సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి
- టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం
- సింగరేణి కార్మికులకు మద్దతుగా రేపు యాత్ర
హైదరాబాద్,
సెప్టెంబర్ 18 (టీ న్యూస్): శాంతియుతంగా జరుగుతున్న సింగరేణి కార్మికుల
సమ్మెను అప్రజాస్వామికంగా అణచివేయజూస్తున్నారని, సింగరేణి నుంచి తక్షణమే
పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెలంగా ణ జర్నలిస్టుల ఫో రం ఆధ్వర్యంలో
ఆదివారం సీఎం కిరణ్‌ను కలిసిన తెలంగాణ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధి
బృందం కోరింది. ప్రభుత్వ వైఖరి సరికాదని స్పష్టం చేసింది. అందుకు సీఎం
ప్రతిస్పందిస్తూ.. ప్రజలకు నష్టం కలిగించే విధంగా సమ్మె ఉన్నప్పుడు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతినిధి బృందంతో అన్నారు. సత్వరమే
తెలంగాణకు పరిష్కారం చూపాలని, ఈ సమస్యను సాగదీయకుండా పరిష్కరించేందుకు సీఎం
ప్రయత్నించాలని ప్రతినిధి బృందం కోరింది.
ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో టీజేఎఫ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహాడ్డి, ప్రజావూఫంట్ చైర్మన్ గద్దర్, ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీడీపీ టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ నగారా సమితి నేతలు నాగం జనార్దన్‌డ్డి, వేణుగోపాలాచారి, కాంగ్రెస్ ఎంపీ వివేక్, బీజేపీ నేత బద్దం బాల్‌డ్డి, టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, నాయకులు పల్లె రవికుమార్, క్రాంతి, రమేష్ హజారే, లాయర్స్ జేఏసీ నేత రాజేందర్‌డ్డి, ఆర్టీసీ జేఏసీ నేత రాజిడ్డి, డాట్స్ కన్వీనర్ నర్సయ్య తదితరులు సీఎంను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం అల్లం నారాయణ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికులకు మద్దతుగా మంగళవారం అన్ని పార్టీల నాయకులు యాత్రగా బయలుదేరుతున్నారని తెలిపారు. బొగ్గు బావులు, ఓపెన్‌కాస్టులు ఒక్కటి కూడా నడవడం లేదని పోలీసులు బలవంతంగా కార్మికులను బావుల్లోకి దించుతున్నారని, కరపవూతాలు పంచిపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
సింగరేణి కార్మికులకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం త్వరలో యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. సీఎం చెబుతున్నట్లుగా సమ్మెతో ప్రజలు బాధపడటం లేదని, అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె ఆరోరోజుకు చేరిందని, వారిపై పోలీసులు దాడులుచేయడం సరికాదని ఎంపీ వివేక్ అన్నారు. పోలీసులు బలవంతంగా బొగ్గు బావుల్లోకి కార్మికులను దింపుతున్నారని నాగం విమర్శించారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సంయమనం పాటించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. హైదరాబాద్ నగరంలో వి ద్యుత్ సరఫరా నిలిపివేసైనా రైతులకు కరెంటు ఇవ్వాలని నాయిని నర్సింహాడ్డి కోరారు. సిం గరేణి ఎం.డి. తె లంగాణ వ్యక్తేనని, కార్మికులకు సహకరిస్తారని సీఎం చెప్పినట్లు వేదకుమార్ తెలిపారు.
కార్మికులకు అండగా నిలుస్తాం
సింగరేణి
కార్మికులను భయవూభాంతులకు గురి చేయడం అనాగరికమని తెలంగాణ పార్టీల, ప్రజా
సంఘాల నేతలు తప్పుబట్టారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ
జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు పోలీస్ చర్యలను
తీవ్రంగా ఖండించారు. సింగరేణి కార్మికుల సమ్మె ప్రభుత్వానికి చెమలు
పట్టిస్తోందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి అన్నారు.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ వివేక్
అన్నారు. ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని
టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి
కార్మికుల సహాయనిరాకరణతో ప్రభుత్వానికి వణుకు పుడుతోందని తెలంగాణ
జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు.
సింగరేణి కార్మికుల స్ఫూర్తితో వారి సోదరులుగా సమ్మె సైరన్ మోగిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రాజిడ్డి వెల్లడించారు. రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం కాదని, సకల జనుల సమ్మెలో పాల్గొనాలని, అప్పుడే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారని డాక్టర్ నర్సయ్య అన్నారు. పోలీసులు బలవంతంగా పనిచేయించడం చట్ట విరుద్ధమని న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్‌డ్డి పేర్కొన్నారు. కార్యక్షికమంలో ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, బీజేపీ నేత కె.లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, సామాజిక జై ఆంధ్ర ప్రతినిధి సాంబశివరావు, బోడ జనార్దన్ పాల్గొన్నారు.
అరెస్టులకు నిరసనగా అధ్యాపకుల ఆందోళన
నాంపల్లి: సింగరేణి కార్మికులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ అధ్యాపకుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం సభ్యులు ఆదివారం అమరవీరుల స్థూపం వద్ద తలకు నల్ల రిబ్బన్లు కట్టుకొని బైఠాయించి నిరసన తెలిపారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కార్యక్షికమంలో నాయకులు మల్‌హర్‌రావు, రాజమహేంవూదడ్డి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
- సింగరేణి కార్మికులకు మద్దతుగా రేపు యాత్ర

ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో టీజేఎఫ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహాడ్డి, ప్రజావూఫంట్ చైర్మన్ గద్దర్, ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీడీపీ టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ నగారా సమితి నేతలు నాగం జనార్దన్‌డ్డి, వేణుగోపాలాచారి, కాంగ్రెస్ ఎంపీ వివేక్, బీజేపీ నేత బద్దం బాల్‌డ్డి, టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, నాయకులు పల్లె రవికుమార్, క్రాంతి, రమేష్ హజారే, లాయర్స్ జేఏసీ నేత రాజేందర్‌డ్డి, ఆర్టీసీ జేఏసీ నేత రాజిడ్డి, డాట్స్ కన్వీనర్ నర్సయ్య తదితరులు సీఎంను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం అల్లం నారాయణ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికులకు మద్దతుగా మంగళవారం అన్ని పార్టీల నాయకులు యాత్రగా బయలుదేరుతున్నారని తెలిపారు. బొగ్గు బావులు, ఓపెన్‌కాస్టులు ఒక్కటి కూడా నడవడం లేదని పోలీసులు బలవంతంగా కార్మికులను బావుల్లోకి దించుతున్నారని, కరపవూతాలు పంచిపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
సింగరేణి కార్మికులకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం త్వరలో యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. సీఎం చెబుతున్నట్లుగా సమ్మెతో ప్రజలు బాధపడటం లేదని, అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె ఆరోరోజుకు చేరిందని, వారిపై పోలీసులు దాడులుచేయడం సరికాదని ఎంపీ వివేక్ అన్నారు. పోలీసులు బలవంతంగా బొగ్గు బావుల్లోకి కార్మికులను దింపుతున్నారని నాగం విమర్శించారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సంయమనం పాటించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. హైదరాబాద్ నగరంలో వి ద్యుత్ సరఫరా నిలిపివేసైనా రైతులకు కరెంటు ఇవ్వాలని నాయిని నర్సింహాడ్డి కోరారు. సిం గరేణి ఎం.డి. తె లంగాణ వ్యక్తేనని, కార్మికులకు సహకరిస్తారని సీఎం చెప్పినట్లు వేదకుమార్ తెలిపారు.
కార్మికులకు అండగా నిలుస్తాం

సింగరేణి కార్మికుల స్ఫూర్తితో వారి సోదరులుగా సమ్మె సైరన్ మోగిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రాజిడ్డి వెల్లడించారు. రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం కాదని, సకల జనుల సమ్మెలో పాల్గొనాలని, అప్పుడే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారని డాక్టర్ నర్సయ్య అన్నారు. పోలీసులు బలవంతంగా పనిచేయించడం చట్ట విరుద్ధమని న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్‌డ్డి పేర్కొన్నారు. కార్యక్షికమంలో ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, బీజేపీ నేత కె.లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, సామాజిక జై ఆంధ్ర ప్రతినిధి సాంబశివరావు, బోడ జనార్దన్ పాల్గొన్నారు.
అరెస్టులకు నిరసనగా అధ్యాపకుల ఆందోళన
నాంపల్లి: సింగరేణి కార్మికులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ అధ్యాపకుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం సభ్యులు ఆదివారం అమరవీరుల స్థూపం వద్ద తలకు నల్ల రిబ్బన్లు కట్టుకొని బైఠాయించి నిరసన తెలిపారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కార్యక్షికమంలో నాయకులు మల్‌హర్‌రావు, రాజమహేంవూదడ్డి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
No comments:
Post a Comment