- గాంధీ ఆస్పవూతిలో అదుపులోకి...భగ్గుమన్న తెలంగాణవాదులు
- చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన
- జనాక్షిగహంతో తోకముడిచిన సర్కారు.. బేషరతుగా ఉద్యోగ నేత విడుదల
- స్టేషన్‌కు వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... స్వామిగౌడ్‌ను తీసుకొని టీఎన్జీవో ఆఫీస్‌కు
- అరెస్టుకు నిరసనగా సిద్దిపేటలో భారీ రాస్తారోకో.. ఎమ్మెల్యే హరీష్‌రావు అరెస్ట్
చిలకలగూడ,
బౌద్ధనగర్, సెప్టెంబర్ 16 (టీ న్యూస్):నాలుగు రోజులుగా శాంతియుతంగా
సాగుతున్న సకల జనుల సమ్మెలో సర్కారు చిచ్చురేపింది. తెలంగాణ రాష్ట్ర సాధన
ఉద్యమంలో వీరోచితంగా దూకిన ఉద్యోగ సంఘాల జేఏసీకీ నేతృత్వం వహిస్తున్న
స్వామిగౌడ్‌ను అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా దుస్సాహసానికి పాల్పడింది.
నిర్బంధం అమలు చేస్తే ఏం జరుగుతుందో శాంపిల్ చూద్దామని పోలీసులు చేసిన
ప్రయత్నం బెడిసి కొట్టింది. స్వామిగౌడ్ అక్రమ అరెస్టుతో యావత్ తెలంగాణ
భగ్గుమన్నది. సకల ఉద్యోగవర్గాలు మొదలు రాజకీయ పార్టీలు, విద్యార్థులు,
ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో భయపడిన ప్రభుత్వం
చిట్టచివరకు తోకముడిచింది. అక్రమంగా అరెస్టు చేసిన స్వామిగౌడ్‌ను కొద్ది
గంటల్లోనే బేషరతుగానే విడుదల చేసింది. అక్రమ అరెస్టులపై విమర్శలు వెల్లు
ముందు జాగ్రత్త చర్యగానే స్వామిగౌడ్‌ను అరెస్టు చేశామని పోలీసులు
బుకాయించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కేసీఆర్.. స్వామిగౌడ్‌ను
విడిపించుకుని టీఎన్జీవో కార్యాలయానికి తీసుకొని వెళ్లారుపత్యేక తెలంగాణ
రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె బాటలో నడుస్తున్న గాంధీ ఆస్పత్రి
టీఎన్జీవోలకు మద్దతు ప్రకటించేందుకు టీఎన్జీవోల అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల
జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీ ఆస్పవూతికి
వచ్చారు. ఉద్యోగులను కలిసి, వారికి సంఘీభావం ప్రకటించారు. మీడియాతో
మాట్లాడి, బయల్దేరేందుకు సిద్ధమమయ్యారు. ఆ సమయంలో సీమాంవూధకు చెందిన డీసీపీ
శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు
స్వామిగౌడ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా గాంధీ ఆస్పవూతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టును అడ్డుకోవడానికి టీఎన్జీవో ప్రతినిధులు పోలీసు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. వారిని పోలీసులు బలవతంగా ఈడ్చేశారు. స్వామిగౌడ్‌ను చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, టీఎన్జీవో నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్వామిగౌడ్ అరెస్టును ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న తెలంగాణవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అరగంట వ్యవధిలోనే వేల మంది స్టేషన్ వద్దకు వస్తుండటంతో పోలీసులు కంగుతిన్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై మండిపడిన తెలంగాణవాదులు స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అయినా తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పోలీసుస్టేషన్‌వైపు దూసుకు రావడంతో పోలీసులు చేతుపూత్తేశారు. దాంతో వేల మంది ఉద్యోగులు, తెలంగాణవాదులు, విద్యార్థులు, యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో నాలుగు గంటల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటుతున్నదని భావించిన పోలీసులు స్వామిగౌడ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్టేషన్‌లో సంతకం చేసి వెళ్లాలని షరతు పెట్టారు. తనను అక్రమంగా ఎందుకు అరెస్టు చేశారో స్పష్టం చేయాలని, అప్పటి వరకు వెళ్లనని స్వామిగౌడ్ భీష్మించారు.
దీంతో
పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశామని చెప్పారు. శాంతియుతంగా
ఉద్యమం చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి వెళ్తుంటే ఎలా అరెస్టు చేస్తారని
పోలీసులతో స్వామిగౌడ్ వాగ్వివాదానికి దిగారు. అరెస్టు విషయం తెలుసుకున్న
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యే నాగం
జనార్దన్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్‌డ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు టీ
పద్మారావు, చాడ సురేష్‌డ్డి, నాయిని నర్సింహడ్డి, కర్నె ప్రభాకర్, కవి
నందిని సిధాడ్డి, ఉద్యోగుల జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్, డాట్స్ చైర్మన్
డాక్టర్ నర్సయ్య, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి దేవీవూపసాదరావు, టీఆర్‌ఎస్
నాయకులు గజ్జల నాగేష్, ఆర్‌వీ మహేందర్‌కుమార్, టీఎన్జీవో గ్రేటర్
అధ్యక్షుడు కృష్ణయాదవ్, మహిళా నేత శ్రీలతా యాదవ్, కంది నారాయణ, మేకల
సారంగపాణి, ఆలకుంట హరి, రాష్ట్ర విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శశిధర్
శిల్పి, తదితరులు పీఎస్‌కు వచ్చి స్వామిగౌడ్‌కు సంఘీభావం ప్రకటించారు.
స్వామిగౌడ్ అరెస్టుపై తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది.
అరెస్టును వ్యతిరేకిస్తూ అనేక చోట్ల నిరసన కార్యక్షికమాలు జరిగాయి.
స్వామిగౌడ్ అరెస్టును వ్యతిరేకిస్తూ సిద్దిపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు,
ఉద్యోగ సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా
మారుతుండటంతో ఈ కార్యక్షికమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌రావును సైతం
పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఆందోళనను ఉద్దేశించి మాట్లాడిన
హరీష్‌రావు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడితే ఎమ్మెల్యేలను కాలు
కదపనీయవద్దని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవి కవ్వింపు చర్యలు: కోదండరాం
సీమాంధ్ర పాలకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని అణిచివేయడానికి యత్నిస్తున్నారని జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. స్వామిగౌడ్‌ను చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో కలిసి సంఘీభావం తెలిపిన ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేస్తే ఉద్యమం మరింత బలపడుతుందే తప్ప వెనక్కు తగ్గబోదని హెచ్చరించారు. స్వామిగౌడ్ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి విడిపించుకున్న తరహాలో మున్ముందు తెలంగాణవాదులు, ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులను సైతం బెదిరింపులు, అరెస్టులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హింసను ప్రేరేపించడానికి ప్రభుత్వ కుట్ర :డాక్టర్ నర్సయ్య
శాంతియుత ఉద్యమాన్ని హింసవైపు ప్రేరేపించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ నేత డాక్టర్ నర్సయ్య విమర్శించారు. ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కవ్వింపు చర్యలు మంచివి కావు: ఓయూ జేఏసీ చైర్మన్
కవ్వింపు చర్యలు మంచిది కాదని ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ప్రభుత్వానికి హితవు పలికారు. ‘‘శాంతియత వాతావరణంలో ఉద్యమం చేస్తున్నాం... రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు: డీసీపీ
సకల జనుల సమ్మె నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగానే స్వామిగౌడ్‌ను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ శ్రీకాంత్ విలేకరులకు చెప్పారు. గాంధీ ఆస్పవూతిలో ఉద్యోగులను రెచ్చగొడతారనే అనుమానంతోనే ఆయనను అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశామని తెలిపారు.
- చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన
- జనాక్షిగహంతో తోకముడిచిన సర్కారు.. బేషరతుగా ఉద్యోగ నేత విడుదల
- స్టేషన్‌కు వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... స్వామిగౌడ్‌ను తీసుకొని టీఎన్జీవో ఆఫీస్‌కు
- అరెస్టుకు నిరసనగా సిద్దిపేటలో భారీ రాస్తారోకో.. ఎమ్మెల్యే హరీష్‌రావు అరెస్ట్

ఈ సందర్భంగా గాంధీ ఆస్పవూతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టును అడ్డుకోవడానికి టీఎన్జీవో ప్రతినిధులు పోలీసు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. వారిని పోలీసులు బలవతంగా ఈడ్చేశారు. స్వామిగౌడ్‌ను చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, టీఎన్జీవో నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్వామిగౌడ్ అరెస్టును ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న తెలంగాణవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అరగంట వ్యవధిలోనే వేల మంది స్టేషన్ వద్దకు వస్తుండటంతో పోలీసులు కంగుతిన్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై మండిపడిన తెలంగాణవాదులు స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అయినా తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పోలీసుస్టేషన్‌వైపు దూసుకు రావడంతో పోలీసులు చేతుపూత్తేశారు. దాంతో వేల మంది ఉద్యోగులు, తెలంగాణవాదులు, విద్యార్థులు, యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో నాలుగు గంటల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటుతున్నదని భావించిన పోలీసులు స్వామిగౌడ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్టేషన్‌లో సంతకం చేసి వెళ్లాలని షరతు పెట్టారు. తనను అక్రమంగా ఎందుకు అరెస్టు చేశారో స్పష్టం చేయాలని, అప్పటి వరకు వెళ్లనని స్వామిగౌడ్ భీష్మించారు.

ఇవి కవ్వింపు చర్యలు: కోదండరాం
సీమాంధ్ర పాలకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని అణిచివేయడానికి యత్నిస్తున్నారని జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. స్వామిగౌడ్‌ను చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో కలిసి సంఘీభావం తెలిపిన ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేస్తే ఉద్యమం మరింత బలపడుతుందే తప్ప వెనక్కు తగ్గబోదని హెచ్చరించారు. స్వామిగౌడ్ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి విడిపించుకున్న తరహాలో మున్ముందు తెలంగాణవాదులు, ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులను సైతం బెదిరింపులు, అరెస్టులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హింసను ప్రేరేపించడానికి ప్రభుత్వ కుట్ర :డాక్టర్ నర్సయ్య
శాంతియుత ఉద్యమాన్ని హింసవైపు ప్రేరేపించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ నేత డాక్టర్ నర్సయ్య విమర్శించారు. ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కవ్వింపు చర్యలు మంచివి కావు: ఓయూ జేఏసీ చైర్మన్
కవ్వింపు చర్యలు మంచిది కాదని ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ప్రభుత్వానికి హితవు పలికారు. ‘‘శాంతియత వాతావరణంలో ఉద్యమం చేస్తున్నాం... రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు: డీసీపీ
సకల జనుల సమ్మె నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగానే స్వామిగౌడ్‌ను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ శ్రీకాంత్ విలేకరులకు చెప్పారు. గాంధీ ఆస్పవూతిలో ఉద్యోగులను రెచ్చగొడతారనే అనుమానంతోనే ఆయనను అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశామని తెలిపారు.
No comments:
Post a Comment