Pages

Monday, September 12, 2011

బానిసకొక బానిసకొక బానిస -అల్లం నారాయణ

‘పీనుగుల మీద పేలాలు ఏరుకునే జాతి ఏదన్నా ఉన్నదంటే అది మన మంత్రుల జాతే’
ఇటీవల నాకొచ్చిన మెసేజ్ సారాంశం ఇది. ‘అంత‘హార్ష్’గ అంటే ఎట్లా’... నా సమాధానం కాని ప్రశ్న. దానికి అవతలి వ్యక్తి ‘మీరు కూడా అట్లంటే ఎట్ల సార్! అన్నీ తెలిసి. ఇవతల మనుషులు చనిపోతుంటే వాళ్లకు పంద్రాగస్టులు, క్యాబినెట్లు కావల్సి వచ్చాయా? వాళ్లనేం చేసినా తప్పులేదు. మీరు సమర్థించకం డి’.. మళ్లీ కొట్టొచ్చినట్టు మెసేజ్. నిజమే. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల రాజీనామాలు అవి ఉత్తుత్తవే కావొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమానికి ఒక ఊతం గా భావించారు. కానీ, వాళ్లే మళ్లీ రాజీనామాలు అట్లా పక్కనబెట్టి అంతకు ముందు ఏమీ జరగనట్టు పంద్రాగస్టు వేడుకలకు వెళ్లి, ఒకే ఒక్క కోమటిడ్డి తప్ప మంత్రులు మొత్తం క్యాబినెట్‌కు వెళ్లే సరికి జనాలకు సహజంగానే పుండు మీద కారం రాసినట్టువుతున్నది. మంట మండుతున్నది. ఇజ్జత్ లేదు.

అనే మాట తెలంగాణల తరచూ వాడే మాట. అదిప్పుడు మంత్రుల పట్ల చిన్న మాటైపోయి పీనుగులు-పేలాల దాకా వచ్చింది. సిగ్గుందా? అని అడిగిండు నాగం. కానీ ప్రజలు అంతకన్నా ఎక్కువే అడుగుతున్నరు. ‘పదిరోజులు పదవిలేకపోతే బతకలేరు మీరా మాట్లాడేది’ అని లగడపాటి అన్నడు. నిజమే పదవి లేకపోతే మేమేడ బతుకుతమని బందెలదొడ్లె స్వచ్ఛందంగా సొచ్చిన పశువుల్లాగా మంత్రులు క్యాబినెట్‌లోకి స్వచ్ఛందంగా వెళ్లారు. ఐచ్ఛిక, రాజకీయ మరణాలని ఎవరు మాత్రం నివారించగలరు. ఒకవేపు వందల ఆత్మహత్యలు, గుండె పగిలిన తెలంగాణ. కాంగ్రెస్ జాతీయ పార్టీ విశ్వాస ఘాతుకం. అదే పార్టీ మంత్రులది తెలంగాణ పట్ల ఇదీ కథ. ఒక పరాధీన బాంచెల కథ. కేంద్ర కాంగ్రెస్ మోసాల కథ విలీనం నుంచి ఇప్పటిదాకా సాగుతూ వస్తున్నది. బహుశా ఏకాభివూపాయం సాధించండి. మీది మీరే తేల్చుకోండి. అసెంబ్లీ తీర్మానం లాంటి మాటలను చిదంబరం పార్లమెంటు లో ప్రవచించిన తీరు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మోసానికి కూడా సూచికగా అనుకోవచ్చు.

ఆర్టికల్3ని కాదని, అసెంబ్లీ తీర్మానాలు, టిరనీ ఆఫ్ మెజారిటీని తెలంగాణ మీద తోల్తున్నారం కాంగ్రెస్ పార్టీ విలీనం నాటి, ఆ తర్వాతి అన్ని ఉద్యమాల నాటి ద్రోహ బుద్ధినే ప్రదర్శిస్తున్నదని అర్థం. ఇసుమంత మారని ఈ కాంగ్రె స్ బుద్ధి వెనుక ఏముంటుంది కనుక... అధికార దాహం. రాజకీయ ప్రయోజనా లు. ధనకాంక్ష, నయా పెట్టుబడిదారులకు కొమ్ముకాసే తత్వం. బహుశా ఈ తత్వ మే మన బాంచెలను కూడా క్యాబినెట్‌కు పంపించి ఉంటుంది. లగడపాటి రాజగోపాల్‌కు ఆ విశ్వాసం ఎక్కడిది? తెలంగాణ మంత్రుల స్వభావాన్ని ఆయన అట్లా అంచనా ఎలా కట్టగలిగారు. తావీజ్ మహిమ కాదు. లగడపాటి రాజకీయ వివేచనాశక్తి గలవాడు కూడా కాదు. కానీ అతనొక బేపారి. కలలను ఎట్లా కొనా లో, ఎట్లా అమ్మాలో తెలిసిన బేపారి. తమ మోచేతి నీళ్లు తాగకుండా ఎక్కడికి పోతారని ఆయనకు బాగా తెలుసు. మోచేతి నీళ్లు తాగడానికి అలవాటుపడి ఉన్నవాళ్ల బలహీనతలు కూడా బాగా తెలుసు.

అందువల్లనే కదా! రాజగోపాల్ అన్న మాటను అతితొందరగా నిజం చేసి చూపించారు మంత్రులు. ప్రాణం పోతున్నా సరే. మానం పోతున్నా సరే. మంది చస్తున్నా సరే. తెలంగాణ ప్రజలందరూ ఇగ మా వల్ల కాదు. మాకు ఒక తెలంగాణ పరిష్కారం అంటున్నా సరే.. మన తెలంగాణ మంత్రులకు మాత్రం పదవులు, దానివల్ల వచ్చే అధికారమదం, రాలే ఎంగిలి మెతుకులు, శవాల మీద ఏరుకునే నాణేలు కనబడ్తుండడం యాధృచ్ఛికం కాదు. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయి’ అని సామెత. నిజానికి తెలంగాణ ప్రజలు ఆనాడు, ఈనాడు కాంగ్రెస్ ను తెలంగాణ ఇస్తారన్న విషయంలో నమ్మలేదు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అమాయకపు తెలంగాణ అననైతే అన్నడు కానీ, ఏ ఒత్తిళ్లకు లొంగాలో వాటికి లొంగి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా విలీనం నిర్ణయం తీసుకుని మొదటి మోసం చేసిండు.

విలీనం అయిన మరుసటి దినం నుంచే ఇదే కాంగ్రెస్ పార్టీ అన్ని ఒప్పందాలను, అన్ని సూత్రాల ను, తెలంగాణ, ఆంధ్ర, ప్రజలను కలిపి ఉంచాల్సిన షరతులను గంపగుత్తగా తొక్కి ఆధిపత్య భావజాలంతో వలసగా మార్చారు. 1969లో తెలంగాణ రోసిపోయి, మా కొలువులు మాకే దక్కాలని పోరుబాట పడ్తే కాసు బ్రహ్మానందడ్డి, ఇందిరాగాంధీలు 369 మందిని చంపి ఉద్యమాన్ని నెత్తురు ముంచా రు. దేశ సమక్షిగత, సమైక్యత అని చిలుకపలుకులు పలికిన ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజల నెత్తురు కండ్ల జూసింది. కని తెలంగాణ ఇవ్వలేదు. ఉన్న చెన్నాడ్డిని లొంగుటాన ఏసుకుని, తెలంగాణ ఆకాంక్షలను మంట్లె కలిపేసిన చరిత్ర, ద్రోహం, నలభై రెండు సంవత్సరాల మానని గాయం. ఇక అప్పటి నుంచీ కాంగ్రెస్ వాళ్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరనప్పుడు, అధికారం అందని పండైనప్పుడు తెలంగాణను తడవతడవలుగా తలకెత్తకున్నది. తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణకు అన్యాయం జరిగిందని అంగలార్చింది అధికారంలో లేనప్పుడు. చంద్రబాబు రాజ్యమేలుతున్నప్పుడు.

ఆ తర్వాత సమైక్యవాది అని గొప్పలు కొట్టుకు నే వై.ఎస్., దేశ సమక్షిగత గురించి మాట్లాడే సోనియాగాంధీ, టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని, ఎన్నికలు గెలిచి , తెలంగాణను బోడమల్లన్న చేసింది. ఆ తర్వాత సీఎంపీలో, రాష్ట్రపతి భాషణలో, తెలంగాణ పేరు చెప్పి మోసం చేసి ఇట్లా ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజలను కించపర్చింది. తద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను భంగపరిచిందీ కాంగ్రెస్ పార్టీయే. చివరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరాహారదీక్ష పెల్లుబికిన తెలంగాణ చైతన్యం, వీరత్వం చూపిన విద్యార్థిలోకం, సకల జనుల చైతన్యం చూసి డిసెంబర్ 9 ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ యే. అదే పార్టీ ఇప్పుడు నాలుక తిరగేసి ఇజ్జత్‌లేని ప్రకటనలు చేసింది. సోనియాగాంధీ జన్మదిన కానుక అంటే మురిసిముక్కలైతిమి.

కాంగ్రెస్ పార్టీని నమ్మి నానబోస్తే అదే చిదంబరం ఇప్పుడు అదే పార్లమెంటులో ఏకాభివూపాయం అని, రాజ్యాంగం దఖలు పరిచిన కేంద్రం హక్కును వదులుకొని ఆంధ్ర మెజారిటీకి తెలంగాణను బలిపెడ్తున్నాడంటే దేనివల్ల? అసలు తెలంగాణ అనే ఒక స్వేచ్ఛా ఆకాంక్షకు అరవై సంవత్సరాలుగా అడ్డుతగులుతున్నది కాంగ్రెస్ పార్టీయే. కానీ.. రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యం కనుక. దానికి కాంగ్రెస్ పార్టీయే శరణ్యం కనుక తెలంగాణ పదేపదే గొర్రె కసాయిని నమ్మినట్టు నమ్మాల్సి వస్తున్నది.తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిజంగానే కసాయిలుగా పదేపదే అవతారమెత్తుతున్నారు. నిజానికి రాజకీయ పార్టీల నేతలందరూ రాజీనామాలు చేసి సీమాంధ్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణ సాధించాలన్న డిమాండ్ ఇవ్వాల్టిది కాదు.


కానీ, అడుగడుగునా ప్రజలు తెలంగాణ ప్రజావూపతినిధులను, మంత్రులను అడ్డుకుంటున్న సందర్భం. ఎందుకురా ఈ బతుకు జనంలోకి వెళ్లలేమనుకుంటున్న సందర్భం. మేమూ ఇంకా తెలంగాణ తెస్తామని, ఉద్యమిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు హఠాత్తుగా రాజీనామాల నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదం పొందలేదు. అదే వేరే విష యం. కానీ తెలంగాణ వచ్చేదాకా రాజీనామాలు ఉపసంహరించుకోబోమని, మాట మార్చేది లేదని ఎన్ని ప్రగల్భాలు పలికారో? లెక్కలేదు. ప్రాణాలు కూడా ఇస్తామన్న వీరుల్లా ప్రకటనలు కోకొల్లలు. మీసాలు తిప్పి, మాటల
గారడీ చేసిన కాంగ్రెస్ మంత్రులు ఒక్క పొద్దులు, ఉపవాసాలు చేసి , మళ్లీ అందరం వాళ్లను నమ్మి వాళ్ల దీక్షల్లో ప్రసంగాలు చేసి, వాళ్ళ మాటల తడి వాళ్ల నాల్కల కొసన ఇంకా ఊగులాడుతుండగానే ఈ మోసం... ఎంత ఇజ్జత్ లేకుంటే ఇట్లా జరుగుతుందనుకోవడం ఒక అమాయకత్వమే. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న తరుణం.

కుంభకోణాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయ నాయకత్వం పైగా అవిశ్వసనీయత . 14ఎఫ్ విషయంలో చిదంబరం ప్రకటన గుర్తుందా? మళ్లీ తీర్మానం కావాలన్న చిదంబరం రెండు రోజులాగి 14ఎఫ్ రద్దు చేయడం వెనుక ఏముంది? ప్రహసనం, అన్నా హజారే దీక్ష సందర్భంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు దాని నాయకత్వలేమిని, రాజకీయ అపరిణితిని, నిజాయితీ లేనితనాన్ని, ప్రజాస్వామిక ధర్మాలను అది పాతర పెడ్తుండడాన్ని సూచిస్తున్నది. ఈ అవిశ్వసనీయత, ప్రహసన నిర్ణయాల ప్రభావం తెలంగాణపైనా ఉంది. డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఇప్పుడు ఏకాభివూపాయం. గాడిద గుడ్డు అనడం కానీ, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి,సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చెయ్యడానికి, ఎట్లా ప్రయత్నం చేస్తున్నదో వాటిపై పడుతున్నది.

అంతా విని రామునికి సీతేమైందన్నట్టు ఆజాద్ వచ్చె మళ్లీ బాగోతం మొదలుపెట్టమన్నట్టు? ఇప్పుడు చివరాఖరికి ఏం జరిగిందో చెప్పండి? తేల్చుకొనిరండి? మూడు నెలలయితే నిర్ణయం. నిజంగా తెలంగాణ ప్రజల కాళ్లకు మొక్కా లె. అయినా వాళ్లు ప్రశాంతంగా ఉన్నరు. ప్రశాంతంగా ఉద్యమిస్తున్నరు. ఈ తారీఖులు, దస్తావేజులు మారడం దేనికి సూచన. రాష్ట్రంలో పరిస్థితులు మారిన వన్న ఈ సూచన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీమాంధ్ర, పెట్టుబడిదారుల కొమ్ముకాసి మరోసారి తెలంగాణకు ద్రోహం తలపెట్టే యోచనతోనే ఉన్నదా? అర్థం అవుతూనే ఉన్నది. ఇది కొనసాగతున్నది. ఇప్పుడు... తెలంగాణ ఉద్యమాన్ని గమనించే వాళ్లకు అర్థమయ్యే విషయం. మన బాంచెలు పిరికి వాళ్లు. పరాధీనులు అయిన మంత్రులు స్వామి, సకార్యాల కోసం క్యాబినెట్‌లోకి వెళ్లి వాళ్ల రాజకీయ జీవితకాలంలో పెద్ద తప్పు చేశారు.

ఆ తప్పు దిద్దుకుంటారో, ఎంగిలి మెతుకులు, ఏరిపారేసిన ఎముకలకు ఆశపడ్తారో వారి ఇష్టం. అధికార రాజకీయ ప్రయోజనాలకోసం ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనజీవితాలతో ఆటలాడుకుంటున్నది. కొంత అధికారం, కొంత ఆదాయ మార్గం అటు అధిష్ఠానానికి, ఇటు సీమాంధ్ర ఏలికలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం. ఇప్పటికైతే ఇదే నిజం. పిల్లలు చచ్చిపోతున్నరు. కాపురాలు కూలిపోతూనే ఉన్నయి. తల్లిదంవూడులు అంగలారుస్తూనే ఉన్నరు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదవ చాప్టర్‌అమలులో విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయనాయకులు, తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుకు తెరలేపుతున్నది. రాజకీయ, మీడియా మేనేజ్‌మెంట్‌లు అయిపోయి, అనంతర చర్యలు, అణచివేత చర్యలు ప్రారంభమవుతున్నయి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని కీలక విషయాల్లోనూ అంచనాలు తప్పి తప్పులు చేస్తున్నట్టే, తెలంగాణ విషయంలోనూతప్పులో కాలేస్తున్న ది. ఇది మునుపటి ఉద్యమం కాదు.

గ్రామ గ్రామానికీ పాకిన ఉద్యమం. మని షి మనిషికీ వ్యాపించిన ఉద్యమం. ప్రజాస్వామిక ధర్మాలు, సూత్రాలను కాలరాసి గుప్పెడు మంది కోసం కోట్ల మంది ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోదు తెలంగాణ. సకల జనుల సమ్మె కావచ్చు. దిగ్బంధం జరగొచ్చు. నెత్తురు ఒడిసిన నేల నెత్తురు మండితే ఏం జరుగుతుందో? ఏలికలకు కొత్తకాదు. తెలంగాణ ఆగదు. అంతం కాదు. వచ్చేదాకా సాగిపోతది. తెలంగాణ మంత్రులకు ఒక గమనిక. కొండా వెంకటరంగాడ్డి ఒక మాట అన్నడు. ‘గులామ్ కీ జిందగీసే మౌత్ అచ్ఛా హై!’ అని మరి బానిసలవుతారో..? మరేమవుతారో మీఇష్టం. బానిసల కన్నా.. చావులు మేలు. ‘బానిసకొక బానిసకొక బానిసవోయ్, బానిసా!మానిషి జన్మానికి ఛీ మచ్చవు నర పీనుగా’ శ్రీశ్రీ.
Source: NamastheTelangana.com

No comments:

Post a Comment