Pages

Monday, September 12, 2011

మన భాష... మన యాస..‘డబుల్’ కా మీటా...

A sunday supplement called "Batukamma" in our newspaper NamastheTelangaana is very much appreciated, because since beginning of the newspaper i am following it and it enphasizes more on the culture, nature people and traditions of the telangaana region below is one of teh article which resembles sweet and freshness of our language and accent here is the article for you friends. Thanks to newspaper onceagain

మన భాష... మన యాస..‘డబుల్’ కా మీటా...


kodipunju‘ఏంది బిడ్డా ఎప్పుడచ్చినవ్? పొలగాండ్లు బాగున్నరా? పురాంగ అంటుకుసొంటుకు లేకుండా పోయినవేంరా? మా ఆపతిసంపతి నువ్వు గాకపోతె ఎవ్వల్జూత్తరు కొడుక..?’ అంటడు ఆ పెద్ద మనిషి. ‘కాదే చిన్నాయిన! ఆఫీసుల పనిబాగైతంది. వద్దంవద్దం అనుకుంటనే లేటైంది. చిన్నవ్వ మంచిగున్నాదె?’ వరుసకు కొడుకైన రమేష్ ఇట్ల జవాబిస్తడు.

‘ఏం మంచిగుండడు బిడ్డ! అప్పుడెమొ అద్దంటె ఉరికురికి చేసె! ఇప్పుడు మంచాల పడె! మనిషంత పుండుపుండోలైంది. రాత్రంత ఆయెపాయె అన్నట్టు జేత్తంది! నేనే కిందవడిమీదవడి అండిపెడ్తె, ఓ బుక్క తింటంది..! దావఖన్లకు తీస్కపోదంరా అంటే చిన్నోడు ఇయ్యరమయ్యర తిట్టిండు. పెద్దంత్రంచిన్నంత్రం లేకుండ మాట్లాడిండు. అప్పుడు పానంపానమోలె సాత్తె ఇప్పుడు గిట్ల చెయ్యవట్టిరి. నువ్వన్న జెప్పు బిడ్డ తమ్ముళ్లకు! అది గడిగడికి నిన్నే యజ్జేత్తంది నువ్వయితె ఇంటికివా.. నేను జల్దిజల్ది పొయ్యి పంపుపెట్టత్త!...’

jantapadalu- వింటున్నరు కద...అచ్చమైన తెలంగాణ ఆత్మీయత ఎట్లుంటదో! ఆ భాష, యాస ఎంత కమ్మగుంటదో! గుండెల నిండా ఉన్న ప్రేమ, వాత్సల్యం వ్యక్తీకరించేందుకు ఒక్కపదమూ సరిపోక, జంట పదాలై ఎలా తన్నుకొస్తున్నదో..!

పైన ఉదహరించిన చిన్ని సంభాషణలో ఏకంగా డజను దాకా జంట పదాలు(పదం) ఉన్నయి. తెలంగాణ పల్లెల్లో ఇట్ల మాట్లాడటం మామూలే. తమ కష్టసుఖాలను అదే స్థాయిలో ఎదుటి వ్యక్తికి చేరవేయడంలో భాగంగా ఇట్లాంటి పదాల వాడకం సహజంగా కనిపిస్తది. ఉదాహరణకోసం రాసిందేగానీ ఇట్లాంటి సంభాషణలు మీకే ఎక్కువ తెలుసు.

మామూలుగానే ‘మనం వాడు మోసం చేస్తండు’ అనరు.. ‘ఉల్టపల్ట చేస్తండు’ అంటం. ‘భయమేస్తంది’ అని ఊకోం. ‘అగులుబుగులు అయితంది’ అని చెబ్తం. అలిగితే కేవలం ‘బతిమిలాడి’ సరిపుచ్చం.. ‘అద్గరిచ్చి.. బుద్గరిచ్చి’ అక్కునజేర్చుకుంటం. ఇటువంటి ఎన్నో జంట పదాలు, అచ్చమైన తెలుగుపదాలు తెలంగాణ భాష నిండా ఉన్నయ్. కొన్ని ఉర్దూ మిళితమై కనిపిస్తయ్. వాటిలో కొన్నింటిని చదవి చూడాలె..పాణం లేచి వస్తది.

అంటుకు సొంటుకు : దగ్గరకు
లంబుకులంబు : లావు
అండ్లదండ్ల : లోలోపల
అక్కలుముక్కలు : ఏదో అట్ల
అక్కిరిబిక్కిరి : మీదమీద
అడ్డందొడ్డం : మీదమీద
అగులుబుగులు : భయం
అగ్గువసగ్గువ : చౌకగా
అట్లట్ల : అలా
అడుగుబొడుగు : చివరకు మిగిలేది
అడుపదడప : అప్పుడప్పుడు
అతారపతార : పలుకుబడి
అదల్‌బదల్ : బదలిచ్చు
అద్గరిచ్చిబుద్గరిచ్చి : నయానోభయానో
ఆయెపాయె : చావుబతుకుల స్థితి
అర్కతిబర్కతి : వెలితి, లేమి
అలగ్‌సలగ్ : వేరుగా ఉండడం
అలాయ్‌బలాయ్ : కౌగిలింత
అలిమిబలిమి : బలవంతం
ఆపతిసంపతి : ఆపదసంపద
ఇగరాదుఅగరాదు : ఎంతకీ రాదు
ఇయ్యరమయ్యర : ఇష్టమొచ్చినట్లు
ఈకగాదుతోకగాదు : లెక్కలోకిరాదు
ఉత్తుత్తగ : ఊరికే
ఉరికురికి : జల్దిజల్ది
ఉల్టపల్ట : కిందమీద
ఊలేదు ఆలేదు : ఏమీలేదు
ఎంగిలిమంగలం : ఎంగిలిచేయడం
ఎగ్గిలెగ్గిలి : ఎడ్డెక్కిరి
ఎటువెట్టిఎటుదిరిగి : అటీటుజేసి
ఎతలేదు కతలేదు : ఏదీలేదు
ఎర్రగబుర్రగ : అందంగా
కంకెడుకంకెడు : పిడికెడు
కయ్యకయ్య : లబోదిబో
కస్సపిస్స : మెత్తగా
కాకిరిబీకిరి : అర్థం పర్థం లేకుండా
కాయిపాయి : కమ్మగా
కిందవడి మీదవడి : ఎలాగోలా
కుయ్యిలేదు కుటుక్కు లేదు : సడీచప్పుడు లేదు
గంగలగోదాట్ల : ఏట్లో
గట్టగట్ట(గుట్టగుట్ట) తాగు : తొందరగా తాగు
గడికిగడికి : గడియగడియకూ
గాయిగాయి : అల్లరి
గావరగావర : ఆకలితో నకనకలాడు
గొడగొడ ఏడ్సుడు : బాగా ఏడ్చు
గొర్రగొర్ర గుంజు : లాగడం
గోసగోస : దీనస్థితి
చిక్కుబొక్కు : కలగాపులగం
చిన్నంత్రంపెద్దంత్రం : చిన్నాపెద్దా తేడా
చిల్లంకల్లం : చిందరవందర
చెప్పకుంట చెయ్యకుంట : చెప్పాపెట్టకుండా
జప్పజప్ప తిను : జల్దిజల్ది తిను
జల్దిజల్ది : తొందరగా
జల్గురుజల్గురు : జారునట్లు
జిలజిల : రోత
జెప్పజెప్ప : తొందరగా
టకటక : తొందరగా
డుంబుకుడుంబు : లావుగా
తుంటకుతుంట : లావుగా
తంతెతంతెకు : తరతరానికి
తాపతాపకు : మళ్లీమళ్లీ
తాపకింత తాపకింత : కొద్దికొద్దిగా
తిప్పితిప్పికొడితే : అన్నీ కలిస్తే
తిర్రమర్ర : ఉల్టాపల్టా
తుక్కుతుక్కు : చితక
తుకపెక : బాగా
దబ్బదబ్బ : తొందరగా
దిక్కుదీం : దిక్కులేని
దిక్కుసక్కి : దిక్కులేని
నిక్కినిక్కి : మునిగాళ్లపై నిలబడి
నిగనిగ : అందంగా
నోట్లెనోట్లె : లోలోపల
పట్టిపట్టి : అదే పనిగా
పడుడుపడుడే : పడడంతోనే
పరంపరం : పొట్టుపొట్టు
వల్లవల్ల : ఎడతెగకుండా
పానంపానం : ఆరోప్రాణం
పిసపిస : పిచ్చి పట్టినట్లు
పుల్లలుపుల్లలు : అన్నం ఉడికిన తీరు
పెట్టుపోతలు : లాంఛనాలు
పుండుపుండు : అస్వస్థత
బండకుబండ : దృఢంగా
బట్టకు పొట్టకు : మామూలుగా
బడబడ : కల్లాకపటం లేకుండా
బర్సులుబర్సులు : నున్నగా లేకపోవడం
బిత్తిరిబిత్తిరి : అమాయకపు
బెక్కన బెంగటిల్లు : బెంగపడు
బొట్టులేదు బోనంలేదు : అవమానపరచు
బోడబోడ : ఏమీలేని పరిస్థితి
మంగురుమంగురు : తిక్కతిక్క
మన్నుమశానం : వల్లకాడు
మర్రిమర్రిజూసుడు : వెనక్కిచూసుడు
మాటమాటకు : మాటిమాటికి
మాటలేదు ముచ్చటలేదు : మాట్లాడకపోవడం
మిట్టమిట్టచూసు : ఆశపడు
మెరమెర : మనసులో మెదులు
మొన్నమొన్నటి : ఇటీవలి
యాల్లపొద్దుగాల : పెందలడ
రయ్యరయ్య : తొందరగా
రందారప్డా : ఏ బాధాలేదని
అంగడంగ : గందరగోళం
లట్టుపొట్టు : యథేచ్ఛగా
లడ్గురుం బొడ్గురుం : వదులువదులు
లద్దిలద్ది : మెత్తగా
లొడలొడ : అతిగా
శిదల్‌శిదల్ : ముక్కలుముక్కలు
శిమాంటశిమాంట : మొట్టమొదలు
శిటశిట : పూర్తిగా అయిష్టత
శీర్కెలుశీర్కెలు : పూర్తిగా చినిగిపోవు
సందుబొందు : సందట్లో సడేమియా
సకులంముకులం : సకలం ముకిళింపజేసుకొని కూర్చును
సర్రసర్ర : తొందరగా
సాదసీద : నిరాడంబరం
సాఫ్‌సీద : నిక్కచ్చిగా
సొడసొడలుపోవు : అలసిపోవు
అత్తరబుత్తర : ఏదో అయిందనిపించడం
Source: NamastheTelangaana.com

No comments:

Post a Comment