- సీరియస్‌గా ఇళ్ల ముట్టడి
- ఆంధ్ర బస్సులన్నింటినీ అడ్డుకోవాల్సిందే
- వచ్చేనెలలో హైదరాబాద్ దిగ్బంధనం
- తెలంగాణ రాజకీయ జేఏసీ కార్యాచరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న సకల జనుల సమ్మె విజయవంతమైన నేపథ్యంలో రాజకీయ జేఏసీ తమ తదుపరి కార్యాచరణకు పదును పెడుతోంది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ప్రణాళి రచిస్తున్నట్లు తెలిసింది. ఉద్యమానికి మద్దతు తెలపని ఈ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లను ముట్టడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ ప్రజలంతా ఉద్యమం వైపు ఉంటే, ప్రజా ప్రతినిధులు కలిసి రాకపోవడం, సీమాంధ్ర సర్కారుకు వత్తాసు పలకడంపై నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించింది. రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని, వారి ఇళ్ల ముందు బైఠాయించి ఆందోళన కార్యక్షికమాలు చేపట్టాలని జేఏసీ కార్యాచరణను రూపొందించినట్లు సమాచారం. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని, ప్రజా ప్రతినిధులు ఆ దిశగా పయనించేలా ఒత్తిడిని తీవ్రతరం చేయాలని రాజకీయ జేఏసీ భావిస్తోంది.
నేతలను నియోజక వర్గాల్లోకి, గ్రామాల్లోకి రానీయకుండా సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సులన్నీ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ తిరిగే ఆంధ్ర బస్సులను కూడా అడ్డుకోవాల్సిందేనని జేఏసీ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ముందస్తుగా డెడ్‌లైన్ విధించి, తదుపరి కార్యాచరణని అమలు చేయాలని భావిస్తోంది. పరిపాలన తమ వల్ల కాదనేలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంకట పరిస్థితిలోకి నెట్టేలా ప్రణాళిక రంచించేందుకు జేఏసీ నాయకులు సమాయత్తమవుతున్నారు. తెలంగాణపై, ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతూ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వారు భావిస్తున్నారు. వచ్చేనెలలో భారీ స్థాయిలో ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమాన్ని నిర్వహించి, నగరం మొత్తాన్ని దిగ్బంధించేందుకు, ఇది మిలియన్ మార్చ్‌ను మించిన కార్యక్షికమంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్షికమంలో భాగంగా సచివాలయాన్ని కూడా ముట్టడించాలని ఉద్యోగులు, కార్మికులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమంలో వెనుకంజ వేయకూడదని, అన్నింటినీ అధిగమించి ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసుకోవాలని జేఏసీ నాయకులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అయితే అన్ని రంగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుంటే.. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రం ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని, ఇప్పటికే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, లేకపోతే అనంతరం జరిగే పరిణామాలకు నాయకులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

No comments:
Post a Comment