హైదరాబాద్: సకల జనుల సమ్మెకు మద్ధతుగా సింగరేణిలో నాలుగో రోజు సమ్మె
కొనసాగుతుంది. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. వరంగల్‌లలోని
భూపాలపల్లిలో 6 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. దీంతో రూ. 8
కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. కరీంనగర్‌లోని రామగుండం, గోదావరిఖనిలలో
పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నాలుగు ఓపెన్ కాస్ట్‌లలో, 10
భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఖమ్మంలోని
కొత్తగూడెం, ఇల్లందులలో పూర్తి స్థాయిలో కార్మికులు విధులకు హాజరు కాలేదు.
ఆదిలాబాద్‌లో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలలో 26 వేల మంది
కార్మికులు విధులకు హాజరు కాలేదు.
No comments:
Post a Comment