Pages

Sunday, September 18, 2011

కుట్ర పత్రాలపై కన్నెర్ర .. Govt silly tactics to supress people's Stir

-సమ్మె విరమణ అంటూ సంఘాల పేరిట కరపవూతాలు
- సింగరేణి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుయుక్తులు
- యాజమాన్యం, సర్కారు జాయింట్ ఆపరేషన్
- తిప్పికొట్టిన కార్మిక సంఘాలు.. కరపత్రాలు దహనం

kannerra-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీ న్యూస్ ప్రతినిధి, కోల్‌బెల్ట్/కొత్తగూడెం:‘గడ్డిపోచలు ఏకమైతే మద గజాన్ని సైతం కట్టివేయవచ్చు’ అనే నానుడిని నిజం చేస్తున్న తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలైన సింగరేణి కార్మికుల ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్ర సర్కారు కుట్రపన్నింది. కార్మికులు ఏకమై సమ్మెకు దిగితే కేంద్రం దిగిరాక తప్పదని గుర్తించిన సీమాంధ్ర సర్కారు కుట్రలకు తెరలేపింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను కార్మికులు ఎక్కడ సాధించిపెడతారేమోననే భయంతో పదితలల పాములా విషం చిమ్ముతోంది. యాజమాన్యం, వలస పాలకులు, సీ మాంధ్ర నేతలంతా కలిసి కార్మికుల ఐక్యతను దెబ్బతీసి, సమ్మెను విచ్ఛి న్నం చేసేందుకు కుయుక్తులు పన్నారు.

అందులో మొదటి అస్త్రాన్ని శనివారం కరపవూతాల రూపంలో సంధించారు. సమ్మె విరమిస్తున్నట్లు సంఘాలు ప్రకటించినట్లుగా ఉన్న కరపవూతాలను యాజమాన్యం విడుదల చేసింది. సింగరేణి చరివూతలో ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొన్న కార్మికులు, ముక్తకం తిప్పికొట్టారు. కరపవూతాలను దహనం చేసి, తెలంగాణ వచ్చేవరకు పోరుబాట వీడమని స్పష్టం చేశారు. ‘సమ్మె వల్ల అన్ని వర్గాలకు నష్టం జరుగుతోంది. దయచేసి సమ్మె విరమించండి’అని యాజమాన్యం అధికారికంగా విడుదల చేసిన మరో కరపత్రాన్నీ తగలబెట్టారు.

భగ్గుమన్న కార్మికలోకం
కార్మిక సంఘాల పేరు మీద వేసిన కరపవూతాలను టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, జేఏసీ నాయకులు వాచ్‌మెన్‌ల వద్ద నుంచి లాక్కొని సింగరేణివ్యాప్తంగా వాటిని దహనం చేశారు. శ్రీరాంపూర్, శిర్కే కాలనీలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు బంటు సారయ్య, చంద్రయ్య, తదితరుల నేతృత్వంలో దహనం చేశారు. మందమపూరిలో టీబీజీకేఎస్ నాయకులు సంపత్, జే రవీందర్, ఓ రాజశేఖర్ తదితరుల నాయకత్వంలో దహనం చేశారు. బెల్లంపల్లి, గోదావరిఖని, కొత్తగూడెం, భూపాలపల్లిల్లోనూ కరపవూతాలను దహనం చేశారు. ఇదంతా యాజమాన్యం కుట్ర అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షుడు బీ సంపత్ కుమార్, బీఎంఎస్ అధ్యక్షుడు పులి రాజిడ్డిలతోపాటు ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు రేవెల్లి రాజారాం, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆరోపించారు.

సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రచారం
ఇప్పటికే ఓపెన్‌కాస్టు బొగ్గు బావుల మీద సాయుధ పోలీసులను మోహరించారు. విధులకు హాజరయ్యేలా కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆయా ఓసీ ప్రాజెక్టుల అధికారులు సెల్‌ఫోన్లలో కార్మికులతో కాంటాక్ట్‌లో ఉంటున్నారు. సెక్యూరిటీ కలిపిస్తామని, బావుల మీదనే ఉంటే ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఓటీ ఇస్తామని మభ్య పెడుతున్నారు. యాజమాన్యం ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టినా కార్మికులు మాత్రం ఖాతరు చేయడం లేదు. తెలంగాణ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ ఎస్పీలు శనివారం సింగరేణి ప్రాంతంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని..అరెస్టు చేయడం లేదని, శాంతి భద్రతలకు భంగం కలగనంత వరకు ఎవరి జోలికి వెళ్లమని ఆదిలాబాద్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

రుద్రంపూర్‌లో కదం తొక్కిన మహిళలు
‘మీరు ఉద్యమంలో బాగా కనబడుతున్నారు.మాటిమాటికీ కన్పిస్తున్నరు. మీ భవిష్యత్తు ఆగం చేస్తా. కేసులు పెట్టి లోపలేస్తా. మీకు పెళ్లిళ్లు కాకుండా చేస్తా. ఏమయ్యా పెద్దమనిషి.. నువ్వన్నా బుద్ధిచెప్పు. అమ్మాయిలు..ఉద్యమంలో కన్పిస్తే బతుకులు ఆగమైతయ్.. జాగ్రత్త’.. ఇవి కార్మికుల కూతుళ్లను ఉద్దేశించి కొత్తగూడెం టూటౌన్ ఎసై్స ముత్తులింగయ్య చేసిన హెచ్చరికలు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి, మహిళలపట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఎసై్స శనివారంనాడు రుద్రంపూర్‌లోని కార్మికవాడలో ఇంటి ఎదుట కూర్చున్నవారిని పిలిచి ఇలా బెదిరించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం రుద్రంపూర్ సింగరేణి ఏరియా గౌతంఖని ఓపెన్‌కాస్టులో పోలీసులు దగ్గరుండి ఉత్పత్తి చేయిస్తున్నారు.

దీనికి నిరసనగా శుక్రవారంనాడు కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు ఓపెన్‌కాస్టు రహదారిలో రాస్తారోకో చేశారు. అంతకు ముందు కార్మికులను బెదిరించి డ్యూటీలకు తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసుల జీపులను సైతం మహిళలు అడ్డుకొన్నారు. ఈ సంఘటనల్లో రుద్రంపూర్‌లోని గోపి ఏరియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. దీన్ని సహించలేని ముత్తులింగం శనివారం సాయంత్రం గోపి ఏరియాకు వెళ్లి ఆరుబయట కూర్చున్న వారిపై దుర్భాషలాడారు. విషయం తెలియగానే రుద్రంపూర్ జేఏసీ నాయకులు, మహిళలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులకు, వారికి తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ దేవదాస్‌నాగుల్ అక్కడికి చేరుకొవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని, ఏం చేస్తారో చేసుకోండి.. మేం రెడీ. అని తెలంగాణవాదులు డీఎస్పీ ఎదుట స్పష్టం చేశారు.

No comments:

Post a Comment