కరీంనగర్ వేదికగా సకల జనుల సమ్మెకు సైరన్
జనగర్జనకు సర్వం సిద్ధం
సభకు ముందుగా భారీ కాన్వాయి
ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా కళా బృందాలు
200మంది వలంటీర్లు
4వేల మంది పోలీసులు
-గులాబీమయంగా కరీంనగర్
-కళ్లెం యాదగిరిడ్డి ప్రాంగణం ముస్తాబు
-భారీ జన సమీకరణకు జేఏసీ నేతల కసరత్తు
-అందరిచూపూ ఉద్యమాల ఖిల్లా వైపే

కరీంనగర్, టీ న్యూస్ ప్రతినిధి:కరీంనగర్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానం (కళ్లెం యాదగిరి రెడ్డి ప్రాంగణం)లో జరిగే సభకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభావేదికను అందరికీ కనిపించే విధంగా తయారు చేసిన నాయకులు వేరువేరు గ్యాలరీలను ఏర్పాటుచేసి బారికేడ్లు నిర్మించారు. సభ ప్రాంగణంలో కేసీఆర్ నిలు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటుగా వివిధ ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో వచ్చే వాహనాలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. సభ ప్రాంగణంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా రెండువందల మంది వలంటీర్లను నియమించారు.
సభను గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్వహించడానికి గాను జనసమీకరణపై దృష్టిపెట్టారు. గత నాలుగైదు రోజులుగా గులాబి దండు ఊరు వాడ తిరిగి నగరా మోగించగా.. అన్ని జేఏసీ సంఘాలు ఎక్కడిక్కడే జనాలను తమ శక్తి మేరకు తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పలు గ్రామాల్లో ఇప్పటికే సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి తీర్మానాలు చేసుకున్నారు. జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జిల్లా ఇన్‌చార్జి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ , టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, విద్యార్థి సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు సుమన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ తదితర నాయకులు జనసమీకరణ, సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిజానికి గతంలో అదిలాబాద్, నిజమాబాద్, వరంగల్, మెదక్ జిల్లానుంచి భారీగా జనాన్ని తరలించాలని నిర్ణయించినా.. స్వచ్ఛందంగా ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక, కర్షక , మహిళలు తరలివచ్చేందుకు సిద్ధం కావడంతో కరీంనగర్ జిల్లా నుంచే లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు.
జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న బహిరంగ సభకు ప్రజలను సమీకరించేందుకు టీఆర్‌ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుండగా, సకలజనుల సమ్మెకు మద్దతుగా పాల్గొనేందుకు బీజేపీ, న్యూ డెమోక్షికసీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభం కానున్న జగనర్జనసభకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ నేతలు భారీ కాన్వాయితో హైదరాబాద్ నుంచి తరలిరానున్నారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం శనిగరం చేరుకొని అక్కడ తెలంగాణ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌వీ నాయకులు మోటర్ సైకిల్ ర్యాలీతో చేరుకొని స్వాగతం పలుకుతారు. ఎల్‌ఎండీ మీదుగా కమాన్, తెలంగాణ చౌక్ నుంచి సర్కస్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సర్కస్ మైదానం నుంచి భారీ ప్రదర్శన సభ ప్రాంగణం వరకు సాగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ర్యాలీలో కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టే విధంగా ఉండే వివిధ కళారూపాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కేసీఆర్‌తోపాటు జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేతలు విద్యాసాగర్‌రావు, దత్తావూతేయ, నూ డెమోక్షికసీ నేత సూర్యం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శాసన సభాపక్ష నేత ఈటెల, మాజీ ఎంపీ వినోద్ ర్యాలీలో పాల్గొంటారు. కరీంనగర్ నగరం యావత్తు గులాబీమయం అయింది. ఏ రహదారి చూసినా తెలంగాణ జెండాలు, తెరాస జెండాలతో రెపపలాడుతున్నాయి. ప్రతి చౌరస్తాను గులాబిమయం చేసారు. ఎల్‌ఎండీ నుంచి సర్కస్ మైదానం వరకు పెద్ద ఎత్తున్న ప్లెక్సీలను ఏర్పాటుచేసారు. ర్యాలీ సాగే రహదారి వెంట ప్రత్యేక తెలంగాణ పోరు, సకలజనుల సమ్మెకు సంబంధించి నినాదాలతో కూడ బ్యానర్లు, పోస్టర్లు నిర్మించారు. కొన్ని చోట్ల భారీ కట్‌అవుట్లను ఏర్పాటుచేసారు. జనగర్జన సభ సందర్భంగా నాలుగువేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. దీంతో సభ నిర్వహణపై పోలీసులు డేగకన్ను వేశారు. జనసమీకరణ నుంచి నేతల పర్యటనల వరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు.
నాటి సింహగర్జన స్థానంలో నేడు జనగర్జన
2001లో తెలంగాణ రాష్ట్రసమితి అవిర్భవానికి వేదికైన కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాల గడ్డపైనే నేడు జనగర్జన సభను నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలంలో అనేక సభలు, సమావేశాలు జరిగినా.. జనగర్జనను మాత్రం మరోసారి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి సకలజనుల సమ్మెలో భాగంగా మూడు సభలు ఏర్పాటు చేయాలని నిర్వహించిన తొలిసభను మాత్రం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక ఎత్తు అయితే.. సభ మరుసటి రోజు నుంచే సకల జనుల సమ్మె సైరన్ మోగుతుండటం విశేషం.
నేడు ఉద్యోగుల సర్వసభ్య సమావేశం
13 నుంచి ఆరంభమయ్యే సకల జనుల సమ్మెను విజయవంతం చేసే దిశగా ఉద్యోగులను సమయాత్తం చేయడానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆపీసర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని జిల్లాకేంవూదంలోని టీఎస్‌జీవో ఫంక్షన్ హాలులో నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు జరిగే సభకు స్వామిగౌడ్, ఇతర ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. అక్కడి నుంచి ర్యాలీలో పాల్గొని సభకు తరలి ఉద్యోగులు నిర్ణయించారు. ఇలావుండగా, సకల జనుల సమ్మెకు కరీంగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మద్దతు పలికారు. సమ్మెను ఉద్ధృతం చేయడానికి హైదరాబాద్‌ను దిగ్బంధం చేద్దామని, ఇందుకు అన్ని రాకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అవసరమైతే ఈ కార్యక్షికమాన్ని తానే ముందుండి నడిపిస్తానని వెల్లడించారు.
Source: Namasthetelangaana.com
No comments:
Post a Comment