- జిల్లాల్లో నిలిచిన బిల్లుల వసూళ్లు
- సై అన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు
- సీమాంధ్ర చెత్త ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతిన
- అప్రతిహతంగా ఆర్టీసీ, సింగరేణి సమ్మెలు
- వీరోచితంగా సాగుతున్న ఉద్యోగులు
- ఉద్యమ బాటలో హోరెత్తుతున్న జిల్లాలు
సర్కారుకు షాక్ శంఖారావం పూరించిన కరెంటోళ్లు
ఎనిమిది
రోజులుగా అప్రతిహతంగా సాగుతున్న సకల జనుల సమ్మె.. మంగళవారం నాడు మరింత
ఉధృతమైంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ
కార్మికులు వీరోచితంగా సాగిస్తున్న సమ్మె సమరంలోకి మంగళవారం నాడు
కరెంటోళ్లు దూకారు. సర్కారు కుర్చీకి కరెంట్ వైర్లు తగిలించి.. శాంపిల్
షాక్ ఇచ్చారు. మున్ముందు ఓల్టేజ్ పెంచి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తామని
హెచ్చరిక చేశారు. తెలంగాణలో అత్యవసర సేవలు మినహా ఎలాంటి పనులు జరగబోవని
తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్లు
నిలిచిపోయాయి.
మరోవైపు హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు సైతం సై అన్నారు. తెలంగాణను శుభ్రం చేసుకోవడంతో పాటు.. సీమాంధ్ర చెత్తను ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతినబూనారు. అటు కార్యాలయాలు తెరుచుకోక.. బొగ్గు గనుల్లో ఉత్పత్తి లేక.. ఆర్టీసీ చక్రం తిరగక కల్లోలానికి గురవుతున్న సీమాంధ్ర సర్కారు... సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రల పావులు కదిపింది. సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 74 కంపెనీల పారామిలిటరీని మోహరించిన ప్రభుత్వం.. మరో 25 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రాన్ని కోరింది.
శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఖాకీలను ఉసిగొల్పుతున్నది. సర్కారు ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. సోమవారం ఉస్మానియా వర్సిటీలో, నిజాం కాలేజీలో తమ ప్రతాపాన్ని చూపారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి... సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణేనని తేల్చారు. తెలంగాణ విషయం తన చేతిలో ఏమీ లేదని, ప్రజలంతా సహకరించాలని విన్నవించారు. సీఎం వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ‘‘నీ చేతిలో చేయడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఉన్నది ఎందుకు? గాడిద పండ్లు తోమడానికా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
- సై అన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు
- సీమాంధ్ర చెత్త ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతిన
- అప్రతిహతంగా ఆర్టీసీ, సింగరేణి సమ్మెలు
- వీరోచితంగా సాగుతున్న ఉద్యోగులు
- ఉద్యమ బాటలో హోరెత్తుతున్న జిల్లాలు
సర్కారుకు షాక్ శంఖారావం పూరించిన కరెంటోళ్లు

మరోవైపు హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు సైతం సై అన్నారు. తెలంగాణను శుభ్రం చేసుకోవడంతో పాటు.. సీమాంధ్ర చెత్తను ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతినబూనారు. అటు కార్యాలయాలు తెరుచుకోక.. బొగ్గు గనుల్లో ఉత్పత్తి లేక.. ఆర్టీసీ చక్రం తిరగక కల్లోలానికి గురవుతున్న సీమాంధ్ర సర్కారు... సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రల పావులు కదిపింది. సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 74 కంపెనీల పారామిలిటరీని మోహరించిన ప్రభుత్వం.. మరో 25 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రాన్ని కోరింది.
శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఖాకీలను ఉసిగొల్పుతున్నది. సర్కారు ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. సోమవారం ఉస్మానియా వర్సిటీలో, నిజాం కాలేజీలో తమ ప్రతాపాన్ని చూపారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి... సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణేనని తేల్చారు. తెలంగాణ విషయం తన చేతిలో ఏమీ లేదని, ప్రజలంతా సహకరించాలని విన్నవించారు. సీఎం వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ‘‘నీ చేతిలో చేయడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఉన్నది ఎందుకు? గాడిద పండ్లు తోమడానికా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
No comments:
Post a Comment