Pages

Wednesday, September 28, 2011

స్వామిగౌడ్‌పై హత్యాయత్నం?

 - ఛాతీ, కడుపు, మర్మావయవాలపై దెబ్బలు
- అపస్మారకంలోకి స్వామిగౌడ్
- బంజారాహిల్స్ కేర్‌కు తరలింపు
- చికిత్సతో కోలుకుంటున్న నేత
- పరామర్శించిన కేసీఆర్
- స్వామిగౌడ్ హత్యకు కుట్రచేశారు
- పోలీసులపై మండిపడిన టీఆర్‌ఎస్ అధినేత
- నేడు రాస్తారోకోలు, ధర్నాలకు పిలుపు
- స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్‌కు డిమాండ్

Kcrr-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 27 (టీ న్యూస్) :ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్‌పై మఫ్టీలో ఉన్న పోలీసులు మంగళవారం నాడు పాశవికంగా దాడి చేశారు. ఆర్టీఏ కమిషనరేట్‌లోకి వచ్చిన లగడపాటిని నిలదీసేందుకు వెళ్లిన సందర్భంగా పోలీసులు ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. అరెస్టు చేసే పేరుతో స్వామిగౌడ్ తదితరులపై ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు కురిపించారు. మర్మాయవాలతో పాటు పొట్టమీద, ఛాతీపై కొట్టారు. తీవ్ర గాయాలైన స్వామిగౌడ్‌ను చికిత్స నిమిత్తం కేర్ ఆస్పవూతికి తరలించారు. ఆస్పవూతిలో స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తదితరులు పరామర్శించారు. స్వామిగౌడ్‌పై ఖాకీల దాడికి నిరసనగా బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

రవాణా ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులను ఉద్యోగులు, తమ నేతలు, రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో సోమవారం రద్దు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కమిషనరేట్‌లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ ఏదో జరిగిపోయిందన్నట్లు విజయవాడ ఎంపీ, కరడుగట్టిన సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ పొద్దున్నే ఆర్టీఏ కార్యాలయం వద్ద వాలిపోయారు. దీనికి నిరసనగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు రఘునందన్ర్రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డి, బీజేపీ నేత విద్యాసాగర్‌రావు, ఉద్యోగసంఘాల నాయకులు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దేవీవూపసాద్‌రావు, భారీ సంఖ్యలో ఉద్యోగులు రవాణా కమిషనరేట్‌కు చేరుకున్నారు. లగడపాటిని ఆర్టీఏ కార్యాలయం లోపలికి అనుమతించిన పోలీసులు వీరిని మాత్రం అడ్డుకున్నారు. పోలీసులను నెట్టుకుని నాయకులు కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లి బైఠాయించారు.

ఈ విషయం తెలుసుకున్న పశ్చిమ మండలం డీసీపీ స్టీఫెన్ రవీంద్ర పెద్ద సంఖ్యలో పోలీసులను, మఫ్టీ పోలీసులను వెంటబెట్టుకుని కమిషనరేట్‌కు వచ్చారు. కమిషనర్ గది నుంచి నేతలు బయటికి వస్తున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, వారిని బలవంతంగా అరెస్టు చేయడానికి పూనుకున్నారు. దీంతో రవీంవూదను ఉద్దేశించి ‘‘నీ పద్ధతి మార్చుకోవాలి. తెలంగాణవాదులపై ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?’’ అని స్వామిగౌడ్ నిలదీశారు. అప్పటికే గుంపులోకి చొరబడిన మఫ్టీ పోలీసులు కాసేపటికే స్వామిగౌడ్‌ను చుట్టుముట్టారు. రవీంద్ర కను సైగలతో ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. పక్కటెముకల మీద తన్నారు. ఛాతీపైనా, పొట్టపైన పిడికిళ్లతో గుద్ది, మర్మావయవాలపైనా కిరాతకంగా, విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆయన అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో కిందపడిపోయారు. ఓ విధంగా ఆయనపై హత్యాయత్నానికి పోలీసులు ప్రయత్నించినట్లు కనిపించింది.

ఈ పరిస్థితిలో ఉద్యోగ సంఘాల నేతలు వీ శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, విఠల్, కత్తి వెంకటస్వామి, సలీమొద్దీన్, రంజన తదితరులు స్వామిగౌడ్‌ను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పవూతికి తరలించారు. గంట సేపు చికిత్స చేసిన తర్వాత ఆయన కొద్దిగా కోలుకున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆయనను పరీక్షించిన వైద్యులు చెప్పారు. స్వామిగౌడ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే కేర్ ఆస్పవూతికి వచ్చి ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా స్వామిగౌడ్‌ను పరామర్శించారు. పోలీసుల పాశవిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల నాయకుడిగా స్వామిగౌడ్ నాలుగున్నర కోట్ల ప్రజలకు సంబంధించినవాడని, ఆయనపై పాశవిక దాడి జరిగిన దాడికి నిరసనగా బుధవారం తెలంగాణ అంతటా రాస్తారోకోలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరోచితంగా అగ్రభాగంలో ఉన్న నాయకులను మట్టుపె రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ కుట్రలో భాగంగానే స్వామిగౌడ్‌ను హతమార్చేందుకు ప్రయత్నించారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. స్వామిగౌడ్‌ను పరామర్శిస్తున్న సమయంలో తన దుఃఖాన్ని కేసీఆర్ ఆపుకోలేకపోయారు. తెలంగాణ ప్రజల ఆకలి దప్పుల మంటలతో సీమాంధ్ర పెత్తందార్లు చెలగాటమాడుతున్నారని, ఇంతకింత అనుభవించతప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచిన నాయకులను హింసించి, దౌర్జన్యం చేసి లక్ష్యం నుండి వేరు చేయాలని కుటిల యత్నాలను చేస్తున్నారని మండిపడ్డారు. స్టీఫెన్ రవీంవూదను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఉద్యోగసంఘాల నాయకుడు స్వామిగౌడ్ వాగ్మూలాన్ని హక్కుల కమిషన్ న్యాయమూర్తులు తీసుకున్నారని కేసీఆర్ వివరించారు.

ఇది కచ్చితంగా హత్యా యత్నమేనని, కిరణ్‌సర్కార్ ఇందుకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ముందుగా సంబంధిత పోలీసు అధికారి స్టీఫెన్ రవీంవూదను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపైన కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌తో పాటు ఈటెల రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌డ్డి, శ్రావణ్ స్వామిగౌడ్‌ను పరామర్శించారు.

No comments:

Post a Comment