"...చరిత్ర నిండుగా సింగరేణి నిలబడింది. కావొచ్చు మేము అర్థ రైతులం. అర్థ కార్మికులం.. కానీ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించే ఒక నిప్పురవ్వ మా వద్ద ఉంది. అది నల్ల బంగారం సెమ్మాసు మర్రేసినం.. జాగ్రత్త.. ఇక తెలంగాణ ఇస్తరా.. చీకట్ల ఛస్తరా! తేల్చుకోవాల్సింది మీరు.. సింగరేణి జిందాబాద్.. సమ్మె జరుగుతూ ఉంటుంది. ఇక ఆ గల్లరగల్లర హాలర్ల సప్పుడు వినపడదు. ఇక బొయ్‌ఁమనే పంఖా గాలీ వీచదు. ఓపెన్‌కాస్ట్‌ల్లో రాక్షస యంత్రాలు తిరగవు. మేం నిలబడ్తం.. కలెబడ్తం.. కడదాకా.. తెలంగాణ వచ్చేదాకా..."
మట్టి ఎత్తిపోసిన గుట్టల కింద మా ఊరుంది. ఆ ఊరికి ఒక ఆత్మకూడా ఉంది. కంపచెట్లల్లో ఇప్పటికీ ఒక ఆత్మ తిరుగాడుతుంటుంది. అది తప్పనిసరి ఒక నెత్తుటి జాడ అయి ఉంటుంది. శేషగిరిరావో! పెద్ది శంకరో! గజ్జెల గంగారామో, కట్ల మల్లేషో అనుకుంటారు కానీ నిరామయంగా పగళ్లు చీక ట్లు కమ్మినట్టుగా జీబురుగా ఉండే బొగ్గుగని కార్మిక వాడల్లో అగ్గి కణాలు పుట్టిన ప్రతిసారీ గుడిసె కొప్పుల మీద ఎంటెనాలకు బదులుగా ఎర్రజెండాపూగిరేవి. అవి అగ్గిపూలు పూసిన అగ్ని నక్షవూతాలై ఎగసినా ఇప్పటికిప్పుడు నూటా ఇరవై ఏండ్ల సింగరేణి మనాదిలో కొట్టుకుపోయిన పల్లెల జాడ చెప్పి న వాడొకడు.. ఇక్కడ అగ్ని శిఖరం మీద వికసించిన వజ్రం. ఏ రమేజాబీ కోసమో సింగరేణిలో మస్టర్ల కోసమో సింగరేణి సమ్మె కట్టిన ప్రతిసారీ అదొ క కార్మికలోకపు కాగడాగా వెలిగిన క్షణాలు.
కాలం మంకెనపూలు పూస్తుం ది. అవి వాడిపోయి ఉండొచ్చు. తరతరాల తండ్లాట. ఒకటే దృశ్యం. బొగ్గు పొక్కల్లోంచి భారంగా మొద్దు మొరటు పాదాలనీడ్చుకుంటూ తట్టా, సెమ్మ సు, నెత్తిన దారి చూపే దీపం. ఏ మాత్రం సొరబారని వెలుగు. భూమిపొక్కల్ల అగ్గి గుట్టల్ల సొమ్మసిల్లి, పాలిపోయిన శరీరాల్లో కరెంటు తీగలు నింపిన ఉద్యమం. ఇది మూడో మజిలీ. గల్లరగల్లర హాలర్ సప్పుడు లేదు. బొఁయ్‌మని వీచే పంఖా గాలి లేదు. రాక్షస యంత్రాలొచ్చి జీవనాన్ని ఛిద్రం చేసి కొత్త గోడల్లాంటి బొగ్గు గుట్టలను పోసినా.. అక్కడా అలికిడి లేదు. సమ్మె కట్టింది సింగరేణి. ఇప్పుడది తనను తాను విముక్తి చేసుకోవడం కోసం. ఇప్పుడది వ్యాపారంలో తరలించుకుపోతున్న ఖనిజ సంపద కోసం.
కొండ లు తవ్వుకు ఒరిస్సాలో, ఛత్తీస్‌గఢ్‌లో విల్లంబులు ఎక్కుపెట్టిన వారి జాడ ఒకటి బొగ్గుబావుల చుట్టూ అస్తిత్వ ఆకాంక్ష అయి తిరుగాడక పోతే ఎంటెన్నాల విషం ఎక్కి ఉండవచ్చు. తనది కాని వినోదమూ తనని పరాయిని చేసి ఉండవచ్చు. కానీ ఈ దఫా మా తెలంగాణ మాకు కావాలె. మా బొగ్గు మాకు కావాలె. రాజపోశవ్వ యాతన. మామిడితోట ముతమైపోయింది. నీళ్లేవి దేవరలారా! ఏండ్లకేండ్లు తవ్వినా ఒడువని బొగ్గు ఎక్కడికి పెకిలించుకపోతున్నరు. ఓపెన్‌కాస్ట్‌లు బొందలగడ్డలు తవ్వుతున్నవి. సింగరేణి వస్తదంటే నిజమే ఇక్కడ ఒక బతుకు వికసిస్తుందనుకున్నం. నిజాంను ఎదిరించినం. బర్మార్లు పట్టినం. మాఫియాను, గూండాలను బొగ్గుపెళ్లల మధ్య దాగున్న దౌర్జన్యాన్ని ఎదిరించినం. దేశం స్పందించినప్పుడు, తెలంగాణ మండినప్పుడు సికాసల ఎర్రపూల వనాలమై సకల దోపిడీలను సెమ్మ సు మర్రేసి తిప్పికొట్టినం. కానీ.. నల్లనల్లని రేగళ్ల పొంటి నడిచివచ్చినవాణ్ని.. నీటి కాల్వల పొంటి నడిచివచ్చిన వాణ్ని... గోదావరిలోయ గుండా ఎక్కి వచ్చినవాణ్ని.. కర్నూలు గుడారాల నుంచి నేరుగా నడీ నగరంలోపాతుకుపోయినవాణ్ని. పసిగట్టలేకపోయినం. మండే ఎండాకాలాల్లో మాడిపోయిన వాళ్లం.
ఇగ మా వశం కాదు. ఇగ చాలు. ఇది మూడో పోరాటం. తవ్వుకుపోయిన నల్లబంగారం జాడ లు. ఇక్కడ మేం మా మొద్దుబారిన వేళ్లతో బంగారాన్ని తవ్వినట్టు తవ్వుతాం. గుడిసెలో దీపం.. నొసట దీపం దారి చూపుతుంటే గులాయిల ఒరుసుకుని పారే చెమట దేహాలతో నెత్తురు కలికలి చేసుకుంటుంటే.. లాడీసుల్ల నింపిన బొగ్గు హాలర్ల మీదుగా అంతమూ, ఆదీ లేని ఏ ప్రాంతాలకు వ్యాపార సరుకై వెళ్లిపోయిందో.. తెలియదా? ఇక్కడి బొగ్గు.. ఇక్కడి ఇంధనం ఎక్కడ వెలుగులు విరిజిమ్ముతున్నట్టు. మోటుగాళ్లమంటిరి. తెలివిలేనోళ్లంటిరి. గుట్టు చప్పుడు కాకుండా వచ్చి మా గుంపుల్లో పెద్దమనుషులై కొలువులకు ఎసరుపెడ్తిరి. లక్ష మందిలో విలసిల్లిన సింగరేణి అరవై ఐదే వేలకు ముడుచుకుపోయిందెందుకు? ఏ రాక్షస యంత్రాలు ఎవరి పొ ట్టగొట్టినట్టు..? మా జంగల్ ఇచ్చినం. మా పంట పొలాలు ఇచ్చినం. మా మామిడి తోటలు ఇచ్చినం. కానీ కాళ్లీడ్చుకుంటూ భూ గుయ్యారాలకు దిగు తూ.. పడుతూ లేస్తూ.. ఉత్త నిప్పచ్చి బతుకుల కార్మికులం మేమైతే.. బాయి దొరలు మీరు.
తెలంగాణ నిజాం బూజు వదిలించిన తెలంగాణ. తెలంగాణ బర్మార్లు, బంధూకులు పట్టి భూస్వామ్యాన్ని గెదిమిన తెలంగాణ.. గడీలల్ల ఎవుసం జేసిన తెలంగాణ.. సెమ్మసు మర్రెయ్యదా? ఏ సంస్కరణ ఫలాలు ఎవరికి మేలు చేసినయో ఎరుకలేక కాదు. ఎరికైంది కనుకనే ఇయ్యల్ల సమ్మె కట్టినం. డ్బై వేల మంది జీతం ఒక్క ఆరేడుగురు రాయలసీమ ఓబీ కాంట్రాక్టర్లకు కట్టబట్టే విలువ కాదు. ఏమి బతుకులు మావి. ముందు మీరు నిజాములై వచ్చిండ్రు. దోపిడీ.. పీడన.. ఎర్ర జెండాను శేషగిరి తెచ్చిండు. పాలిపోయిన, రక్తం చచ్చిపోయిన బతుకుల్లో రక్త చలన సంగీతమైంది ఎర్రజెండా.. ఇక సకల దోపిడీలకు చెల్లు. మళ్లీ పాత కథే. విముక్తి జరగనేలేదు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం వలసను పెంచింది. వెలిసిపో యిన ఎర్రజెండాలు శాంతినగర్‌లను తెచ్చినయ్. ఏది విముక్తి. ఏది విమోచ న. ఇప్పుడు ఇక వలసవాది రాజ్యం. ఇక్కడి బొగ్గును తవ్వుకపోయి ముద్దనూరులో వెలుగులు విరజిమ్మిన వాడి కైతికం. ఎన్టీపీసీ జాతీ య ప్రాజెక్టు అయిన కేఎల్‌రావు కుట్ర. ఎవరి వనరులు వాళ్లకే దక్కాలె. కాలేదు.
అడవి ఇచ్చిన వాడికి, భూమి బేదఖలు చేసినవానికి, పంట పొలం ఇచ్చిన వానికి ఉద్యోగం లేదు. ఉరుకు.. మానవ వనరు పరుగు పందెం. కార్జెం తెగిపడేట ట్టు.. ఛాతీ చీల్చుకొని గుండెలు బయటకు తన్నుకొచ్చేట్టు.. నరాలు తెగేట్టు ఉరుకు.. ఉరికిన వాడికే ఉద్యోగం.. తవ్వింది మేము.. ఎత్తింది మేము. దొరతనం చేసింది మీరు. కాలం మారింది. కొలువులు పోయినయి. ఆబ్సెంటి జం ఒక సాకు. డిపెండెంట్‌లు పోయిండ్రు.. సంస్కరణలు.. తక్కువ మంది.. ఎక్కువ ఉత్పత్తి.. కానీ శేషగిరి తర్వాత కూడా సింగరేణి నిలబడింది. బొగ్గు కప్పుకున్న ఆ వీధుల్లో నల్లని మట్టి పాదాలను నిగడదన్ని.. అప్పుడొక కట్ల మల్లేష్.. అప్పుడొక గజ్జెల గంగారాం.. అప్పుడొక పెద్దిశంకర్. సకలం బంద్.. విముక్తి కావాలె.. పని పద్ధతులు మెరుగుపడాలె. సింగరేణి విప్లవాన్ని కన్నది. అది ప్రజల జైత్రయావూతకు.. పోదాం పదే జాతరకు అస్త్రశస్త్రాలిచ్చింది. పాటలిచ్చింది.
పద్యాలిచ్చింది. వీరుడు అడవికి వెళ్లాడు. ఉక్కుపాదం.. పోలీసు పదఘట్టనలు.. కోవర్టులు... అరెస్టు లు.. చిత్రహింసలు.. బావులు బెంగటిల్లినయి. గోదావరి ఒడ్డు ఎన్‌కౌంటర్ రణ క్షేత్రాల అభూత కల్పనలయ్యాయి. కానీ.. ఇప్పుడు మళ్లీ నిలబడింది సింగరేణి.. తవ్వుకుపోతున్న ఖనిజం గురించే.. స్థానికత గురించే.. తవ్వుకుపోతున్న ప్రాణాల గురించే.. అందుకే సింగరేణి ఒక ఆత్మల కూడలి. దానికొక చరిత్ర.. వారసత్వం ఉన్నాయి. ఓపెన్‌కాస్ట్‌లు బొందల గడ్డలయినయి. బొగ్గు బావు లు విస్తరించినయి. అంతా ఓపెన్. అరవై ఏండ్లు తవ్విన బొగ్గు ను అయిదేండ్లల్ల తవ్విపోయాలె. ఇక్కడి ఓపెన్ కాస్ట్ స్థానికుడి బొందల గడ్డ అయితే అది సముద్ర తీరాలపొంటి వెలిగే కరెంటు ప్రాజెక్టయితది. వాన్‌పిక్‌లుగా విస్తరించిన ఎడారి కారిడార్‌లకు ఇక్కడి నల్ల వజ్రం పునాదిరాయి అయితది. అందుకే.. ఇక చాలు. మేం చైత్రాలు చూసిన వాళ్లం.. నెత్తుటి కోలాటాలు చూసిన వాళ్లం.. ఏడికైతే గాడికాయె.. ఎట్లయితే గట్లాయె.. ఇది మా తెలంగాణ పోరాటం. చాలు మమ్మల్ని బొందలగడ్డల మీద నిలబెట్టి, మా కొలువులు కొల్లగొట్టి.. మమ్మల్ని బానిసలను చేసిన నయా నిజాముల మీద మా యుద్ధం.
బాయి పొక్కల మీద సన్నీలు.. చిప్పటోపీలు.. ఖాకీ కరాళ నృత్యాలు మాకు కొత్తగాదు. ఉక్కుపాదాలు కొత్తగాదు. ఈ బొగ్గు బావుల మీద ఏకె 47లు కొత్తగాదు. చాలా చూసినం. ఒక ప్రశ్న తుపాకులు బొగ్గును తవ్వగలవా? తుపాకులు సెమ్మాసులు కాగలవా? తుపాకులు బొగ్గు పొరల్లో గిలెటిన్‌లు దట్టించగలవా? అవును మా తెలంగాణ మాకు గావాలె. అరెస్టు చేయాల్సింది స్వామిగౌడ్‌ను కాదు. అరెస్టు చెయ్యాల్సింది మమ్మల్ని కాదు. తుపాకులు ఎక్కుపెట్టాల్సింది మా మీద కాదు. ప్రశాంతంగా.. మా సమ్మె మేము చేసుకుంటున్నం. ఒకరిని కొట్టలేదు. ఒకరిని తిట్టలేదు. సమ్మె మా ప్రజాస్వామ్య హక్కు. అరెస్టు చేయాల్సింది చిదంబరాన్ని. మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నం. ప్రజాస్వామ్య హక్కుగా సమ్మె చేస్తు న్నం. డిసెంబర్ 10, 2009న ప్రజాస్వామ్య ఉన్నత సౌధాలని మీరు చెప్పు కుంటున్న పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించి, తెలంగాణను ఇవ్వకుండా నానబెట్టి ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించిన చిదంబరాన్ని అరెస్టు చేయండి.
ప్రణబ్ ముఖర్జీని అరెస్టు చేయ్యండి. నోటికాటి కూడు లాక్కున్న లగడపాటి, రాయపాటి, కావూరి, టీజీ వెంక అరెస్టు చేయండి. ప్రజాస్వామ్యం విశ్వాసాల మీద నిలబడిన ఒక మహాసౌధం అయితే.. ఆ విశ్వాసాలను తూట్లు పొడిచిన వాళ్లను అరెస్టు చేయండి. నిజ మే. మా తెలంగాణ మాగ్గావాలె. అదొక్కటే మార్గం. ప్రజాస్వామ్యం కోసం మా పోరాటం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 కోసం మా పోరా టం. స్థానిక వనరుల మీద మావి మాకు దక్కాలని పోరాటం. ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నం. మా గుడిసెల మీద ఎగిరిన ఎర్రజెండాల సాక్షి.. ఇప్పుడు మా అస్తిత్వ పతాకను మోస్తున్నం. చరిత్ర నిండుగా సింగరేణి నిలబడింది. కావొచ్చు మేము అర్థ రైతులం. అర్థ కార్మికులం.. కానీ.. ఢిల్లీ పీఠా న్ని గడగడలాడించే ఒక నిప్పురవ్వ మా వద్ద ఉంది. అది నల్ల బంగారం సెమ్మాసు మర్రేసినం.. జాగ్రత్త.. ఇక తెలంగాణ ఇస్తరా.. చీకట్ల ఛస్తరా! తేల్చుకోవాల్సింది మీరు.. సింగరేణి జిందాబాద్.. సమ్మె జరుగుతూ ఉంటుంది. . ఇక ఆ గల్లరగల్లర హాలర్ల సప్పుడు వినపడదు. ఇక బొయ్‌ఁమనే పంఖా గాలీ వీచదు. ఓపెన్‌కాస్ట్‌ల్లో రాక్షస యంత్రాలు తిరగవు. మేం నిలబడ్తం.. కలెబడ్తం.. కడదాకా.. తెలంగాణ వచ్చేదాకా...

No comments:
Post a Comment