- ఎవరికి వారే.. యమునాతీరే..
- నాడు ఒత్తిడి గ్రూపు... నేడు ఉత్తుత్తి గ్రూపు
- ఆజాద్ నివేదికపైనే ఆశ.. అందుకే నెలాఖరు డెడ్‌లైన్‌లు!
- టీ కాంగ్రెస్ పరిస్థితేంటి?... శ్రేణుల్లో చర్చ
(టీ న్యూస్, హైదరాబాద్)
ఓ వైపు సకల జనుల సమ్మె మహోధృతంగా సాగుతున్న తరుణంలో టీ కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో కనిపిస్తున్నది. స్టీరింగ్ కమిటీ పేర ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతున్నప్పటికీ.. దాని నిర్ణయాలే అమలుకాని దుస్థితిని ఎదుర్కొంటున్నది. ఇప్పుడు సకల జనుల సమ్మెలో అనూహ్య స్థాయిలో సబ్బండ వర్ణాలూ పాల్గొంటుండటంతో ప్రత్యక్ష కార్యాచరణ కొరవడి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగానే అక్కడక్కడ కొందరు టీ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణపై ప్రకటన చేయాలంటూ డెడ్‌లైన్‌లు విధిస్తున్నారు. మంత్రి పదవికి దూరంగా ఉండాలన్న నిర్ణయంలో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్న కోమటిడ్డి వెంకట్‌డ్డి మొదలు.. స్టీరింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉంటూ దాని నిర్ణయాన్నే ఉల్లంఘించి కేబినెట్ సమావేశానికి హాజరైన జానాడ్డి దాకా... రాజీనామా విషయంలో గట్టిగా నిలబడిన ఎంపీ పొన్నం ప్రభాకర్ మొదలు.. రేణుక చౌదరి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎంపీ వివేక్ దాకా అందరూ ఎవరికి వారు తెలంగాణపై గట్టిగానే మాట్లాడుతున్నారు. కోమటిడ్డి వెంకట్ రెడ్డి అయితే నెలాఖరులోపు కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే 30న మంత్రిపదవికి, అక్టోబర్ 1న శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, మరుసటి రోజు నుంచి దీక్షకు దిగుతానని హెచ్చరిస్తున్నారు. నేరుగా సీఎంకే బహిరంగ లేఖ రాసి, ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా నిరసించారు. నెలాఖరులోగా మరోసారి ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తామని జానాడ్డి చెబుతున్నారు.
ఓ అడుగు ముందుకేసిన పొన్నం ప్రభాకర్... సకల జనుల సమ్మె నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగానే మండిపడ్డారు. కిరణ్ కుమార్‌డ్డి ఎలా మానిప్యులేట్ చేసి సీఎం పదవి దక్కించుకున్నారో కాస్త మాకూ చెబితే మేం కూడా మానిప్యులేట్ చేసి తెలంగాణ తెచ్చుకుంటాం.. అంటూ చురక వేశారు. సమ్మె విఫలమైందన్న రేణుక వ్యాఖ్యలపైనా తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. మొత్తానికి నేతలు పరుష పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. ఇవి కేవలం జనం దృష్టిలో టీ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారన్న అభివూపాయం కల్గించేవే తప్పించి.. కార్యాచరణ మాత్రం కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. డెడ్‌లైన్‌లు విధిస్తున్నప్పటికీ.. తదుపరి వారి కార్యాచరణ ఎలా ఉండబోతున్నదన్న అంశంపై టీ కాంగ్రెస్ నేతల్లో స్పష్టత కనిపించడం లేదు. ఒకప్పుడు ప్రెజర్‌క్షిగూప్‌గా కీలకంగా పని చేసిన టీ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమం విషయంలో డోలాయమాన పరిస్థితిలో, అధిష్ఠానాన్ని ఎదిరించలేని నిస్సహాయస్థితిలోనే ఉన్నారు.
గతంలో అధిష్ఠానంపై యుద్ధం చేస్తామంటూ ప్రకటనలు గుప్పించిన నేతలు.. ఇప్పుడు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా.. మాటల పటాటోపం తప్పించి టీ కాంగ్రెస్ నేతల నుంచి నిర్దిష్ట కార్యాచరణ కనిపించడం లేదు. మొన్న రాజీనామాలు చేసే సమయంలో విశేష ఐక్యత ప్రదర్శించిన టీ కాంగ్రెస్ నాయకులు.. మరోసారి రాజీనామాలు చేసే విషయంలో మాత్రం వెనుకంజ వేశారు. అదే సమయంలో సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కారు పన్నుతున్న కుయుక్తులను తీవ్రంగా ఖండించలేని స్థితిలో ఉన్నారు. సమ్మె ఉధృతంగా సాగుతున్నా దాని విషయంలో కిరణ్ సర్కారు ఉలుకూపలుకూ లేనట్లు వ్యవహరించడం, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు పంపుతుండటం, సమ్మె విఫలమైందంటూ తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకొనే రేణుకాచౌదరి, కాస్త అటూఇటూగా అవే వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి వ్యాఖ్యల విషయంలో ఉదాసీనంగా ఉన్నారు.
ఓ ఈ నెలాఖరులోగా పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీఆజాద్ ఒక నివేదికను సమర్పించనున్నారు. దాని ఆధారంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో ఒక ప్రకటన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దానిపైనే టీ కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఆ దిశగానే సీనియర్ నేత కే కేశవరావు, మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి తదితరులు విధిస్తున్న డెడ్‌లైన్‌లు, ఢిల్లీకి వెళ్తామంటున్న జానాడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు పరిశీలకులు అంటున్నారు. డెడ్‌లైన్‌లు విధిస్తున్నా.. నెలాఖరుకు ఆజాద్ సమర్పించే నివేదిక అనంతరం కేంద్రం చేయబోయే ప్రకటనను తెలంగాణకు సానుకూలంగా తెప్పించే దిశగా టీ కాంగ్రెస్ నేతల కార్యాచరణ ఉండటం లేదన్న అభివూపాయం వినిపిస్తున్నది. ఇప్పటికే ఊళ్లలో తిరగలేని పరిస్థితిని టీ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ డెడ్‌లైన్‌ల అనంతరం తెలంగాణకు సానుకూల వాతావరణం లేకపోతే పరిస్థితి ఏమిటన్నది టీ కాంగ్రెస్ నేతల్లో, పార్టీ శ్రేణుల్లో తలెత్తుతున్న కోటి రూకల ప్రశ్న!

No comments:
Post a Comment