పదేళ్ళ కిందట ఏ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ సింహ గర్జన చేసినారో ఇప్పుడు అదే గడ్డమీద సకల జనులు సంఘటితంగా సమర శంఖం పూరించిండ్రు. ఇవాల్లటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల చరివూతాత్మక సమ్మె ప్రారంభమవుతున్నది. సింగరేణి కార్మికుల గుండె ఇప్పుడు నిప్పు కణికై మండుతున్నది. కరెంటు కార్మికులు దశాబ్దాల చీకటిని పారదోలి తెలంగాణ నిండా స్వేచ్ఛా వెలుగులు నింపుదామంటున్నరు. ఆర్టీసీ రథ చక్రాలు జనం వెంట నడుస్తున్నయి. ఉపాధ్యాయులు ఉద్యమ పాఠా లు చెబుతున్నరు. బడి పిల్లలు బతుకు పాఠాలు చదువుకుంటున్నరు. సబ్బండ వర్ణాలు స్వాభిమానం తమ సహజ స్వభావమని చాటి చెబుతున్నయి. తెలంగాణ గర్జిస్తున్నది. ఈ గర్జనకు ఢిల్లీ పెద్దలు దిగిరావాలె. ఆంధ్ర సర్కారు కూలిపోవాలె.
ప్రపంచంలో ఎక్కడైనా పాలకవర్గం ఉద్యమకారులను చంకకెత్తుకుని ముద్దు పెట్టుకుంటదా? ఎస్మా అంటది, 177 జీవో అని బెదిరిస్తది. 130 జీవో అని హుంకరిస్తది. కానీ... ప్రపంచ చరివూతలో ఉద్యమాలను అణచివేసే మొనగాడు ఇప్పటి దానుక పుట్టలేదు. అదే జరిగితే ప్రపంచ చరిత్ర స్తంభించి పోయేది. కాలం ఎనుకకు పోయేది. జనానికి ఈ మాత్రం హక్కులు ఉండేవా? అంతిమంగా ఉద్యమానిదే విజయం. ఇందులో అనుమానం అక్కర లేదు. నియంతలు కొట్టుక పోతరు. జనం గెలుస్తరు.
పోరాడితే ఏమయితది? ఏమీ కాదు.. బానిసత్వం పోతది. ఉద్యోగాలు పోతయా? పోవు... ఎక్కడికీ పోవు.. ఇప్పటి వరకు ఎక్కడా ఉద్యోగాలు పోలేదు. లక్షలాది మంది ఉద్యోగులు అదీ జనం కోసం సమ్మె చేస్తే తీసేసే దమ్ము ఏ సర్కారుకూ ఉండదు. తమిళనాడులో లక్షలాది మంది ఉద్యోగులు సమ్మెకు దిగినప్పుడు జయలలిత సర్కారు ఒక్క కలం పోటుతో అందరి ఉద్యోగాలు పీకేసి విర్రవీగింది. ఉద్యోగులను తీసేయడం సబబే అని కోర్టులు కూడా అన్నయి... అయినా అందరినీ మళ్ళ అమెనే ఉద్యోగంలో కి తీసుకున్నరు. లక్షలాది మంది ఉద్యోగాలు తీసేసి ఈ భూగోళం మీద ఏ ప్రభుత్వ మూ బతికి బట్ట కట్టలేదు. ఏ సర్కారైనా ఉద్యోగులతో పెట్టుకుంటే తన మరణ శాసనం మీద తనే సంతకం పెట్టుకున్నట్టు. ఇంత మంది ఉద్యోగులకు జీతాలు, జనానికి ఈ మాత్రం సంక్షేమ పథకాలు ఎట్ల వచ్చినయి. దానికో చరిత్ర ఉన్నది. ఎన్కట ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పుడు అన్ని దేశాలలో పాలకులకు అసలు సంగతి అర్థమైంది. కొనుగోలుదారు అంతో ఇంతో చల్లగ ఉంటేనే కార్పొరేట్ సంస్థలకు లాభాలు వస్తయి.
వీళ్ళు డీలా పడితే వాళ్ళ బిజినెస్‌లు అంతమయిపోతయి. అందుకనే జీతాలు పెంచి, మధ్యతరగతి తాహతు పెంచిండ్రు. సంక్షేమ రాజ్యం అనే సిద్ధాంతం వల్లించుతున్నరు. తెలంగాణలో లక్షలాది మంది ఉద్యోగాలు పోతే, తెలంగాణ అంతటా కొనుగోళ్ళు నిలిచిపోతె, రాకపోకలు ఆగిపోతె.. ఎవరికి నష్టం? ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలయిన కార్పొరేట్ల కాళ్ళకిందికి నీళ్లొస్తయి. చిన్న పెద్ద అమ్మకాలు ఆగిపోయి పెట్టుబడిదారీ ప్రపంచం కంపించి పోతది. అందుకనే ఉద్యోగులారా! ఎవరి ఉద్యోగాలు పోవు.. ఉద్యోగాలు పీకేసినమని తాఖీదులు జారీ చేసినా బెదరవద్దు.. మీ వెనుక కోట్లాది మంది ప్రజలున్నరు. మళ్లీ మీ ఉద్యోగాలు మీకు పూలల్ల బెట్టి ఇయ్యక తప్పదు. తెలంగాణ అంటుకొని మండితే, అది భారత దేశం కడుపుల రాచపుండు పుట్టిన ఎనకట నెహ్రూ అన్నడట. తెలంగాణ కీలకమైన ప్రాంతం. ఉత్తర దక్షిణాల నడుమ, దేశానికి మధ్యన, అడవులకు, కొండలకు మధ్యన కీలక భూమి. తెలంగాణ గర్జిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు.
ప్రపంచీకరణ యుగంలో పోరాటాలు నడవయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు కొందరు బుద్ధిహీనులు. తెలంగాణ ప్రజలారా! మనం ఒంటరిగాళ్ళం కాదు. మన పోరాటం ఒంటరి ఆరాటం కాదు. ఇది భూమి పుత్రుల ఉద్యమ యుగం. లాటిన్ అమెరికా మొదలుకొని మధ్య ఆసియా, తూర్పు ఆసియా వరకూ అడుగడుగునా... భూమి పుత్రులు జమీన్ కోసం, జల్, జంగల్ మీద హక్కుల కోసం పోరాడుతున్నరు. అమెరికా ఖండాలలో భూమి పుత్రులు కొలంబస్ విగ్రహాలు కూలగొట్టి బరబరా రోడ్ల మీద గుంజుకుంట పాటలు పాడి చెంగ చెంగ ఎగురుతున్నరు. లాటిన్ అమెరికా దేశాలలో కమ్యూనిస్టులు పాత పుస్తకాలు పక్కకు పెట్టి భూమి పుత్రుల ఉద్యమంతో మమేకమై అధికారం చేపట్టిండ్రు. వెనెజులా, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలివి యా, పరాగువే ... అన్ని చోట్ల భూమి పుత్రులు అమెరికా ప్రవచిస్తున్న ప్రపంచీకరణను ఎనుకకు తిరుగుమని జాడించి తన్నిండ్రు. అమెరికా తొత్తు ప్రభుత్వాలను కూలగొట్టి నయా ఉదారవాదం ఓడిపోయిందని ప్రకటించిండ్రు. చైనాలోని ఉయిగూర్లు పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నరు. కుర్దులు, టిబెటన్లు, బెలూచీలు... ఒక్కరేమిటి ప్రపంచమంతటా ముల్కీ పోరాటాలు పెల్లుబుకుతున్నయి.
తెలంగాణ ఉద్యమం బహుముఖంగా సాగుతున్నది. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణను వెనక్కు తీసుకున్న ప్రజాస్వామ్య విఘాతం మీద జరుగుతున్న యుద్ధమిది. ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఇరవై రెండు నెలలుగా ఉధృతంగా సాగుతున్న తెలంగాణ పోరాటం, శాంతియుతంగా సాగుతున్నది. కానీ ప్రజాస్వామ్యం విఫలం అవుతున్నది. పార్లమెంటు ప్రకటనలకూ దిక్కు లేకుండాపోయింది. అందుకే ఈ సకల జనుల సమ్మె. ఈ సమ్మెలో... నాయకులు కలి సి రాకున్నా సరే...వస్తే మంచిది.. జనం పోరాడుతనే ఉంటరు. సకల జనులు తెలంగాణ సాధిస్తరు. తెలంగాణ జనులారా! మనం ఒంటరిగాళ్ళం కాదు... మన పోరాటం ఒంటరిది కాదు. మన భూమి పుత్రుల పోరాటం మొదటిది కాదు, చివరిది కాదు. అంతిమ విజయం మనదే. తెలంగాణ భూమి పుత్రులదే.

No comments:
Post a Comment