Pages

Sunday, September 4, 2011

KCR directions to Telangana Movement

ఇక దిగ్బంధమే
-యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
-సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి
-ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు
-ఇచ్చినా హైదరాబాద్‌తో లింకు పెట్టేలా ఉంది
-మన ఉధృత ఉద్యమం ఆ లింకును తెగ్గొట్టాలి
-సకలజనుల సమ్మె గ్రాండ్ సక్సెస్ కావాలి
-ఘనంగా కరీంనగర్ సభ జరగాలి
-పార్టీ కేడర్ భుజాలపైనే ఈ బాధ్యత
-ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు 110 ఎమ్మెల్యే సీట్లు ఖాయం
-16 ఎంపీ స్థానాల్లో మనదే జయకేతనం
-టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు!
-రహదారుల దిగ్బంధాన్ని 18కి మార్చాలి
-జేఏసీని కోరనున్న టీఆర్‌ఎస్

trs-bavan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 3 (టీ న్యూస్):తెలంగాణ రాజకీయ జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన పార్టీగా టీఆర్‌ఎస్ నుంచి ప్రజలు ఉద్యమ కార్యాచరణను ఆశిస్తారు కాబట్టి అదే స్థాయిలో వారిలో సమరోత్సాహాన్ని నింపేందుకు సకల జనుల సమ్మెను, కరీంనగర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో అంతర్గతంగా జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. సమ్మెను, కరీంనగర్ సభను సక్సెస్ చేసే బాధ్యతను పార్టీ కేడర్ భుజస్కంధాలపై వేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణ అమలులో తలమునకలై ఉన్నందువల్లే పార్టీ కార్యకలాపాలపై దృష్టిని సారించలేక పోయానని చెప్పిన కేసీఆర్.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి త్వరలోనే వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ సక్సెస్ చేయాలని, దేశం యావత్తు ఆశ్చర్య పోయే స్థాయిలో ఈ కార్యక్షికమాన్ని నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.


తెలంగాణకు వచ్చే సీమాంవూధవూపాంతాల దారులన్నింటినీ మూసివేయాలని, చీమ కూడా చిటుక్కుమనొద్దన్న స్థాయిలో దిగ్బంధం ఉండాలని ఆయన సూచించారు. రాష్ర్ట పాలన మొత్తం స్తంభించిపోవాలని, అవసరమైతే జైళ్లకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని 18వ తేదీకి మార్చాలన్న విషయంపై జేఏసీని కోరనున్నట్లు చెప్పారు. దిగ్బంధం ఎప్పుడు జరిగినా పార్టీ కేడర్ ఈ కార్యక్షికమాన్ని సొంతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌కు 110 ఎమ్మెల్యే, 16 ఎంపీ స్థానాలు దక్కడం ఖాయమని కేసీఆర్ అన్నారు.

కరీంనగర్ సభ ఏర్పాట్లపై రాష్ర్ట కమిటీ ఏర్పాటు
సకల జనుల సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 12న కరీంనగర్‌లో జరుగనున్న భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యులు కరీంనగర్ సభ ఏర్పాట్లను స్థానిక నాయకత్వంతో కలిసి పర్యవేక్షించనున్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ కార్యక్షికమాల అమలు కమిటీ చైర్మన్ కర్నె ప్రభాకర్, గుంతకండ్ల జగదీశ్‌డ్డి, రాములు నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, రాష్ట్ర నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌డ్డి, బాలమల్లు, తదితరులతో కమిటీని కేసీఆర్ నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


Source: NamastheTelangaana.com

No comments:

Post a Comment