Pages

Thursday, September 15, 2011

నల్ల సూరీళ్ల సెగ..!

- మరో మూడురోజులకే బొగ్గు నిల్వలు
- ప్రత్యామ్నాయం లేక సర్కారు విలవిల
- దడ పుట్టిస్తున్న ‘నల్ల సూర్యులు’
- అప్పుడే విద్యుత్ కోతలు షురూ
- రెండో రోజూ స్తంభించిన సింగరేణి
- నిర్మానుష్యంగా మారిన గనులు
- 12 వేలకుపైగా ఆగిన లారీలు
- నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి విలువ 50 కోట్లు
- 16 కోట్ల వేతనాలు త్యాగం చేసిన కార్మికులు
- రహదారులపైన రాస్తారోకోలు, ర్యాలీలు
010-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
సింగరేణి కార్మికుల ఐక్యతకు సర్కారు వణికిపోతోంది. రెండు రోజుల సమ్మెకే ఆపసోపాలు పడుతోంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జీతాలను లెక్కచేయకుండా సామాజిక బాధ్యతను నెత్తికెత్తుకున్న ‘నల్లసూర్యుల’ ధాటికి విలవిలలాడుతోంది. కార్మిక సంఘాలు ఐక్యంగా కన్నెర్ర జేయడంతో కటిక చీకట్లను తప్పించుకునే మార్గం కనిపించకపోవడంతో సర్కారులో కలకలం మొదలైంది. వరదలొస్తే తప్ప జల విద్యుత్ ఉత్పత్తి చేయలేని స్థితిలో ప్రత్యామ్నాయాలు కరువై కంగారు పడుతున్నది. సింగరేణిలో బుధవారం కూడా ఒక్క బొగ్గుపెళ్ల బయటకు రాలేదు.

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 36 భూగర్భ, 14 ఓపెన్ కాస్టు గనులతోపాటు 11 జీఎం, 11 వర్క్‌షాపులు, స్టోర్‌లు, సీఎస్పీలలో సైతం 65 వేల మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. బొగ్గు రవాణా చేసే 12 వేలకుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎస్పీల నుంచి బయటకు వెళ్ల్లే వ్యాగన్లు సైతం ఆగిపోయాయి. రెండు రోజులుగా రూ.50 కోట్ల విలువైన బొగ్గు బయటకు రాలేదు. కార్మికులు రెండు రోజులకుగాను రూ.16 కోట్ల వేతనాలు కోల్పోయారు. తెలంగాణ కోసం గతంలో తొమ్మిది రోజులు సమ్మె చేసి రూ.64 కోట్ల వేతనాలు కోల్పోయిన కార్మికులు, ఈసారి ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

నిండుకుంటున్న నిల్వలు
ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రంలో బొగ్గు స్టాకు నిండుకుంటోంది. మరో మూడు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉండడంతో బుధవారం నుంచి నాలుగు గంటల విద్యుత్ కోతకు సర్కారు శ్రీకారం చుట్టింది. వీటీపీఎస్, కేటీపీఎస్‌లలోనూ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. అక్కడ కూడా స్టాకు మరో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉన్నట్లు సమాచారం. వీటీపీఎస్‌కు మహానది కోల్‌ఫీల్డ్ (ఒరిస్సా) నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో 590 వరకు చిన్న, పెద్ద పరిక్షిశమల్లో సైతం బొగ్గు స్టాకు దగ్గరపడినట్లు సమాచారం. రాష్ట్రంతో పాటు, కర్నాటక, తమిళనాడు, కేరళలోని 4000 పైగా పరిక్షిశమలకు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 13 లక్షల వరకు కార్మికులపై మూడు రోజులలో సమ్మె ప్రభావం ప్రత్యక్షంగా కనిపించనుంది.

ఇదంతా పారిక్షిశామిక సంక్షోభానికి దారితీస్తాయని అధికార వర్గాలు చెబుతున్నారు. మంగళవారం నుంచి సింగరేణి ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడలేదని తెలిసింది. దీంతో అనధికారికంగా కోతలు అమలు చేయాలని సర్కారు తీర్మానించిందని సమాచారం. గురువారం నుంచి గ్రామాలకు 8 గంటలు, మండల కేంద్రాలకు 4 గంటలు, జిల్లా కేంద్రాలకు రెండు గంటల చొప్పున కరెంటు కోతలు పంచుతున్నారు. బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో థర్మల్‌పవర్ ప్రాజెక్టులు మూత దిశగా ఉన్నాయి. తొలి దెబ్బ రామగుండం థర్మల్ స్టేషన్‌పై పడనుందని సమాచారం. ఇక్కడ బుధవారం రాత్రి నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం రాత్రికి విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నారని సమాచారం.

ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ నాలుగు రోజులకు మాత్రమే సరిపడు బొగ్గు నిల్వలు ఉండటంతో అక్కడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేద్దామన్నా.. ట్రాన్స్‌మిషన్ కారిడార్ లేకపోవడం సమస్యగా తయారైంది. ప్రస్తుతం జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో 66 మిలియన్ యూనిట్ల మేరకు జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్తరాది నుంచి వరదలు తగ్గిపోతే ఇది కూడా ఆగిపోతుంది. దీంతో ఏకైక మార్గంగా మహానంది కోల్‌ఫీల్డ్ నుంచి ఐదు ర్యాక్‌ల బొగ్గు తెప్పించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. దక్షిణది గ్రిడ్ నుంచి ఎక్కువ విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నది.

బిల్లు పెట్టక తప్పదు
తెలంగాణపై అనుకూల నిర్ణయం వస్తేనే సమ్మె విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు సమ్మె వద్దన్నా కార్మికులు మాత్రం ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారు. సింగరేణి అధికారులు సైతం సమ్మెలోకి రావాలని జేఏసీ నాయకులు బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల ఇంటింటికి వెళ్లి సమ్మెలో కలిసి రావాలని పువ్వులు అందజేశారు. కాసిపేట గని కార్మికులు ఇంటింటికి తిరుగుతూ వారిని ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మిక కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి వస్తున్నారు. ఇందారం వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా యువకులు నిరాహార దీక్ష చేపట్టారు. బుధవారం శ్రీరాంపూర్, మంచిర్యాల, గోదావరిఖనిలలో ప్రజావూఫంట్ నాయకుడు గద్దర్‌తోపాటు వేద కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు. కార్మికులతో సభలు ఏర్పాటు చేసి వారిలో ఆత్మసై్థర్యాన్ని నింపారు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడేనని, మీ వెంట మేమున్నామని భరోసా ఇచ్చారు.

సింగరేణివ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మంచిర్యాల ఎమ్మెల్యే జీ అరవింద రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వై గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య, కలవేని శంకర్, వీరభవూదయ్య, మల్లాడ్డి, కుమార స్వామి, ఐఎన్టీయూసీ నాయకులు, ఎమ్మెల్సీ బీ వెంకవూటావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు బంటు సారయ్య, శరబలింగం, సంపత్, బెల్లంపల్లి టీఆర్‌ఎస్ నియోజక వర్గం ఇన్‌చార్జి ప్రవీణ్, శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు టీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బీ సంపత్ కుమార్, జాఫర్, చాంద్‌పాషా, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, రాజిడ్డి, ఓజియర్, రాజగోపాల్, రహీం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు అన్నయ్య, రాజారాం, కాంపెల్లి సమ్మయ్య, కాశీరావు, ప్రధాన కార్యదర్శి బీ జనక్ ప్రసాద్, బీఎంఎస్ నాయకులు ఆదిరాం నర్సయ్య, పులి రాజిడ్డి, తదితరులు జేఏసీ కో ఆర్డినేటర్ రాంమూర్తి, గోసిక మల్లేశ్, రవీందర్, కళాదర్, శంకర్ నాయక్, తదితరులు పలు ఆందోళన కార్యక్షికమాలలో పాలుపంచుకున్నారు.

No comments:

Post a Comment