- వీరు చెప్పారు..వారు విన్నారు
- ఆజాద్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ
- మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చ
- త్వరలో నివేదిక అనే మాట తప్ప
- తెలంగాణపై స్పష్టమైన భరోసా ఏదీ లేదు
- రెండు రోజుల్లో సోనియా, ప్రధానిలకు నివేదిక
- నాన్చితే నామరూపాల్లేకుండా పోతామన్న టీ నేతలు
- ఆజాద్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ
- మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చ
- త్వరలో నివేదిక అనే మాట తప్ప
- తెలంగాణపై స్పష్టమైన భరోసా ఏదీ లేదు
- రెండు రోజుల్లో సోనియా, ప్రధానిలకు నివేదిక
- నాన్చితే నామరూపాల్లేకుండా పోతామన్న టీ నేతలు

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న సకలజనుల సమ్మె, ఆందోళనలు, బంద్‌లు, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను ఆయనకు విన్నవించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, మీడియా క్లిప్పింగ్‌లను అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇంకా ఆలస్యం చేయొద్దని, ఇదే తీరు కొనసాగిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకు పోతుందని కొందరు నేతలు ఆజాద్‌కు విన్నవించారు. ‘ఇప్పటికే తెలంగాణ విషయంలో ఏదో సాకులు చెబుతూ దాటవేత ధోరణి అవలంభించారు. ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. గత రెండు నెలలుగా తాము కూడా పార్టీ అధినేత్రి సోనియా ఆరోగ్య పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ తమ పై ఒత్తిడి పెరుగుతున్నా భరిస్తూ వచ్చాం. ప్రస్తుతం తెలంగాణలో మేం తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. జనం అధికార పార్టీ నేతలనే అడ్డుకుంటున్నారు. ఘెరావ్‌లు, దాడులకు పాల్పడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉద్యమం మహోధృతంగా మారింది.
మా పరిస్థితులను అర్ధం చేసుకుని త్వరగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలి’ అని మరి కొందరు నేతలు ఈ సమావేశంలో ఆజాద్‌ను కోరారు. ఉద్యమం వత్తిళ్లకు తట్టుకోలేక పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వారు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై ఉద్యమకారులు భౌతిక దాడులకు కూడా వెనుకాడటం లేదని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్‌పై పోలీసులు పాశవికంగా దాడిచేసిన విషయాన్ని ప్రస్తావించి, ముఖ్యమంవూతిపై తీవ్ర విమర్శలు చేశారు. నాయకులు చెప్పినదంతా ఆజాద్ సావధానంగా, సానుకూలంగా విన్నారు, రాసుకున్నారు. తెలంగాణలోని పరిస్థితులను తాను అర్ధం చేసుకున్నానని ఆయన అన్నారు. రెండు రోజుల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధినేత్రి సోనియాకు ఒక నివేదిక సమర్పిస్తాను. సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై ఒక నిర్ణయం ఉంటుంది అని ఆజాద్ నేతలకు భరోసా ఇచ్చారు. ఈ నిర్ణయం అనేది తెలంగాణకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదని ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఒకరు చెప్పారు.
ఆజాద్‌తో చర్చలు పూర్తయినప్పటికీ తెలంగాణపై ప్రకటన వచ్చే వరకు తాము ఢిల్లీ వదిలి వెళ్ళేది లేదని కాంగ్రెస్ నేతలు ఈ భేటి అనంతరం స్పష్టం చేశారు. ఆజాద్ రెండు రోజుల్లో ప్రధాని, సోనియాలకు నివేదిక సమర్పిస్తానని ప్రకటించడంతో ఈ లోగా హైకమాండ్‌లోని మిగతా కీలక నేతలను కలిసి తెలంగాణపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు.
నిర్ణయాలకు కట్టుబడతా: జైపాల్
బుధవారం మధ్యాహ్నం ఎంపీ వీహెచ్ ఇంట్లో సమావే మైన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ భేటీకి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆజాద్‌తో చర్చించాల్సిన అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. అధిష్ఠానం అనుకున్న గడువులోపు తెలంగాణపై సానుకూల ప్రకటన చేయని పక్షంలో ఏం చేద్దామన్న దానిపై తర్జనభర్జనలు జరిగినా ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలన్న ప్రతిపాదన వచ్చినా మంత్రులు వ్యతిరేకించడంతో, ఆజాద్ సమావేశం తర్వాత ఆయన స్పందనపై ఆధారపడి మరోసారి చర్చిద్దామని తీర్మానించారు. అయితే జైపాల్ రెడ్డి మాత్రం తెలంగాణకు సానుకూల ప్రకటన రాని పక్షంలో స్టీరింగ్ కమిటీ నిర్ణయించే భవిష్యత్తు కార్యచరణకు కట్టుబడి ఉంటానని హమీ ఇచ్చినట్లు తెలిసింది.
జాతీయ మానవ హక్కుల కమిషనుకు ఫిర్యాదు
ఉద్యోగ సంఘ నాయకుడు స్వామిగౌడ్‌పై పోలీసులు జరిపిన పాశవిక దాడిపై జాతీయ మానవ హక్కుల కమీషనుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఆ మేరకు ఇప్పటికే ఎంపీ కేకే సిద్ధం చేసిన లేఖను గురువారం హక్కుల కమీషన్ చైర్మన్‌కు అందజేయనున్నారు. ఈ దా పై సత్వరమే విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. అంతకు ముందు ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్వామి గౌడ్‌పై జరిగిన దాడిని ఎంపీలంగా ముక్త కంఠంతో ఖండించారు. ఉద్యమ నేతపై ప్రభుత్వ మద్దతుతో పోలీసులు దాడి చేయడం సిగ్గు చేటని పోన్నం మండిపడ్డారు.
ప్రభుత్వం ఆదేశించినంత మాత్రాన పోలీసులు విచక్షణ కోల్పోవద్దని హితవు పలికారు. తెలంగాణలోని ఉద్యమ పరిస్థితిని పట్టించుకోకుండా సమ్మెను అణచివేయాలని అధికారంలో ఉన్న వారు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు క్రాప్ హలీడే అని తప్పించుకుని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు తెలంగాణను అడ్డుకోవడానికి కలిసికట్టుగా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు సీమాంధ్ర పార్టీలే కనుక తెలంగాణ ప్రజలను రెండో శ్రేణిగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment