పక్షం నేతలు ఆదిలాబాద్ జిల్లాలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. మందమర్రి మండలం రామకృష్ణాపురంలో సింగరేణి కార్మికులకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటం ఆపరాదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్దర్  ఆటపాటలతో అలరించారు.  అంతకముందు కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వస్తోన్న ఎంపి వివేక్ కాన్వాయ్ ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. 
 
   ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండోరోజు ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ టిఎఫ్ నాయకులు బస్సులు నడిపేందుకు యత్నించడంతో...తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహులు బయటకు రావాలంటూ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో టూటౌన్ సిపి తలకు దెబ్బతగలడంతో....పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోవైపు కొత్తగూడెం సింగరేణి ఒపెన్ కాస్ట్ గనిలో...ఎమ్మెల్సీ చుక్కారామయ్య పర్యటించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. సమ్మెకు సహకరించాలని జికెఓసి మేనేజర్ ను కోరారు. అటు రేణుకా చౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉద్యోగుల ఆధ్వర్యంలో రేణుకా చౌదరి వేషధారణలో ఉన్న వ్యక్తికి  ఉరితాడు బిగించి ఊరేగించారు. 
 మెదక్ జిల్లాలో ఎనిమిదోరోజూ సకలజనుల సమ్మె విజయవంతంగా కొనసాగింది. సమ్మెపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టి ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. రోడ్లపై బైఠాయించారు. లాయర్లు చెవిలో పూలు పెట్టుకుని తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జుహీరాబాద్ లో 6వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తోన్న వాహనాల అద్దాలను తెలంగాణవాదులు ధ్వంసం చేశారు. ఈ నెల చివరి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంపి వివేక్ డిమాండ్ చేశారు. 
 
   నిజాంకాలేజీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ..నల్లగొండ జిల్లాలో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. నోటికి నల్లవస్త్రాలు ధరించి....ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నినాదాలు చేస్తూ లోపలికివెళ్లేందుకు యత్నించడంతో..పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు. మరోవైపు క్లాక్ టవర్ సెంటర్్లో అంగన్ వాడి కార్యకర్తలు గర్జన నిర్వహించారు. సమ్మెపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ...టీఆర్ ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేణుకా చౌదరిదిష్టిబొమ్మను దహనం చేశారు. అటు న్యాయవాదులు...ఉద్యోగులు నార్కట్ పల్లి -అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

No comments:

Post a Comment