Pages

Tuesday, September 13, 2011

ఉద్యోగులపై ఈగవాలినా అగ్గిరాజుకుంటది


-ఇదీ కేసీఆర్ మాట
-ఎస్మా అంటే రగిలిపోతం
-బస్సు పయ్య కదలొద్దు.. బొగ్గు పెళ్ల పెగలొదు బడిగంట మోగొద్దు.. రైలు కదలొద్దు
- సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలి
- సమైక్య రాష్ట్రంలో జరగని దగా లేదు
- రాష్ట్రం సాధించుకోకపోతే పాతాళానికి తొక్కేస్తారు జాగ్రత్త
- కట్టుబానిసల్లా బతకాల్సి వస్తుంది
- కావూరి కాకిలాంటోడు
- రాయపాటి సాంబశివరావు దొంగ... ఆయన వల్ల చైనాలో ఆరుగురికి ఉరి
- టీజీ.. పిచ్చికూతలు మానుకో... లేదంటే నాలుక కోస్తాం

07-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

(టీ న్యూస్, కరీంనగర్) ‘‘సకల జనుల సమ్మె అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసే సమ్మె కాదు. అందరం పాల్గొనాలె. రేపటి నుంచి బస్సు పయ్య తిరగదు. బడిగంట మోగదు. సింగరేణిలో బొగ్గు పెళ్ల పెగలదు. రైళ్లు తిరగవు’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై ఈగవాలినా తెలంగాణలో అగ్గి రాజుకుంటుందని చెప్పారు. అగ్గిబరాటలా మండుతామని చెప్పారు. లక్షలాది మంది హాజరైన తెలంగాణ జన గర్జన సభలో కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. కరీంనగర్ గడ్డకు వందనం.. కరీంనగర్ బిడ్డకు వందనం.. అంటూ తన ఉపన్యాసం ప్రారంభించిన కేసీఆర్... తెలంగాణ కోసం కొట్లాడే ధైన్యాన్ని కరీంనగర్ ఇచ్చిందని చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో సింహగర్జన సభ పెట్టిన నప్పుడు నన్ను కరీంనగర్ బిడ్డలు అదరించారు..ఇన్నేళ్ల ఉద్యమం జనగర్జన పెడితే.. అదే అత్మవిశ్వాసంతో స్వాగతం పలికారు.

నాకు ఇస్తున్న భరోసా, స్వాగతం చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి. నా బాధ్యతను మరింత పెంచాయి. తెలంగాణ సాధన కోసం అవసరమైతే తల నరక్కుంటాను కానీ... ఎత్తిన జెండాను దించను’’ అని కేసీఆర్ ప్రకటించారు. ‘‘సకల జనుల సమ్మె అంటే అషామాషీ కాదు. యావత్తు తెలంగాణ కదాలాలె. కదన రంగంలోకి దూకాలె. సమ్మె అంటే ఉద్యోగులే కాదు.. యావత్తు తెలంగాణ ప్రజలు పాల్గొనాలి. తెలంగాణ బాధలను, ఇబ్బందులను తమ భుజాల మీద వేసుకొని మోసుకుపోతున్న ఉద్యోగుల్లారా.. ఆగ్గిరగిలించండి.. సకలజనుల సమ్మెలో ఏ ఒక్క ఉద్యోగిపై ఎస్మా ప్రయోగించినా.. లేదా ఈగ వాలినా ఊరుకోం. స్వామిగౌడ్ గారు.. మీ వెనక జాతీయ పార్టీ బీజేపీ ఉంది. న్యూడెమోక్షికసీ ఉంది. కేసీఆర్ ఉన్నాడు. నాలుగున్నర కోట్ల జనం ఉన్నారు’’ అని చెప్పారు.
knr-(2)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘పదేళ్లుగా ఆంధ్రోళ్లు నన్ను తిట్టని తిట్టు తిట్టిండ్రు. నాలుగు కోట్ల మంది తరపున పోరాడుతున్న కోదండరాంను టీజీ వెంక అనేటోడు తిడుతున్నడు. బంగారంలాంటి కోదండరాంను బురద అంటావా? నీకెన్ని గుండెలు? ఎందుకు ఆ కండకావరం? పిచ్చి కూతలు మానకపోతే నాలుక కోస్తాం’’ అని హెచ్చరించారు. ‘‘కావూరి కాకి లాగ ఒర్రుతున్నడు. తెలంగాణ విద్యార్థులు పనికిరానివారంటున్నడు.ఖబడ్దార్. ఒక్కటంటే వందంటం. లఫూట్ మాటలు మాట్లాడితే మీకన్నా లఫూట్ మాటలు మాట్లాడతాం. నోరు దగ్గర పెట్టుకోండి. సహించే వరకు సహించినం. ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కడ వాత పెట్టాలో మాకు తెలుసు’’ అని అన్నారు. ‘‘పొగాకు ఎక్స్‌పోర్టులో డూప్లికేట్ ఆకులు పెడితే రాయపాటి సాంబశివరావు వల్ల చైనాలో ఆరుగురు అధికారులకు ఉరి శిక్షపడింది.

రాయపాటిని అప్పజెప్పమని చైనా కోరితే ఇక్కడ కాంగ్రెస్‌వాళ్లు ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. సన్నాసి, దొంగతనం చేసిన రాయపాటి విద్యార్థుల గురించి మాట్లాడుతాడా?’’ అంటూ నిప్పులు చెరిగారు. సమైక్యాంవూధలో జరగని దగా లేదని చెప్పారు. కరీంనగర్-హైదరాబాద్ రైల్వే లేన్‌పై సర్కారు వివక్షను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మన దేశానికి స్వాతవూంత్యం వచ్చిన తరువాత తెలంగాణకు వచ్చిన ఒకే ఒక్క రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్. దీనికోసం కేంద్రం 671 కోట్లు శాంక్షన్ చేసింది. ఏళ్లు దొర్లుతున్నా రాష్ర్ట ప్రభుత్వం తన వంతు నిధులు ఇవ్వలేదు.

భూమి సేకరించలేదు. అన్నారు. ‘‘సీఎం... నువ్వు యువ కిరణాలు పెడతా... తోక కిరణాలు పెడతా... అభివృద్ధిని ఆపుకోవద్దు అంటున్నవ్. చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రాన్ని పాలించే ఇంగిత జ్ఞానం ఉంటే, ప్రాంతీయ పక్షపాతివి కాకుంటే దీనికి నిధులు ఇవ్వు. 2006లో ఈ లైన్ శాంక్షన్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్‌డ్డి కట్టలేదు. ఈ ఆరేళ్లలో ప్రభుత్వం 6లక్షల కోట్ల బడ్జెట్ చేసిందిగానీ హైదరాబాద్- కరీంనగర్ లైన్‌కు 234 కోట్లు ఇవ్వటానికి రాలేదు.

knr-(10)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగత యేడాది 40 కోట్లు పెట్టారు. అవి కాస్తా వాపసు పోయాయి. నువ్వూ దీని గురించి పట్టించుకోవటం లేదు. ఇంక మేం ఎందుకు అడగద్దు తెలంగాణ? ఆరేళ్ల క్రితం బడ్జెట్ శాంక్షన్ అయితే వేరే రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి కావాలనుకునే సీఎం అయితే మోకాళ్ల మీద ఉరుక్కుంట పోయి నిధులు తెచ్చుకుంటరు. కరీంనగర్ జిల్లాకు 600 కోట్ల రూపాయలతో మంచినీళ్ల పథకం తెచ్చి 30 కోట్లు ఇవ్వమంటే మూడు రూపాయలు ఇవ్వలేదు. ఎందుకడగద్దు తెలంగాణ?’’ అని ఆయన సీఎంను నిలదీశారు. ‘‘సమైక్య రాష్ట్రంలో కలిసి ఉంటే కలదు సుఖం అంటవ్. యేడ సుఖం ఉంది? మిడ్‌మానేరు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏదో ఒక కథ చెప్పి తెలంగాణ ప్రాజెక్టులు పక్కన పెడతారు.

పోలవరానికి 4వేల కోట్ల ప్యాకేజీతో టెండర్లు పిలుస్తరు. వెయ్యి కోట్ల మిడ్‌మానేరును పట్టించుకోరు’’ అన్నారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు గురించి మాట్లాడుతూ.. ‘‘ఏం చెప్పాల అర్థం కాదు. అయినోని గురించి చెప్పాలె. కానోని గురించి ఏం చెప్పాలె? కాంగ్రెస్‌లో ఒక నలుగురైదుగురు ఎంపీలు తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడుతుంరు. పొన్నం ప్రభాకర్ ఆ నలుగురిలో ఒకడు. ఫస్ట్‌టైం ఎంపీ అయినా ధైర్యంగా కొట్లాడుతున్నడు. పొన్నం.. ఎవ్వరికీ భయపడకు. అదే ధైర్యంతో ఉండు. తల కోసుకో కానీ ఎత్తిన పిడికిలి దించకు. మేం మీ వెంట ఉంటం. పొన్నంకు శ్రీధర్‌బాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అన్నారు.‘‘చూడండి. ఈ దంపతులది మహారాష్ట్రలోని విదర్భ.

తెలంగాణ, విదర్భ ఎంతగా బంధించబడి ఉన్నాయో చూడండి... (విదర్భ దంపతులు సంకెళ్లతో వేదికపైకి వచ్చారు) విదర్భ నుంచి పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణ యావత్తు తిరుగుతున్నరు... ఇటువంటి ఆదర్శమూర్తులను, ఇట్లాంటి బిడ్డలను మనం గుండెల్లో పెట్టుకోవాలి. ఈ దంపతులకు తలవంచి నమస్కారం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘విదర్భలో ఉన్న దంపతులకు మన బాధ అర్థమైందిగానీ మన తెలంగాణ సన్నాసులకు అర్థం కాదు. ఇజ్జత్ ఉందా? తెలంగాణ జనం ఒక్క నమూనలలో తిడుతుంరా? కళాకారులు పాటలు కట్టి మరీ తిడుతున్నరు. అయినా మేం కదలం. అంటున్నరు సన్నాసులు. నేను చెబ్తిని, దండం పెడతానన్న. రాజీనామాలు చేస్తే గెలిపించుకుంటమని చెప్పిన. కాల్మొక్త అని కూడా అన్న. అయినా వచ్చినట్టే వచ్చి వెనక్కి పొయ్యింరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కుక్కతోకకు రాయి కడితే సక్కగయితాది?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘11 సంవత్సరాలుగా ఉద్యమాన్ని చేస్తున్నం. గండాలను ఎదురీదినం. ఎత్తిన పిడికిలి దించలేదు.

knr-(5)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ సాధించుకోలేకపోతే ఉంచుతరా మనల్ని? పాతాళలోకానికి తొక్కుతారు. ఈ దశలో రాష్ట్రాన్ని సాధించటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు’’ అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘ప్రయివేట్ పాఠశాలలు కూడా సమ్మెకు పోతున్నయి. మీ అందరితో మనవి చేసేదొక్కటే. నో ఆల్టర్‌నేట్. తెలంగాణను సాధించుకోవాలె. ఉద్యోగుల సమ్మె అని అనుకుని ఎక్కడోళ్లు అక్కడ ఇండ్లళ్ల పండొద్దు. రైల్‌రోకో అంటే గ్రామాలకు గ్రామాలు వచ్చి పట్టాలపై కూసోవాలి. రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం టైం టు టైం పిలుపిస్తారు. ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించారు. దానినిబట్టి ఉద్యమాన్ని ముందుకు నడపాలె. ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా 13న తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేయాలి. 14, 15తేదీల్లో సినిమాహాళ్ల బంద్ ఉంది.

18న జాతీయ రహదారుల దిగ్భంధనానికి జేఏసీ పిలుపునిచ్చింది’’ అని చెప్పారు. ‘‘మణిపూర్‌లో ఎలా చేశారో అదే పద్ధతిలో జాతీయ రహదారులపై మనమందరం చేరుకోవాలె. చీమలదండులా దిగ్భంధం చేయాలి’’ అని ఉద్బోధించారు. ‘‘ఈ రోజు ఇంత సమయం గడిచినా. మీరు ఇంత పొద్దు పోయేవరకు ఉండి ఇంత అపురూపంగా కూర్చుని ఉండి నాయకుల ఉపన్యాసాలు విన్న మీ అందరికీ పేరుపేరున ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ’’ అంటూ ఆయన తన ఉపన్యాసాన్ని ముగించారు.

‘‘ముఖ్యమంతి కిరణ్‌కుమార్ రెడ్డి.. సకల జనుల సమ్మెపై పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేసి, కుంట్రలు కుతంవూతాలు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగుండదు. ఇది మాహెచ్చరిక. మా సహనంకు ఓ హద్దుఉంది. పరీక్ష పెట్టకండి’’ అని హెచ్చరించారు. ‘‘మేం అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చి న మాటనే కదా.. 120 కోట్ల జనం సాక్షిగా తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటను అమలు చేయమంటున్నాము. ఇదేమైనా తప్పా.. ఇందుకోసం పోరాటం చేస్తున్న మాపై మీకు ఎందుకు కక్ష? న్యాయం చేయాలని అడిగితే వేధింపులకు గురిచేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఖబడ్దార్ మా ఉద్యోగుల బిడ్డల మీద ఈగ వాలినా.. ఊరుకోం. సకల జనుల సమ్మెను అషామాషీగా తీసుకోవద్దు... సమ్మెలో భా గంగా ఒక బస్సు పైయ్య కదలదు..

బడిగంట మోగదు. సింగరేణిలో పెళ్ల కూడ పెగలదు... రైలు ముందుకు కదలదు.. విద్యు త్తు ఉద్యోగులు తమ పంథాలో ఆందోళన చేస్తారు. న్యాయవాదులు పిడికిలి బిగించి కొట్లాడాతారు. మాది నా్యైయమెన కోరిక, ధర్మాక్షిగహ పోరాటం. ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుంది’’ అని కేసీఆర్ ఆవేశంగా చెప్పారు.

‘‘పాపం.. సీహెచ్ విద్యాసాగర్‌రావు అమాయకుడు. బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌డ్డి ఏకక్షిగీవంగా ఎన్నికవుతడని అంటున్నడు. అందరూ ఆయనలాగే అమాయకంగా ఉంటరనుకుంటున్నడు. ఇప్పటికే సీఎం కిరణ్, బొత్స సత్యనారాయణ బాన్సువాడలో పోటీ పెట్టడానికి సిద్ధమవుతున్నరు. పెట్టండి. పోటీ పెట్టమనే అంటున్న. కరీంనగర్‌లో ఇంతకముందు పోటీకొచ్చిండ్రు. గుద్దు గుద్దితే నేలకు తాకిండ్రు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన పోచారంపై పోటీ పెట్టడానికి వాళ్లకు ఇజ్జత్, మానం ఉండాలి. సీఎం కిరణ్‌కు విజ్ఞత ఉంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి. ఎస్మా గిస్మా అని బెదిరించడం మానుకోవాలి’’ అని కేసీఆర్ అన్నారు.

వరంగల్‌లో యాకూబ్‌డ్డి సహా పలువురు విద్యార్థులను పోలీసులు తీవ్ర చిత్రహింసలు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘వరంగల్ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈ వేదిక మీది నుంచి డిమాండ్ చేస్తున్న’’ అంటూ కేసీఆర్ గర్జించారు. ‘‘14ఎఫ్ పేరు చెప్పి మీ టోపీలు లాటీలు గుంజుకుంటున్నరనే నేను దీక్ష చేసిన. విద్యార్థులు ఉస్మానియాలో వీరవిహారం చేశారు. వాళ్లను కొట్టడానికి మీకు చేతుపూలా వచ్చినయి?’’ అని కేసీఆర్ పోలీసులను ప్రశ్నించారు.

No comments:

Post a Comment