Pages

Monday, September 26, 2011

రణరంటమైన జనగామ - పోలీసుల అత్యుత్సాహం.. లాఠీచార్జీ


- ఏడుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం..
- ఒకరి ఆత్మహత్యాయత్నం..సీఐని సస్పెండ్ చేయాలని ధర్నా
- నేడు జనగామ బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ

Police-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaజనగామ, సెప్టెంబర్ 25: వరంగల్ జిల్లా జనగామలో రైల్‌రోకో ‘రణ’రంగమైంది. తెలంగాణవాదులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలను ఝళిపించారు. పోలీసుల అత్యుత్సాహానికి ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఓ తెలంగాణవాది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. జనగామలో చేపట్టిన రైల్‌రోకో కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తిడ్డి యాదగిరిడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మొగుళ్ల రాజిడ్డి, ఆరుట్ల దశమంతడ్డిల నేతృత్వంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో స్టేషన్ చేరుకుని రైల్‌రోకో చేస్తున్న తెలంగాణవాదులకు మద్దతు తెలిపారు.

అనంతరం సమైక్యవాదులకు తొత్తులుగా మారిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావుల దిష్టిబొమ్మలను దహనం చేసే క్రమంలో స్థానిక సీఐ జితేందర్ అక్కడ చేరిన వారిపై లాఠీ ఝులిపించారు. ఈ ఘటనలో టీఆర్‌ఎస్ నాయకులు బక్క నాగరాజు, గద్దల నర్సింగరావు, మేకల కళింగరాజు, మేకపోతుల ఆంజనేయులు, గుజ్జక రాజు, ఈర్ల దానయ్యతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వీరిలో గుజ్జుక రాజు, ఈర్ల దానయ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటనతో ఆగ్రహించిన తెలంగాణ వాదులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. తెలంగాణవాదులపై దాడికి పాల్పడిన సీఐ జితేందర్‌తో పాటు పోలీసులను సస్పెండ్ చేయాలని కోరుతూ సుమారు రెండు గంటలకుపైగా ధర్నా నిర్వహించారు. బీజేపీ, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నాయకులు రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సీఐ జితేందర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ రైల్వేస్టేషన్ వెనుక రోడ్డుపై టీఆర్‌ఎస్ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో జనగామ పోలీస్ స్టేషన్, రైల్వేస్టేషన్‌ల సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని కాంగ్రెస్, టీడీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు ఖండించారు.

తెలంగాణవాది ఆత్మహత్యాయత్నం

పోలీసుల వైఖరికి నిరసనగా వెంకిర్యాలకు చెందిన బోయినిపల్లి సిద్దాడ్డి రైల్వేస్టేషన్‌లోనే పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకొని దవాఖానాకు తరలించారు. అదే క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న తెలంగాణ వాదులపై తిరిగి రెండోసారి పోలీసులు లాఠీచార్జీ చేశారు. పరిగెడుతున్నా వెంటపడుతూ మరీ దొరికినవారిని దొరికినట్లు బాదుతుండడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కనికరం లేకుండా చిన్నారులపై సైతం తమ కర్కషత్వాన్ని ప్రదర్శించారు.

నేడు జనగామ బంద్
1410-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema

No comments:

Post a Comment