Pages

Thursday, September 29, 2011

మానుకోటలో వినూత్న నిరసన... స్వచ్ఛందంగా కరెంట్ బంద్

మహబూబాబాద్: సకలజనుల సమ్మెకు సంఘీభావంగా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలంటూ సీపీఐ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రాత్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో గంటపాటు స్వచ్ఛంద బిజిలీ (కరెంట్) బంద్ చేపట్టారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కరెంటు నిలిపివేసి ఇంటిముందు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం సీపీఐ ఆధ్వర్యంలో వీరభవన్‌నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌తోపాటు టీటీజేఏసీ, ఆర్టీసీ, న్యాయవాద, కుల, అధ్యాపక జేఏసీలు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, ఎలక్ట్రానిక్‌మీడియా అసోసియేషన్ పాల్గొన్నాయి.

No comments:

Post a Comment