- తెలంగాణపై కచ్చితమైన పరిష్కారం!
- లేదా రెండు ప్రత్యామ్నాయ మార్గాలు!!
- నేడే కాంగ్రెస్ కోర్ కమిటీకి ఆజాద్ నివేదిక
- 15 పేజీలతో సరి... నేటి కోర్ కమిటీలో పూర్తి స్థాయి చర్చ
- అందుకే 2జీపై మంత్రుల అత్యవసర రాజీ
- ఢిల్లీలో జోరుగా మంతనాలు.. ప్రణబ్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ
- ద్వివేదీ, ఫెర్నాండెజ్‌తోనూ సమావేశం
- ఆజాద్‌ను కలిసిన బొత్స... నేడూ ఢిల్లీలోనే మకాం ...అమ్మ పలకాలి..!
రాష్ట్ర
విభజన విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్
ఇవ్వనున్న నివేదిక ఎలా ఉండబోతున్నది? మళ్లీ జాతీయ స్థాయి చర్చలనడం వెనుక
దాగున్న పరిణామాలేమిటి? ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి సమస్యను మరింత జటిలం
చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికకు భిన్నంగా ఒకటి లేదా రెండు ప్రత్యామ్నా
యాలతో రానున్నట్లు ప్రచారం జరుగుతున్న ఆజాద్ నివేదిక ‘జాదూ’ చేస్తుందా? లేక
మళ్లీ సమస్యను మొదటికి తెస్తుందా? ఆజా ద్ నివేదికపై చర్చించనున్న
కాంగ్రెస్ కోర్ కమిటీ ఏం తేల్చనుంది? పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ
చెబుతున్నట్లు నెలలోపే తెలంగాణ అంశంపై పరిష్కారం దొరుకుతుందా? ఇప్పుడు
రాష్ట్రం మొత్తం ఇదే ఆసక్తి!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (టీన్యూస్) : రెండు నెలల క్రితం కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో చేపట్టిన చర్చల ప్రక్రియను బుధవారం ముగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ శుక్రవారం నాడు తన నివేదికను పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సమర్పించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా నివేదిక 15 పేజీలకు మించకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. నెలలోపే తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలతో పాటు దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు దగ్గరగా పరిష్కారం ఉంటుంది’ అని బొత్స అన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ప్రధాని నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. ఆజాద్ తన నివేదికను కోర్‌కమిటీ సమావేశంలో పెద్దలకు అందించనున్నారు.
దానిపై కోర్ కమిటీ సభ్యులైన ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్మన్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ చర్చించనున్నారు. ప్రతి శుక్రవారం అత్యంత కీలక దేశీయ అంశాలపై చర్చ జరిపే కోర్ కమిటీ, ఈ వారం పూర్తిగా తెలంగాణ సమస్య పరిష్కారం పైనే దృష్టి సారించనుంది. అందుకు అనుగుణంగా కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం మధ్య రగులుతున్న 2జీ వివాదాన్ని అత్యవసరంగా గురువారమే ముగించింది. 2జీ వ్యవహారంలో చిదంబరం పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసిన ప్రణబ్‌తో అధినేత్రి సోనియాగాంధీ సమావేశమై వివాదానికి తెరదించాలని సూచించారు. ‘‘ఆంవూధవూపదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనలు తీవ్రమవుతున్నందున, దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కనుక 2జీ వ్యవహారానికి ముగింపు పలకాలి’’ అని సోనియా ప్రణబ్‌ను ఆదేశించారు.
దీనికి
అనుగుణంగా చిదంబరంతో కలిసి ప్రధానితో సమావేశమైన ప్రణబ్ అనంతరం విలేకరులతో
మాట్లాడుతూ తమ మధ్య నెలకొన్న వివాదాన్ని ముగిసిన అధ్యాయంగా అభివర్ణించారు.
ప్రణబ్ ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ చిదంబరం కూడా వివాదానికి
తాత్కాలికంగానైనా ముగింపు పలికారు. దీంతో తెలంగాణ సమస్య పరిష్కారానికి కోర్
కమిటీలో పూర్తి స్థాయి చర్చకు ఆస్కారం కల్పించినట్లయింది. అందుకే
శుక్రవారం నాడు జరగనున్న సమావేశంలో ఆజాద్ అందించే నివేదికపైనే సభ్యుల మధ్య
చర్చ జరగనుంది. తెలంగాణ విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ
నివేదిక నిర్దిష్ట సిఫారసు చేయకుండా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించడం వల్లే
సమస్య మరింత జటిలమైందన్న అసంతృప్తి చాలా వర్గాల్లో వ్యక్తమైంది. ఈసారి
ఆజాద్ తన నివేదికలో సమస్య పరిష్కారానికి కచ్చితమైన మార్గాన్ని
చూపించనున్నట్లు సమాచారం. అలా వీలుకానిపక్షంలో అన్ని ప్రాంతాల ప్రజలను
సంతృప్తిపరిచే విధంగా రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించే అవకాశం కూడా
ఉందని సమాచారం.
వీటిపై విస్తృతంగా చర్చించనున్న కోర్‌కమిటీ.. కచ్చితంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతుండటం, తెలంగాణపై రోడ్ మ్యాప్ ఖరారు కానంతవరకు ఢిల్లీలోనే ఉంటామని టీ కాంగ్రెస్ నేతలు ప్రకటించడం వారిపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ వైఖరిని బయటపెట్టక తప్పని స్థితిలో పడిపోయింది. ఒక్కసారి కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయిందంటే దానికి పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందే. పార్టీలో ట్రబుల్ షూటర్లుగా పేరున్న నలుగురు నాయకులు మంత్రివర్గంలోనూ కీలక పాత్ర పోషించనున్నందున కోర్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం ఎవరూ చేసే అవకాశం లేదు. కోర్ కమిటీలో నిర్ణయం జరగనందునే డిసెంబర్ 9 ప్రకటనను వ్యతిరేకించే సాహసాన్ని సీమాంధ్ర నాయకత్వం చేసిందన్న అభివూపాయంతో ఉన్న పార్టీ అధిష్ఠానం.. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల్లో ఒకరిద్దరు వివిధ కారణాల వల్ల వ్యతిరేకించినా మెజార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. మంత్రి వర్గంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్, దానికి విశ్వాస పాత్రమైన పార్టీల వారే ఉండటంతో తెలంగాణపై కోర్ కమిటీదే అంతిమ నిర్ణయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎవరైనా వ్యతిరేకించినా వారి వారి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వైదొలిగే సాహసం చేసే పరిస్థితి లేదు. ఇటు చర్చల ప్రక్రియను పూర్తి చేసిన ఆజాద్ కూడా గురువారం పీసీసీ అధ్యక్షుడితో సమావేశమై తన నిర్ణయాన్ని చూచాయగా తెలియజేసినట్లు సమాచారం.
విషయం బయటకు పొక్కితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనన్న భయంతో పార్టీ సీనియర్ నాయకులకు కూడా విషయం తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆ క్రమంలోనే బొత్స తన విలేకరుల సమావేశంలో ఆకుకు అందకుండా.. పోకకు పొందకుండా అన్నట్లు మాట్లాడారు. కోర్ కమిటీ చర్చించి చేసే నిర్ణయాన్ని రాష్ట్ర నేతలకు చేరవేయడానికి వీలుగా తనతో మరోసారి సమావేశం కావాలని బొత్సకు ఆజాద్ సూచించడంతోనే ఆయన తన ఢిల్లీ పర్యటనను మరో రోజు పొడిగించుకున్నారని సమాచారం. మొత్తంగా శుక్రవారం జరగనున్న కోర్ కమిటీ సమావేశం తెలంగాణ ఉద్యమ చరివూతలో అత్యంత కీలకం కానుంది.
తెలంగాణ భవిష్యత్తును తేల్చనున్న సమావేశం కావటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ కూడా తెలంగాణ అంశంపై రంగంలోకి దిగారు. సోనియా ఆదేశాల మేరకు ఆయన గురువారం రాత్రి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో సుదీర్ఘ సంప్రతింపులు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను నేతలు మరోసారి ప్రణబ్‌కు వివరించినట్లు సమాచారం.
ద్వివేదీతో సమావేశమైన టీ నేతలు
అంతకు ముందు పార్టీ అధినేత్రి సోనియాకు అత్యంత విశ్వాసపావూతుడైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీతో ీ కాంగ్రెస్‌నేతలు సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో దాదాపు ముప్పావు గంటకు పైగా సమావేశమైన నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా సమ్మె ప్రభావంతో పాటు తాము ఢిల్లీకే పరిమితమైన పరిస్థితిని వివరించి, తెలంగాణపై త్వరగా నిర్ణయం జరగాలని కోరారు. తెలంగాణను సత్వరమే ప్రకటించని పక్షంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని ఆయనకు చెప్పారు.
ఆజాద్ తన నివేదికను శుక్రవారం సమర్పించనున్నందున తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా మీ వంతు పాత్ర పోషించాలని ఆయ కు విజ్ఞప్తి చేశారు. ఇవే విషయాలను కాంగ్రెస్ కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్ దృష్టికి కూడా టీ నేతలు తీసుకొచ్చారు.
ద్వివేదీతో జరిగిన సమావేశంలో మంత్రులు సారయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీతా లక్ష్మాడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రులు సారయ్య, సునీత తదితరులు తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ద్వివేదీతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణను ఇస్తుందన్న నమ్మకం తమకు కలిగినట్లు తెలిపారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ఖరారు అయ్యేంత వరకు ఢిల్లీలోనే ఉండి ఇతర పెద్దలను కలుస్తామని అన్నారు.
- లేదా రెండు ప్రత్యామ్నాయ మార్గాలు!!
- నేడే కాంగ్రెస్ కోర్ కమిటీకి ఆజాద్ నివేదిక
- 15 పేజీలతో సరి... నేటి కోర్ కమిటీలో పూర్తి స్థాయి చర్చ
- అందుకే 2జీపై మంత్రుల అత్యవసర రాజీ
- ఢిల్లీలో జోరుగా మంతనాలు.. ప్రణబ్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ
- ద్వివేదీ, ఫెర్నాండెజ్‌తోనూ సమావేశం
- ఆజాద్‌ను కలిసిన బొత్స... నేడూ ఢిల్లీలోనే మకాం ...అమ్మ పలకాలి..!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (టీన్యూస్) : రెండు నెలల క్రితం కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో చేపట్టిన చర్చల ప్రక్రియను బుధవారం ముగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ శుక్రవారం నాడు తన నివేదికను పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సమర్పించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా నివేదిక 15 పేజీలకు మించకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. నెలలోపే తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలతో పాటు దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు దగ్గరగా పరిష్కారం ఉంటుంది’ అని బొత్స అన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ప్రధాని నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. ఆజాద్ తన నివేదికను కోర్‌కమిటీ సమావేశంలో పెద్దలకు అందించనున్నారు.
దానిపై కోర్ కమిటీ సభ్యులైన ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్మన్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ చర్చించనున్నారు. ప్రతి శుక్రవారం అత్యంత కీలక దేశీయ అంశాలపై చర్చ జరిపే కోర్ కమిటీ, ఈ వారం పూర్తిగా తెలంగాణ సమస్య పరిష్కారం పైనే దృష్టి సారించనుంది. అందుకు అనుగుణంగా కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం మధ్య రగులుతున్న 2జీ వివాదాన్ని అత్యవసరంగా గురువారమే ముగించింది. 2జీ వ్యవహారంలో చిదంబరం పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసిన ప్రణబ్‌తో అధినేత్రి సోనియాగాంధీ సమావేశమై వివాదానికి తెరదించాలని సూచించారు. ‘‘ఆంవూధవూపదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనలు తీవ్రమవుతున్నందున, దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కనుక 2జీ వ్యవహారానికి ముగింపు పలకాలి’’ అని సోనియా ప్రణబ్‌ను ఆదేశించారు.

వీటిపై విస్తృతంగా చర్చించనున్న కోర్‌కమిటీ.. కచ్చితంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతుండటం, తెలంగాణపై రోడ్ మ్యాప్ ఖరారు కానంతవరకు ఢిల్లీలోనే ఉంటామని టీ కాంగ్రెస్ నేతలు ప్రకటించడం వారిపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ వైఖరిని బయటపెట్టక తప్పని స్థితిలో పడిపోయింది. ఒక్కసారి కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయిందంటే దానికి పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందే. పార్టీలో ట్రబుల్ షూటర్లుగా పేరున్న నలుగురు నాయకులు మంత్రివర్గంలోనూ కీలక పాత్ర పోషించనున్నందున కోర్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం ఎవరూ చేసే అవకాశం లేదు. కోర్ కమిటీలో నిర్ణయం జరగనందునే డిసెంబర్ 9 ప్రకటనను వ్యతిరేకించే సాహసాన్ని సీమాంధ్ర నాయకత్వం చేసిందన్న అభివూపాయంతో ఉన్న పార్టీ అధిష్ఠానం.. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల్లో ఒకరిద్దరు వివిధ కారణాల వల్ల వ్యతిరేకించినా మెజార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. మంత్రి వర్గంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్, దానికి విశ్వాస పాత్రమైన పార్టీల వారే ఉండటంతో తెలంగాణపై కోర్ కమిటీదే అంతిమ నిర్ణయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎవరైనా వ్యతిరేకించినా వారి వారి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వైదొలిగే సాహసం చేసే పరిస్థితి లేదు. ఇటు చర్చల ప్రక్రియను పూర్తి చేసిన ఆజాద్ కూడా గురువారం పీసీసీ అధ్యక్షుడితో సమావేశమై తన నిర్ణయాన్ని చూచాయగా తెలియజేసినట్లు సమాచారం.
విషయం బయటకు పొక్కితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనన్న భయంతో పార్టీ సీనియర్ నాయకులకు కూడా విషయం తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆ క్రమంలోనే బొత్స తన విలేకరుల సమావేశంలో ఆకుకు అందకుండా.. పోకకు పొందకుండా అన్నట్లు మాట్లాడారు. కోర్ కమిటీ చర్చించి చేసే నిర్ణయాన్ని రాష్ట్ర నేతలకు చేరవేయడానికి వీలుగా తనతో మరోసారి సమావేశం కావాలని బొత్సకు ఆజాద్ సూచించడంతోనే ఆయన తన ఢిల్లీ పర్యటనను మరో రోజు పొడిగించుకున్నారని సమాచారం. మొత్తంగా శుక్రవారం జరగనున్న కోర్ కమిటీ సమావేశం తెలంగాణ ఉద్యమ చరివూతలో అత్యంత కీలకం కానుంది.
తెలంగాణ భవిష్యత్తును తేల్చనున్న సమావేశం కావటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ కూడా తెలంగాణ అంశంపై రంగంలోకి దిగారు. సోనియా ఆదేశాల మేరకు ఆయన గురువారం రాత్రి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో సుదీర్ఘ సంప్రతింపులు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను నేతలు మరోసారి ప్రణబ్‌కు వివరించినట్లు సమాచారం.
ద్వివేదీతో సమావేశమైన టీ నేతలు
అంతకు ముందు పార్టీ అధినేత్రి సోనియాకు అత్యంత విశ్వాసపావూతుడైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీతో ీ కాంగ్రెస్‌నేతలు సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో దాదాపు ముప్పావు గంటకు పైగా సమావేశమైన నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా సమ్మె ప్రభావంతో పాటు తాము ఢిల్లీకే పరిమితమైన పరిస్థితిని వివరించి, తెలంగాణపై త్వరగా నిర్ణయం జరగాలని కోరారు. తెలంగాణను సత్వరమే ప్రకటించని పక్షంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని ఆయనకు చెప్పారు.
ఆజాద్ తన నివేదికను శుక్రవారం సమర్పించనున్నందున తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా మీ వంతు పాత్ర పోషించాలని ఆయ కు విజ్ఞప్తి చేశారు. ఇవే విషయాలను కాంగ్రెస్ కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్ దృష్టికి కూడా టీ నేతలు తీసుకొచ్చారు.
ద్వివేదీతో జరిగిన సమావేశంలో మంత్రులు సారయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీతా లక్ష్మాడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రులు సారయ్య, సునీత తదితరులు తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ద్వివేదీతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణను ఇస్తుందన్న నమ్మకం తమకు కలిగినట్లు తెలిపారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ఖరారు అయ్యేంత వరకు ఢిల్లీలోనే ఉండి ఇతర పెద్దలను కలుస్తామని అన్నారు.
No comments:
Post a Comment