న్యూఢిల్లీ: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం జాతీయ
సమగ్రతా మండలి సమావేశంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంఘర్ణణలను
నైపుణ్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆయన 12 పేజీల ప్రసంగ
ప్రతిలోని 6,7 పేజీల్లో తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు
చేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుందని
ఆయన అన్నారు. అధిక భావోద్వేగాల వల్ల పరిస్థితి ఏర్పడినప్పుడు బాధ్యతగా
వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలు,
పార్టీల నాయకులు సంయమనం పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భావోద్వేగాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఆందోళనల విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మీడియాపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు పరిమితులు అవసరమని ఆయన అన్నారు. గణేష్, రంజాన్ వంటి ఉత్సవాలను సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు.
ప్రాంతీయ భావోద్వేగాలతో తలెత్తిన ఉద్యమాలను శాంతిభద్రతల సమస్యగా చూడరాదని ఆయన అన్నారు. రాజకీయ పరిష్కారం కనుక్కునే వరకు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

No comments:
Post a Comment